సంకలనాలు
Telugu

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వుంది మోడీ తీరు!

నోట్ల రద్దు నిర్ణయంపై ఆప్ సీనియర్ నేత అశుతోష్ విశ్లేషణ..!!

12th Dec 2016
Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share

నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇప్పటిదాకా 80 మందికి పైగా చనిపోయారు. డబ్బులు దొరక్క సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బ్యాంకింగ్ సిస్టమ్ పతనమైంది. నల్లధనం బయటకొచ్చే అవకాశం కనుచూపుమేరలో కూడా లేదు. ప్రధాని వరస చూస్తుంటే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయనలో కించిత్ పశ్చాత్తాపం కూడా లేదు. మోదీ తీసుకున్న అత్యంత రహస్య నిర్ణయం బహుశ ఇదే మొదటిది కావొచ్చు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా తీసుకున్న డెసిషన్ ఇంతటి విషాదానికి దారితీసింది. దేశ భవిష్యత్తను మార్చే అడుగు వేసేముందు సరైన ప్లానింగ్ లేకపోవడం దారుణం. నిర్మాణాత్మకమైన అడుగులు వేయకుండా గుడ్డి పోకడ పోవడం నిజంగా సిగ్గుచేటు.

ఈ నిర్ణయం వెనుక అనేక కుట్రలు దాగున్నాయి. ఒకటి- ఇద్దరు బాడా పారిశ్రామికవేత్తల నుంచి మోదీకి భారీగా డబ్బు ముట్టిందనే ఆరోపణలున్నాయి. అతనే పెద్ద నల్లకుబేరుడని ప్రతిపక్షాలు, గిట్టనివారు అనకముందే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నాడనేది మరో విమర్శ. ఇంకో యాంగిల్లో చెప్పాలంటే రాబోయే యూపీ ఎలక్షన్లలో మోడీ మార్క్ ప్రభావం చూపించాలనే దురుద్దేశంతోనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మోడీ తన రెండున్నరేళ్ల అసమర్ధతను కప్పిపుచ్చుకోడానికి తెరమీదికి తెచ్చిన డ్రామా పేరే డిమానిటైజేషన్.

రెండున్నరేళ్ల క్రితం ఎలక్షన్ ప్రచారంలో మోడీ ఏమని ఊదరగొట్టారు ..? నల్లధనం ఎక్కడున్నా వెలికితీస్తా.. నల్లకుబేరుల తాటతీస్తా.. అని కదా వాగ్దానాలు చేశారు . మరి అవన్నీ ఉత్తర కుమారుడి ప్రగల్బాలేనా? కనీసం బ్లాక్ మనీ వేటలో ఉన్నాడన్న విశ్వాసమైనా కలిగించారా..? లేదు. ఇంకో విషయం ఏంటంటే.. ఎలాగూ దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడం తనవల్ల కాదని మోడీకి తెలుసు. ఇలా అయితే 2019లో పార్టీకి గడ్డుకాలమే. అందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ప్రజల ఖాతాల్లోకి డైరెక్టుగా డబ్బు పంపిణి జరుగుతుంది. దాంతో మళ్లీ ఓట్లు వస్తాయి. మోడీ మాస్టర్ ప్లానే ఇది.

image


ఇప్పటిదాకా నోట్ల రద్దుమీద ఒక కాంక్రీట్ ఆన్సరే రాలేదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పొచ్చు. సేమ్ ఇందిరాగాంధీలా పాలించాలని మోడీ తీరుని చూస్తుంటే అర్ధమైపోతోంది. ఆమె కూడా అచ్చం ఇతనిలాగే వ్యవహరించారు. ఒంటెత్తు పోకడలు. సంచలాన్మతక నిర్ణయాలు. అన్నిటికీ కేరాఫ్ ఇందిరా. అయితే మొదట్లో ఆమెను మూగబొమ్మ (గూంగీ గుడియా) అని పిలిచేవారు. ప్రతిపక్షాలే కాదు రామ్ మనోహర్ లోహియా లాంటి పార్టీ సీనియర్లు కూడా ఇందిరను డమ్ డాల్ అని సంబోధించేవారు. నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన నేత అన్న కారణంతోనే ఆమెను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోలేదు. ప్రాంతీయ పార్టీల దోస్తీ ఆమెను కంట్రోల్ చేస్తుందనే భావనతోనే ప్రధానిగా సెలెక్ట్ చేసుకున్నారు.

కానీ మోడీ అలా కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ తనకంటూ సొంత వాయిస్ ఉంది. ఏ నిర్ణయమైనా స్వతహాగా తీసుకోగలనని ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా పోరాడ్డానికే ఇష్టపడతాను అని చెప్పకనే చెప్తారు. భారత రాజకీయాల్లో నెంబర్ వన్ విలన్ మోడీ అనే కదా.. మొన్నటిదాకా అనేక పాశ్చాత్య దేశాలు ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించాయి. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి.. ప్రధాని అయ్యాక అనేక దేశాలు తిరిగి, డెవలప్మెంట్ మంత్రాన్ని జపించి, విదేశీ ప్రధానుల మనసులో డార్లింగ్ ముద్ర వేసుకున్నారు. అయినప్పటికీ రెండోసారి గెలుపు అంత ఈజీ కాదు. ఆయన గేమ్ ప్లాన్ చూస్తుంటే ఇందిరాగాంధీ గుర్తొస్తున్నారు.

60వ దశకం చివర్లో ఒకవేళ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయివుంటే ఇందిరకు ప్రధాని పదవి వరించేదే కాదు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట కారణంగా నీలం సంజీవయ్య వివి గిరి చేతిలో ఓడిపోయారు. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది. పార్టీలో తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు ఇందిర వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడదీసుకుని వి.వి.గిరి రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ చీలిపోయింది అది వేరే విషయం. దాంతో సంజీవరెడ్డి రాజకీయాల్లో కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇది ఆమె రాజకీయ చతురతకు నిదర్శనం. పార్టీలో మహామహా సీనియర్లను మట్టికరిపించారు ఇందిరాగాంధీ. ఆమెకంటూ సొంత శిబిరం ఉంది. నెహ్రూ కూతురనే కాదు.. అనేకమంది మేథావులు, సోషలిస్టులు ఆమె ధైర్యం వెంట నడిచారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతోపాటు హరిత విప్లవం, గరీబీ హఠావో నినాదం లాంటి ప్రజాకర్షక కార్యక్రమాలు, పథకాలు చేపట్టారు. తిరుగులేని పాలకురాలు అని నిరూపించుకున్నారు.

మోడీ కూడా అచ్చం ఇందిరాగాంధీ లాంటి ట్రిక్కులనే ప్లే చేస్తున్నారు. నల్లధనం మీద అతను యుద్ధం చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా అంతే ఫైట్ చేస్తున్నాయి అతని మీద. అవినీతిని అంతం చేయాలని మోడీ చూస్తుంటే.. అపోజిషన్ పార్టీలు మోడీ పాలనను అంతం చేయాలని పట్టుపడుతున్నాయి. పార్లమెంట్ లోపలా బయటా ప్రధాని తీరుని ఎండగడుతున్నారు. అధికార పక్షం మాత్రం ప్రతీసారి తమ నాయకుడి నిర్ణయాన్ని వెనకేసుకుని వస్తోంది.

నోట్ల రద్దు నేపథ్యంలో చెలరేగుతున్న విమర్శలకు మోడీ బెదరినట్టు కనిపించడం లేదు. కానీ ఎంతోకాలం ఈ గాంభీర్యం చెల్లదు. 50 రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్తున్నారు. ప్రతీసారీ నవభారత నిర్మాణం లాంటి పెద్దపెద్ద మాటలతో ఊదరగొడుతున్నారు. జాతిగర్వించే నిర్ణయమని తెలివిగా లింకు పెడుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత యాభై రోజులంటే మాటలు కాదు. అందుకే కేంద్రం ఏం చేయాలో తెలియక రోజుకో వింత నిర్ణయం తీసుకుంటోంది. డైలీ ఏదో మెలిక పెడుతోంది. ఏమన్నా అంటే క్యాష్ లెస్ సొసైటీ అనే ఒక పదాన్ని పట్టుకుని పాకులాడుతున్నారు. జనానికి ఆ మాటను ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఫైనల్ గా చెప్పాలంటే.. నోట్ల రద్దు నిర్ణయం ఒక విఫలయత్నం. అదొక సమాంతర వ్యవస్థను క్రియేట్ చేసింది. లంచగొండి బ్యాంకర్ల మూలంగా సామాన్యుడు బలైపోయాడు. అమాయకులను అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు బాజాప్తా నల్లధనానికి తెల్లరంగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పరిస్థితి చక్కదిద్దాల్సిన కేంద్రం బేలచూపులు చూస్తోంది. నిస్సహాయంగా నిలబడిపోయింది. మోడీ సొంత పార్టీ నేతలే పీకల్దాకా అవినీతిలో మునిగిపోయారు. ఫండ్స్ కు సంబంధించి సుప్రీంకోర్టు అడిగిన లెక్కలు 80 శాతం చూపించలేకపోయారు. ఇప్పటిదాకా లోక్ పాల్ ఏర్పాటు చేయలేకపోయారు. పార్లమెంటుకు ముఖం చూపించే దమ్ము మోడీకి లేదు. లోక్ సభలో మాట్లాడటం లేదుగానీ జనసభల్లో గంటలు గంటలు మాట్లాడుతున్నారు. సామాన్యుల విశ్వాసం చూరగొని ఇందిరాగాంధీ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. కానీ నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేసి పబ్బం గడుపుకుంటున్నారు.

రచయిత: అశుతోష్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, సీనియర్ జర్నలిస్టు,

Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share
Report an issue
Authors

Related Tags