సంకలనాలు
Telugu

నేతన్నల మగ్గాలపై రంగురంగుల పూల తేరులు! సర్కారు ఆత్మీయ కానుకగా బతుకమ్మ చీరలు!

team ys telugu
17th Sep 2017
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో వినూత్నమైన కార్యక్రమం బతుకమ్మ చీరల పంపిణి. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బతుకమ్మ పండగ సంబరం నింపేందుకు చేపట్టిన బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమం ప్రారంభమయింది. బతుకమ్మ చీరల ద్వారా ఒక సంబరాన్ని, ఒక సంక్షోభాన్ని చాకచక్యంగా అడ్రెస్ చేయగలిగింది. తెలంగాణ ఇంటి పండగ బతుకమ్మకు ప్రతి పేద అడబిడ్డ సంతోషంగా పండగ చేసుకోవడంతోపాటు, దశాబ్దాలుగా సరిపడా ఉపాధి లేని నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరల పంపిణి చేపట్టింది.

image


సూమారు మూడు నెలల కింద నేతన్నలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతన్న కష్టాలు, వారికి కావాల్సిన సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రతి నేతన్నకు కనీసం 15 వేల నెల ఉపాధి దొరికేలా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలకు రూలక్పల్పన చేస్తుందని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల బాధ్యతను మంత్రి కెటీఆర్ కు అప్పగించారు. ఇప్పటికే రంజాన్, క్రిస్మస్ పండగలకు నూతన వస్ర్తాలు పంపిణి చేస్తున్న ప్రభుత్వం ఈ బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ద్వారా నేతన్నల ఇళ్లలో సంక్షోభాన్ని సంబరంగా మార్చింది.

బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు ప్రణాళికాబద్దంగా పనిచేసింది. ముందుగా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి అడబిడ్డకు చీరల పంపిణి చేయాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు సూమారు కోటీ నాలుగు లక్షల చీరలు(1,04,57,610)ను సిద్ధం చేసింది. ఇందుకోసం సూమారు 222 కోట్లు రూపాయల ఖర్చు చేస్తున్నది. ఈ చీరల తయారీకీ సూమారు 7 కోట్ల మీటర్ల వస్తాలను ప్రభుత్వం తయారు చేయించింది. ఈ మెత్తం చీరల్లో సగానికిపైగా రాష్ట్రం నుంచే సేకరించింది. రాష్ట్రంలోని మరమగ్గాల్లో అత్యధిక శాతం ఉన్న సిరిసిల్లలోనే 52 లక్షల చీరలు ఉత్పత్తి అయ్యాయి. ఈ రెండు నెలలపాటు అన్ని మరమగ్గాలు పూర్తి ఉత్పాదక సామర్ద్యంతో పనిచేసి సగం చీరలు సిద్దం చేశాయి. జాతీయ స్థాయి టెండరింగ్ ప్రక్రియ ద్వారా మిగిలిన చీరలను సేకరించారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఇక్కడి నేతన్నల నుంచే సేకరణ చేయనున్నారు.

ఈ చీరల తయారీలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నది. ముఖ్యంగా టెక్స్ టైల్ డైరెక్టర్ శ్రీ శైలజా రామయ్యర్ అధ్వర్యంలో వందలాది చీరల డిజైన్లను తయారు చేయించారు. ఈ డిజైన్ల నుంచి మహిళా ఉన్నతాధికారులు, ఇతర అధికారిణులు పలు చీరలను ఎంపిక చేశారు. మహిళాల అభిరుచి మేరకు ఈ బతుకమ్మ చీరల డిజైన్ ఎంపిక జరిగింది. పండగ నాడు అందరు మహిళలు ఒకే విధంగా కన్పించకుండా సూమారుగా 500పైగా డిజైన్లు, పలురకాల రంగుల్లో ఈ చీరలు తయారు అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వస్త్రాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు,బార్డర్లు, ప్యాకేజీంగ్ వంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. సూరత్ నుంచి వచ్చే చీరల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించేందుకు శైలజా రామయ్యర్ స్వయంగా సూరత్ వెళ్లి వచ్చారు.

చీరల పంపిణికి అంతా సిద్దం అయ్యిందని మంత్రి కెటి రామారావు తెలిపారు. బతుకమ్మ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి అదేశాల మేరకు కోటీ నాలుగు లక్షల మంది అడబిడ్డలకు, సొదరీమణులకు బతుకమ్మ కానుగా చీరలు అందివ్వడం తనకు వ్యక్తిగతంగా చాల సంతోషాన్నిస్తుందన్నారు. చీరల పంపిణి కోసం ప్రత్యేకంగా ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో ఎన్నికల్లో మాదిరి ప్రత్యేకంగా పంపీణీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు ప్రతి కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చీరల పంపిణి చేస్తామన్నారు. 18 సంత్సరాల వయసు నిండి, తెల్ల రేషన్ కార్డులో పేరున్న ప్రతి సొదరికి ఈ చీర అందుతుందని, ఎలాంటి తొందర అవసరం లేదన్నారు. ఇప్పటికే జిల్లా గోడౌన్లకు 80 శాతం చీరలు చేరుకున్నాయి. 18, 19, 20 తేదీల్లో మెత్తం చీరల పంపీణి జరుగుతుంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags