సంకలనాలు
Telugu

వెబ్ సైట్లకు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా ?

మొబైల్ స్టార్టప్ మొదలు పెడుతున్నారా ?వెబ్ సైట్ తోనే వ్యాపారం చేయాలనుకుంటున్నారా ?మీ కంపెనీకి వెబ్ సైట్ ఏరకంగా ఉపయోగపడుతుంది ?డిజిటల్ శకంలో ముందుకు పోవాలంటే ఏఏ మార్గాల్లో పయనించాలి ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే !

4th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ప్రతిరోజూ మనం ఎన్నో ఇంటర్నెట్ కంపెనీల సేవలను ఉపయోగిస్తూ ఉంటాం. గూగుల్, ఫేస్‌బుక్ ,ట్విట్టర్,లింక్డిన్,కోరా, వికీపీడియాలు ప్రధానంగా మదిలో మెదులుతాయి. ఈ రోజుల్లో అందరికీ సమాచారాన్ని చేరవేసే ప్రచార మాధ్యమాలుగా ఇవన్నీ ఉన్నాయి. వర్డ్ ప్రెస్ లేదా బ్లాగర్ నుంచి వెబ్ సైట్ తీసుకోవడం, ఐట్యూన్స్ లేదా గూగుల్ ప్లే నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం, యూట్యూబ్ లో ఫ్రీగా వీడియో చూసేయడం, క్విక్కర్ లిస్ట్‌లో క్లాసిఫైడ్‌ను పోస్ట్ చేయడం లాంటివి సాధారణంగా నెట్ వాడే ప్రతి ఒక్కరూ చేసే పనులే. ఇవన్నీ ఉచితంగా ఎలా చేయగలమనే దానికి ఎవరైనా సమాధానం చెప్పగలరా ?

వాళ్లు మనకు కొన్ని ఫ్రీగా ఇచ్చి.. టన్నుల కొద్దీ డబ్బులను దండుకుంటారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. వారి అభిప్రాయం తప్పుకాకపోవచ్చు. కానీ అది ఎలా సాధ్యం చేస్తున్నారనేదే ప్రధానం. ప్రకటనల నుంచి మాత్రమే ఆదాయం వస్తుందని మనందరి భావన. నిజమే ప్రకటనలు ప్రధాన ఆదాయ మార్గాలే కానీ.. అవి మాత్రమే ఆదాయాన్ని తెచ్చిపెడతాయనుకుంటే పొరపాటు. మనకు ఆశ్చర్యం కలిగించే వివిధ రకాలైన ఆదాయమార్గాలున్నాయి. అవేంటేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోటోలో కనపడిన వాటికి ఆదాయాలెలా వస్తాయి? కావాలంటే స్టోరీ చదవండి

ఫోటోలో కనపడిన వాటికి ఆదాయాలెలా వస్తాయి? కావాలంటే స్టోరీ చదవండి


1. ప్రకటనలు

చాలా పురాతనమైన ఆదాయ వనరు ఇది. ఇది స్థిరమైన ఆదాయమార్గం. సాధారణంగా ఇంటర్నెట్ జనాభా ప్రకటనలను బ్లాక్ చేయడం ఆరంభించిన క్షణం నుంచే పరిశ్రమ కొత్త మార్గాల వెతుకులాటలో పడింది.

డిస్ ప్లేయాడ్- ఉదా: యాహూ

సెర్చ్ యాడ్- ఉదా: గూగుల్

టెక్ట్స్ యాడ్ - ఉదా: గూగుల్,ఫేస్ బుక్ 

వీడియోయాడ్ - ఉదా: యూట్యూబ్ 

ఆడియోయాడ్ - ఉదా: సావన్ 

ప్రమోటెడ్ కంటెంట్ - ఉదా: ట్విట్టర్, ఫేస్‌బుక్ 

పెయిడ్ ప్రొడక్షన్ రిక్రూట్మెంట్ యాడ్ - ఉదా: లింకిడిన్

క్లాసిఫైడ్స్ - ఉదా: జస్ట్ డైల్, క్విక్టర్ 

ఫీచర్డ్ లిస్ట్ - ఉదా: జొమాటో, కామన్ ఫ్లోర్ 

ఈ-మెయిల్ యాడ్స్ - ఉదా:యాహూ, గూగుల్, 

లొకేషన్ బేస్డ్ ఆఫర్స్ - ఉదా: ఫోర్ స్వేర్

ఇలా జనాలను ఏ విధంగా ఆకర్షించాలో అనేక మార్గాలను కంపెనీలు కనిపెట్టాయి.


2. ఫ్రీమియం మోడల్

చాలా రకాలైన వెబ్ సర్వీసులు చేసే పనే ఇది. ఎంత మంది కావాలంటే అంత మందికి కంటెంట్ చేరవేయడం. దాన్ని పొందాలంటే పేమెంట్ చేయాలని షరతులు పెట్టడం. కస్టమర్లకు మాత్రమే కావల్సిన, అవసరమైన సమాచారం అందిస్తారు. చాలా రకాలైన సాస్ ప్రాడక్టులు ఇదే రకమైన పద్దతిని అవలంభిస్తున్నాయి. డ్రాప్ బాక్స్ 2జీబి డేటాను ఉచితంగా ఇస్తుంది. అంతకంటే అదనం కావాలంటే డబ్బులు కట్టాల్సిందే.దీనికి ఇతర ఉదాహరణలుగా ఎడోబ్ ఫ్లాష్, ఎవర్ నోట్, గూగుల్ డాక్స్ లేదా డ్రైవ్, లింకిడిన్, ప్రెజీ, స్లైడ్ షేర్, స్కైప్, వరల్డ్ ప్రెస్ తో పాటు ఫర్మ్ విల్లే, యాంగ్రీ బర్డ్స్ లాంటి మొబైల్ గేమ్స్ ను చెప్పొచ్చు.

సక్సస్ ఫుల్ ఈకామర్స్ కంపెనీలివే

సక్సస్ ఫుల్ ఈకామర్స్ కంపెనీలివే


3. ఈ కామర్స్

90వ దశకంలో ఉన్నట్లు భారీ మాల్స్ లో అతి పెద్ద దుకాణాలు పెట్టి చేసే రిటైల్ వ్యాపారం పూర్తిగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ ధరల మంటలను తగ్గిస్తూ అమెజాన్ లాంటి ఈకామర్స్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఎలాంటి పన్నుపోట్లు లేకుండా జనానికి చవకైన ధరకు అన్ని రకాల వస్తువులను చేరవేశాయి. ఈ కామర్స్ ద్వారా అమ్మకాలు చేసే కంపెనీలిలా ఉన్నాయి. రిటైలింగ్ - ఉదా: మింత్ర, 

మార్కెట్ ప్లేస్ - ఉదా: స్నాప్ డీల్, 

షేరింగ్ ఎకానమీ - ఉదా: ఎయిర్ బిఎన్ బి, 

అగ్రిగేటర్స్ - ఉదా: ట్యాక్సీ ఫర్ షూర్, 

గ్రూప్ బైయింగ్ - ఉదా: గ్రూప్ఆన్, 

డిజిటల్ గూడ్స్ లేదా డౌన్ లోడ్స్ - ఉదా: ఐట్యూన్స్ 

వర్చువల్ గూడ్స్ - ఉదా: జింగా, 

ట్రెయినింగ్ - ఉదా: కోర్స్ఎరా, సింప్లీ లెర్న్, 

పే వాట్ యూవాంట్ - ఉదా: ఇన్‌స్టామోజో, 

ఆక్షన్ కామర్స్ - ఉదా: ఈబే, 

క్రౌడ్ సోర్స్ సర్వీసులు - ఉదా: ఎలాన్స్, ఓడెస్క్


4. అఫిలియేట్ మార్కెటింగ్

బ్లాగ్స్‌లో హై ట్రాఫిక్ ఉండటం వల్ల సైన్ ఐన్ కి అఫ్లియేషన్ చేసుకోవడం, కంటెంట్ ను వారికి మాత్రమే అందించడం జరుగుతోంది. యూజర్లు లింక్ ని ఫాలో అయితే పబ్లిషర్ కు కమిషన్ అందుతుంది. అఫ్లియేషన్ సైట్ కు యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే వారిని వేరే సైట్ కు అమ్ముకునే అవకాశం ఉంటుంది. లింక్ ను వేరే సైట్ వైపు మార్చి దీన్ని సుసాధ్యం చేస్తారు. ఇటీవల మోటో జీ పై మంచి రివ్యూలు రావడంతో దాన్ని ఫ్లిప్ కార్ట్ లో పోస్టు చేసి అక్కడ అమ్మకాలను సాగించారు. ఇలా సైట్ కు ప్రత్యేక కమిషన్ వస్తుందన్నమాట.

5. సబ్‌స్క్రిప్షన్ మోడల్

న్యూస్ పేపర్లు, జిమ్, మ్యాగజైన్ లు ఇవన్నీ సబ్ స్క్రిప్షన్ మోడల్ కిందకు వస్తాయి. ఇది చాలాకాలంగా నడుస్తోన్న వ్యాపారమే. డిజిట్ డొమైన్ , సాఫ్ట్‌వేర్లపై కొన్నాళ్ల క్రితం వరకూ లైసెన్సింగ్ మోడల్ ఆదిపత్యాన్ని చూపించేది. నెమ్మదిగా ఇది సబ్ స్క్రిప్షన్ వైపు మళ్లింది. సాధారణంగా యూసేజి ప్రకారం చార్జీలు వసూలు చేస్తారు. కొన్ని చార్జీలు మరీ ఎక్కువ అవుతుండటం సబ్ స్క్రిప్షన్ తెరపైకి వచ్చింది.

ఎన్ వై వెబ్ పేజ్

ఎన్ వై వెబ్ పేజ్


జిమ్మీ వేల్స్ మాట

జిమ్మీ వేల్స్ మాట


6. కంటెంట్ సర్వీసు

వివిధ రకాలైన సబ్ మోడల్స్ .. సాఫ్ట్ వేర్ యాజ్ సర్వీసు(SaaS) – ఉదా.ఫ్రెష్ డెస్క్. సర్వీస్ యాజ్ య సర్వీస్ – ఉదా. పేయూ

ఇన్ ఫ్రాస్ట్రక్చర్/ ప్లాట్ ఫామ్ యాజ్ ఏ సర్వీస్ – ఉదా.ఏడబ్యూఎస్,అజురే, మెంబర్షిప్ సర్వీస్– ఉదా. అమెజాన్ ప్రైమ్, సపోర్ట్ అండ్ మెంటెనెన్స్ – ఉదా.రెడ్ హ్యాట్, పేవాల్– ఉదా. ఎప్టీడాట్కామ్, ఎన్ వై టైమ్స్

7. లైసెన్సింగ్

సాఫ్ట్ వేర్ కంపెనీల్లో చాలా సాధారణ మోడల్ ఇది. సాస్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ లాగానే అనిపించినా ఇది మరో రకం. యూసేజ్‌కి మాత్రమే లైసెన్సింగ్ తీసుకోవడం. ఇది మేధో సంపత్తి హక్కు కాబట్టి సాధారణంగా కాలపరిమితి కలిగి ఉంటుంది. టెర్రిటరీ, ప్రాడక్ట్‌లో రకాలు, వాటి వాల్యూమ్ పై ఆధారపడి ఉంటుంది. ఇందులో వేరేరకం సర్టిఫికేషన్. మెకెఫీ(McAfee SECURE) అనేది ఇంటర్నెట్ వెబ్ సైట్ లకు ట్రస్ట్ మార్క్ గా ఉన్నట్లన్న మాట.

పెన్ డ్రైవ్/సర్వర్ లైసెన్స్– ఉదా. మైక్రోసాఫ్ట్ ప్రాడక్టులు, పెర్ అప్లికేషన్ ఇన్ స్టెన్స్ – ఉదా.అడోబ్ ఫోటోషాప్, పెర్ సైట్ లైసెన్స్ – ఉదా. ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి ప్రైవేట్ క్లౌడ్ , పేటెంట్ లైసెన్సింగ్ – ఉదా.క్వాల్ కామ్

గేమ్( in app purchase)

గేమ్( in app purchase)


8. డేటా అమ్మకం

మీకీ సంగతి తెల్సా. నెట్ ప్లాట్‌ఫాం వాడుకున్నందుకు మీరు డబ్బులు చెల్లించకపోయినా వాళ్లకు మాత్రం మీ నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. హై క్వాలిటీ, ప్రత్యేక మైన డేటాలు డిజిటల్ ఏజ్ లో చాలా ప్రాధాన్యం కలిగినవి. చాలా సంస్థలు థర్డ్ పార్టీకి డేటాని అమ్మడానికి సిద్ధపడుతున్నాయి. గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్ ల సర్వీసులకు మనమెలాంటి చెల్లింపులు చేయం. మీ డేటాని గొప్పదైన, దుర్భేద్యమైనదిగా చూపించి వాళ్లు ప్రకటనలు పొందుతాయి. ఈ లెక్కన చూస్తే మీరు వాళ్ల సేవలను ఉపయోగించుకోవడం లేదు. మిమ్మల్నే వాళ్లు వాడుకుంటున్నారు. 

యూజర్ డేటా – ఉదా. లింకిడిన్, సెర్చ్ డేటా – ఉదా.గూగుల్, బెంచ్ మార్కింగ్ సర్వీసు – ఉదా. కామ్ స్కోర్, మార్కెట్ రీసెర్చ్ – ఉదా. మార్కెట్స్ అండ్ మార్కెట్స్.

9. స్పాన్సర్షిప్, డొనేషన్స్

చాలా రకాల సర్వీసులు ప్రభుత్వ రంగ సంస్థలు స్పోన్సర్ చేస్తాయి. మేజర్ ఫండ్ లు నేరుగా సాయపడతాయి. దీనికి ఉదాహరణంగా ఖాన్ అకాడమీ నడిచేది గేట్స్ ఫౌండేషన్, గూగుల్ ఇచ్చిన ఫండ్స్ తోనే. వికీపీడియా లో కూడా ఎక్కువ, తక్కువ తేడా లేకుండా ఫండ్స్ ఇవ్వడం పరిపాటిగా మారింది. దీనికి చాలా బ్రౌజర్ ఎక్స్ టెన్షన్లు, వర్డ్ ప్రెస్ దీన్నే ఫాలోఅవుతున్నాయి.

10. బిల్డ్ టు సెల్ ( Google, Facebook , ఇతర వెబ్ సైట్లకు)

ఇది కౌంటర్ ఇనిషియేటివ్. ఇది బెస్ట్ రెవెన్యూ మొడలని చెప్పలేం. ప్రధానంగా ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవు. చాలా కంపెనీలు ట్రాక్షన్ ను బిల్డ్ చేసినప్పటికీ దానితో ఎలా సొమ్ముచేసుకోవడమో తెలియడం లేదు. బాగా బిల్డ్ చేసుకొని ఏదో ఒక మంచి రోజు చూసి అమ్మేయడమే. ఆరోజు కోసం ఎదురు చూడాల్సిన ఉంటుంది. ఆరోజు వస్తే మంచిది రాకపోతే అలా ఎదురు చూపులు తప్పవు. దీనికి ఉదాహరణగా ఇన్‌స్టాగ్రామ్, ప్రింటరెస్ట్

పెయిడ్ యాప్ డౌన్ లోడ్స్ – ఉదా. వాట్సాప్, 

ఇన్ యాప్ పర్చేసస్ – ఉదా. కాండీక్రష్ సాగా, టెంపుల్ రన్, 

ఇన్ యాప్ సబ్ స్క్రిప్షన్ – ఉదా. న్యూయార్క్ టైమ్స్ యాప్, 

అడ్వర్టైజింగ్ – ఉదా. ఫ్లుర్రీ, 

ట్రాంజాక్షన్స్ – ఉదా. ఎయిర్ టెల్ మనీ, 

సబ్‌స్క్రిప్షన్ – ఉదా. వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్, 

ప్రీమియమ్ – ఉదా. ఎక్స్ బాక్స్ గేమ్స్, 

డౌన్ లోడ్ కంటెంట్ – ఉదా. కాల్ ఆఫ్ డ్యూటీ దీనిలో ప్రధానమైనవి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags