నలుగురు కుర్రాళ్లకు ఖాళీ కుర్చీలు నేర్పిన మార్కెటింగ్ పాఠాలు

 లోకల్ బిజినెస్‌కు డిజిటల్ మార్కెటింగ్ కల్పిస్తున్న పిక్‌సెల్

16th Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


అది 2014 డిసెంబర్ 31. నలుగురు మిత్రులు కలిశారు 2014 సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు బెంగళూరు కోరమంగళలోని ఓ చిన్న రెస్టరెంట్‌లో పార్టీ చేసుకుంటున్నారు. ఆర్డరిచ్చిన ఫుడ్ అద్భుతంగా ఉంది. చుట్టూ యాంబియన్స్ కూడా అదిరిపోయింది. చూడగానే రెస్టరెంట్ నచ్చేసింది. అయితే ఇంతకుముందు ఆ రెస్టరెంట్‌ గురించి వారెప్పుడూ వినలేదు. వెళ్లడం కూడా అదే తొలిసారి. విచిత్రం ఏంటంటే ఆ రెస్టరెంట్‌లో ఉన్నది ఆ నలుగురే. చుట్టూ ఖాళీ కుర్చీలు. అరే.. ఎందుకిలా..? ఫుడ్ బావుంది.. యాంబెన్స్ అదిరింది. క్వాలిటీ ఖతర్నాక్ ఉంది. ఇన్ని రకాలుగా బాగున్నా.. ఎందుకిలా దివాళా తీసినట్టుగా వుంది? అంటే ఏం లేదు.. ఆన్సర్ సింపుల్. వ్యాపారానికి తగిన మార్కెటింగ్ లేదు.

సుబ్రత దేబ్‌నాథ్, బసుదేవ్ సాహా, అభిజిత్, రాజేశ్

సుబ్రత దేబ్‌నాథ్, బసుదేవ్ సాహా, అభిజిత్, రాజేశ్


చిన్న చిన్న రెస్టారెంట్లు, చిన్నాచితక వ్యాపారస్థులు సాధారణంగా స్థానిక కస్టమర్లనే టార్గెట్ చేసుకుంటారు. ఆ పరిసరాల్లో పబ్లిసిటికీ ప్రింట్ యాడ్స్, డిజిటల్ మీడియా ప్రచారం, ఫేస్‌బుక్, ఇన్‌మొబీ, జస్ట్ డయల్, గూగుల్ యాడ్స్, ఎస్‌ఎంఎస్ వంటి అంతగా ఉపయోగపడవు.

సుబ్రత దేబ్‌నాథ్, బసుదేవ్ సాహా, అభిజిత్ చౌదరి, రాజేశ్ భట్. వీరంతా చిన్ననాటి స్నేహితులు. 20 ఏళ్ల స్నేహం. అరుణాచల్ ప్రదేశ్‌లోని నార్త్ఈస్ట్ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఈఆర్ఐఎస్‌టీ)లో బీటెక్ చేస్తున్నప్పుడే వీరికి స్టార్టప్ ఐడియా వచ్చింది.

లోకల్ బిజినెస్‌ను డెవలప్ చేసేందుకు అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలన్నది ఐడియా సారాంశం. ఆ ఉద్దేశంతో ‘పిక్‌సెల్‌’ను ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇమేజ్‌ను గుర్తుకు తెచ్చే పిక్సెల్ మాదిరిగా వీరి స్టార్టప్‌కు కూడా పిక్‌సెల్ అనే పేరు పెట్టారు. స్థానిక కస్టమర్లే టార్గెట్‌గా వ్యాపారం నిర్వహించేవారి కోసం డిజిటల్ అడ్వర్టయిజింగ్ చేయడానికి పిక్‌సెల్ సిద్దమైంది.

కొత్తతరం మార్కెటింగ్..

టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్ వంటి సంప్రదాయ ప్రచారం కాకుండా, స్థానికంగా ప్రచారం కోసం వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. అపార్ట్‌మెంట్స్, వ్యాపార కూడళ్ల దగ్గర డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.

చిన్న చిన్న టౌన్లలో పక్కపక్కనే రెస్టరెంట్లు, హెయిర్ సెలూన్లు, రీటైల్ స్టోర్స్, అపార్ట్‌మెంట్స్, క్లినిక్స్, మాల్స్ ఉంటుంటాయి. అన్ని ప్రాంతాల్లో సాధారణంగా డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి. కానీ అవి స్విచ్ ఆఫ్ చేయడమో లేక, కేబుల్ ప్రసారాలు ఆపివేయడమో జరుగుతుంటుంది. అపార్ట్‌మెంట్లు, సెలూన్లు, రెస్టారెంట్ల దగ్గర ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్స్‌లో పిక్‌సెల్ సహకారంతో ప్రీ స్కూల్ యాడ్ వస్తుంది.

వివిధ ప్రాంతాలను ఎంపికచేసుకుని, డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి, కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి ప్రచారాన్ని అయిదు నిమిషాల్లో ప్రారంభిస్తుంది పిక్‌సెల్ టీమ్. దేశంలో 20 మిలియన్ల చిన్న వ్యాపారాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున డిజిటల్ స్క్రీన్స్ పెట్టేందుకు అవకాశాలున్నాయి అంటాడు అభిజిత్.

ఇదీ పిక్‌సెల్ స్టోరీ..

ఐఐఎస్‌సీలో 2002లో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన అభిజిత్ మోటరోలా, సిస్కో, అపీగీ వంటి కంపెనీల్లో పనిచేసి.. ఆ తర్వాత సుబ్రతతో కలిసి 2012లో సాఫ్ట్‌వేర్ కన్‌సల్టింగ్ ఫర్మ్ ఈ-ట్రాన్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు.

పిక్‌సెల్ నలుగురు వ్యవస్థాపకులు ప్రాడక్ట్ బిల్డింగ్‌లో సిద్ధహస్తులు. అయితే ఒకే ప్రాడక్ట్‌పై పూర్తిగా దృష్టిసారించి కాన్సెప్ట్ నుంచి ప్రొడక్షన్ వరకు, సేల్స్, సపోర్ట్ అన్ని విభాగాల్లోనూ పట్టు సాధించాలనుకున్నారు. దాని ఫలితమే పిక్‌సెల్ ఏర్పాటు. ఆరంభ మూలధనం కోటి 20 లక్షలతో అధికారికంగా పిక్‌సెల్‌ను రిజిస్టర్ చేశారు. 15 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ ఇటీవలే ముంబైకి చెందిన జెన్ నెక్స్ట్‌ హబ్‌తో కలిసి స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం నిర్వహించింది.

ఈ సంస్థ ఫస్ట్ కస్టమర్ యూనిలీవర్.. వీరికి ఎంతో సహకరిస్తోంది. డిజిటల్ స్క్రీన్స్‌లో అంతర్గత సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. ఈమెయిల్స్ ద్వారా గతంలో జరిగేది. అది ఇటీవలే డిజిటల్ స్క్రీన్స్‌కు మారింది. అలాగే హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్‌లో ఉన్న అన్ని స్క్రీన్స్‌లో ప్రచారం చేసుకునేందుకు పిక్‌సెల్‌తో నారాయణ హృదాయాలయ హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

తొలి ఏడాదే మంచి లాభాలను ఆర్జించిన పిక్‌సెల్, 2016 చివరికి 500 క్లయింట్లతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటోంది. ప్రస్తుతానికి వీఎల్సీసీ, లాక్మే, బిగ్ బజార్, చెన్నై బేస్డ్ ఎఫ్‌ఎంసీజీ కంపెని వతన్‌మాల్‌తో సహా 200 కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. ప్రమోట్ చేసుకునేందుకు క్యాబ్ హైరింగ్ ప్లాట్‌ఫామ్ ఉబెర్ కూడా అపార్ట్‌మెంట్లలోని స్క్రీన్స్‌ను ఉపయోగించుకుంటోంది.

పిక్‌సెల్‌ ఉద్యోగులు..

పిక్‌సెల్‌ ఉద్యోగులు..


బిజినెస్ మోడల్..

అసెట్ లైట్ మోడల్‌లో పిక్‌సెల్ పనిచేస్తోంది. డిజిటల్ అవుట్ ఆఫ్ హోమ్ (డీఓఓహెచ్) మాదిరిగా కాకుండా, నగరంలో ఫిక్స్ చేస్తున్న డిజిటల్ స్క్రీన్స్‌ను పిక్‌సెల్ సొంతంగా నిర్వహించడం లేదు. డిజిటల్ స్క్రీన్స్‌ను మేనేజ్ చేసేందుకు నిర్వహించేందుకు పార్ట్‌నర్లతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. పిక్‌సెల్ రూపొందించే నెట్, వైఫై లేదా త్రీజీ, ఫోర్ జీ పార్ట్‌నర్లను స్క్రీన్స్‌కు కనెక్ట్ చేస్తున్నారు. యాడ్ ప్లే అయినప్పుడల్లా వచ్చే ఆదాయాన్ని ఈ పార్ట్‌నర్లతో కలిసి పంచుకుంటున్నారు. ఒకేసారి అన్ని స్క్రీన్స్‌కు క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అందిస్తున్నారు. అందుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు.

పిక్‌సెల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రచారం నిర్వహించేందుకు వారానికి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ ఆదాయాన్ని పార్ట్‌నర్లతో కలిసి పంచుకుంటున్నారు. స్థానిక వ్యాపార సంస్థలే కాకుండా, చిన్న చిన్న ప్రాంతాలను టార్గెట్ చేసే పెద్ద బ్రాండ్స్ సైతం ఈ డిజిటల్ స్క్రీన్స్‌లలో ప్రచారం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. స్థానిక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలతో కూడా పిక్‌సెల్ ఒప్పందం కుదుర్చుకుంటోంది.

‘‘బ్రిగేడ్ గేట్ వే, శోభా డాఫోడిల్, పూర్వ పనోరమా వంటివాటితో సహా బెంగళూరులోని పది పెద్ద అపార్ట్‌మెంట్లలో డిజిటల్ స్క్రీన్స్ ద్వారా నోటీసులను కూడా ప్రదర్శిస్తున్నారు. పని ప్రదేశాల్లోనైతే మేం ఇంటర్నల్ కమ్యూనికేషన్ల కోసం ఈమెయిల్స్‌కు బదులుగా డిజిటల్ స్క్రీన్స్ నోటీసులను ఉపయోగిస్తున్నారు.

డిజిటల్ ప్రచారాలను ఎంత మంది వీక్షిస్తున్నారో తెలుసుకునేందుకు కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్క్రీన్ పై వస్తున్న సమయంలో ఎంతోమంది వాటిని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ కౌంట్‌ను పిక్‌సెల్ క్లౌడ్.. టైమ్, డేట్‌తో సహా రికార్డు చేస్తుంది. అలాగే ఈ సమయంలో ఏ స్క్రీన్‌లో ఏ ప్రకటన వచ్చిందో కూడా అడ్వర్టయిజర్లు తెలుసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వారు కోరుకుంటే ఎంత మంది తమ ప్రకటనలను వీక్షించారో విజువల్స్‌తో సహా అందజేస్తున్నారు పిక్‌సెల్ నిర్వాహకులు.

ట్యాబ్లెట్స్, టచ్ టీవీల ద్వారా ప్రాడక్ట్‌లను కొనుగోలు చేసే అవకాశాలను కూడా కల్పించాలనుకుంటన్నారు. స్క్రీన్లలో ప్రకటన చూసి ఎంతమంది ఆ వస్తువును కొనుగోలు చేశారో ప్రకటనదారులకు తెలిసిపోతుంది. 

గట్టి పోటీ..

లోకల్ బిజినెస్ డెవలప్‌మెంట్‌కు మాంచి ప్రచారం నిర్వహిస్తున్న పిక్‌సెల్‌కు ఈ రంగంలో పోటీ గట్టిగానే ఉంది. రెస్టరెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, డీఓఓహెచ్ ప్లేయర్ ‘లైవ్ మీడియా’ వంటివి పోటీగా వస్తాయని పిక్‌సెల్ భావిస్తోంది. అయితే విభిన్న ప్రచారం ద్వారా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న పిక్‌సెల్.. ఇప్పుడు రీటైల్ చైన్స్‌పై దృష్టిసారించింది. వీటి ద్వారా దేశంలో లక్షన్నర స్క్రీన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇండియాలోనే కాదు ఇండోనేషియాలో సైతం పిక్‌సెల్ బిజినెస్ నిర్వహిస్తోంది. అక్కడి రవాణా సంస్థతో పిక్‌సెల్ ఒప్పందం కుదుర్చుకుంది.

మార్కెట్ అంచనా..

దేశంలో యాడ్ మార్కెట్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఈ రంగం విలువ 45 వేల కోట్లు. ప్రతి ఏటా 13% వృద్ధి చెందుతోంది. 2018 కల్లా ఈ మార్కెట్ మరో 20 కోట్లు వృద్ధి చెందుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ఇంటర్నెట్ వ్యాప్తి దేశంలో 34.8% మాత్రమే ఉంది. అమెరికాలో అయితే 88.5%గా ఉంది. లోకల్ యోకెల్ మీడియా, థింక్ నియర్, యూజ్ వంటి సంస్థలు హైపర్ లోకల్ అడ్వర్టయిజింగ్ మీడియాలో ఉన్నాయి. దేశంలోని మెట్రో నగరాలకు విస్తరించేందుకు మౌలిక వసతుల ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోతో పిక్‌సెల్ ఒప్పందం కుదుర్చుకుంది. వినూత్న ఆలోచనలతో స్థానిక వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్న పిక్‌సెల్.. మరిన్ని విజయాలు సాధించాలని యువర్‌స్టోరీ కోరుకుంటోంది.

వెబ్‌సైట్:


  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India