సంకలనాలు
Telugu

నెలసరి తేదీ చెప్పే ‘లవ్ సైకిల్స్’ యాప్, ఇప్పటికే 50 లక్షల డౌన్ లోడ్స్

మహిళలు రుతుచక్రపు వివరాలు నిక్షిప్తం చేసుకోవచ్చుఆడవారి సమస్యలు గుర్తించి వ్యాపారావకాశంగా మార్చుకున్న జాన్ పాల్ఇప్పుడు వివిధ దేశాల్లో పేరు పొందిన లవ్ సైకిల్స్

team ys telugu
6th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

స్త్రీలకు ప్రకృతి సహజంగా వచ్చే నెలసరి (ఋతు క్రమం), చాలామందిలో చికాకును కలిగిస్తుంటుంది. కొందరిలో ప్రతినెలా నిర్దిష్టమైన రోజుల్లోనే ఋతు క్రమం వస్తుంటుంది. అయితే మారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి తదితర అనేక కారణాల వల్ల.. నేటి మహిళలు, చాలామందిలో ఈ నెలసరి నిర్దిష్టమైన తేదీల్లో రావడం లేదు. ఫలితంగా... సంప్రదాయ భారతీయ మహిళలు.. నేటికీ, నెలసరి వచ్చిన ఆ మూణ్ణాళ్ళూ పూజలు, వ్రతాలు, వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉండడం మనం చూస్తుంటాము. ఇలాంటి శుభ కార్యక్రమాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకొని.. నెలసరి కారణంగా రద్దు చేసుకున్న సందర్భాలూ గమనిస్తుంటాము. ఇలాంటి వారి సౌలభ్యం కోసం రూపొందిందే... లవ్ సైకిల్స్. జాన్ పాల్, దీని సృష్టికర్త.


జాన్ పౌల్, లవ్ సైకిల్స్ ఫౌండర్

జాన్ పౌల్, లవ్ సైకిల్స్ ఫౌండర్లవ్ సైకిల్ అనేది మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ఒక అప్లికేషన్. మహిళల నెలసరి వివరాలను నిక్షిప్తం చేసి.. అవసరమైనప్పుడల్లా వాటిని చూసుకుంటూ.. తమ కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకునేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించారు. 2011 ద్వితీయార్థంలో కనుగొన్న ఈ యాప్ ను కేవలం రెండు సంవత్సరాలలోపే ఐదు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారంటే.. దీనికి ఉన్న ఆదరణ ఏంటో ఇట్టే అర్థమై పోతుంది. లవ్ సైకిల్స్ యాప్ ని ప్రతిరోజూ కచ్చితంగా ఉపయోగించే వినియోగదారులు దాదాపు లక్షన్నర మంది ఉన్నారంటే ఇది మహిళల జీవితాల్లో ఎలా మమేకమైందో అర్థమై పోతుంది.

ఈ యాప్ గురించి జాన్ పాల్ మాట్లాడుతూ... “మా స్నేహితులు, బంధువుల ఇళ్ళల్లోని మహిళలు.. నెలసరి వివరాలను ఎక్సెల్ షీట్స్ లో భద్రపరిచు కోవడం నేను గమనించాను. మరికొందరైతే.. డైరీలు, గోడలపై వేలాడే క్యాలెండర్లపైనా వారి నెలసరి వివరాలను రాస్తూ ఉండడం చూశాను. ఇలా రాసిన డైరీలు, క్యాలెండర్లను వారితో పాటుగా తీసుకు వెళ్ళలేని పరిస్థితి. వైద్యుల వద్దకు వెళ్ళేటప్పుడూ.. మరో పేపర్లో నెలసరి వివరాలను రాసుకొని తీసుకు వెళ్ళాల్సిన దయనీయ స్థితి. ఆ సమస్యలోంచే లవ్ సైకిల్స్ యాప్ ఆవిర్భవించింది. స్మార్ట్ ఫోన్లు ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా నిలిచాయి. స్మార్ట్ ఫోన్లలో లవ్ సైకిల్స్ డౌన్ లోడ్ చేసుకొని.. అందులో నిక్షిప్తం చేసే ఋతు క్రమానికి సంబంధించిన వివరాలు పొందు పరిస్తే... ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని తెలుసుకునే వీలుంటుంది” అని అంటారు.


లవ్ సైకిల్స్ యాప్ పేజ్

లవ్ సైకిల్స్ యాప్ పేజ్


ఈ యాప్ ని చాలా తేలిగ్గానే తయారు చేసినా.. చాలా మంది అభిప్రాయాలను సేకరిస్తూ.. ఎప్పటికప్పుడు దీన్ని మెరుగు పరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ముగ్గురు డెవలపర్స్ తో కూడిన ఆరుగురు సభ్యుల బృందం.. లవ్ సైకిల్స్ యాప్ మెరుగుదలకు అనునిత్యమూ శ్రమిస్తూ ఉన్నారు.

ఆసక్తికరమైన అంశాలు :

  • 1) భౌగోళిక వినియోగం : డౌన్ లోడ్స్ అంశాన్ని ప్రస్తావించుకుంటే.. భారతదేశం.. టాప్-10 జాబితాలో కూడా ఉండదు. బ్రెజిల్, మెక్సికో, రష్యా దేశాలు టాప్-3 లో ఉంటాయి. ఇలాంటి గణాంకాల నేపథ్యంలో కూడా.. లవ్ సైకిల్స్ యాప్ మార్కెటింగ్ కోసం ఎలాంటి ప్రత్యేక శ్రద్ధా తీసుకోలేదు. నిజం చెప్పాలంటే మార్కెటింగ్ కోసం ఒక్క నయాపైసా కూడా ఖర్చు చేయలేదు. అయితే.. వినియోగదారులకు యాప్స్ ను అందించడంలో.. గూగుల్ సంస్థ ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుందో అన్నదానిపైనే.. ఎక్కువగా దృష్టి సారించింది... లవ్ సైకిల్స్ బృందం. గూగుల్ ప్లే లో... ఆంగ్లంలో “menstrual” అన్న పదం టైప్ చేయగానే.. దీనికి సంబంధించిన వందలాది యాప్స్ ఉన్నా.. లవ్ సైకిల్స్ టాప్-3గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
  • 2) మనుగడ ఎలా ? : లవ్ సైకిల్స్... ప్రస్తుతం అడ్వర్టయిజ్ మెంట్ల పై ఆధారపడుతోంది. (యాడ్స్ వద్దనుకుంటే.. వినియోగదారులు కొంత మొత్తం చెల్లిస్తే చాలు). లవ్ సైకిల్స్ తన మనుగడ కోసం రెండు విధానాలను ఎంచుకుంది. ఒకేసారి నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించడం ద్వారా, అడ్వర్టయిజ్ మెంట్లను తొలగించడం, వార్షిక చందాల విధానాలను అనుసరిస్తోంది. వ్యాపారంలో చందాదారులను చేర్పించే విధానమే ఉత్తమమైంది. ప్రస్తుతం 60 శాతం ఆదాయం అడ్వర్టయిజ్ మెంట్ల ద్వారా వస్తుంటే.. 40 శాతం ఆదాయం ఒకేసారి చెల్లింపు విధానం ద్వారా వచ్చేది. ఎప్పుడైతే చందాదారుల పద్ధతిని ఎంచుకున్నారో.. ఈ నిష్పత్తి.. 80-20 గా మారిపోయింది. “ మేము వీలైనంత ఎక్కువగా చందాదారులను చేర్చుకోవాలనుకుంటున్నాము. ఎప్పుడైతే చందాదారులు పెరుగుతారో మా అప్లికేషన్ ప్రజాప్రయోజనకారి అన్నది స్పష్టమవుతుంది కదా” అంటారు.. జాన్.
  • 3) భవిష్యత్తు ప్రణాళిక: పెద్ద పెద్ద యాప్స్ విజయవంతానికి, నిర్దిష్ట ప్రణాళికలు అవసరం. అయితే.. లవ్ సైకిల్స్ అంత స్థాయి ప్రణాళికలు ప్రస్తుత దశలో అంత ప్రయోజనకరం కావు. ప్రస్తుతానికైతే, ఈ బృందం, యాప్ కి మరిన్ని ఫీచర్స్ సమకూర్చడం ద్వారా, వినియోగదారులను మరింతగా ఆకర్షించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా, వినియోగదారులతో కలిసి ఒక ఫోరమ్ ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీని వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న కారణంగా.. అందరికీ ఉపకరించే, సులభంగా ఉండే భాషలో దీన్ని రూపుదిద్దాలి కాబట్టి, లవ్ సైకిల్స్ బృందం, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. దీంతో పాటే మరిన్ని ఆలోచనలు ఉన్నా.. లవ్ సైకిల్స్ యాప్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని సముచిత నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు.

Lovecycles ని పరిశీలించండి. ఇది టెక్-30 సంస్థల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. టెక్ స్పార్క్స్ 2014లో, 30 అగ్రశ్రేణి సంస్థలతో రూపొందించిన సమగ్ర జాబితాలోనూ లవ్ సైకిల్స్ చోటు సంపాదించుకుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags