షియోమీకి భారత్ ఏం నేర్పింది ?

షియోమీ... ! భారత్ లో ఇప్పుడో టాప్ స్మార్ట్ ఫోన్ సంస్థ. శాంసంగ్ లాంటి కంపెనీలకు కూడా ముచ్చెమటలు పట్టించిన చైనా కంపెనీ. సాధారణంగా చైనా మొబైల్ అనగానే దాన్ని ఓ ఛీప్ ప్రొడక్ట్ గా చూడడం మనకు అలవాటు. కానీ ఆ ఆలోచనను పూర్తిగా తుడిచేసి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో స్మార్ట్ మొబైల్ గా పేరుతెచ్చుకున్న షియోమీ భారత్ నుంచి చాలా విషయాలే నేర్చుకుంది. ఫ్లిప్ కార్ట్ తో కలిసి ఎందుకు హిట్ పెయిర్ అనిపించుకుందో తెలుసా ? కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ హూగో బర్రా చెబ్తున్న ఆసక్తికర విషయాలోంటో చూస్తే.. ఈ-కామర్స్ సహా అనేక విషయాలపై ఓ స్పష్టత వస్తుంది.

25th Mar 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


షియోమీకి, ఫ్లిప్ కార్ట్ కు చాలా దగ్గర సంబంధం ఉందంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుందంటారు బర్రా. శాంసంగ్ కేవలం మొబైల్ టెక్నాలజీ సంస్థ కానీ షియోమీ మాత్రం మొదట ఈ-కామర్స్ కంపెనీ ఆ తర్వాతే మొబైల్ ఇంటర్నెట్ సంస్థ. అందుకే భారత్ లోని ఫ్లిప్ కార్ట్ తో మాకు అంత సులువుగా, తక్కువ సమయంలో ధృడ బంధం ఏర్పడింది.

ఫ్లిప్ కార్ట్ తోనే ఎందుకు ?

ప్రొడక్ట్ ను తయారు చేయడమే కాదు దాన్ని జనాల్లో ఎలా తీసుకెళ్తే సక్సెస్ అవుతుందనే కిటుకును షియోమీ పట్టేసింది. ఫ్లాష్ సేల్ పేరుతోనే కస్టమర్లకు దగ్గరైన షియోమీ భారత్ లో కూడా ఫ్లిప్ కార్ట్ తో కలిసి అదే ఫార్ములాను వాడింది. సాధారణంగా ఒక్కో దేశంలో ఒక్కో రకమైన మార్కెట్ ఉంటుంది. ఈ-కామర్స్ తో పాటు టెక్నాలజీ కంపెనీగా గుర్తించిన తర్వాతే తాము ఫ్లిప్ కార్ట్ తో జతకట్టామనేది షియోమీ మాట. ఈ-కామర్స్ లో ఉన్న లోటుపాట్లన్నీ పూరిస్థాయిలో తమ ఇద్దరికీ అవగాహన ఉండడం వల్లే ఈ బంధం బలపడిందని బర్రా చెబ్తారు.

భారత్ లో ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ టై అప్స్ కు మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ మధ్యకాలంలో ఫ్లిప్ కార్ట్ - మోటరోలా సేల్ ఇందుకు మంచి ఉదాహరణ. భారత మార్కెట్లో తనకంటూ మళ్లీ ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకోవడానికి మోటోకు మరో అవకాశం లభించింది. మోటో ఎక్స్, మోటో జి, మోటో ఈ మోడళ్లు దేశ మార్కెట్లోకి చొచ్చుకుపోయాయి.

ప్రపంచంలో ఉన్న అనేక బ్రాండ్లతో ఒప్పందం ఉన్నా.. షియోమీకి తమకు ఉన్న బంధం ప్రత్యేకమైంది అంటారు ఫ్లిప్ కార్ట్ రిటైల్ వైస్ ప్రెసిడెంట్ -బ్రాండ్ అలయన్స్ హెడ్ మైకేల్ అడ్నానీ.

షియోమీ (సింపుల్ గా MI - మీ) భారత్ లో సూపర్ సక్సెస్ సాధించింది. కేవలం మూడు నెలల్లో Mi3 మోడల్ లక్ష యూనిట్లు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి చూస్తే 'మార్కెట్ లో గిరాకీని ఎలా క్రియేట్ చేసి సొమ్ము చేసుకోవాలో మాకు అర్థమైంది. అంతే కాదు దేశవ్యాప్తంగా మా కస్టమర్లకు వెబ్ సైట్ అనుభవాన్ని ఇంకా ఎంత అద్భుతంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం' అంటారు మైకేల్ అడ్నానీ. 

ప్రస్తుతం రెడ్మి 1s (RedMi 1s) మోడల్ అమ్మకాలపై షియోమీ దృష్టిసారించింది. ఎంట్రీ లెవెల్ లో రూ.5,999 మాత్రమే ఉండే ఫోన్ ను కేవలం 4.2 సెకెండ్లలో 40,000 యూనిట్లను ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మి మొబైల్ మార్కెట్ ను నివ్వెరబోయేలా చేసింది. అంతేకాదు Mi3, RedMi మోడళ్ల ఫోన్లను రెండు, మూడు సెకెండ్లలో 20 నుంచి 40 వేల పీసులు అమ్మి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది షియోమీ.

"రెండు, మూడు సెకెండ్లలో 20 వేల నంచి 40 వేల పీసులను అమ్మడం నిజంగా మాకు అశ్చర్యమైన విషయమే. ఇంతవరకూ భారత ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లాష్ సేల్ మోడల్ ఎవరూ ప్రయత్నించలేదు. అయినా మొదటి ప్రయత్నంలోనే మేము విజయం సాధించాం. దీన్నిబట్టి చూస్తే ఇక్కడి కస్టమర్ల ఆలోచనా విధానం మారుతోంది. ఆన్ లైన్ షాపింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో సూచించేందుకు ఇదే నిదర్శనం. అనేక మంది కొత్త కస్టమర్లు ఈ ఆన్ లైన్ మోడల్ అనుభవాన్ని పొందేందుకు ఉత్సాహంగా ఉన్నారు. తమ కొనుగోలులో మంచి విలువ ఉందని కస్టమర్లు భావించినంతకాలం దీనికి ఢోకా ఉండదు'' అని వివరిస్తున్నారు మైకెల్.

ఒక్కో ఫ్లాష్ సేల్ ద్వారా ఒక్కో కొత్త విషయాన్ని ఫ్లిప్ కార్ట్ కొనుగొంది. ఒక్కోసారి విపరీతమైన ట్రాఫిక్ వల్ల అనేక సమస్యలు వచ్చేవి. సేల్ ప్రారంభం కాగానే ప్రతీ సారీ ఏదో ఒక ఇబ్బందితో కస్టమర్ల నుంచి విమర్శలు వినాల్సివచ్చేది. అందుకే మెల్లిగా వాటన్నింటినీ అధిగమిస్తూ ఇప్పుడు వాటిన్నింటికీ పరిష్కారం కనుగొన్నామంటోంది ఫ్లిప్ కార్ట్. తమ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించేందుకు ఇలాంటి ఎన్నో అనుభవాలు కారణమయ్యాయని చెబ్తోంది.

ఫ్లిప్ కార్ట్ తో అనుబంధం, భారత్ నుంచి ఏం నేర్చుకున్నారు, భవిష్యత్ ప్రణాళికలపై షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ హూగో బర్రా ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. యువర్ స్టోరీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వినండి.

https://www.youtube.com/watch?feature=player_embedded&v=6uvufvRik9A

భారత్ మార్కెట్ పై కొద్దినెలల్లోనే హూగో బర్రాకు విశేషమైన అనుభవం లభించింది.

''భారత కొనుగోలుదారు అందరికంటే ఎక్కువ ఆశిస్తారని (మోస్ట్ డిమాండింగ్ కస్టమర్) నా కెరీర్ మొత్తం అనుభవంలో అర్థం చేసుకున్నాను'' - హ్యూగో బర్రా

భారత కస్టమర్లు చైనా షియోమీకి ఏం నేర్పించారు ?

  • ఏం కావాల్లో వాళ్లకు స్పష్టత ఉంది

భారత కస్టమర్లు ఫిర్యాదు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడరు. తాము అనుకున్నంత స్థాయి దానికిలేకపోతే ఖచ్చితంగా తమ గొంతును బలంగా వినిపిస్తారు. ఒక రకంగా ఇది చాలామంచిది. దీనివల్ల మేము ప్రపంచవ్యాప్తంగా మరింత ధృడంగా మారేందుకు అవకాశముంది.

  • ఇక్కడ స్ర్కీన్ ప్రొటెక్టరూ ముఖ్యమే !

Mi3, షియోమీ మోడళ్లను లాంచ్ చేసినవెంటనే యాక్సెసరీస్ ప్రవేశపెట్టలేకపోయాం. కానీ రెడ్మి RedMi 1sకు మాత్రం మొదటి రోజు నుంచే యాక్సెసరీస్ సిద్ధం చేశాం. భారతీయులు మొబైల్ కొన్న వెంటనే మొదట స్క్రీన్ ప్రొటెక్టర్ కోసం చూస్తారు. మేం అదే తెలుసుకున్నాం. అందుకే రెడ్మి 1s తో పాటు రెండు స్ర్కీన్ ప్రొటెక్టర్లను కూడా అందించాం.

  • మౌత్ పబ్లిసిటీ

భారత్ లో మౌత్ పబ్లిసిటీ ముందు ఏదీ సాటిరాదు. ఫేస్ బుక్ లో Mi ఇండియా ఫ్యాన్ పేజ్ కు అతితక్కువ సమయంలో 50,000 లైక్స్ వచ్చాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎన్నో కంపెనీలతో పోల్చుకునే స్థాయికి మమల్ని పెంచారు. ఇదే వార్డ్ ఆఫ్ మౌత్ గొప్పదనం. ఈ ఆదరణకు మేం పరవశించిపోయాం. భారత్ లో బలమైన సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాం. వెంటనే పెద్ద టీమ్, ఆర్ అండ్ డి ఫెసిలటీ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.


హూగో బర్రాతో Mi ఫోన్ ఫ్యాన్స్

హూగో బర్రాతో Mi ఫోన్ ఫ్యాన్స్


Mi భవిష్యత్ ప్రణాళికలు

  • బెంగళూరు బలం !

ఇప్పుడు బెంగళూరులోని సెస్నా బిజినెస్ పార్క్ లో చిన్న స్థలంలో ఉన్నాం. త్వరలో పెద్ద ఆఫీసుకు మారబోతున్నాం. అక్కడ నిర్వాహణ, లాజిస్టిక్స్, సోషల్ నెట్వరింగ్, మార్కెటింగ్ టీమ్స్ ఉంటాయి. భారత అవసరాలకు తగ్గట్టు అధిక ఉత్పత్తులు తయారు చేసేందుకు చూస్తున్నాం.

  • ఇండియాలో గ్లోబల్ ఆర్ అండ్ డి

పరిశోధన-అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు భారత్ అత్యంత అనువైన దేశం. చైనాకు ధీటుగా పోటీఇవ్వగల సత్తా భారత ఆర్ అండ్ డి కేంద్రానికి ఉంటుంది. భారత్ ఒక్కటే కాకుండా ఇతర ప్రాంత అవసరాలకు ఉపయోగపడేలా ఇండియా ఆర్ అండ్ డిని తీర్చిదిద్దుతాం.

* కస్టమర్ సపోర్ట్ సెంటర్స్

అమ్మకాల తర్వాత సర్వీస్ చాలా ముఖ్యం. అం

దుకే ఆఫ్టర్ సేల్ సపోర్ట్ కస్టమర్ కేంద్రాలపై దృష్టిపెట్టాం. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు ప్రత్యేక సర్వీసు సెంటర్లు ఉన్నాయి. త్వరలో హైదరాబాద్, చెన్నై, ముంబై, గుర్గావ్ లోనూ ప్రారంభించబోతున్నాం.

  • రండి ! ఆడుకోండి !

షియోమీకి ఫ్యాన్సే అండ. చైనాలో వీళ్లవల్లే కంపెనీ ఈ స్థాయికి వచ్చింది. భారత్ లో కూడా అదే తరహా సామాజిక మాధ్యమ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కొత్త ఆఫీసులో కొంత ప్రాంతాన్ని విడిగా ఉంచబోతున్నాం. అక్కడ మా ఉత్పత్తులన్నీ ఉంటాయి. కస్టమర్లు ఎవరైనా వచ్చి వాటిని ఉపయోగించుకోవచ్చు. వాటితో ఆడుకోవచ్చు. ఈ సందర్భంలో వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందుల పరిశీలించి మా ఉత్పత్తులను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తాం.


భారతీయత ఉట్టిపడ్తున్న ఎంఐ బన్నీస్

భారతీయత ఉట్టిపడ్తున్న ఎంఐ బన్నీస్


భారతీయం !

ఇక్కడి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే ఇండియన్ థీమ్స్ ను రూపొందిస్తున్నాం. Mi బన్నీ అనేది షియోమీ మస్కట్. ఇది భారతీయ దుస్తులతో అలరిస్తూ భారతీయులకు మనసుదోస్తోంది. షియోమీ మెల్లిగా భారతీయులకు దగ్గరవుతోంది. అంతేకాదు దీన్నో ఇండియన్ బ్రాండ్ గా మార్చి మరింత చేరువయ్యేందుకు కూడా కంపెనీ సిద్ధమవుతోంది.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India