సంకలనాలు
Telugu

ఈ మ్యాజిక్ బస్‌లో ఎక్కితే వీధి బాలలు విద్యావంతులైనట్టే !

పేదరికానికి అంతం పలకాల్సిందేఒకేసారి అందరినీ బయటకు తేలేకపోతే...ఒక్కొక్కరి చొప్పున బయటకు తీసుకురావాలంటున్న మ్యాజిక్ బస్పేదరికం చెయిన్ లింక్‌కు అంతం పలుకుతున్న మ్యాజిక్ బస్

ABDUL SAMAD
29th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మనిషి శక్తిసామర్ధ్యాలు ఊహించసాధ్యం కానివి. తలచుకోవాలే కానీ దేనినైనా సాధించగలిగే శక్తి మనిషికి మాత్రమే ఉంది. ఊహాశక్తితో ఏ లక్ష్యాన్నైనా అందుకోవడం కేవలం మానవునికే సాధ్యం. అమెరికాకు తొలి నల్ల జాతీయుడైన అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక సందర్భంలో చెప్పిన మాటలను గుర్తి చేసుకుందాం. “ మీ శక్తిని అంతకు మించినదానితో కొలిచినపుడే... మీ అంతర్గత సామర్ధ్యం బయటపడుతుంది.” ఇప్పుడు మ్యాజిక్ బస్ చేస్తోందదే. పేదరికపు చెయిన్ లింకుని తెగ్గొట్టే ప్రయత్నం చేస్తోందీ సంస్థ. ఒక్కో చిన్నారి చొప్పున ఎంపిక చేసుకుని... దేశంలో ఉన్న పేదలను క్రమ పద్ధతిలో ఒక్కో అడుగు చొప్పున ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. పేరుకు తగ్గట్టుగానే దేశపు పేదరికాన్ని మ్యాజిక్ చేసి మరీ మాయం చేసే ప్రయత్నమే మ్యాజిక్ బస్.

image


మ్యాజిక్ బస్ ఎలా మొదలైందంటే...

జాతీయ రగ్బీ జట్టు ఆటగాడు మాథ్యూ స్పేసీ ముంబైలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్ట్రీట్ ఎదురుగా ప్రాక్టీస్ చేస్తూండేవాడు. ఇది ముంబై వీధి బాలలు నిత్యం తిరుగాడే ప్రాంతం. ప్రాక్టీస్ సమయంలో ఆ వీధి బాలలతో కలిసి ఆడేవాడు మాథ్యూ. క్రమంగా వారిలో సానుకూల మార్పులు రావడాన్ని అతడు గమనించాడు. ఇదే సమయంలో మొత్తం టీంలోనూ కొన్ని మార్పులు రావడాన్ని కూడా గుర్తించాడు. వీధుల్లో పెరిగినవారే అయినా... గోల్ కొట్టడంలో వారికుండే కసి... వారు ఉండే ప్రాంతానికే చెందిన వ్యక్తులకు భిన్నంగా, ఉన్నతంగా ఎదగాలనే ఆశయం కనిపించేది అతనికి. క్రమంగా ఆట ప్రభావం వారిలో కనిపించసాగింది. ఆటల ద్వారా నేర్చుకునే ఓ క్రమశిక్షణ, వారి జీవితాల్లోనూ ప్రతిబింబించడం అతనికి ఆనందం వేసేలా చేసింది. కష్టాలకు ఎదురొడ్డి నిలబడే వ్యక్తిత్వాన్ని నేర్పే శక్తి ఆటలకు ఉందని మాథ్యూకు ఆ సమయంలోనే అర్ధమైంది. పదేళ్లపాటు ఇలా కొనసాగిన శిక్షణే చివరకు మ్యాజిక్ బస్‌గా మార్పు చెందింది. అభివృద్ధికి వేసే అడుగులుగా ఆటలను ఎంచుకోవచ్చనే ఓ అద్భుతమైన ఆలోచనకు ఆరంభాన్ని ఇచ్చింది. అనేకమంది జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు సహాయపడింది.

మ్యాజిక్‌ బస్ ఎలా పని చేస్తుంది ?

ఈ బస్ ప్రారంభమైంది 199లో. దేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన రెండున్నర లక్షల మంది చిన్నారు, 8వేల మంది యువత... వివిధ స్థాయిల్లో ఇప్పుడు దీనిలో శిక్షణ పొందుతున్నారు. దీనికి తొలి మద్దతు లభించింది మాత్రం మాథ్యూకు చెందిన తొలి సంస్థ కాక్స్ & కింగ్స్ నుంచే. ఆ తర్వాత క్లియర్ ట్రిప్ కూడా సపోర్ట్ చేసింది. మాథ్యూ అతని టీం కలిసి "స్పోర్ట్ ఫర్ డెవలప్‌మెంట్" కాన్సెప్ట్ అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం మొదలుపెట్టారు. ఆయా చిన్నారుల వయసు, అవసరాల ఆధారంగా ఈ కార్యయ్కరమాల నిర్వహణ జరిగింది.

image


విద్య, ఆరోగ్యం, లింగ బేధం లేకుండా సుదీర్ఘంగా నిర్వహించే ఈ ప్రోగ్రామ్స్‌ని స్థానికంగానే నిర్వహించారు. ఆయా చిన్నారుల ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే ఈ కోర్సులుండేవి. వీటి ప్రధాన లక్ష్యం పేదరికం నుంచి బయటపడాలనే తపన వాళ్లకు కలిగించడమే. ఇందుకు అవసరమైన ప్రేరణ మాత్రం మ్యాజిక్ బస్ ఇచ్చేది. వారి ఇంట్రెస్టులకు అనుగుణంగా ప్రోత్సాహం లభించేంది. వారి ప్రదర్శనల అనుగుణంగా మార్గదర్శకులుగా వ్యవహరించేవారి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం, తగిన సూచనలివ్వడం చేసేవారు. ఏవైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే వాటిపై సలహాలిచ్చేవిధంగా వ్యవస్థను రూపొందించారు.

చిన్న వయసు నుంచి కొంత ఎదిగిన తర్వాత వారికి కనెక్ట్‌ అనే ప్రోగ్రామ్‌లో జాయిన్ కావడానికి ఛాయిస్ ఉండేది. ఇది ఉన్నత విద్య అభ్యసించడం, ఉద్యోగావశాలకు ప్రయత్నించడం అనే విధానంపై ఆధారపడి ఉండేది. ఈ కార్యక్రమానికి వెనుక నుంచి లభించిన అనూహ్యమైన మద్దతు కారణంగా ఇప్పటికి రెండున్నర లక్షల మంది యువతకు ఉన్నత విద్యాభ్యాసం లభించగా... అందరూ ఆరోగ్యం విషయంలో మెరుగవడం విశేషం. అలాగే వారి జీవన విధానాల్లోనూ సానుకూల మార్పులు చోటు చేసుకోవడం గమనించచ్చు. వారు పెద్దవారుగా మారేప్పటికే వారి దృక్పథాల్లోనూ కీలక మార్పులు వచ్చాయంటుంది మ్యాజిక్ బస్.

ఎన్‌జీఓ సంస్థల్లో మ్యాజిక్ బస్ ప్రత్యేకం

సాధారణంగా లాభాపేక్ష రహిత సంస్థలు ఏదైనా ఒక ప్రత్యేక కారణం కోసం పని చేస్తుంటాయి. కానీ మ్యాజిక్ బస్ మాత్రం వీటికి భిన్నమైనది. చూడడానికి దీని మూలం ఒకటిగానే ఉన్నా... దీనికి అనేక ఇతర ప్రయోజనాలున్నాయి. మార్గమొక్కటే... గమ్యాలు మాత్రం అనేకం ఉండడం అభినంచదగ్గ అంశం. పిల్లలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ఒక్కటే కాకుండా... వారి ఆలోచనలతోపాటు వారి తల్లిదండ్రులు, బంధువుల కుటుంబాల్లోనూ మార్పు తీసుకురాగల శక్తి ఉంది దీనికి. అందుకే ఈ మ్యాజిక్ బస్‌కు వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ మార్కెట్ ప్లేస్ అవార్డ్ దక్కించుకుంది.

అడ్డంకులను ఇలా ఎదుర్కున్నారు ?

పరాజయాలు ఎన్ని ఎదురైనా లక్ష్యాన్ని మర్చిపోకుండా పోరాడి సాధించుకోగలిగేదే అసలైన విజయం. ఎవరైనా కొత్త వ్యక్తి తెలీని ప్రాంతానికి వచ్చి ఓ బాల్‌ను గాల్లోకి విసిరేస్తే... వయసుతో సంబంధం లేకుండా... గాల్లోకి విసిరింది ఎవరో తెలీకపోయినా... అందరూ దానివంకే చూస్తుంటారు. అదీ ఆటకి ఉన్న ఆకర్షణ శక్తి. అయితే ఇదే సమయంలో ఆడపిల్లల విషయంలో అంత సులభం కాదు. ఆయా ప్రాంతాలతో పాటు స్థానికంగా ఉన్న కట్టుబాట్లు వారిని కట్టిపడేస్తుంటాయి. వారిలో ఉత్సాహాన్ని నీరుగారుస్తుంటాయి. ఇలాంటి అడ్డంకుల నుంచి ప్రాంతపు కట్టుబాట్ల నుంచి బయటకు తీసుకొచ్చి వారిని సమాజపు అభివృద్ధిలో వారినో భాగం చేసి, వారికి వారు ఉన్నత స్థాయికి చేరేలా చేసేందుకు మ్యాజిక్ బస్ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇందుకోసం ఆ సంస్థ అనేక సలహాలు, ప్రయోగాలు చేయడంతో పాటు... వారి తల్లిదండ్రులను కలుసుకుని కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. డోర్ టూ డోర్ కేంపెయిన్‌లు కూడా ఇందులో భాగమే. బాలల హక్కులను కాపాడుతూ... వారికున్న అడ్డంకులను అధిగమిస్తూ... అభ్యంతరాలను సమాధానాలు చెబుతూ... ఉన్నత స్థాయికి చేర్చాలనేదే మ్యాజిక్ బస్ ప్రయత్నం.

image


ఇదే ఇప్పటి వ్యవస్థకు బస్ చేస్తున్న మ్యాజిక్ ట్రీట్‌మెంట్. సంస్థ నాయకుడే ఇలాంటి మ్యాజిక్‌ను అందుకున్న వ్యక్తి అయితే... అది మిగతావారికి ఎంతటి ఆదర్శంగా ఉంటుందో అలోచించడం. మ్యాజిక్ బస్‌లో జరుగుతున్నది అదే. సామాజికవేత్తగా మారేందుకు మాథ్యూ స్పేసీ తనకు భారీ ఆదాయాన్ని అందించే ఉన్నతోద్యాగాన్ని కూడా వదిలేశారు. అనేకమంది వాలంటీర్లు తమకు బంధనాలు వేసే లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చారు. కొత్తగానే కాదు ఉన్నతంగానూ ఆలోచించడం కారణంగానే ఇదంతా సాధ్యమైంది. మ్యాజిక్ బస్ చేసినదాంట్లో వందో వంతు చేయాలనే తపన ప్రతీ ఒక్కరికి కలిగితే... మన మాతృభూమి, మన ఇల్లు, మన దేశానికి ఎంతో సేవ చేసినట్లే. వన్ ఇండియా అనే కాన్సెప్ట్‌కు బాటలు వేసినట్లే.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags