సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ కు అసలైన నిర్వచనం హన్మకొండ బాలవికాస

సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ కు అసలైన నిర్వచనం హన్మకొండ బాలవికాస

Wednesday March 23, 2016,

3 min Read


ఈ మధ్యే దేశవ్యాప్తంగా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అంటున్నారు కానీ.. ఈ స్లోగన్స్ ఏవీ లేని ఆ రోజుల్లోనే వంరంగల్ కి చెందిన బాలవికాస సంస్థ స్టార్టప్ కల్చర్ కి నాంది పలికింది. వెబ్ సైట్ , ట్రాక్షన్, ఫండింగ్, సొల్యూషన్ లాంటి పాష్ పదాలు వాడకపోయినా సెల్ఫ్ సస్టేయినబుల్ మోడల్ లో వ్యాపారాన్ని ఎలా చేయాలో నేర్పిస్తోంది. 

సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్

స్టార్టప్ లన్నీ మెట్రోలకే పరిమితం అయ్యాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నో సంస్థలు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలెన్నో గ్రామీణ భారతంలో నెలకొన్నాయి. వీటికి కావల్సిన సాయం అందించడానికే ఏర్పాటైందే బాలవికాస సంస్థ

విజయ్ బాలవికాస ఇంటర్నేషనల్ కి హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఆంట్రప్రెన్యూర్షిప్ కంటే పరిశ్రమలతో సమాజంలో మార్పు తీసుకు రావడం తమ ముఖ్య ఉద్దేశం అంటున్నారాయన. సంస్థను నెలకొల్పడమంటే ఎంతో మందికి ఉపాధి కల్పించడం. ఉపాధి అంటే వారి కుటుంబాలకు సాయం అందించడం అని ఆయన అభిప్రాయపడ్డారు. లాభాపేక్ష కంటే సామాజికకోణంలో వ్యాపారం చేయగల సంస్థలకు తమ సాయం తప్పకుండా ఉంటుందని అన్నారాయన.

image


ఖండాంతరాల్లో బాలవికాస

బాల వికాస ఇంటర్నేషనల్ కు భారత్ పాటు కెనడా లో కూడా ఆఫీస్ ఉంది. వరంగల్ లో మొదలైన ఈ సంస్థ సిల్వర్ జూబ్లీ కూడా పూర్తి చేసుకుంది. దేశంలో స్టార్టప్ ఇకో సిస్టమ్ నెమ్మదిగా మొదలైన క్రమంలో బాలవికాస ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రారంభమైంది.

“ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న ఎన్నారై లకు మేం స్టార్టప్ లను వెతికిపెడతాం,” అనూషారెడ్డి

బాలవికాసకు అనూషారెడ్డి ప్రొగ్రాం ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. సిఎస్ఆర్ లాంటి ఫండ్స్ ని వినియోగించడానికి తమతో కలసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. పూర్తిగా సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ కు సాయం అందించే వారితో టై అప్ అవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారామె.

image


ఆలోచనతో రండి

సోషల్ స్టార్టప్ ఐడియా ఉంటే చాలు దాన్ని పూర్తిస్థాయి స్టార్టప్ గా మారుస్తామని అంటున్నారు విజయ్. ప్రధానంగా 3 దశల్లో తమ ప్రొగ్రాం ఉంటుందని వివరించారు.

1. ప్రీ ఇంక్యుబేషన్ సర్వీసులు

ఐడియేషన్ ప్రాసెస్ ను మద్దతిస్తూ నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతారు. ఈ క్రమంలోనే సోషల్ ఇన్నోవేటర్స్ కు కౌన్సిలింగ్ సపోర్ట్ ఇస్తారు.

2. మెంటారింగ్, కోచింగ్ సపోర్ట్

ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ కోసం స్కిల్స్, ట్రెయినింగ్ తో పాటు కావల్సిన పూర్తి సమాచారం అందిస్తారు. సామాజిక కోణంతో పాటు కమర్షియల్ గా ఎలా నెగ్గుకు రావాలనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సాయం చేస్తారు. 

3. ఇంక్యుబేషన్ కమ్ బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్

చిన్నాతరహా వ్యాపార వేత్తలు, ఆంట్రప్రెన్యూర్లకు టెక్నికల్ , నాన్ టెక్నికల్ సేవలను ఈ దశలో అందిస్తారు. దీని ద్వారా వారు చేరాలనుకున్న గోల్ ను మరింత బాగా అర్థం చేసుకోగలరు. కమర్షియల్ గా స్టార్టప్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో, ఈ దశలో అర్థమవుతుంది. డిజైన్, ఐపి రిజిస్ట్రేషన్ లాంటి వ్యవహారాలన్నీ ఈ స్టేజ్ లోనే కంప్లీట్ చేసుకుంటాయి. ఆలోచన కాస్తా పూర్తిస్థాయి స్టార్టప్ గా రూపాంతం చెందుతుందన్న మాట.

బాలవికాస టీం

ఇక టీం విషయానికొస్తే ప్రధానంగా చెప్పుకోవలసింది ముగ్గురు గురించి. విజయ్ భాస్కర్ దీనికి జనరల్ మేనేజర్. మేనేజ్మెంట్, సోషల్ డెవలప్ మెంట్ రంగాల్లో దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది అతనిని. 1991 నుంచి సామాజిక పరిస్థితులపై అధ్యయంన చేయడం.. వాటికి పరిష్కార మార్గాలు చూపించం లాంటి వ్యవహారాలు చూస్తున్నారు. బాలవికాసకు చివరి నిర్ణయం తీసుకోవడంలో ఈయన కీలక సభ్యుడు. శౌరి రెడ్డి టీంలో మరో కీలక వ్యక్తి. ఈయన కూడా సోషల్ డెవలప్మెంట్ ఇన్ సస్టేయినబులిటీ పై దాదాపు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వీరితో పాటు ప్రొగ్రాం ఆఫీసర్ గా అనూష పనిచేస్తోంది. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ లో యూకే లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమీ నుంచి డిగ్రీ పొందారామె. ఎయిడ్ ఎట్ యాక్షన్ అనే సంస్థలో రెండున్నరేళ్లు పనిచేశారు. వీరితో పాటు ఫ్రీలాన్సర్స్ చాలా మంది పనిచేస్తున్నారు.

image


సవాళ్లు, ఫ్యూచర్ ప్లాన్స్

సరైన సోషల్ స్టార్టప్ లను గుర్తించడం ప్రధాన సవాల్ అని అనూష అంటున్నారు. సోషల్ ఫండింగ్ తీసుకు రావడం కూడా ఛాలెంజ్ అని అంటున్నారు. తమ దగ్గరున్న సక్సెస్ స్టోరీస్ తో దీన్ని అధిగమిస్తామనే భరోసాతో ఉన్నారు. ప్రస్తుతం వీరు అన్ లిమిటెడ్ హైదరాబాద్ లాంటి సంస్థలతో కలసి పనిచేస్తున్నారు. ఫండింగ్ విషయంలో చిక్కులను అధిగమించడానికి ఎన్జీఓలతో కలసి పనిచేయడం సరైన మార్గంగా చెబుతున్నారు.

పూర్తి స్థాయి ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం ముందున్న టార్గెట్ గా చెబుతున్నారు అనూష. సిఎస్ఆర్ టై అప్స్ లాంటివి మరింత స్పీడప్ చేయడం ఈ ఏడాది ప్రణాళికలుగా పెట్టుకున్నారు. సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయడం తమ అంతిమ లక్ష్యమని ముగించారు అనూష.

image