సంకలనాలు
Telugu

ఆన్‌లైన్‌లో రొమాంటిక్ అనుభూతిని కల్పించే 'ట్రూలీ సోషల్'

15th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వర్చువల్ రియాలిటీ అనే సరికొత్త భావనను మీరు ఇష్టపడుతున్నారా ? దీని ద్వారా మీరెప్పుడైనా డేటింగ్ చేసేందుకు ప్రయత్నించారా ? నిజ జీవితంలో శృంగారానికి ఇది దారి తీసే పరిస్థితులు తీసుకురాగల సత్తా వర్చువల్ రియాలిటీకి ఉందని తెలుసా ? నమ్మినా నమ్మకపోయినా ట్రూలీ సోషల్ రూపొందించన (ఫ్లర్టింగ్ + వర్చువల్) ఫ్లర్చువల్ రియాలిటీ గేమింగ్ ఆప్ చేసేది ఇదే. ఈ యాప్ ఓ సంచలనం. ఐదేళ్ళ క్రితమే సెబాస్టియన్ కోమన్.. సోషల్ గేమింగ్‌పై ఆసక్తి కనబరిచారు. అయితే అప్పటికే గేమింగ్ ట్రెండ్ సమాజాన్ని చుట్టుముట్టేస్తోంది.

గేమ్‌లన్నీ మూసధోరణిలో, కొత్త దనం ఏమీ లేనట్టు భావించారు సెబాస్టియన్. ఎప్పుడూ బోర్‌గా అనిపించే గేమ్‌లు ఏం ఆడతారు ? గేమింగ్ ప్రియుల కోసం కొత్త ఏదైనా చేయాలని భావించారు సెబాస్టియన్. సంప్రదాయ గేమ్‌లకు కాలం చెల్లిందని, వినూత్నంగా ఆలోచించి డిజైన్ చేసే గేమ్‌లకు మంచి ఆదరణ ఉంటుందని గుర్తించారు. ఎంతో మంది మహిళలు గేమింగ్‌లోకి వస్తున్నా, ఎవరూ ఈ సెగ్మెంట్‌పై అంతగా ఆసక్తి కనబరచడం లేదని గమనించారు.

ఈ ఆలోచన రావడానికి మరో కారణం కూడా ఉంది. పలు డేటింగ్ సైట్స్ అందుబాటులో ఉన్నా.. అన్నీ టెక్ట్స్ మెసేజ్‌ల ఆధారితమైనవే. వాటిని విశ్వసించడానికి అంతగా ఆస్కారం లేదు. సామాజిక పరిచయాల విషయంలో గేమిఫికేషన్‌ను ఎవరూ ప్రయత్నించలేదు. రొమాంటిక్ భావనలపై ఓ గేమ్ రూపొందించవచ్చనే ఆలోచనతో ట్రూలీ సోషల్ మొదలైంది. త్రీడీ ప్రపంచం ఆధారంగా వర్చువల్‌గా జంటలను కలపచ్చన్నదే ఫ్లర్చువల్ రియాలిటీ ప్రధాన ఉద్దేశ్యం.

ఫ్లిర్ట్ ప్లానెట్ @ ఫ్లర్చువల్ రియాలిటీ

ఫ్లిర్ట్ ప్లానెట్ @ ఫ్లర్చువల్ రియాలిటీ


ట్రూలీ సోషల్ టీమ్

వర్ట్యువుల్ మోడల్‌లో రొమాంటిక్ టచ్‌తో గేమింగ్ ఫార్ములా తయారుచేయాలని భావించారు. త్రీడి తరహాలో గేమింగ్ తయారుచేశారు సెబాస్టియన్. బిజినెస్ స్కూల్‌లో కొలీగ్ అయిన సలోని సెహగల్‌తో తన ఐడియా గురించి వివరించారు. అప్పటికి బార్‌క్లేస్ బ్యాంక్‌కి సలోని వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ట్రూలీసోషల్ గురించి ఆమెకు వివరించారు సెబాస్టియన్. ఆంట్రపెన్యూర్‌షిప్‌లోకి ప్రవేశించాలని, ఏదైనా సాధించాలన్న తన తపనను ఆమె ముందు పెట్టారు సెబాస్టియన్. దీనికి ఉన్న సామర్ధ్యం అర్ధం కాగానే.. బోర్డ్‌లోకి ప్రవేశించానంటారు సలోనీ.

వీలైనంత త్వరగా మినిమం వయబుల్ ప్రొడక్ట్(కనీస గిట్టుబాటు గల ఉత్పత్తి)ని రూపొందించారు సెబాస్టియన్. ఇందు కోసం కొందరు అమెరికన్ డెవలపర్స్ సహాయం తీసుకున్నారు. ఈ ప్రొడక్ట్‌ను భారత్‌తో లింక్ చేయగలగితే.. ఖర్చు విషయంలో ఉండే లాభదాయకతపై సలోనీకి అవగాహన ఉంది. అందుకే భారతీయ డెవలపర్లను తీసుకుని వ్యయాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిద్దామని సూచించారు.

సలోనీ సెహగల్, సీఈఓ, ట్రూలీ సోషల్

సలోనీ సెహగల్, సీఈఓ, ట్రూలీ సోషల్


సెబాస్టియన్‌కి ఈ ఐడియా నచ్చడంతో వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టారు సలోని. గేమింగ్ డెవలపర్ల కోసం వెతకడం ప్రారంభించారు. ‘‘మేం ఇండియా నుంచి ఔట్‌సోర్సింగ్ ద్వారా ఎవరైనా ఉద్యోగుల్ని తీసుకోవాలని భావించాం. అయితే మేం మంచి టీంని ఎంపిక చేసుకోగలిగాం. ఔట్‌సోర్సింగ్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మేం ఎంపిక చేసుకున్న టీం సభ్యులు అప్పటికే మంచి అనుభవం ఉన్నవారు. ప్రతిభ ఉన్న ఆర్టిస్టులు, డెవలపర్లు’’ అన్నారు సలోని.

యుకెలో స్థిరపడ్డ కంపెనీ ట్రూలీ సోషల్. అయితే లండన్‌తోపాటు.. ఇండియాలోనూ ఈ వెంచర్ విస్తరించింది. ‘‘ఇద్దరితో ప్రారంభమయిన మా టీం ఇప్పుడుతొమ్మిది మందికి చేరింది. కొత్తగా వచ్చే వారికి మేం చెప్పేది ఒక్కటే. కొత్త ఆలోచనలకు రూపం ఇవ్వండి. ఎప్పుడూ కొత్తగా ఆలోచించండి’’ అని చెబ్తున్నారు సలోని.

బయటనుంచి వేరే వ్యక్తులు వచ్చి.. గేమింగ్ పరిశ్రమలో పాతుకుపోయిన దిగ్గజ కంపెనీలను ఢీ కొట్టడానికి తగిన అవకాశాలు ఉన్నాయంటోంది ట్రూలీ సోషల్ టీం. ఇద్దరితో మొదలై తొమ్మిది మందికి చేరిన ఈ వెంచర్ టీం.. మరింతమందిని చేర్చుకోబోతోంది.

సమస్యలు-పరిష్కారాలు

కొత్త ప్రపంచంలోకి ప్రవేశించడం.. ప్రారంభంలో కొన్ని సవాళ్లను తీసుకొచ్చే విషయమే. గేమ్‌లను రూపొందించే రంగంలో.. ఇప్పటికే పోటీ తారాస్థాయిలో ఉందంటారు సలోనీ. సాధారణంగా గేమింగ్ యాప్ తయారుచేసే ఉద్యోగులు ఎప్పుడూ కొత్తదనం కోసం ఆలోచించాల్సి ఉంటుంది. వారికి తగిన వసతులు, ధైర్యం, అన్నిటికంటే మించి తగిన సమయం ఉండాలి. బోర్ కొట్టడం అనేది వారికి విసుగును తెప్పించేదిగా ఉంటే.. మరిన్ని ఫలితాలు సాధించవచ్చంటారు సలోనీ.

“మేం ఉద్యోగులకు ఇచ్చే జీతాలు తక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఉద్యోగం చేయడం అంటే.. మనసుకు దగ్గరయ్యేలా గేమింగ్ వ్యవస్థలో భాగం కావడం. ఒక యూజర్ అనుభవాన్ని సృష్టించడానికి ముఖ్యం కొత్త ఆట, శైలి. ఇందుకు ముఖ్యంగా కావలసింది సమయం. వనరులు. వీటన్నిటికంటే కాలం ప్రధానమైంది’’ అంటారు సలోని.

సాధారణంగా ముందుగా అనుకున్న డెడ్‌లైన్ ప్రకారం ప్రాజెక్టు పూర్తికావాలని పెట్టుబడిదారులు కోరుకుంటారు. ట్రూలీ సోషల్‌లో పెట్టుబడి పెట్టేవారు.. సాధారణంగా ఈకామర్స్ సైట్‌లతో మా కంపెనీ పోల్చి చూస్తుంటారు. కొంతమంది గేమింగ్ అప్లికేషన్ డెవలపర్లు ఎక్కువ టైం తీసుకున్న మాట వాస్తవమే కానీ, కేవలం మూడంటే మూడురోజుల్లో కొత్త గేమ్స్ తయారుచేసి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.

సెబాస్టియన్ కొమన్, ఫౌండర్, ట్రూలీ సోషల్... ఇమేజ్ క్రెడిట్-ప్రొఫెషనల్ ఇమేజెస్

సెబాస్టియన్ కొమన్, ఫౌండర్, ట్రూలీ సోషల్... ఇమేజ్ క్రెడిట్-ప్రొఫెషనల్ ఇమేజెస్


ది సిమ్స్‌ అనే గేమ్‌ని ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ తయారుచేసింది. దీంతో పాటు ఇదే టీం లైవ్ బీటా ద్వారా యాంగ్రీబర్డ్స్ సిరీస్‌లో 51 గేమ్స్ రూపొందించారు. ఈ గేమ్‌ డెవలపర్లు.. వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని తరువాతి వెర్షన్‌లో వాటికి మెరుగులు దిద్దుతూ ఉంటారు. వెర్షన్‌లో మార్పులు చేశాక ఎంతోమంది వినియోగదారులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం తమ వెంచర్‌కు కొత్త పెట్టుబడిదారులను వెతికే పనిలో ఉన్నామని చెప్పారు సలోని.

మొబైల్‌లో ఉచితంగా గేమ్స్ అందించగలగడం, కనీస లాభదాయకత ఉండే గేమ్‌లను రూపొందించడం స్మార్ట్ ఫోన్స్ ప్రవేశించాక కొంత సులభంగా మారింది. ఇలాంటి ఆటల రూపకల్పన పెరిగింది. ఇప్పుడు కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని.. అందుకు అనుగుణంగా.. గేమ్‌లో మార్పు చేర్పులు చేస్తున్నారు. “ ప్రస్తుతం మేం రూపొందించిన యాప్‌కు ఆశించిన స్థాయికి మించిన స్పందన లభిస్తోంది. యూజర్లు ప్రారంభంలోనే వీటివైపు మొగ్గుచూపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందుకోసం యూజర్ ఇంటర్‍‌ఫేజ్, యూజర్ ఇంటరాక్షన్‌ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాం ” అన్నారు సలోనీ. మరోమారు నిధుల సమీకరణకు ప్రయత్నాలు జరుగుతుండడం విశేషం.

మా లక్ష్యం ఏంటంటే..?

‘‘వినోద ప్రధానమయిన, కొత్త ఆలోచనలతో కూడిన... ముఖ్యంగా రొమాంటిక్ భావనలున్న గేమ్‌లో లీనమయ్యే అనుభవాన్ని కలిగించడమే మా ఉద్దేశం. మా థీంలతో పోటీపడే గేమ్స్ ప్రస్తుతం మార్కెట్లో ఏం లేవు. మనం ఆడే గేమ్స్‌లో రాక్షసులను చంపడం, కృత్రిమ బొమ్మల ఇళ్ళు, ఆటలు ఆడడం, వివిధ అవతారాలు ఇలా ఎన్నో విలక్షణమయిన అంశాలతో కూడిన గేమ్‌లు ఉంటాయి.

టెక్నాలజీ ఎంతో మారిపోయింది. మనం ఎంతో స్మార్ట్‌గా తయారయ్యాం. ఇదే సమయంలో మనం కొన్ని అనుభూతులను కూడా కోల్పోతున్నాం. ఫ్లర్చువల్ రియాలిటీ ఇప్పుడు కొత్త ట్రెండ్. ఇది మన ఆలోచనల్ని కొంచెం మార్చగలదని మేం భావిస్తున్నాం’’ అంటున్నారు సలోని.

సామాజిక మాధ్యమాలతో అనుసంధానమైన డేటింగ్ ఇంటరాక్షన్స్ చేస్తున్నాం. మా ఉద్యోగులు కూడా ఇదే పనిలో ఉన్నారు. వీడియో గేమ్ మెకానిక్స్‌తో బిహేవియరల్ సైకాలజీ, న్యూరో సైన్స్ వంటి అనేక అంశాలు జోడిస్తున్నాం. అవతార్ త్రీడీ గేమ్‌లో ఎంటరయిన వెంటనే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ క్యారెక్టర్లు కనిపిస్తాయి. న్యూరోసైంటిస్టుల సాయం తీసుకోవడం కారణంగా.. నిజంగా డేటింగ్ చేసిన అనుభూతిని కల్పించడం దీని స్పెషాలిటీ.

మన అరచేతిలో ఉన్న ఫోన్‌లో మంచి గేమ్స్ ఆడుతూ ఉంటే మెదడు కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. 90 వేల వాక్యాలు తయారుచేసి గేమ్ డెవలపర్లకి ఇస్తే ఎవరికివారు స్వంతంగా ఆలోచించి మంచి గేమ్ రూపొందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఏ ఇద్దరు కలిసినా ఒకే ఆలోచన ఉండదు. ఎవరికీ ఒకే సంభాషణ మరోసారి ఎదురుకాదు. ఎంత బాగా ఆడితే అన్ని హగ్స్ అకౌంట్‌లోకి వస్తాయి. ఎంత చక్కగా, తెలివిగా సంభాషణ కొనసాగిస్తే.. గేమ్‌లో అంతగా ముందుకెళ్లచ్చు. దీంతో లిటిల్ బ్లాక్ బుక్‌కి నెంబర్స్ యాడ్ చేయడం ద్వారా.. పారిస్‌లో వర్చువల్ డేటింగ్ చేయచ్చు. ఎవరికి వారు కొత్తగా ఆలోచించే ఈ గేమ్‌లో ప్యారిస్, ఆస్పెన్ వంటి రొమాంటిక్ ప్రాంతాల్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. “మేం కొన్ని అనుబంధాలను ఏర్పరుస్తున్నాం” అంటున్నారు సలోనీ.

భవిష్యత్ ప్రణాళికలు

బీటా వెర్షన్‌కే అనూహ్యమైన స్పందన వస్తోందని చెబ్తోందీ ఫ్లర్చువల్ రియాలిటీ టీం. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి యూజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ట్రూలీ సోషల్ అందించే గేమ్స్‌ని 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న మహిళలే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బీటా వెర్షన్ గేమ్ప్ అందుబాటులో ఉన్నాయి. మా గేమ్స్ వాడుతున్న వారిలో 70 శాతం మంది మహిళలే. ఒక్కక్కరూ సరాసరిన 25 నుంచి 30 నిముషాలు గేమింగ్‌లోనే గడుపుతున్నారు.

ఫ్లర్చువల్ రియాలిటీ ఓ సాహిత్య ప్రక్రియ లాంటిది. గేమింగ్, డిజిటల్ డేటింగ్ అనే ప్రక్రియలను వాడుతూ ఉండాలి. అత్యంత రద్దీగా ఉండే గేమింగ్ ప్రపంచంలో లాభదాయక మార్కెట్లను ఎంచుకోవాలంటారు సలోనీ. సాధ్యమయినంత వరకు అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా గేమింగ్ సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామని చెబ్తున్నారామె. మొబైల్స్‌లో వర్చువల్ రియాలిటీ ఉండేలా చూసుకోవాలి. స్మార్ట్ ఫోన్లు పెరిగాక గేమింగ్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.

పెరుగుతున్న సాంకేతికతకు అనుకరణగా , పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ మరియు టాబ్లెట్ వ్యాప్తి, మరియు గేమింగ్ మరియు డేటింగ్ అనువర్తనాలు ఏర్పడటంతో , పెరుగుదల బాగా ఉంటోంది.

యూజర్ల అభిరుచులకు అనుగుణంగా మన గేమింగ్ విధానం ఉండాలి. అప్పుడే మనం తయారుచేసే యాప్‌లను వినియోగదారులు ఆదరిస్తారంటారు సలోన్. ఇప్పటికే గేమ్‌లో వర్చువల్ ఎకానమీని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా యాప్‌లోని కొనుగోళ్లను అంచనా వేసుకుంటున్నారు. పరిశీలన కోసం కూడా శక్తివంతమైన ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కస్టమర్లలో 2 నుంచి 3 శాతం ప్లేయర్లను యాప్‌లో కొనుగోళ్లు చేసేవారిగా మార్చాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు.

ట్రూ సోషల్ యాప్ ద్వారా గేమ్‌లు కొనుగోలు చేయడం చాలా తేలిక. అమెరికాలో దీని ద్వారా 8 నుంచి 12 డాలర్లు పెట్టి యాప్‌లు కొంటున్నారు. కొంతమంది 100 డాలర్లు అంటే మన రూపాయల్లో అయితే 6 వేల రూపాయలు కూడా వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కువమంది గేమింగ్ యాప్‌లు తీసుకుంటే ఈ ధర తక్కువగా వస్తుంది.

గత ఏడాది మా టీం సీడ్‌రౌండ్‌ని పక్కన పెట్టేసింది. కొత్త పెట్టుబడిదారుల ను అన్వేషిస్తున్నాం. త్వరలో మంచి గేమ్‌లు తయారుచేసి అందరికీ కొత్త గేమింగ్ ఉత్తేజాన్ని అందిస్తాం’’ అంటున్నారు సలోని.

2015 చివర్లో పెద్దస్థాయిలో ఇనిస్టిట్యూషనల్ రౌండ్ ఫండింగ్ ద్వారా నిధుల సమీకరణ చేయనున్నారు. “దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిధులు సమీకరించగలిగేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామనే విషయం మాకు తెలుసు. మేం సృష్టించిన వినూత్న ఉత్పత్తికి తగినంత స్థాయిలో డిమాండ్‌తో పాటు, నిధులు కూడా అందుతాయని ఆశిస్తున్నాం. మార్కెట్‌కి సెట్ అయ్యే ప్రోడక్ట్‌ని అందించామనే నమ్మకం మాకుంది. దీన్ని ఖర్చులకు తగినట్లుగా నిర్వహించడం ముఖ్యమైన విషయం. నిధుల సమీకరణ పూర్తయ్యాక.. వ్యాపార సామర్ధ్యాన్ని, తీరుతెన్నుల్లో కీలక మార్పులను తీసుకొస్తా”మని చెప్పారు సలోనీ. 

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags