సంకలనాలు
Telugu

గ్రామీణ ప్రాంతాలకు ఈ కామ‌ర్స్ రుచి చూపిస్తున్న స్టోర్‌కింగ్‌

Karthik Pavan
3rd Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అది క‌ర్నాట‌క‌లోని ఓ మారుమూల ప‌ల్లె. క‌నీసం రోడ్డు స‌దుపాయం కూడా స‌రిగా లేని ఊరు. అక్క‌డో కుర్రాడు ఉద‌యాన్నే ఎల్లో క‌ల‌ర్ ఫ్యాన్సీ స్పోర్ట్స్ షూ వేసుకుని కాలేజీకి వెళ్లాడు. క‌ట్ చేస్తే.. కొద్ది రోజుల త‌ర్వాత త‌న‌తో పాటు చ‌దువుకుంటున్న 114మంది కూడా అచ్చం అలాంటివే షూ వేసుకుని కాలేజీకి వ‌చ్చారు.

ఈ స్టోరీ విన్న వాళ్లు ఎవ‌రికైనా వ‌చ్చే మొద‌టి అనుమానం ఏంటి? ఎలాంటి ర‌వాణా స‌దుపాయం లేని ఈ ఊళ్లో కుర్రాళ్ల‌కు ఫ్యాష‌న్ షూస్ తెచ్చిపెట్టింది ఎవ‌రు? ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డ‌ర్ చేశారా? పోనీ మింత్రా ద్వారానా ? లేక జ‌బాంగ్‌ నుంచా?


image


కచ్చితంగా పైవేవీ కాదు. 91 శాతం గ్రామీణ వినియోగ‌దారుల‌కు ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఏంటో తెలియక‌పోగా.. క‌నీసం ఇంగ్లీష్‌లో అడ్ర‌స్ ఎంట‌ర్ చేయ‌డ‌మే రాద‌ని తాజాగా జ‌రిగిన ఓ స‌ర్వేలో తేలింది. ఇంట‌ర్‌ఫేస్ ద‌గ్గ‌ర్నుంచి.. అడ్ర‌స్ ఎంట‌ర్ చేయ‌డం నుంచి ప్ర‌తీదీ అంద‌రికీ అర్ధ‌మ‌య్యేలా స్ధానిక భాష‌లో త‌యారుచేయ‌బ‌డిన ఒక ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్ నుంచి ఈ క‌ర్రాళ్లు ఆర్డ‌ర్ చేశారు కాబ‌ట్టే ఇది సాధ్య‌మైంది.

స్టోర్ కింగ్‌. బెంగ‌ళూరుకు చెందిన ఈ-కామ‌ర్స్ స్టార్ట‌ప్‌. స్ధానిక భాష‌లో మొద‌లై.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికే 10 ల‌క్ష‌ల‌మందికి ఆన్‌లైన్ షాపింగ్‌ను ప‌రిచ‌యం చేసింది.

“ కొంత‌కాలం క్రితం మేం నిర్వ‌హించిన స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాల‌ను బ‌ట్టి దీన్ని త‌ప్ప‌నిస‌రిగా త‌యారుచేయాల‌ని అనుకున్నాం” అంటారు.. స్టొర్‌కింగ్ ఫౌండ‌ర్ సీఈవో శ్రీధ‌ర్ గుండ‌య్య‌.

కాస్త వెన‌క్కి వెళితే..

ఈ బెంగుళూరు కుర్రాడికి స్టార్ట‌ప్‌లు కొత్తేమీ కాదు.. ఐటీ, ఈ-కామ‌ర్స్‌పై లండ‌న్ గ్రీన్‌విచ్ యూనివ‌ర్శిటీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తిచేసిన త‌ర్వాత‌.. యులోప్ అనే కంపెనీని 2007లో స్ధాపించాడు. ఇండియాలో మొట్ట‌మొద‌టిసారిగా లొకేష‌న్‌ని బేస్ చేసుకుని క‌స్ట‌మ‌ర్ల‌కు స‌ర్వీసులు అందించింది ఈ కంపెనీనే.

క‌స్ట‌మ‌ర్ల‌కు స‌ర్వీసులు అందించ‌డంలో 2009లో మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌ను గుర్తించిన శ్రీధ‌ర్‌.. అందుకు గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాల‌జీపై అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని తేల్చాడు. ఒక‌సారి చైనా ప‌ర్య‌ట‌నకు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ మెసేజ్‌లు చేసుకోవ‌డం ద‌గ్గ‌ర్నుంచి ఈ-కామ‌ర్స్‌, ఈ-మెయిల్‌.. ఇలా ప్ర‌తీదీ చైనీస్‌, మాండ్రియ‌న్ భాష‌ల్లో చేసుకోవ‌డం.. అదీ అక్క‌డివాళ్ల‌కు ఎంతో సుభంగా ఉండ‌టాన్ని గ‌మ‌నించాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో స్టోర్‌కింగ్‌ని లాంచ్ చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది.! 2012లో స్టోర్ కింగ్ లాంచ్ అయింది.

ఈ స్టోరీ కూడా చదవండి

image


స్టోర్‌కింగ్ ఎలా ప‌నిచేస్తుంది?

అటు ఇటుగా 50,500 ర‌కాల ప్రొడ‌క్ట్స్ అమ్ముతున్న ఒక ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ స్టోర్‌కింగ్‌. అన్ని ఈకామర్స్ వెబ్‌సైట్ల‌లానే కానీ.. ఇంట‌ర్‌ఫేస్ మాత్రం ఇంగ్లీష్‌లో ఉండ‌దు. ప్ర‌స్తుతానికి త‌మిళం, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, గోవా భాష‌ల్లో స‌ర్వీసులు అందిస్తోంది.

“ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల‌కు స‌రైన అడ్ర‌స్‌లు ఉండ‌వు. కేవ‌లం ఆ ఊళ్లో పూర్తిపేరు ఆధారంగానే పోస్ట్‌మ్యాన్‌లు డెలివ‌రీ చేస్తుంటారు. ఈ స‌మ‌స్య‌ను గుర్తించే ఓ కొత్త డెలివ‌రీ మోడ‌ల్‌ను ప్లాన్ చేశాం” అంటారు శ్రీధ‌ర్‌.

గ్రామాల్లోని మొబైల్ రీచార్జ్ ద‌గ్గ‌ర్నుంచి ప్ర‌తీ రీటైల‌ర్‌ను డైర‌క్ట్‌గా క‌లిసి.. స్టోర్‌కింగ్ టాబ్లెట్‌ను అక్క‌డ ఇన్‌స్టాల్ చేసుకునేలా ఒప్పిస్తారు. అందుకు రీటైల‌ర్‌కు రూ.10వేల దాకా ఖ‌ర్చ‌వుతుంది.

“గ్రామంలో అంద‌రికీ సుప‌రిచిత‌మైన రీటైల‌ర్‌ను ఎంపిక చేసి అత‌ని షాపులో మ‌న టాబ్లెట్ కానీ.. కియాస్క్ కానీ అమ‌రుస్తాం. అంద‌రూ అత‌ని ద‌గ్గ‌రికే వ‌చ్చి కావాల్సిన‌వి స్టొర్‌కింగ్ ద్వారా కొనుగోలు చేసుకుంటారు” అంటారు శ్రీధ‌ర్‌.


image


రీటైల‌రే స్వ‌యంగా క‌స్ట‌మ‌ర్‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాడు. చెకౌట్ ప్రాసెస్ కూడా ద‌గ్గ‌రుండి జ‌రిపించి.. ఆర్డ‌ర్ క‌న్‌ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత డ‌బ్బులు క‌ట్టించుకుంటాడు. వెంట‌నే అటు రీటైల‌ర్‌కు, ఇటు క‌స్ట‌మ‌ర్‌కు ఇద్ద‌రికీ స్ధానిక భాష‌లో ఎస్ఎంఎస్ వ‌స్తుంది.

“ క‌స్ట‌మ‌ర్‌ను ఐడెంటిఫై చేయాలంటే ఫోన్ నంబ‌ర్ ఒక్క‌టే స‌రిపోతుంది. ఆ త‌ర్వాత అన్ని క‌మ్యూనికేష‌న్ ఎస్ఎంఎస్‌లు డైర‌క్ట్‌గా క‌స్ట‌మ‌ర్ నంబ‌ర్‌కే పంపుతాం” అని శ్రీధ‌ర్ చెబుతున్నారు.

బెంగ‌ళూరులో వేర్‌హౌస్ ఏర్పాటుచేసుకున్న స్టోర్‌కింగ్‌.. 48గంటల్లో ఆర్డ‌ర్‌ను FMCG ప‌ద్ధ‌తిలో డెలివ‌రీ చేస్తుంది. ఎక్కువ ధ‌ర‌లకు అమ్మ‌డం, డిస్కౌంట్‌లు ఇవ్వ‌డంలాంటి అవ‌స‌రం లేకుండా.. కాస్త మార్జిన్‌తోనే ప్ర‌స్తుతానికి వ్యాపారం చేస్తోంది. అంతేకాకుండా ప్ర‌తీ ట్రాన్సాక్ష‌న్‌కు రీటైల‌ర్‌కు 6 నుంచి 10శాతం క‌మిష‌న్ అందిస్తోంది.

ఇంత‌కీ గ్రామీణ ప్రాంతాల్లో ఏం కొంటున్నారు?

న‌మ్మ‌డానికి కాస్త ఆలోచించాల్సి వ‌చ్చినా.. యాంటీ ఏజింగ్ క్రీమ్ ఆర్డ‌ర్లు ఈ మ‌ధ్య స్టోర్ కింగ్‌లో ఎక్కువైపోయాయ‌ట‌. షాపు ద‌గ్గ‌రకి వ‌చ్చి.. “ఆ అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్‌లో మాధురీ దీక్షిత్‌లాగా క‌నిపించాలి.“ అని గ్రామ‌స్తులు అడిగి మ‌రీ క్రీమ్‌లు బుక్ చేసుకుంటున్నార‌ని చెబుతున్నారు శ్రీధ‌ర్‌. ఇక డిష్‌వాష్ బార్‌లు.. ఇంట్లోని ఐట‌మ్స్ ఎక్కువ‌గా సేల్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ల‌తో పాటు ఈ మ‌ధ్య‌నే కొన్ని చోట్ల ఐఫోన్‌6 కూడా డెలివ‌రీ చేశామ‌ని అంటున్నారు.

ప్ర‌యాణం సాఫీ..!

ద‌క్షిణాది రాష్ట్రాల్లో 4,500 కియాస్క్‌లు ఏర్పాటు చేసుకున్న స్టొర్ కింగ్‌. నెల‌కు కనీసం 75వేల ఆర్డ‌ర్ల‌న డెలివ‌రీ చేస్తోంది. అయితే, మినిమం ఆర్డ‌ర్ 500గా నిర్ణ‌యించారు. తాజాగా మ్యాన్‌గ్రోవ్ కేపిట‌ల్ నుంచి రూ.41కోట్ల రూపాయ‌ల ఇన్వెస్ట్‌మెంట్ ద‌క్కించుకుంది.

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు

వీలైనంత త్వ‌ర‌గా మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో త‌మ సర్వీసుల‌ను విస్త‌రించాల‌ని స్టోర్‌కింగ్ భావిస్తోంది.

“ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లాంటి సంస్ధ‌లు.. మారుమూల ప్రాంతాల‌కు డెలివ‌రీ చేయ‌వు క‌నుక‌..మ‌రో రెండుమూడేళ్ల‌లో.. 50కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను చేరుకోగ‌ల‌మ‌ని అనుకుంటున్నాను.” అని శ్రీధ‌ర్ ధీమాగా చెబుతున్నారు.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈస్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags