సంకలనాలు
Telugu

ఉద్యోగం కోసం ఇండియాకు వచ్చి.. బడా వ్యాపారిగా మారాడు..

11th Mar 2016
Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share


భారత్ లో మొబైల్ వినియోగదారుల సంఖ్య వంద కోట్లు దాటింది. 20 కోట్ల మందికిపైగా స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. 2020 నాటికి మొబైల్ వ్యాలెట్ మార్కెట్ విలువ 6.6 బిలియన్ కోట్ల డాలర్లు దాటుతుందని అంచనా. అంటే… 44వేల కోట్ల రూపాయల పైమాటే. 

ప్రభుత్వ విధానాలు, స్టార్టప్ లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో పేటీఎం, ఫ్రీ రీచార్జ్, మొబిక్ విక్ లాంటి స్టార్టప్స్ కోట్లలో వ్యాపారం చేస్తూ దూసుకు పోతున్నాయి. షాపింగ్ యాప్స్, కన్వీనియన్స్ యాప్స్, బుకింగ్ యాప్స్… ఇలా స్టోర్లలోకి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. 

దక్షిణ కొరియాలోని గంగ్నమ్ కు చెందిన సీరియల్ మొబైల్ ఏంట్రపెన్యువర్ చార్లీ లీ ఇటీవలే విడుదల చేసిన ట్రూ బ్యాలెన్స్ యాప్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్లుకూడా కాలేదు.. 20 లక్షల మందికి పైగా దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. దశాబ్దంగా ఢిల్లీలోని గుర్గావ్ లో ఉంటూ అనేక స్టార్టప్ లు ప్రారంభించిన 45 ఏళ్ల చార్లీ లీతో యువర్ స్టోరీ ముచ్చటించింది.  

యువర్ స్టోరీ: భారత్ లో మీ ప్రస్థానం ఎలా మొదలయ్యింది?

లీ : రియల్ నెట్ వర్క్ సంస్థలో పనిచేస్తూ 2002లో భారత్ వచ్చాను. హలో ట్యూన్స్ వ్యాస్( వేల్యూ యాడెడ్ సర్వీసెస్ )లో నేను భాగస్వామిని. రియల్ నెట్ వర్క్ కు ఇండియా హెడ్ గా పనిచేశాను. అప్పట్లో ఎయిర్ టెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మోహిత్ భట్నాగర్ తో కలిసి ఎయిర్ టెల్ ద్వారా హలో ట్యూన్స్ ప్రాచుర్యంలోకి తెచ్చాను. బీఎస్ఎన్ఎల్, ఐడియాతో కూడా టైఅప్ అయ్యాను. హలో ట్యూన్స్ వల్ల మొబైల్ సర్వీస్ కంపెనీలకు చాలా లాభాలొచ్చాయి. రియల్ పేరుతో ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, ఫిలిప్పీన్స్ లోనూ వ్యాపారం చేశాను. కాన్సెప్ట్ సేమ్ టూ సేమ్.

యువర్ స్టోరీ: రియల్ లో పనిచేశాక ట్రూ బ్యాలెన్స్ యాప్ ప్రారంభించారు ?మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది..?

లీ:2006 లో రియల్ నెట్ వర్క్స్ లో ఉద్యోగం మానేశాను. యాక్సెస్ మొబైల్ ప్రారంభించాను. నాకున్న అనుభవంతో మొబైల్స్ లో వేల్యూ యాడెడ్ సర్వీసులను అందిస్తున్నాను. అన్నీ విజయవంతమయ్యాయి. కలీగ్స్ ఉద్యోగాలు మానేసి నాతో కలిసివచ్చారు. సియోల్ హెడ్ క్వార్టర్స్ గా యాక్సెస్ మొబైల్ కంపెనీ స్థాపించాను. మ్యాజిక్ ఎస్ఎంఎస్, పిక్చర్ ఎస్ఎంఎస్, స్మార్ట్ టెక్స్ట్, భారత్ లో ఐడియా, టాటా, ఎయిర్ టెల్, వొడా ఫోన్ హలో ట్యూన్స్ ఆ కంపెనీ నుంచి వచ్చినవే. ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో సేవలందిస్తున్నాను. చైనా, ఆస్ట్రేలియా, వియత్నాం, థాయిలాండ్ సహా పశ్చిమాసియా దేశాల్లో మాకు ఆఫీసులున్నాయి.

undefined

undefined


ఇప్పుడు మా వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ల వాడకం 2008-09 నుంచి పెరిగింది. తర్వాత ఇప్పుడు మొబైల్ మార్కెట్ వాతావరణమే మారిపోయింది. యాక్సెస్ మొబైల్ కంపెనీలో కొత్త ఆలోచనలకు పెద్దపీట వేస్తాం. బ్యాలెన్స్ హీరో అనే బ్రాండ్ కింద 2014లో ట్రూ బ్యాలెన్స్ యాప్ ప్రారంభించాం. బ్యాలెన్స్ హీరోకు ఇప్పుడు ఫుల్ టైం సీఈఓను నేనే.

యవర్ స్టోరీ: ట్రూ బ్యాలెన్స్ యాప్ ఎలా పనిచేస్తోంది?

లీ: మొబైల్ బ్యాలెన్స్ చెకింగ్, రీఛార్జ్ ను తొందరగా చేస్తుంది ఈ యాప్. భారతీయ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని దీన్ని స్థాపించాను. ఒక్క టచ్ తోనే అన్నీ తెలుసుకోవచ్చు. ఇందులోకి మరిన్ని ఫీచర్లను యాడ్ చేస్తాం. యూసేజ్, అలెర్ట్ మెసేజ్ లు యాడ్ చేస్తాం.

యువర్ స్టోరీ: యాప్ ప్రయాణం ఎలా ఉంది?

లీ: 20 లక్షల మందికి పైగా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒక్కొక్కరూ మా యాప్ ద్వారా రోజుకు రెండు మూడు సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీలో మాకు 13వ స్థానం వచ్చింది. 2016 జనవరిలో ఓవరాల్ కేటగిరీలో 334 వ ప్లేస్ వచ్చింది. ఢిల్లీ సహా కొన్ని ఇక్కడి నగరాల్లో మా సేవలు అందిస్తున్నాం. కొన్ని నెలల్లోనే భారత్ అంతటా యాప్ సేవలు విస్తరిస్తాం. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేస్తాం.

యువర్ స్టోరీ: ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారు..? బిజినెస్ ఎలా ఉంది..?

లీ: క్లీన్ మాస్టర్ అనేది మాలాంటి కంపెనీయే. డెయిలీ యాక్టివ్ యూజర్స్ సంఖ్య పెంచడమే మాముందున్న మొదటి లక్ష్యం. యాడ్స్ వస్తే చాలు. రెండోది మీడియం టెర్మ్ కు పీటూపీ రీఛార్జ్ మోడల్ ను తీసుకు రావాలనుకుంటున్నాం. యుజర్స్ కు చాలా తక్కువ ఛార్జ్ చేస్తాం. 0.1 శాతం.. అలా అన్నమాట. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎవరి రీచార్జ్ వారు చేసుకోరు… ఉదాహరణకు కిరాణా షాపులోకి వెళ్లి పాతిక రూపాయల కార్డు వేయండి అంటారు. కిరాణాషాపు వారు అందులో కమిషన్ తీసుకుంటారు. మేం కూడా నామమాత్రపు కమీషన్ తీసుకుని ఈ యాప్ ద్వారా రీచార్జ్ చేయబోతున్నాం.

యువర్ స్టోరీ: భారత్ లోనే మీరు ఎందుకు వ్యాపారం చేయాలనుకున్నారు?

లీ: 2002లో నేను భారత్ తొలిసారిగా వచ్చాను. చాలా కాలం ఇక్కడే ఉన్నాను. చాలా ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ లో ఓపెన్ మార్కెట్ వ్యవస్థ ఉంది. నేను మొబైల్ వేల్యూ యాడెడ్ సర్వీసులు అమ్మినప్పుడు టెలికం కంపెనీలు నాతో చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరించాయి. భారత్ చాలా పెద్ద దేశం. మొదట్లో అయితే మేం సేవలు అందించగలమా భయపడ్డాం. అదీ.. పెద్ద పెద్ద మొబైల్ కంపెనీలతో కలిసి. కో-ఆర్డినేషన్ పక్కాగా చేయడంతో పేమెంట్స్ దగ్గర నుంచి అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. పేటీఎం విజయ్ శంకర్ శర్మాతోనూ టచ్ లో ఉన్నాను. మేమిద్దరం ఒకేలాంటి వ్యాపారాలు చేస్తున్నాం.

యువర్ స్టోరీ: మీ భవిష్యత్ ప్రణాళికలేంటి?

లీ: ట్రూ బ్యాలెన్స్ ను పూర్తి స్థాయి సేవలు అందించే సంస్థగా మార్చడమే ప్రస్తుతం నా టార్గెట్. వేరే ఆలోచనలేమీ ప్రస్తుతానికి లేవు. అన్ని రకాల బ్యాలెన్స్ వివరాలను ఒకే యాప్ ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. క్లోజ్డ్ వ్యాలెట్ అనే కొత్త యాప్ తీసుకొస్తాం. అది ఒక ఆలోచన మాత్రమే. ఇప్పుడు మాత్రం దృష్టంతా ట్రూ బ్యాలెన్స్ పైనే. 

క్కడ దక్షిణ కొరియా... ఎక్కడ భారత్... టెక్నాలజీకి హద్దులు, సరిహద్దులు లేవని నిరూపిస్తున్నారు లీ. ప్రపంచీకరణ అన్నింటినీ చెరిపేసిందంటే ఇదేనేమో. 

Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share
Report an issue
Authors

Related Tags