సంకలనాలు
Telugu

ఉద్యోగం కావాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు.. సొంత డివైజ్ కూడా ఉండాలి..!!

25th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


న‌రేశ్ మార్కెటింగ్ జాబ్ లో చేరాల‌నుకున్నాడు! ఇంట‌ర్వ్యూకు వెళితే బైక్ ఉందా అని అడిగారు! ర‌మేశ్ సొంత క్యాబ్ కొన్న త‌ర్వాతే ట్రావెల్స్ కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింది. ఈ రోజుల్లో జాబ్ రావాలంటే టాలెంట్ ఒక్క‌టే స‌రిపోదు. ఉద్యోగానికి అవ‌స‌ర‌మ‌య్యే వ‌స్తువు కూడా మ‌న ద‌గ్గ‌ర ఉండాలి. అప్పుడే కొలువులో కొలువుదీరొచ్చు! ఈ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట‌ప్ ల‌కూ పాకింది!!

బ్రింగ్ యువ‌ర్ ఓన్ డివైజ్! షార్ట్ క‌ట్ లో బ్యాడ్! నిజానికిది గుడ్ ఐడియా! టాలెంట్ నీదే! డివైజ్ నీదే! ప్రాజెక్ట్ కంపెనీ ఇస్తుంది. కంప్లీట్ చేస్తే జీతం వ‌స్తుంది. బ్యాడ్ సిస్ట‌మ్ తో అటు ఉద్యోగుల‌కు, ఇటు కంపెనీకి ఇద్ద‌రికీ లాభ‌మే!

image


ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్స్, కంప్యూట‌ర్స్ లాంటివి స్థిరాస్తులు. వాటిలో ఎంతోకొంత త‌రుగుద‌ల ఏర్ప‌డుతుంది. ఫైన‌ల్ గా దాన్ని బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి. అప్పుడు లాభ‌మో న‌ష్ట‌మో తెలుస్తుంది. కానీ బ్యాడ్ విధానంలో ఆ రిస్క్ ఉండ‌దు. ఎవ‌రి డివైజ్ వాళ్లే తెచ్చుకుంటారు కాబ‌ట్టి, దానికేమైనా ఉద్యోగులదే బాధ్య‌త‌. కంపెనీకి ఈ త‌రుగుద‌ల త‌ల‌నొప్పి ఉండ‌దు. ఫ‌లితంగా ఖ‌ర్చు త‌గ్గుతుంది. ఉత్ప‌త్తి పెరుగుతుంది.

వ‌ర్క్ ఫ్ర‌మ్ ఎనీవేర్..!!

ఇక దీనివల్ల ఉద్యోగుల‌కు ఎలా లాభ‌మంటే.. సొంత డివైజ్ ఉంటే ఆఫీసుదాకా వెళ్లాల్సిన ప‌నిలేదు. ఎంచ‌క్కా ఇంట్లో కాఫీ చ‌ప్ప‌రిస్తూ వర్క్ ఫినిష్ చేయొచ్చు. వెకేష‌న్ లో ఉన్నా ప్రాజెక్ట్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసి పారేయొచ్చు. ప‌ర్స‌న‌ల్ ప‌నుల‌కు ఒక ల్యాప్ టాప్, ఆఫీసు ప‌నుల‌కు మ‌రో ల్యాపీ వాడాల్సిన ప‌నిలేదు. ఈ పెన్ డ్రైవ్ ల జంఝాటం అస‌లే ఉండ‌దు. హ్యాపీగా ప‌ర్స‌న‌ల్ ప‌నులు, ఆఫీసు ప‌నులు ఒకే సిస్ట‌మ్ మీద లాగించేయొచ్చు.

కంపెనీలకూ లాభమే..

ఏ కంపెనీకి అయినా మెషిన‌రీ సెట్ చేయ‌డం పెద్ద హెడేక్! సామగ్రి అంతా కొని, దాని ఇన్ స్ట‌లేష‌న్ పూర్త‌య్యే స‌రికి త‌ల ప్రాణం తోక్కొస్తుంది. ఖ‌ర్చు కూడా త‌డిసి మోపెడ‌వుతుంది. అదే ఎవ‌రి ల్యాప్ టాప్ వాళ్లే తెచ్చుకుంటే ఈ త‌తంగ‌మంతా ఉండ‌దు. పైగా ఒక్కో ఉద్యోగికి ఒక్కో కీ బోర్డ్ అల‌వాటు ఉంటుంది. కొంద‌రు యాపిల్ కీ బోర్డు మీద ర‌ప్ఫాడిస్తే.. ఇంకొంద‌రు టైప్ రైట‌ర్ ఉంటే త‌ప్ప ప‌నిచేయ‌లేరు. ఎవ‌రి సిస్ట‌మ్ వారికుంటే ఈ గోలంతా ఉండదు. హాయిగా ఎవరి పని వారు చేసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల అటు ఉద్యోగుల‌కు, ఇటు య‌జ‌మానుల‌కు ఇద్ద‌రికీ హ్య‌పీసే!

పైగా ఉద్యోగులు త‌మ సొంత కంప్యూట‌ర్లు వినియోగిస్తారు కాబ‌ట్టి రిస్క్ ఉండ‌దు. ఒక‌వేళ రిపేర్లు వ‌చ్చినా వాళ్లదే బాధ్య‌త! దీనివ‌ల్ల కంపెనీకి కొంత‌లో కొంత ఖ‌ర్చు మిగిలిన‌ట్టే. అయితే ఒక విష‌యంలో మాత్రం సంస్థ ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఉద్యోగులు ఎవ‌రి ల్యాపీ వాళ్లు తెచ్చుకున్నా.. వాట‌న్నింటినీ అనుసంధానం చేయ‌డంలో జాగ్ర‌త్త పాటించాలి. ముఖ్యంగా టైమ్ అండ్ మ‌నీ! ఈ రెంటినీ దృష్టిలో పెట్టుకొని ఈఎంఎం లేదా ఎండీఎం టూల్స్ ఉప‌యోగించాలి. అప్పుడే అనుకున్న ఫ‌లితాలు రాబ‌ట్ట‌గ‌ల‌రు. మ‌రింకెందుకు ఆల‌స్యం? మీ స్టార్టప్ ను పరుగులు పెట్టించండి!!

(నోట్: ఈ క‌థ‌నంలో పేర్కొన్న అభిప్రాయాలు పూర్తిగా రచయితవే. అవన్నీ యువ‌ర్ స్టోరీ సొంతమని భావించొద్దు) 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags