సంకలనాలు
Telugu

T కార్పొరే'టీ'కరణే "ఛాయ్ తేలా''

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఛాయ్ ఖ‌రీదులో చీపురా భాయ్.. ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్.. ఇలా ఛాయ్ చ‌మ‌క్కులు ఎన్నో ! అస‌లు ఛాయ్ అంటే ఏంట‌నుకున్నారు? మ‌న జాతీయ పానీయం. మ‌న‌ దేశంలో ఛాయ్ రోజుకు ఏడేనిమిది సాగ‌ర్లు లాగించందే పొద్దుపోని వారు బోలెడు మంది. ఇంత‌కీ ఇండియాలో ఛాయ్ మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా? ఒక‌టి కాదు రెండు కాదు అక్ష‌రాలా 20,000 కోట్ల రూపాయలు. అలాంటి ఛాయ్ ఫ్రెష్ గా తాగుతున్న వారెంద‌రు? పానీయాల్లో సూర్యుడు కాఫీ అయితే, చంద్రుడు ఛాయే. కాఫీకోసం కాఫీడే, బ‌రిస్టా, స్టార్ బ‌క్స్ లాంటి పెద్ద కార్పొరేట్ షాపులున్నాయి. దేశంలో ఇంత ఫేమ‌స్స‌యిన ఛాయ్ కి మాత్రం ఆ హోదా ఉండొద్దా? ఛాయ్ కేం త‌క్కువ‌ ? అనే ఆలోచన నుంచి పుట్టింతే ఛాయ్ తేలా !

25th Mar 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

ఛాయ్ వాలా నుంచి పీఎం కుర్చీ ఎక్కారు మోడీ. త‌మిళ‌నాడు సీఎం ప‌న్నీర్ సెల్వం కెరీర్ కూడా ఛాయ్ కొట్టు నుంచే మొద‌లైంది. అలాంటి గ్రేట్ హిస్ట‌రీ ఉన్న ఛాయ్ బండి మాత్రం ఎక్క‌డున్న‌ది అక్క‌డే ఉంది. రోడ్డు సైడున ఉంటూ అలాగే బ‌తుకుబండి లాగిస్తోంది. ఛాయ్ బండికి కార్పొరేట్ హోదా ద‌క్కాల్సిందే అనుకున్నారు పంక‌జ్ జ‌డ్జ్, నితిన్ చౌద‌రీ. అది కూడా పంక‌జ్ పెళ్లి ఇక కొన్ని నెల‌ల్లో ఉంది. పెళ్లవుతోందంటే కొత్త బాధ్య‌త‌లు మ‌రిన్ని పెరుగుతాయి. ఈ స‌మ‌యంలో ఉన్న ప‌ని ఒదిలేసి కొత్త ప‌ని అది కూడా ప్ర‌యోగాత్మ‌కం. క‌ష్ట‌మే అన్నారంద‌రూ. క‌ష్టాల‌తో ఇష్టంగా ప్ర‌యాణం చేయ‌డ‌మే క‌దా? విజ‌య ర‌హ‌స్యం. ఈ విష‌యంలో నో కాంప్ర‌మైజ్ అన్నాడు పంక‌జ్..అత‌ని కాబోయే భార్య కూడా నా స‌పోర్ట్ నీకే అంది.

image


అయినా ఛాయ్ బిజినెస్ ఏంటీ? కుర్రాళ్లంద‌రూ ఎంచ‌క్కా కార్పొరేట్ ఆఫీసుల్లో హాయిగా ఏసీల్లో కూర్చుని ఉద్యోగాలు చేసుకుంటుంటే... దానికా పేరు అస్స‌లు బాగోలేదు. మావాడొక‌డు రోడ్ సైడ్‌ ఛాయ్ తేలా న‌డుపుతున్నాడు.. వాడికీ నీకూ పెద్ద తేడా ఏవుందీ? అన్నాడు పంక‌జ్ మావ‌గారు. నితిన్ బంధు మిత్రుల నుంచి కూడా ఇలాంటి సూచ‌న‌లే అందాయి. వాళ్ల‌వీ వీళ్ల‌వీ అభిప్రాయాలు తీసుకుని జీవితం తీర్చిదిద్దుకుంటే అద‌స‌లు మ‌న‌ జీవిత‌మే కాదు. మ‌న జీవితం మ‌నం జీవించాలంటే మ‌న ఆలోచ‌న‌ల‌తో దాన్ని ప‌కడ్బందీగా రూపొందించాలి. అస‌లు ఇక్క‌డ ఫ‌లానా మేట‌రుంద‌ని నువ్వు గ్ర‌హించ‌డ‌మే పెద్ద విష‌యం.. దాన్ని వాళ్లూ వీళ్లు చెప్పే నిరుత్సాహ‌పూరిత మాట‌ల‌తో క‌ప్పేస్తే ఇక మిగిలేది ఏం ఉండ‌దు. జీవితం ఏ రుచీ లేకుండా చ‌ప్ప‌గా సాగిపోవ‌డం వ‌ల్ల ఎవ‌రికి ఉప‌యోగం? అయినా పుట్ట‌లో చీమ‌లు పుట్ట‌వా గిట్ట‌వా అంటారు. ఈ మాట‌ల‌ను నిరూపించ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు. అనుకున్నారా ఇద్ద‌రూ.. ఛాయ్ బండి.. కార్పొరేట్ ఆఫీసుల్లో ఊహించుకో ఎలా ఉంటుందో.. అన్నారు ఉత్సాహంగా..

క‌ట్ చేస్తే పంక‌జ్ పెళ్ల‌యింది.. హానీమూన్ త‌ర్వాత అస‌లు జీవితం స్టార్ట్ అయ్యింది. జ‌స్ట్ టూ మంత్స్ లో ఛాయ్ తేలా బిజినెస్ స్టార్ట‌యింది.పంకజ్ తో ఈ ఛాయ్ బిజినెస్ లోకి వ‌చ్చే ముందు నితిన్ లిక్క‌ర్ రీటైల్ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ల ప్ర‌ధాన ల‌క్ష్యం. ఐటీ పార్కులు, కాలేజీలు, హాస్పిట‌ల్స్ లో అద్భుతమైన టీ అందించే దుకాణాలు తెర‌వ‌డం. ఇద్ద‌రితో మొద‌లైన ఛాయ్ తేలా ఇప్పుడు 32 మంది ఉద్యోగులు, ఆరు ఔట్ లెట్ల‌కు చేరింది. రోజూ 500 నుంచి 600 క‌ప్పులు అమ్ముతున్నారు ఒక్కో ఔట్ లెట్ లో.

పంక‌జ్- నితిన్ నిర్వ‌హిస్తున్న ఛాయ్ తేలా ఔట్ లెట్స్ లో మ‌సాలా టీ, ద‌నియా టీ, గ్రీన్ యాపిల్ టీ, మాంగో టీ. క‌శ్మీరీ కవ్వా టీ.. ఇలా మొత్తం 40 ర‌కాలు దొరుకుతాయి. వీటిలో ఆమ్ ఆద్మీ ఛాయ్ ధ‌ర 10 రూపాయ‌లైతే, మాంగో టీ 25 రూపాయ‌లుంటుంది. అంటే బ‌రిస్టా, స్టార్ బ‌క్ లోలా భారీ రేట్లుండ‌వు. జ‌స్ట్ అంద‌రికీ అందుబాటులో ఉండే ధ‌ర‌ల్లో చ‌క్క‌ని చిక్క‌ని రుచిగ‌ల ఛాయ్ అమ్మ‌డ‌మే ధ్యేయం.

ఛాయ్ తేలా ప్రారంభానికి ముందు పంక‌జ్ ద‌గ్గ‌ర‌గానీ, నితిన్ ద‌గ్గ‌ర గానీ న‌యా పైసా లేదు. ఇద్ద‌రూ అప్పుచేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. పంక‌జ్ కైతే ఒక ప‌క్క పెళ్ల‌యిన కొత్త‌. అదే ఏదైనా జాబ్ చేస్తుంటే.. ఎంచ‌క్కా వీకెండ్స్ ఎంజాయ్ చేయ‌డానికి ఆస్కార‌మెక్కువ‌. కావాలంటే లీవులు కూడా పెట్టొచ్చు. కొన్ని సార్లు అత‌ని భార్య శ్వేత‌ కాస్త ఇబ్బందిగా ఫీల‌యింది కూడా. ఇలాంటివ‌న్నీ ప‌ట్టించుకుంటే జీవితంలో ముందుకెళ్ల‌డం క‌ష్టం. అనుకున్నాడు.. ఛాయ్ తేలా బిజినెస్ లో తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు పంక‌జ్. ఇప్పుడు పంక‌జ్, నితిన్ టార్గెట్ ఏంటో తెలుసా?

image


వ‌చ్చే ఐదేళ్ల‌లో దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో 1000 ఔట్ లెట్ల‌ను తెర‌వ‌డం. ఈ దిశ‌గా ఇప్ప‌టికే నిధుల స‌మీక‌ర‌ణ చేస్తున్నారీ ఛాయ్ ఫ్రెండ్స్..

ఇటీవ‌లి కాలంలో ఛాయ్ ఔట్ లెట్ బిజినెస్ బ్రంహ్మాండంగా సాగుతోంది. సామాకేపిట‌ల్, ఛాయ్ ప‌త్తీ, ఇన్ఫినిటీ వంటి ఛాయ్ కంపెనీలు మంచి లాభాలు గ‌డిస్తున్నాయి. ఛాయ్ తేలాపై కాసుల వ‌ర్షం కురిపించ‌డానికి భారీ అవ‌కాశాలే ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఇవ్వ‌డానికి డ‌బ్బుకు కొద‌వ‌లేదు. అందుకు ప్ర‌తిఫ‌లంగా మంచి క్వాలిటీతో కూడిన ఆహారాప‌దార్ధాలు, పానీయాలే దొర‌క‌డం లేదు. ఇదే పంక‌జ్, నితిన్ ధైర్యం. మ‌నం గ‌నుక కార్పొరేట్ కాంపౌడ్స్ లో స‌రైన నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను పాటించ‌గ‌లిగితే.. ఛాయ్ బండికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు. గో అహెడ్ పంక‌జ్, నితిన్.. మీ ఐడియా సూప‌ర్. వ‌చ్చే ఐదేళ్ల‌లో మీ వెయ్యి ఔట్ లెట్ల ఆశ‌యం ఖ‌చ్చితంగా నెర‌వేరుతుంది. ఇందులో నో డౌట్‌.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags