సంకలనాలు
Telugu

మందుకొట్టి తలపట్టేసిందా..? నో టెన్షన్.. మార్నింగ్ ఫ్రెష్ తాగండి..

SOWJANYA RAJ
16th Mar 2016
Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share


రమేష్, సురేష్ ఇద్దరూ ఐటీ ఉద్యోగులు.. అంతకు మించి మంచి ఫ్రెండ్స్...వీకెండ్స్ లో ఇద్దరూ లేట్ నైట్ పార్టీలు చేసుకుంటారు..."ఫుల్లు"గా ఎంజాయ్ చేసి ఇంటికెళ్తారు..సండే ఇద్దరికీ బానే ఉంటుంది...కానీ సోమవారం వచ్చేసరికి రమేశ్ కు చుక్కలు కనిపిస్తాయి.. కారణం "హ్యాంగోవర్".. నరకం కనిపిస్తుంది. అందుకే రమేష్ నుంచి "ఓ గాడ్ దిసీజ్ మండే" అనే నిట్టూర్పు ప్రతివారం వస్తుంది.

కానీ సురేష్ విషయంలో మాత్రం పూర్తి డిఫరెంట్. "థాంక్ గాడ్.. దిసీజ్ మండే" అనుకంటూ ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఆఫీసుకెళ్తాడు. హ్యాంగోవర్ అన్నమాటే ఉండదు.

ఇద్దరి ఎంజామెంట్ ఒకటే..! అయినా రమేష్.. సురేష్ ల విషయంలో హ్యాంగోవర్ ఎందుకు వివక్ష చూపిస్తోంది..?!

ఎందుకంటే సురేష్ ఇంకో బాటిల్ ఎక్కువ తాగుతాడు కాబట్టి... ! ఆ బాటిల్ పేరు "మార్నింగ్ ఫ్రెష్". ఎంత తాగినా హ్యాంగోవర్ ని హండ్రెస్ పర్సంట్ హ్యాండిల్ చేసే వెరైటీ డ్రింక్..! సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటే లేదు. ఇంకా చెప్పాలంటే అల్కహాల్ వల్ల వచ్చే దుష్పరిణామాలను తగ్గిస్తుంది కూడా.. దీన్ని తయారు చేసింది ఎవరో తలనెరిసిన సైంటిస్టు కాదు.. మిథాలీ టాండన్ అనే పాతికేళ్ల యువతి. తన సరికొత్త డిస్కవరీతో స్టార్టప్ కంపెనీని ప్రారంభించి ఫ్యూచర్ స్టార్ గా అప్పుడే పేరు సంపాదించారు. 

image


నవతరం లైఫ్ స్టైల్ కోసం ...

24X7 సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, బీపీవో స్టాఫ్, స్టార్టప్ ఔత్సాహికులు, అంట్రప్రెన్యూర్లు ఇలా ఇప్పుడు ఏ రంగం చూసుకున్నా... ఫలానా టైంలోనే ఫలానా పనిచేయాలనే రూల్ ఎక్కడా లేదు. వారంలో ఏడు రోజులు.. ఇరవై నాలుగ్గంటలూ... గడియారం ముల్లు తిరుగుతున్నంత సేపూ పని చేయాల్సిందే. ఈ వర్కింగ్ లైఫ్ స్టైల్ లోనే లేట్ నైట్ పార్టీలు, వీకెండ్ మస్తీలు చొచ్చుకొచ్చేశాయి. వీటిలోకొచ్చేసిన తర్వాత నేను పట్టను... నేను ముట్టను అని మడిగట్టుకుని కూర్చునేదేం ఉండదు. పార్టీలో అంతా సూపర్బ్... మనకన్నాఎంజాయ్ చేసేవాడు ప్రపంచంలో మరొకడు ఉండడు అనిపిస్తోంది. కానీ ఆ తర్వాతి రోజు ఉదయం మాత్రం మన కన్నా దరిద్రుడు ఉండడనిపిస్తుంది. ఒకరకమైన నరకం కనిపిస్తుంది. కడుపులో జానీవాకర్ తిరుగుతుంటాడు. వాడి వాకింగ్ నే "హ్యాంగోవర్" అంటారు. ఆ బాధవల్లే ఐటీ కంపెనీల్లో సోమవారాల్లో ఉద్యోగుల హాజరు శాతం సగం పడిపోయిందట. ఈ మధ్య ఏదో సర్వేలో తేలింది. ఈ హ్యాంగోవర్ ని చిటికెలో నయం చేస్తుంది మార్నింగ్ ఫ్రెష్.

కర్నాటకలో బయోటెక్నాలజీ ఆథారిత పరిశ్రమ నడిపే కుటుంబం నుంచి వచ్చిన మిథాలీ టాండన్ కు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలనే తపన ఎక్కువ. అందుకే కాలేజీలో చదివే సమయంలో యంగ్ ఎంటర్ ప్రైస్ పేరుతో ఓ గ్రూపును నడిపారు. తర్వాత ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ సంస్థకు ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ లో సహకారం అందించారు. తర్వాత దళితులు, ఆదివాసీలకు సాయం చేసే ఎన్జీవో సంవాద్ కు సేవలు అందించారు. చదువు చివరిదశకు వచ్చినప్పుడు తండ్రి కంపెనీలో బాధ్యతలు తీసుకున్నారు.

ప్రయోగాలతో హ్యాంగోవర్... సక్సెస్ తో ఫ్రెష్

మిథాలీ తండ్రి కంపెనీ పేరు సెరీకేర్. నేచురల్ ప్రొటీన్ ఫైబర్ అయిన సిల్క్ నుంచి సెరీకల్చర్ కు అవసరమైన బయో మెటీరియల్స్ తయారుచేయడంలో ఈ కంపెనీకి చాలా పెద్ద పేరు ఉంది. తండ్రి కంపెనీలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంతంగా ఏదైనా చేయాలనుకున్నారు. ప్రయోగాలు ప్రారంభించారు. మొదట బ్లాంక్ గా ప్రారంభించినా.. నేచురల్ ప్రొటీన్ ఫైబర్ అయిన సిల్క్ తో ఎన్నో రకాల కొత్త ఉత్పత్తులు తయారు చేయగలమని నమ్మింది. అయితే ఏం చేయాలనేదానిపై మొదట క్లారిటీ లేకపోయినా... పరిశోధనలు... ఆ తర్వాత ఫలితాల నేపధ్యంలో... ఆల్కహాల్ తాగిన తర్వాత లివర్ పై పడే ప్రభావాన్ని సిల్క్ తగ్గించగలదని అంచనా వేసింది. ఆ తర్వాత మరోక్షణం కూడా ఆలోచించలేదు. ఆ దిశగా అడుగు ముందుకేశారు మిథాలీ టాండన్.

image


" సిల్క్ నుంచి ఉత్పత్తి చేయగలిగే కొన్నిఎంజైమ్ లు ఆల్కహాల్ వలన కలిగే ఇబ్బందులను దూరం చేయగలవని పరిశోధనల్లో గుర్తించాం. అధిక మొత్తంలో అల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ లో కలిగే పరిణామాల వల్ల హ్యాంగోవర్ వస్తుంది. మేము వాటిని నియంత్రించడం ద్వారా హ్యాంగోవర్ ప్రభావం లేకుండా చేయగలిగం. మొదట మేం ఎలుకలపై ప్రయోగించాం. అద్భుతమైన ఫలితం వచ్చింది." మిథాలీ టాండన్

పూర్తిగా సహజసిద్ధంగా.. ఓ కూల్ డ్రింక్ తాగినంత ఈజీగా మార్నింగ్ ఫ్రెష్ ను వాడవచ్చని మిథాలీ టాండన్ చెబుతున్నారు. అయితే హ్యాంగోవర్ రాకుండా అల్కహాల్ తాగిన తర్వాత మాత్రమే దీనిని ఉపయోంచాలని ఆమె చెబుతున్నారు. సిల్క్ ప్రొటీన్, విటమిన్ సిలతో నిండి ఉండే ఈ డ్రింక్ కోలా, మింట్, స్ట్రాబెరీ రుచుల్లో లభ్యమవుతోంది. ఏ రకమైనా వంద రూపాయలకే ఇస్తున్నారు.

పెద్ద పెద్ద ప్రణాళికలు...

హ్యాంగోవర్ ని దూరం చేసే ఆవిష్కరణ మార్కెట్లో అద్బుతాలు సృష్టిస్తుందని మిథాలీ టాండన్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే మార్కెటింగ్ కోసం పెద్దపెద్ద ప్రణాళికలే అమలు చేస్తున్నారు. మెట్రో నగరాల్లో బార్లు, రెస్టరెంట్లతో ఒప్పందం చేసుకుంటున్నారు. సోషల్ డ్రింకర్స్, పార్టీ పక్షులకు దీనిపై అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కువగా 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యంగ్ ప్రొఫెషనల్స్ కి ప్రొడక్ట్ ని దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

" బారులో బిల్లుతో పాటు మార్నింగ్ ఫ్రెష్ బాటిల్ ఇచ్చేలా, వెడ్డింగ్ ప్లానర్స్ కూడా గెస్ట్ రూముల్లో కచ్చితంగా మార్నింగ్ ఫ్రెష్ ఉండేలా, కాక్ టైల్ రిసెప్షన్ లో ఇదో అత్యవసరంలా... లిక్కర్ షాపులో కచ్చితంగా తీసుకోవాల్సిన ఓ వస్తువులా త్వరలోనే దీన్ని చూస్తాము" మిథాలీ టాండన్. 

ప్రారంభించిన అనతికాలంలోనే అద్భుతమైన రెస్పాన్స్ చూశామని మిథాలీటాండన్ విజయ దరహాసంతో చెబుతారు. అర్థరాత్రి రెండు మూడు గంటల తర్వాత కూడా కొంత మంది తెలిసిన వాళ్లు ఫోన్ చేసి మార్నింగ్ ఫ్రెష్ కోసం అడుగుతూంటారని చెబుతున్నారు. రీజనబుల్ డ్రింకింగ్ కి మార్నింగ్ ఫ్రెష్ పూర్తి మద్దతిస్తుందని చెబుతున్నారు.

image


రెండు నెలల్లోనే అంతులేని ఆత్మవిశ్వాసం

దేశంలో మారుతున్న డ్రింకింగ్ కల్చర్ నేపధ్యంలో మార్నింగ్ ఫ్రెష్ కి అద్భుతమైన భవిష్యత్ ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇదేదో మరో అల్కహాల్ గానో...లేక మెడిసిన్ గానో కాకుండా ఓ చిన్న కూల్ డ్రింక్ లా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు రకాల ఫ్లేవర్స్ తో మార్కెట్లోకి తెచ్చారు. ఆన్ లైన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంచారు. మార్నింగ్ ఫ్రెష్ కి సంబంధించిన పూర్తి వివరాలనూ ఆన్ లైన్లో ఉంచారు. అలాగే పేరు పొందిన బార్లు, రెస్టరెంట్లు, వెడ్డింగ్ ప్లానర్స్ తో టై అప్ అవుతున్నారు. ఇప్పటికి మార్నింగ్ ఫ్రెష్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించి రెండు నెలలే అయింది. పలు వైన్ షాపులు, వెడ్డింగ్ ప్లానర్లు, రెస్టరెంట్ల దగ్గర వీటిని అందుబాటులో ఉంచారు. పార్టీ తర్వాతి రోజు కూడా తమ పనులను తాము పక్కాగా చేసుకోగలిగామంటే దానికి మార్నింగ్ ఫ్రెష్ నే కారణమని కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్. 

సెరీకేర్ కు బయోటెక్నాలజీ ఆధారిత ఉత్పత్తుల విభాగంలో మంచి పేరు ఉంది. ఇప్పుడీ కంపెనీ వారసురాలు వచ్చీ రావడంతో కంపెనీ బ్రాండ్ నే రీ బ్రాండ్ చేసే ఉత్పత్తిని బయటకు తీసుకురావడంతో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. కంపెనీ ఉత్పత్తుల ప్రత్యేకతను నిలుపుకుంటూ మార్నింగ్ ఫ్రెష్ తో సంచలనం రేపుతాననే థీమా మిథాలీటాండన్ లో వ్యక్తమవుతోంది.

(యువర్ స్టోరీ విన్నపం: రమేశ్, సురేశ్ అనే పేర్లు ఎవరినీ ఉద్దేశించి పెట్టినవి కావు.. ఉదాహరణ కోసం సూచించినవే అని అర్ధం చేసుకోగలరు)

Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share
Report an issue
Authors

Related Tags