సంకలనాలు
Telugu

వీళ్లు నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

6th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


మహిళల్ని ఆకాశంలో సగం అంటారు. అవకాశంలో సగం అంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అనుకున్నంత లేదు. సగంలో సగమైనా మహిళలకు అవకాశాలు అందుబాటులో లేవు. అయినా సరే, అందివచ్చిన అవకాశాలతోనే సత్తా చాటుతున్నారు. భర్త సంపాదనను కుటుంబ అవసరాలకు అనుగుణంగా సరిచేయడమే కాదు....అవసరమైన చోట ఆ సంపాదనా బాధ్యతలనూ తీసుకుంటున్నారు. ఇంటి నిర్వహణలో తమకు ఎవరూ సాటిలేరని ఎలా నిరూపించుకుంటున్నారో....పెద్ద పెద్ద వ్యాపారాల్లోనూ తమకు ఎవరూ పోటీలేరని చాటిచెప్తున్నారు. ఆ నైపుణ్యమే ఇవాళ ఎంతోమంది మహిళామణులను అత్యధిక జీతభత్యాలు తీసుకుంటున్న జాబితాలో చేర్చింది.

సాధారణంగా పెద్ద హోదాలో ఉన్న వారి జీతాలను సంవత్సరానికోసారి లెక్కిస్తారు. కానీ పురుషులతో జీతాలతో పోలిస్తే మహిళల జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారు. బడా కంపెనీలకు సీఈవోలుగా, సీఎండీలుగా ఉంటూ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు. వారిలో ఒకరు యాహూ సీఈవో మరిస్సా మేయర్. వరల్డ్ లోనే టాప్ మహిళా ఎగ్జిక్యూటివ్ ఆమె. మరిస్సా జీతం 42.1మిలియన్ డాలర్లు. అలాగే అత్యధికంగా జీతాలు తీసుకుంటున్న 24మంది మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ లో మెగ్ విట్మన్ ఒకరు. ఆమె సాలరీ 19.6మిలియన్ డాలర్లు. TJXకంపెనీలు, పెప్సికో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంద్రానూయి జీతం 9.1మిలియన్ డాలర్లు. 

బిజినెస్ జర్నల్స్, మ్యాగజైన్స్ జరిపిన సర్వేల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తొలి పది మంది ఇండియన్ విమెన్ జీతాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ సారి చదవండి.

image


1. కావేరీ కళానిధి, మేనేజింగ్ డైరెక్టర్ , సన్ టీవీ నెట్ వర్క్.

మీడియా టైకూన్ కళానిధి మారన్ భార్య కావేరీ కళానిధి. ఆమె జీతం రూ. 59 కోట్ల 89 లక్షలు. నిజానికి ఈ సాలరీ ఈ తగ్గింది. అంతకుముందు కావేరీ కళానిధి పే ప్యాకెట్ ఎంతో తెలుసా....72 కోట్ల రూపాయలు. సన్ గ్రూప్ లోనే కాదు, నవంబర్ 15, 2010 నుంచి స్పైస్ జెట్ లిమిటెడ్ ఛైర్మన్ గా, జనవరి 30, 2010 నుంచి ఆ సంస్థకే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె సేవలందిస్తున్నారు.

2. కిరణ్ మజుందార్ షా, సీఎండి బయోకాన్ లిమిటెడ్.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తొలి వంద మంది మహిళల్లో కిరణ్ మజుందార్ షా ఒకరు. విజ్ఞాన, రసాయన శాస్త్ర రంగాల్లో విశిష్టమైన సేవలందించినందుకుగాను ఆమె ఓత్మర్ గోల్డ్ మెడల్ కూడా పొందారు. అంతేకాదు ఫోర్బ్స్ మ్యాగజైన్ అయితే తనకు తానుగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళ అని కిరణ్ మజుందార్ షాను కీర్తించింది. 2014 సంవత్సరం నాటికి షా జీతం ఎంతో తెలుసా రూ. కోటీ,63 లక్షల,47వేల,463.

image


3. ఉర్వి ఎ పిరమల్, అశోక్ పిరమల్ గ్రూప్ ఛైర్ పర్సన్ .

ఉర్వి ఎ పిరమల్. 32 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తమ కుటుంబ వ్యాపారంలోకి వచ్చారు. వ్యాపార విభజన తర్వాత తనకు, తన కొడుకులకు వాటాగా వచ్చిన డయింగ్ టెక్స్ టైల్ మిల్లును, రెండు ఇంజనీరింగ్ కంపెనీల బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి తన కంపెనీలను సక్సెస్ బాటలో నడిపిస్తున్నారు. 2012-13 సంవత్సరం నాటికి ఆమె జీతం రూ.7,03,00,000.

4. చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు ఎండీ, సీఈవో.

చందాకొచ్చార్. 2005 నుంచి ఫోర్బ్స్ మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ లిస్టులో ఉంటున్నారు. వరుసగా 2009 లో ఫోర్బ్స్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ లిస్టులో 20వ స్థానంలో నిలిచారు. ఇండియాలోని రిటైల్ బ్యాంకింగ్ సెక్టారును చక్కగా మలచడంలో చందా కొచ్చర్ ప్రముఖ పాత్ర పొషించారు. ఐసీఐసీఐ డెవలప్మెంట్ లో కూడా ఆమె ముద్ర కనిపిస్తుంది. ప్రస్తుతం కొచ్చర్ 5,22,82,644 రూపాయల వేతనం తీసుకుంటున్నారు.

image


5. శోభనా భార్తియా. రాజ్యసభ మాజీ సభ్యురాలు, హెచ్ టీ సంస్ధ చైర్ పర్సన్.

తండ్రి కె.కె బిర్లా నుంచి వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించిన శోభనా భార్తియా, రాజ్యసభ సభ్యురాలుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ గ్రూపు చైర్ పర్సన్, ఎడిటోరియల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి నుంచి బిజినెస్ తీసుకున్న సమయంలో పెద్దగా లాభాలేవు. కానీ ఇప్పుడు హెచ్ టీ మీడియా దేశంలోనే అత్యంత విజయవంతమైన మీడియా వ్యాపారాల్లో ఒకటిగా నిలిచింది. 2014 సంవత్సరంలో 155 కోట్ల నికర లాభంతో హెట్ టీ సంస్థ టాప్ ప్లేస్ లో నిలిచింది. గతేడాది 24 కోట్లు నికరలాభంతో ముందంజలో ఉంది. ప్రస్తుతం ఆమె 26.880.000 ప్యాకేజీ తీసుకుంటున్నారు.

image


6. ప్రీతారెడ్డి, అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్.

దేశంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ రంగంలో ప్రీతారెడ్డి సారథ్య సంస్థగా అపోలోను రన్ చేస్తున్నారు. అపోలో, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఆరోగ్య సేవలను అందించేందుకు గాను నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (NBH)ను ఏర్పాటు చేశాయి. ప్రీతారెడ్డి జీతం రూ. 5,11,10,000.

image


7. వినీతా సింఘానియా, జె.కె.లక్ష్మీ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్.

వినీతా సింఘానియా. జె.కె. సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ తోపాటు సిమెంట్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. భర్త శ్రీపతి సింఘానియా హఠాన్మరణంతో ఆమె 1998లో బిజినెస్ లోకి అడుగుపెట్టారు. వినీత నేతృత్వంలో కంపెనీ లాభాల బాటలో నడించింది. బాధ్యతలు స్వీకరించిన ఐదేళ్లలోనే కంపెనీ టర్నోవర్ ను ఆమె వంద నుంచి 450 కోట్లకు పెంచగలిగారు. వినీత జీతం రూ.4,39,73,000.

8.వినీతా బాలి, బ్రిటానియా ఇండ్రస్ట్రీస్ సీఈవో.

వినీతా బాలి, బ్రిటానియా ఇండస్ట్రీస్ సీఈవోగా అత్యధికంగా జీతం తీసుకుంటున్న టాప్ 50 బిజినెస్ ఉమెన్ లో ఒకరిగా నిలిచారు. అంతేకాదు ఫోర్బ్స్ లీడర్ షిప్ అవార్డును కూడా పొందారు. వినీతా ప్రస్తుతం 4 కోట్ల జీతం తీసుకుంటున్నారు.

image


9. రేణు సూద్ కర్నాడ్, హెచ్.డి.ఎఫ్.సి మేనేజింగ్ డైరెక్టర్ .

ప్రాడక్ట్ డెవలప్ మెంట్, స్ట్రాటజీ, బడ్జెట్ అంశాలలో రేణుసూద్ కర్నాడ్ కీలకమైన పాత్రును పోషిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలలో నిపుణురాలిగా ప్రఖ్యాతిగాంచిన రేణుసూద్ కర్నాడ్.. వేతనం దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు.  

10. సునీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్.

సునీతారెడ్డి. ఆర్ధిక వ్యవహారాలు చక్కదిద్దడంలో దిట్ట. ప్రపంచబ్యాంకే ఆశ్చర్యపోయేలా అపోలో రీచ్ హాస్పిటల్స్ మోడల్ కు నేతృత్వం వహించారు. ఆమె జీతం రూ. 5,18,40,000.

image

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags