సంకలనాలు
Telugu

‘అంచెల్’ అంచెలుగా ఎదుగుతున్న ‘చికంకారి’ వస్త్రకళా ప్రపంచం

దేశ విదేశాల్లో లక్నో ‘చికంకారి’ డిజైన్లకు పట్టండ్రెస్356 డేస్ వెబ్ సైట్ తో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారంప్రాచీన వస్త్రకళకు నవ్యరీతులద్దిన అంచెల్ గుప్తాడిజైనర్ చికంకారి డ్రెస్సులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

CLN RAJU
17th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

డ్రెస్ 365 డేస్(DRESS365DAYS.COM) అనేది మన ఇండియాకు చెందిన ఈ-కామర్స్ సైట్. చికంకారి దుస్తులకు ప్రత్యేక ఆన్ లైన్ నిలయం. పూర్వం మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య నూర్ జహాన్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైనర్ డ్రెస్సులను రూపొందించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఉన్నత వర్గాలు, రాజకుటుంబాలకు చెందినవారు మొదట్లో ఈ తరహా దుస్తులను ధరించేవారు. రాజసం, హుందాతనం ఉట్టిపడే ఈ దుస్తులకు ఆదరణ వున్నా.. పాశ్చాత్య వస్త్రాల ధాటికి ప్రస్తుతం మరుగునపడిపోయింది. లక్నో కేంద్రంగా విస్తరించిన ఈ ప్రాచీన వస్త్ర కళకు కొత్త మెరుగులు అద్దింది అంచల్ గుప్తా. నిజానికి చికంకారి డ్రెస్సులంటే తెగ ఇష్టపడే అంచల్ గుప్తా...వాటిని కొనుగోలు చేయాలని ఆన్ లైన్ లో వెతికింది. ఎన్నో వెబ్ సైట్లను జల్లెడపట్టేసింది. కానీ లాభం లేదు. ఎక్కడా వాటికి సంబంధించిన షాపులు కానీ.. ఈ-కామర్స్ సైట్లు కానీ కనబడలేదు. అలా తన వెతుకులాట నుంచి పుట్టుకొచ్చిందే డిజైనర్ చికంకారి డ్రెస్సుల ఆన్ లైన్ వెబ్ సైట్.... డ్రెస్ 365 డేస్ డాట్ కామ్ (DRESS365DAYS.COM).


యువర్ స్టోరీ అంచెల్ గుప్తాను కలిసి తన వ్యాపార ప్రస్థానానికి సంబంధించిన ఎన్నో విషయాలపై ఆరా తీసింది.అంచల్ గుప్తా, డ్రెస్ 365 డేస్ డాట్ కామ్ వ్యవస్థాపకురాలు

అంచల్ గుప్తా, డ్రెస్ 365 డేస్ డాట్ కామ్ వ్యవస్థాపకురాలు


యువర్ స్టోరీ: డ్రెస్ 365 డేస్ డాట్ కామ్ (DRESS365DAYS.COM) ప్రారంభించడానికి ప్రేరణ ఏంటి..? మీరు ప్రత్యేకంగా ఈ వ్యాపారం దిశగా అడుగులు వేయడానికి మార్కెట్ లో ఏమైనా లోటును గుర్తించారా..?

అంచల్ గుప్తా: నేను ఆన్ లైన్ షాపింగ్ ను తెగ చేసేదాన్ని. ఫ్యాషన్స్ అంటే ఇష్టంతో చాలా సమయాన్ని ఆన్ లైన్ లో రకరకాల దుస్తుల్ని కొనుగోలు చేసేందుకు వెచ్చించేదాన్ని. ఈ దశలో ఓ ఈ-కామర్స్ కంపెనీ చికాన్ కరి డిజైన్లను అమ్ముతోందని తెలిసింది. కానీ.. వాటిలో చాలావరకు నాణ్యతలేని, ఆకట్టుకోలేని డిజైన్లున్న చికాన్ కరి వస్త్రాలే నాకు కనిపించాయి. ఎంతో స్వచ్ఛమైన , ఇట్టే ఆకట్టుకోగలిగే...లెహెంగాస్, చీరలు, అనార్కలిస్, ముఖాయిష్ / కమ్ దానీ వర్క్ డ్ దుస్తులు ఎక్కడా కనబడలేదు. దీన్నే నేనో మంచి అవకాశంగా మలుచుకున్నాను. ఇలాగైనా ప్రపంచంలో వున్న ప్రజలకు నాకు చేతనైనంత సేవ చేయాలనిపించింది. దానికి తోడు చికాన్ కరి డిజైన్ పుట్టిన లక్నోలోనే నేనూ పుట్టడం కలిసొచ్చింది. దాంతో నాఅంతట నేను ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడం చాలా సులభంగా మారింది.

నాకొచ్చిన ఈ ఆలోచనను చాలామందితో పంచుకున్నాను. సామాజిక అనుసంధాన వేదికల్లో నా దగ్గరివాళ్లను కూడా అడిగాను. అప్పుడే నాకు తెలిసింది. డిజైనర్ చికంకారి దుస్తులంటే ఎంతోమంది ఇష్టపడుతున్నారని. కానీ వాళ్లకు అవి దొరకడం లేదని. అందుకే లక్నో వెళ్లినప్పుడల్లా నేను ఈ దుస్తుల్ని తీసుకొచ్చేదాన్ని. ఇవన్నీ... నేను ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించడానికి, ప్రాచీనమైన చికాన్ కరి కళకు నవ్యరీతులద్ది ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రేరణగా నిలిచాయి.

image


యువర్ స్టోరీ: డ్రెస్ 365 డేస్ ఆన్ లైన్ పోర్టల్ ను మీరెప్పుడు ప్రారంభించారు..?

అంచల్ గుప్తా: డ్రెస్ 365 డేస్ (Dress365days) ఏప్రిల్, 2013లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది...?

యువర్ స్టోరీ: మీరు వ్యాపారాన్ని ప్రారంభించిన మొదట్లో దీనిపై ఎంత పెట్టుబడి పెట్టారు..?

అంచల్ గుప్తా: 5 లక్షల రూపాయల పెట్టుబడితో బిజినెస్ ను ప్రారంభించా..?

యువర్ స్టోరీ: డ్రెస్ 365 డేస్ తో మీ ప్రయాణంలో నిలిచిన కొన్ని అనుభవాలు, మైలు రాళ్లకు సంబంధించి మీరు మాతో పంచుకోగలరా...?

అంచల్ గుప్తా: కొన్నేళ్లలోనే మేము అన్ని ప్రధాన దేశాలకు ఎగుమతుల్ని చేయగలిగాం. దేశీయంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా ఆన్ లైన్ వ్యాపారాన్ని విస్తరించాం. ఇప్పుటివరకు మాకు అసంతృప్తిని వ్యక్తం చేసిన వినియోగదారులు ఒక్కరుకూడా ఎవరూ కనబడలేదు. దేశ, విదేశాల్లో మా ఉత్పత్తులను ఆదరించే నమ్మకమైన వినియోగదారుల్ని తక్కువకాలంలోనే పొందగలిగాం.

యువర్ స్టోరీ: ఒక్కమాటలో చెప్పాలంటే.. డ్రెస్ 365 డేస్ (Dress365days) ఎలాంటి ఆఫర్లను అందిస్తోంది..? 

అంచల్ గుప్తా: డ్రెస్ 365 డేస్ (Dress365days) ఆన్ లైన్ లో అత్యంత ప్రత్యేకమైన చికంకారి దుస్తుల దుకాణం. చేతితో వేసిన ఎంబ్రాయిడరీ కుర్తీలు, డ్రెస్ మెటీరియల్స్, చీరలు, పిల్లలు పెద్దలు ధరించే దుస్తుల్ని అందుబాటు ధరలతో విక్రయిస్తోంది. చికంకారి డిజైన్లలోనే నాణ్యతగల ఉత్పత్తులను, అందరికీ అందుబాటు ధరలకు అందించడమే మా ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాచీన హస్తకళా వస్త్రాలు కేవలం పుట్టిన చోటుకే పరిమితం కాకుండా...ప్రపంచానికి మళ్లీ పరిచయం చేయడమే మా ముందున్న లక్ష్యం. వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటమే మా వ్యాపార విజయానికి నిదర్శనం. కెనడా, యూఎస్, యూకే, మధ్య ఆసియా (ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ ) దేశాల్లో తక్కువ సమయంలోనే కస్టమర్లు బాగా పెరిగారు.

స్వచ్ఛమైన కాటన్ వస్త్రాలపై చికాన్ కరితో పాటు ముఖాయిష్ వర్క్ ను జోడించి రూపొందించే డిజైన్లు మా ఉత్పత్తుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మిషన్ తో కుట్టని కుర్తీ వస్త్రాలు, ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేయబడ్డ డ్రెస్ మెటీరియల్స్ , సెమీ స్టిచ్డ్ అనార్కలిస్ వస్త్ర ఉత్పత్తులకు కూడా గిరాకీ బాగుంది. ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్లకు ఏమాత్రం తీసిపోకుండా.. వాటికి దీటుగా చికాన్ కరి ఉత్పత్తులు ఆదరణ పొందేలా రూపొందిస్తున్నాం. పండుగలు, పర్వదినాలప్పుడు ఈ కలెక్షన్లకు చాలా గిరాకీ వుంటుంది. దివాలీ, ఈద్, పెళ్లిళ్ల సమయాల్లో ప్రపంచ వ్యాప్తంగా వున్న కస్టమర్ల చూపు మా ఆన్ లైన్ పోర్టల్ పై పడుతోంది.

యువర్ స్టోరీ: మీదగ్గరున్న హస్తకళాకారులు, ఇతర డిజైనింగ్ ఆర్టిస్టులంతా లక్నోకు చెందిన వారేనా..?

అంచల్ గుప్తా: అవును. మా దగ్గరున్న హస్తకళాకారులు, డిజైనింగ్ ఆర్టిస్టులు లక్నోకు చెందినవారే. ఈ కళకోసం తమ జీవితాలనే త్యాగం చేసిన, చేస్తున్న వాళ్లే. అందుకే ఈ డిజైనింగ్ దుస్తుల రూపకల్పనలో ఏదోఒక ప్రత్యేకత వుండేలా.. కళకాకారులందరికీ గుర్తింపు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.

యువర్ స్టోరీ: చికంకారి డిజైనింగ్ వర్క్ కు వున్న మార్కెట్ విలువేంటి..?

అంచల్ గుప్తా: ప్రస్తుతం చికాన్ వర్క్ లో విభిన్న రకాల వస్త్రాలు వున్నాయి. వీటిల్లో ఒక్కో రకాన్ని ఒక్కొక్కరు ఇష్టపడుతుంటారు. ఇండియా, అమెరికా, యూకే, మధ్య ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా ఆయా దేశాల వాతావరణ పరిస్థితులు, ఫ్యాషన్లకు అనుగుణంగా చికాన్ వర్క్ లోనే వేర్వేరు రకాల డిజైనింగ్ వస్త్రాలను కావాలని కోరుకుంటారు.

యువర్ స్టోరీ: ప్రస్తుతం వస్తున్న ఈ స్పందన ఎంతకాలం వుంటుంది..?

అంచల్ గుప్తా: దేశ, విదేశాల్లో పెరుగుతున్న కస్టమర్ల సంఖ్యే .. మా వ్యాపారానికి వున్న డిమాండ్ ను, స్పందనను తెలియజేస్తుంది. ఆ విషయంలో నాకు పూర్తి సంతృప్తి వుంది. మా కస్టమర్లు కేవలం మన దేశానికి చెందిన వారే కాదు. ఎన్నారైలు, అందులోనూ వివిధ దేశాలకు చెందినవారూ వున్నారు.

యువర్ స్టోరీ: మీరు చేస్తున్న పనిలో మీకు ఉత్తేజాన్ని కలిగించేదేంటి..? మీకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రేరణ కలిగించిన అంశాలేంటి..?

అంచల్ గుప్తా: ఏదో కొత్తగా, ప్రత్యేకంగా చేస్తున్నాననే భావన , సమర్థవంతంగా వ్యవహరిస్తూ వెళ్తున్నాననేవి చాలా సంతోషాన్నిస్తాయి. ఒక రోజు ముగిసేనాటికి నాలో ఎలాంటి ఉత్సాహం, శక్తి నశించడం లేదు. కస్టమర్ల నుంచి వస్తున్న స్పందనే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి శక్తినిస్తోంది. ఇక్కడ మరొకరి సహకారాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఆయనే నా భర్త. ఆయనే వెన్నుదన్నుగా నిలవకుంటే నేనివన్నీ సాధ్యం చేయగలిగేదాన్ని కాదు, ఇంత దూరం వ్యాపార ప్రయాణాన్ని సాగించేదాన్ని కాదు. నేను పూర్తిగా పనిలో మునిగిపోయినప్పుడు మా బుజ్జి పాపాయిని జాగ్రత్తగా చూసుకుంటారాయన. ఆయనిచ్చిన ప్రోత్సాహం, ప్రేరణే నన్ను వ్యాపారంలో ముందుకు నడిపిస్తోంది.

యువర్ స్టోరీ: ఈ రంగంలోని మహిళామణులకు మీరిచ్చే సలహా..?

అంచల్ గుప్తా: మీ హృదయం ఏది చెబుతుందో దానిమాటే వినండి. ఆ దిశగా శక్తి వంచన లేకుండా పనిచేయండి. మీకు చేసే తెగువ వుంటే... ఉన్నత శిఖరాలను వెళ్లకుండా ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. ఈ ప్రయాణ దశలో ఎన్నో అడ్డంకులు, నిరాశా నిస్పృహలు. కానీ ఆశను చంపుకోకుండా ముందుకు సాగాలి.

యువర్ స్టోరీ: ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు ఇవన్నీ వినరనుకుంటున్నారా..?

అంచల్ గుప్తా: ప్రస్తుతమైతే నేను అలా ఆలోచించడం లేదు..

యువర్ స్టోరీ: ఒక మహిళగా మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు..?

అంచల్ గుప్తా: ఇంటిపనుల్ని చూసుకోవడం, నా రెండేళ్ల పాపాయిని పెంచడం లాంటి కొన్ని ముఖ్యమైన పనులు మొదట కొంత ఇబ్బందిని కలిగించాయి. కానీ.. నా భర్త అందించిన ఎనలేని సహకారంతో వాటన్నింటినీ నేను అధిగమించగలిగాను.

యువర్ స్టోరీ : డ్రెస్ 365 డేస్ ఆదాయమెంతో చెబుతారా..?

అంచల్ గుప్తా: అదంతా ప్రస్తుతానికి వ్యాపార రహస్యం. మేము దాన్ని బహిర్గతం చేయడానికి ఇది సరైన సమయంగా భావించడం లేదు.

యువర్ స్టోరీ: మీ సాహసోపేతమైన వ్యాపారం పట్ల మార్కెట్ ఎలా స్పందిస్తోంది.

అంచల్ గుప్తా: మా ఉత్పత్తుల్లోని సత్తా, సామర్థ్యం జనాలకు బాగా తెలుసు. మా ప్రత్యేకమైన వస్త్ర ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా వారికి అందుబాటులో వుంచాము. దాన్ని వారు ఎంతో అభిమానంగా ఆదరిస్తున్నారు.

Website : Dress365days

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags