సంకలనాలు
Telugu

స్టార్టప్ కంపెనీలకు మంచి కిక్కిచ్చే బడ్జెట్!

Pavani Reddy
1st Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా … ఇది ప్రధాని నరేంద్రర మోదీ నినాదం. ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఉద్యోగార్ధులను … ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో స్టార్టప్ లకు ఈ బడ్జెట్ లో తగిన ప్రాధాన్యతనిచ్చారు. టెక్నాలజీ ఆధారిత… ఆర్థిక వ్యవస్థను సాధించడం స్టార్టప్ ల ద్వారానే సాధ్యమని మోదీ సర్కార్ భావిస్తోంది. స్టార్టప్ ఇండియాకు ఊతం ఇచ్చేందుకు ఈ బడ్జెట్ లో కొన్ని విధానపరమైన నిర్ణయాలను ప్రకటించారు. స్టార్టప్ లతోనే నూతన ఆవిష్కరణలు సాధ్యమని… ఉపాధి లభిస్తుందని, మేకిన్ ఇండియాలో అవి కీలక భాగస్వాములవుతాయని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. ఇది చాలా స్టార్టప్ లకు కేంద్రం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి.

 తయారీరంగ సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతమే

పారిశ్రామిక కార్యకలాపాల ప్రోత్సాహానికి, ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వం కార్పొరేట్ పన్ను తగ్గించింది. కొత్తగా ఏర్పాటయ్యే తయారీ కంపెనీలపై పన్నును 25 శాతానికే పరిమితం చేసింది. గతంలో ఇది 30 శాతం గా ఉండేది. ఐదు కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న చిన్న సంస్థలకు సైతం పన్నును… 29 శాతానికి తగ్గించింది. 2016 మార్చి ఒకటో తేదీ తర్వాత ఏర్పాటయ్యే కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఇది తయారీరంగ స్టార్టప్ లకు గొప్ప ఊరటగానే చెప్పొచ్చు.

స్టార్టప్ కంపెనీలకు పన్నుల వసూళ్లలోనూ మినహాయింపులు లభించనున్నాయనేది నిపుణుల మాట. మరో ఐదు శాతం మినహాయింపులు లభించే అవకాశం ఉంది. తక్కువ లాభాలున్న తయారీరంగ స్టార్టప్ లకు ఇది వర్తించనుంది.

స్టార్టప్ లకు మూడేళ్లపాటు 100 శాతం మినహాయింపు

స్టార్టప్ లకు మూడేళ్లపాటు వందశాతం పన్ను మినహాయింపు లభించనుంది. సంస్థ నమోదు కూడా ఒక్క రోజులోనే పూర్తిచేసుకునే అవకాశం లభించింది. అంతేకాదు… స్టార్టప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా పథకానికి 11 వందల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. టెక్నాలజీ ఆధారిత సేవలు – పేటెంట్ రంగాల్లో అర్హత కలిగిన సంస్థలు ఆర్జించే లాభాలపై అస్సలు పన్నులే లేకుండా చేశారు.

ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్

తొలి ఏడాది టర్నోవర్ - రూ. 20 లక్షలు

నికర లాభం -రూ. 2.23 లక్షలు

బుక్ ప్రాఫిట్ – రూ. 1. 82 లక్షలు

ట్యాక్స్ – కొత్త రూల్స్ ప్రకారం అస్సలు పన్ను కట్టాల్సిన పనిలేదు

గతంలో అయితే 33 వేల 762 రూపాయలు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు పన్ను రద్దయ్యింది

ఎక్స్ జెడ్ వై ప్రైవేట్ లిమిటెడ్

మూడో ఏడాది ఆదాయం – రూ. 50 లక్షలు

నికర నష్టం - రూ.70 వేలు

బుక్ ప్రాఫిట్ – రూ. 62 వేల 7 వందలు

కొత్త రూల్స్ ప్రకారం ఎలాంటి పన్ను కట్టాల్సిన పనిలేదు

గతంలో ఉన్న రూల్స్ ప్రకారం రూ. 11 వేల 6 వందలు పన్ను కట్టాల్సివచ్చేది

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్

కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రభుత్వం మూడేళ్లపాటు 8.33 శాతం ఈపీఎఫ్ సహాయం చేస్తుంది. దీనివల్ల స్టార్టప్ కంపెనీలకు 12 శాతం ఖర్చులు ఆదా అవుతాయి. స్టార్టప్ కంపెనీలు… ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక చర్చలేమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి పెంపే దీని అసలు ఉద్దేశం. ఈపీఎఫ్ ల కోసం ప్రభుత్వం బడ్జెట్లో వెయ్యికోట్లు కేటాయించింది.

ఇప్పటివరకు కంపెనీలే ఈపీఎఫ్ ఓగా ఉద్యోగుల జీతాలనుంచి 12 శాతం చెల్లించాల్సివచ్చేది. దీంతో చాలా కంపెనీలు ముఖ్యంగా స్టార్టప్ లు ఈపీఎఫ్ఓలో చేరేకుండా తప్పించుకునేవి. ఇకపై ఆ సమస్య ఉండదు. ప్రభుత్వమే చెల్లింపులు చేపడుతుండటంతో… స్టార్టప్ లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇందులో చేరే అవకాశం ఉంది. పీఎఫ్ వస్తుందన్న భరోసాతో … టాలెంటెడ్ యూత్ స్టార్టప్ రంగంలోకి రానుంది.

మేకిన్ ఇండియా – 100 శాతం మినహాయింపులు

కొన్ని షరతులకు లోబడి మేకిన్ ఇండియాలో భాగస్వామ్యమైన కంపెనీలకు నూరుశాతం పన్ను మినహాయింపు లభించనుంది. మ్యాట్ మాత్రం వర్తిస్తుంది. స్టార్టప్ ల నిరక లాభాలపై పన్నుల్లేవు. దీంతో ఎక్కువమంది యువకులు స్టార్టప్ లవైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.

హెచ్ఆర్ఏ మినహాయింపులు

అద్దె ఇళ్లలో నివసిస్తూ హెచ్ఆర్ఏ లభించని ఉద్యోగులకు ఊరట లభించింది. ఆదాయపు పన్నుపై లభించే మినహాయింపు పరిమితిని 24 వేల రూపాయల నుంచి … 60 వేల రూపాయలకు పెంచారు. స్టార్టప్ ల్లో పనిచేసేవారు దేశ నలుమూలల నుంచి వచ్చి నగరాల్లో పనిచేస్తుంటారు. వీరు ఎక్కువగా అద్దె ఇళ్లలోనే ఉంటారు కాబట్టి… ఇది స్టార్టప్ ఉద్యోగులకు వరంగానే చెప్పవచ్చు.

స్టార్టప్ లకోసం కంపెనీల చట్టం 2013కు సవరణలు

స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్ వేగవంతమవ్వడానికి కంపెనీల చట్టానికి సవరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.ఇది విధానపరమైన గొప్ప నిర్ణయం.

ఇతర ముఖ్యాంశాలు

రవాణారంగంలో సరళీకరణకోసం మోటార్ వెహికిల్స్ చట్టాన్ని సవరించనున్నారు.

ఎస్సీ / ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ప్రత్యేక హబ్

ఎస్సీ – ఎస్టీ- మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఐదు వందల కోట్లతో ప్రత్యేక నిధి

మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్స్ MOOCS ద్వారా వ్యాపార మెళకువల్లో ప్రత్యేక శిక్షణ 

యువతకు ఉద్యోగాలు కల్పించాలంటే… దేశాభివృద్ధికి బాటలు వేయాలంటే … స్టార్టప్ లను , పరిశ్రమలను ప్రోత్సహించడమే మార్గమని ప్రభుత్వం గుర్తించింది. వ్యాపారం చేయడం మరింత సరళంగా మార్చాలి. స్టార్టప్ లకు ఇంకా కొన్ని అడ్డంకులున్నాయి. ఎఫ్ఎంవీ ట్యాక్స్ ప్రావిజన్, ఈఎస్ఓపీ లాభాలపై పన్నులు, లేబర్ లాస్. ఈ రంగాల్లో మార్పులు వస్తే… కొత్త పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags