సంకలనాలు
Telugu

రాజకీయ పార్టీల ప్రచారానికి టెక్నాలజీని జోడిస్తూ.. తానూ ఎదుగుతున్న 'వాయిస్ ట్రీ'

ఎస్సెమ్మెస్ కాన్వాసింగ్, మిస్స్డ్ కాల్ క్యాంపెయినింగ్..సూపర్ సక్సెస్వాయిస్ బేస్డ్ సర్వీస్ తో అంకిత్ జైన్ స్టార్ట్ అప్ ఆమ్ ఆద్మీ సక్సెస్ కి దోహదపడిన వాయిస్ ట్రీ టెక్నాలజీస్ పొలిటికల్ పార్టీలకు వాయిస్ ట్రీ టచ్..మై ఆపరేటర్

team ys telugu
14th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

2011 సంవత్సరం...ఇండియాలో ఓ పెద్ద క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. అదే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ (భారత్‌లో అవినీతి వ్యతిరేక ఉద్యమం) IAC పేరుతో మధ్యతరగతి జనమే ప్రధానంగా పాల్గొన్న ఆ ఉద్యమం. తర్వాత దేశమంతా కూడా వ్యాపించింది. ఫలితాలెలా ఉన్నా...ఆమ్ ఆద్మీ అనే కొత్త పార్టీ పుట్టుకకూ కారణమైంది. జన్‌ లోక్‌పాల్ బిల్ కావాలంటూ అన్నాహజారే, కిరణ్ బేడీ వంటి ప్రముఖులే కాకుండా అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ ఇలా చాలామంది ఆ ఉద్యమంతోనే ఆ తర్వాత ప్రముఖులుగా మారారు కూడా. ఐతే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే...ఆ ఉద్యమానికి సాంకేతికత (టెక్నాలజీ) అందించిన వాయిస్ ట్రీ టెక్నాలజీస్ ఇప్పుడు తన స్టార్టప్‌ను మరింత డెవలప్ చేసేందుకు సిధ్దమైంది.

image


ఈ సందర్భంగా వాయిస్ ట్రీ టెక్నాలజీస్ సీఈఓ అంకిత్ జైన్ మాట్లాడుతూ "యూత్‌ని ఆకట్టుకునే విధంగా మేం తయారు చేసిన వాయిస్ సొల్యూషన్స్ పెద్ద హిట్టయ్యాయ్. అలానే ప్రభుత్వ విధానాలపై చర్చలకు దూరంగా ఉండే యూత్ కూడా మా క్యాంపెయినింగ్‌కి ఆకర్షితులయ్యారు. ప్రభుత్వ విధనాలపై ప్రశ్నించడానికి అలవాటుపడ్డారు.." అని చెప్పారు

ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ మూమెంట్ తర్వాత వాయిస్ ట్రీ ఆమ్ ఆద్మీ పార్టీకి సాంకేతిక సహకారం అందిస్తూ వచ్చింది. ఆప్ హెల్ప్ లైన్ సెంటర్‌కి సపోర్టిచ్చింది.

అలానే మిస్స్‌డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా అభిప్రాయాలు చెప్పడమనే కొత్త పధ్దతికి నాంది పలికింది కూడా వాయిస్ ట్రీ టెక్నాలజీనే. ఏదైనా అంశంపై తమ అభిప్రాయాన్ని ఎస్ , నో ఎస్సెమ్మెస్ లతోనే కాకుండా మిస్ట్ కాల్ ఇచ్చి కూడా చెప్పడమే ఈ పధ్దతిలో స్పెషాల్టీ.. " మేం ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నీ విజయవంతం కావడానికి మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంమేనంటారు అంకిత్ జైన్. తమకు వచ్చే వేలాది ఫోన్ కాల్స్, స్పందన వాటిని డేటా రూపంలో మార్చి వివరాలు అందించడం వల్లే తమపై తమకు ఓ నమ్మకం ఏర్పడిందంటారాయన.

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిన తర్వాత ఆ విజయంలో మేజర్ పార్ట్ తమదే అనే అభిప్రాయం చాలామందిలో కలిగిందంటారు అంకిత్ జైన్. ఆప్ విజయం అది అనుసరించిన హైటెక్ పధ్దతులు, వాయిస్ ట్రీ టెక్నాలజీ సపోర్ట్ ఇవన్నీ మిగిలిన రాజకీయపార్టీలు గమనించి వాటికి అలాంటి సేవలే కావాలని కోరాయి. అలా వాయిస్ ట్రీ టెక్నాలజీస్ తమ మాస్ కాలింగ్, ఎస్సెమ్మెస్ మిస్స్‌డ్ కాల్ కాంపెయినింగ్ స్టార్టప్ ప్రారంభించింది. వీళ్ల క్లయింట్లలో ఆర్ఎస్ఎస్, బిజెపితో పాటు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలున్నాయ్.

క్లయింట్లన్నీ పెద్ద పెద్ద పార్టీలు అలానే వాటికి వచ్చే రెస్పాన్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది కాబట్టి వాయిస్ ట్రీ టెక్నాలజీస్ తమ కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగుల సంఖ్యను అతి కొద్ది కాలంలోనే పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీటితో పాటు నియోజకవర్గాల వారీగా హెల్ప్ లైన్ సెంటర్లను ' మై ఆపరేటర్ ' పేరుతో అందించారు.

మై ఆపరేటర్ డాట్ కో పేరుతో వెబ్ అప్లికేషన్ హోమ్ పేజ్‌కి వెళ్లగానే సైట్ అందించే సేవలన్నీ స్పష్టంగా కన్పిస్తాయ్. కాల్ ఎక్కడనుంచి వస్తుంది, కాల్ రికార్డ్ చేయడం, అలానే తిరిగి రిపోర్ట్ పంపడం ఇలా మూడురకాల సర్వీస్ కన్పిస్తాయి. ఫ్రీ ప్లాన్‌తో పాటు పెయిడ్ ప్లాన్స్‌తో ఈ సేవలన్నీ యూజర్లు పొందుతారు.

2014 ఎన్నికల్లో సత్తా చాటిన మొబైల్ క్యాంపెయినింగ్

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు..మొబైల్ బేస్డ్ క్యాంపెయినింగ్ ఈ రెండూ 2014 ఎన్నికల్లో హై ఎండ్ పబ్లిసిటీకి పార్టీలు బాగా వాడుకున్నాయి. ఐతే ఈ రెండింటికీ పోటీ పెడితే మాత్రం మొబైల్ ఫోన్ కాన్వాసింగే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మాస్ కాలింగ్, ఎస్సెమ్మెస్ ప్రచారాలతో సోషల్ మీడియా కంటే త్వరగా ఓటర్‌ను చేరుకుంది మొబైల్ క్యాంపెయిన్. పార్టీల ఎజెండా, హామీలు ఎస్సెమ్మెస్ ల రూపంలో ఏ పార్టీలకు మద్దతు అనే అంశంపై మద్దతివ్వడానికి మిస్స్‌డ్ కాల్ క్యాంపెయినింగ్ మొబైల్ ద్వారా ప్రచారం చేశారు.

అలానే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాల్ క్యాంపెయినింగ్‌కి టెక్నికల్ సపోర్ట్ చేసింది వాయిస్ ట్రీ టెక్నాలజీస్. ఇందులో ఏ నేత అయినా ఓ టోల్ ప్రీ నంబర్ కు కాల్ చేసి ఆ నియోజకవర్గంలోని వారితో మాట్లాడవచ్చు. ఆప్ కి వాయిస్ ట్రీ టెక్నాలజీ సపోర్ట్ తో ఎలా ఓటర్లను ఆకట్టుకుందో ఓ డేటా చూద్దాం

  • అమేథీ, వారణాశిలో 300 పారలల్ ఛానల్స్ ఏర్పాటు
  • 11లక్షల మందితో మాట్లాడిన 28వేలమంది వాలంటీర్లు
  • ఒకే నియోజకవర్గంలో ఒక్కరోజులో 20వేల కాల్స్

ఈ విధంగా ఆమ్ ఆద్మీ ప్రతీ నియోజకవర్గంలో 2 లక్షల మందితో తమకి ఉన్న పదివేల మంది వాలంటీర్ల సాయంతో మాట్లాడగలిగింది. తమ ప్రచారాన్ని వారికి చేరవేయగలిగింది. "ఢిల్లీ ఎన్నికల ప్రచారం తర్వాత ఈ కాల్ లైన్స్ సంఖ్య ఇంకా పెంచే సామర్ధ్యాన్ని అందుకోగలిగినట్టు కంపెనీ చెబ్తోంది.

మై ఆపరేటర్ కాల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌తో పాటుగా ఆమ్ ఆద్మీకి వాయిస్ ట్రీ టెక్నాలజీస్, ఇంకో ప్రత్యేకమైన హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది. దీని ఏర్పాటుతో కొత్త వాలంటీర్లను చేర్చుకోవడం వారి ప్రాంతాల్లో కావాల్సిన అవసరాలు, సౌకర్యాలు చూడటం వీలవుతుంది. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ కే కాకుండా మిగిలిన పార్టీలకు కూడా వాయిస్ ట్రీ తన ఎస్సెమ్మెస్ క్యాంపెయినింగ్, కాల్ బ్లాస్ట్ (ఓ గ్రూప్‌కి ఒకే రకమైన మెసేజ్, సమాచారం, అందించడం) మిస్స్‌డ్ కాల్ మేనేజ్ మెంట్ వంటి సేవలు అందిస్తోంది.

టెక్నాలజీ సర్వీస్ అందించే ఓ సంస్థ రాజకీయపార్టీలకు పని చేయడమేంటనే ప్రశ్నకు అంకిత్ జైన్ సమాధానం ఒక్కటే. " పొలిటికల్ పార్టీలకు పని చేయడం మా ఉద్దేశం కాదు. మాకు వచ్చిన అవకాశం అందిపుచ్చుకున్నాం". ఇక వాయిస్ ట్రీ హెవీ ట్రాఫిక్ ను ఎలా హ్యాండిల్ చేయాలి అనే అంశంపై తమ సర్వీస్ ను ..24గంటల సపోర్ట్ ను కూడా అందిస్తోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags