సంకలనాలు
Telugu

డాక్యుమెంట్ సేవలన్నీ ఒకే చోటుకి తెచ్చిన 'నోటరీమామ'

బెంగుళూర్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్రెండేళ్లలో మరో శాఖ ప్రారంభంపెట్టుబడులను ఆకర్షించి విస్తరణకు ప్రణాళికఐదేళ్లలో దేశం మొత్తం వ్యాపించాలనే ఆలోచన

ashok patnaik
18th Jun 2015
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share

ఇల్లు కొనాలునుకుంటున్నారా... ? కొత్త కంపెనీ ప్రారంభించాలనుకుంటున్నారా...? రెంటల్ అగ్రిమెంట్ రెన్యువల్ చేయించుకోవాలా.. ? వీటి కోసం ఎక్కడకెక్కడ తిరగాలా అనే టెన్షన్ వద్దు. ఇప్పుడు అన్ని రకాల డాక్యుమెంటేషన్ సేవలన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు గిరీష్ అండ్ టీమ్. 

ఇంటి రిజిస్ట్రేషన్లు, ఐటీ రిటర్న్స్, ఈ -స్టాంపు, డ్రాఫ్టింగ్... ఇలా సర్వీసు ఏదైనా సొల్యూషన్ మాత్రం నోటరీ మామానే. ఇందులో డాక్యుమెంటేషన్లు సింగిల్ విండో సేవగా మార్చేశారు. చల్లా గిరీష్ అతని ఫ్రెండ్స్ ఐటి రిటర్న్స్ సమర్పించే విషయంలో పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నోటరి మామకు శ్రీకారం చుట్టారు. అద్దె ఒప్పందాల కోసం ఏజెంట్లు చుట్టూ తిరిగే పనులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. E స్టాంప్, డ్రాఫ్టింగ్, నోటరీలు ఒకే చోట లేకపోవడంతో వాటి కోసం తిరగడం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. వీటికి చెక్ పెట్టేందుకే నోటరీ మామా ఆలోచన పుట్టింది.

"నోటరీ మామా దగ్గర అన్ని రకాల డాక్యుమెంటేషన్ సేవలు అందించడం ద్వారా ప్రజలకు విలువైన సమయం, డబ్బు ఆదా చేస్తున్నామన్నారు గిరీష్. నోటరీ మామా ప్రారంభించడం అంతా ఈజీగా కాలేదని, ఈ వ్యవస్థపై పూర్తి అవగాహన చేసుకొని, రిజిస్ట్రేషన్, దాని అనుబంధ చట్టాలను స్టడీ చేశామంటారు. మా వినియోగదారుల ఇళ్లకు గంటలో వారికి కావాల్సిన డాక్యుమెంట్లు అందించేందుకు పక్కా ప్రణాళికలు తయారు చేశామని చెప్పారు. ప్రస్తుతం రోజు 100 మందికిపైగా సేవలు అందించే స్థాయికి ఎదిగామని గర్వంగా చెబుతున్నారు.

వన్ స్టాప్ సొల్యూషన్ అని చూపే నోటరీ మామ పోస్టర్

వన్ స్టాప్ సొల్యూషన్ అని చూపే నోటరీ మామ పోస్టర్


నోటరి మామ ప్రచారం

పెట్రోల్ బంకులు , బేకరీలు, రెస్టారెంట్ల అనుమతి తీసుకొని పోస్టర్లు అతికించామని, వారికి 50 రూపాయల రాయితీ కూపన్లు జారీ చేశామని వివరించారు. ఇలా ప్రారంభించిన మార్కెటింగ్ ప్రజల్లో విశ్వాసం నెలకొల్పింది. వరుసగా మేము చేస్తున్న ప్రయత్నంతో బెంగుళూర్ వాసుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో మరింత విశ్వాసం పెరిగిందని గిరీష్ చెప్పారు. అయితే మాది సింగిల్ విండో సేవ కావడంతో పాటు మా వినియోగదారుల ఇంటికి, ఆఫీసుకు వెళ్లి వారికి కావాల్సిన డాక్యుమెంట్లు అందిస్తూ ఉండడంతో పోటీదారుల నుంచి పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదంటారు. ఈ స్టాంప్స్‌తో పాటు అన్ని రకాల లీగల్ డ్రాఫ్ట్స్ ఒక్క క్లిక్‌తో అందించడంతో ప్రజల మన్ననలు పొందగలిగాం.

నోటరి మామను గిరీష్, ఆదిత్య, ప్రశాంత్ నారాయణ్‌లు స్థాపించారు. గిరీష్ బిజినెస్ డెవలప్‌మెంట్ పై, ఆదిత్య సంస్థ ఆపరేషన్స్ పై దృష్టి సారించడంతో మరో కోఫౌండర్ ప్రశాంత్ బ్రాండ్ డెవలప్‌మెంట్ చూసుకుంటారు. నవంబర్ 2013 లో మేము మొదట సంస్థ ప్రారంభించినప్పుడు ప్రతి రోజుని ఛాలెంజింగ్ తీసుకున్నామని, తర్వాత ఆ సవాళ్లు ఎదుర్కొని మార్కెట్‌లో నిలదొక్కుకున్నామని వీళ్లంతా వివరిస్తారు. తప్పులు దొర్లకుండా ఉండేందుకు ఆన్‌లైన్ సిస్టమ్‌ను ఎన్నుకొన్నాము. బ్యాంకింగ్ కోసం ఎస్‌బిఐ సేవలు వినియోగించుకుంటున్నారు. డైరక్ట్ పే చేయడంతో మధ్యవర్తులను వీలైనంతగా తగ్గించామంటూ అభిప్రాయాన్ని పంచుకున్నారు గిరీష్ .రెండేళ్ల నుంచి పెట్టిన పెట్టుబడులన్నీ పర్సనల్ సేవింగ్స్, స్నేహితుల దగ్గర నుంచి సాయంగా తీసుకున్నవే. అయితే వెంచర్ సక్సెస్ కావడంతో బెంగుళూర్‌లో రెండో శాఖ ప్రారంభించడానికి ఒక క్యాపిటల్ వెంచర్ నుంచి పెట్టుబడి అందిందని గిరీష్ చెప్పారు. నోటరీ మామాకు ఇప్పుడు ప్రతి రంగంలోనూ వ్యాపారం ఉంది. బ్యాంకింగ్, విద్య, ఆస్తి , వ్యాపారం ఏదైనా కావచ్చు అన్ని రంగాల్లో మా సేవలకు అవకాశం ఉంది "మేము ఇప్పుడు ఐటీ కంపెనీలు, బ్యాంకులు, NBFC, రియల్ ఎస్టేట్, కళాశాలలు కార్పొరేట్ కంపెనీలతో కలిసి వ్యాపారం విస్తరిస్తున్నామని అంటారు గిరీష్.

గిరీష్, ప్రశాంత్ నారాయణ్‌, ఆదిత్య- నోటరీ మామా వ్యవస్థాపకులు

గిరీష్, ప్రశాంత్ నారాయణ్‌, ఆదిత్య- నోటరీ మామా వ్యవస్థాపకులు


ఇలా ఒక్కొ అడుగు ముందుకు వేసుకుంటూ గతేడాది జూలై నాటికి 500 వినియోగదారులకు నోటరి మామ సేవలు అందించింది. ఇప్పుడు నోటరీ మామను విస్తరించే పనిలో పడ్డారు కంపెనీ ఫౌండర్స్. మా ఉద్యోగుల్లో అంకిత భావం, బిజినెస్ సీక్రెసీ తప్పని సరిగా ఉండాలని సూచిస్తారు. ఎందుకంటే మా కస్టమర్ వ్యక్తిగత , ఫైనాన్షియల్ డేటా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరని చెబుతారు.ఇక మా కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందించడం ద్వారా వారి ముఖంలో చిరునవ్వు చూస్తే పడిన కష్టమంతా మర్చిపోతాము. అదే మా వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. ఆ సంతోషమే మాకు మరో కొత్త కష్టమర్‌ను పంపించేందుకు కారణమవుతోందని ధీమాగా చెబుతారు గిరీష్. భవిష్యత్తులో బెంగుళూర్, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో విస్తరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో మరిన్ని శాఖలు ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నామని వివరించారు. అంతే కాదు... ఎవరైనా ఈ తరహా పనిచేయడానికి సిద్ధంగా ఉంటే సంప్రదించాలని సూచిస్తున్నారు.

website

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags