21 ఏళ్లకే స్టార్టప్ పెట్టాడు.. వ్యాపారంలో ఇరగదీస్తున్నాడు..

21 ఏళ్లకే స్టార్టప్ పెట్టాడు.. వ్యాపారంలో ఇరగదీస్తున్నాడు..

Thursday March 24, 2016,

3 min Read


బాగా చదువుకున్న తర్వాతే స్టార్టప్స్ పెట్టాలి… ఐఐటీ, ఐఐఎంల్లో చదవుకునో, పాశ్చాత్య దేశాల్లోని టాప్ యూనివర్సిటీ డిగ్రీ ఉంటే తప్ప సొంతంగా ఏం చేయలేం. ఇదీ సగటు భారతీయుడి ఆలోచన. అయితే దీనికి భిన్నంగా వెళ్లాడు ఆదిత్య విక్రమ్. సొంత వ్యాపారం ప్రారంభించాలన్న లక్ష్యంగా అసలు కాలేజ్ మెట్లు ఎక్కకుండానే మిస్టరీ మాంక్స్ స్టార్టప్ పెట్టాడు. వీడియోలు లేదా ఫొటోలు ఇస్తే చాలు… వాటిని ఎడిట్ చేసి అందంగా తీర్చిదిద్దుతాడు. గ్రాఫిక్స్ తో సినిమా చూపిస్తాడు. 2014లో 18 ఏళ్ల వయసున్నప్పుడు ఢిల్లీలో మిస్టరీ మాంక్స్ స్టార్టప్ స్థాపించాడు. ఇప్పుడు ఆదిత్య విక్రమ్ కు 20 ఏళ్లొచ్చాయి. సొంతంగా యాప్స్ రూపొందించడం నేర్చుకున్నాడు. యాప్ కోసం ఎవరైనా ఆర్డర్ ఇస్తే చాలు అనుకున్న సమయానికి తయారుచేసి ఇచ్చేస్తాడు.

ఆదిత్య విక్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిచేశాక ఏడాదిపాటు పనీపాటా లేకుడా తిరిగాడు. కాకపోతే ఏది నేర్చుకోవాలనుకున్నాడో అది దొరకలేదు. ఐట్యూన్స్ యూ పేరుతో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఆన్ లైన్ కోర్స్ చేశాడు. యాప్ డెవలప్ మెంట్ లో ఫ్రీలాన్సర్ గా పనిచేశాడు. దాంతో కొంత సంపాదించాడు. కాలేజీకి వెళ్లకుండానే స్టార్టప్ పెడతానని తల్లిదండ్రులను ఒప్పించాడు. మొదట్లో వాళ్లు ససేమిరా అన్నారు. కానీ తర్వాత అతని పట్టుదల చూసి ఓకే చెప్పారు. ఉద్యోగాలు చేయడానికి డిగ్రీలు లేకపోయినా ఫర్వాలేదు.. బతకగలనన్న ధైర్యం ఉంటే చాలు అనేది ఆదిత్య ప్రిన్సిపుల్.

వీడియో డెవలప్ మెంట్

యాప్స్ తయారీకి డిమాండ్ తగ్గినప్పుడు ఐ మూవీ సాయంతో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు ఆదిత్య. కస్టమర్లను పట్టుకోవడం కొంచెం కష్టమైన పనే. వీడియో ఎడిటింగ్ కు మంచి డిమాండ్ ఉంది. కస్టమర్లు ఒక్కొక్కరి డిమాండ్ ఒక్కోలా ఉంటుంది. ఫ్రీలాన్సర్స్, స్క్రిప్ట్ రైటర్స్, వాయిస్ ఆర్టిస్టులు, గ్రాఫిక్ డిజైనర్లు ఇలా … తమ డిమాండ్లను చెబుతారు. ఇదంతా పెద్ద ప్రహసనమంటున్నారు ఆదిత్య.

కస్టమర్లకు వన్ స్టాప్ సొల్యూషన్ ను అందివ్వాలని నిర్ణయించాడు ఆదిత్య. స్నేహితుడు కార్తీక్ జత కలిశాడు. 2014లో స్టార్టప్ పెట్టాక కార్తీక్ వచ్చి చేరాడు. ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. వీడియో టేకింగ్, ఎడిటింగ్ ఇలా అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి సేవలందిస్తున్నారు. వీరికి కొంతమంది ఫ్రీలాన్స్ ఫ్రొఫెషనల్స్ కూడా దొరికారు. వీడియో ఎడిటర్లు, యానిమేటర్లు, క్రియేటివ్ రైటర్స్, వాయిస్ ఆర్టిస్టులు, గ్రాఫిక్స్ డిజైనర్లు ఇలా చాలామంది … మిస్టరీ మాంక్స్ లో పనిచేస్తున్నారు. మా మిస్టరీ మాంక్స్ వెబ్ సైట్లో రిజిస్టరై … సామాన్యులు కూడా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు.

డీకోడింగ్ ద మిస్టరీ

ఫ్రొఫెషనల్స్, కస్టమర్లు మిస్టరీ మాంక్స్ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదో మంచి వేదికగా ఉపయోగపడుతోంది. కమర్షియల్ , నాన్ కమర్షియల్, షార్ట్ ఫిలిమ్స్ కు వీడియో ఎడిటింగ్ చేసిస్తారు. మిస్టరీ మాంక్స్ లో ఫ్రొపెషనల్ గా మారాలంటే ముందుగా రిజిస్టరై… కొన్ని టెస్టులు పాసవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిశాక… ఫ్రీలాన్సర్ గా పనిచేయవచ్చు. కస్టమర్ ఆర్డర్ ఇవ్వగానే… దాన్ని సంబంధిత ప్రొఫెషనల్ కు అందిస్తారు. వర్క్ పూర్తయిన తర్వాత వచ్చిన దానిలో 30 శాతం కమిషన్ తీసుకుంటుంది మిస్టరీ మాంక్స్.

పెర్ఫెక్ట్ టీం

2015 ఫిబ్రవరిలో మిస్టరీ మాంక్స్ లో ఒక శ్రేయోభిలాషి పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు మిస్టరీ మాంక్స్ లో 39 మంది ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. ఈ స్టార్టప్ లో ఏడుగురు డిజైనర్లు, కోడర్స్ ఉన్నారు. మార్కెటింగ్ ప్రొఫెషనల్ గౌరవ్ ఆర్యా… ఈ కంపెనీ సీటీఓగా బాధ్యతలు చేపట్టారు. ఆదిత్యకు ఎంతలేదన్నా నెలకు 3 వేల నుంచి 5 వేల డాలర్ల ఆదాయం వస్తోంది.

image


మిస్టరీ మాంక్స్ అమెరికా సహా పలు దేశాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలోని వీడియో బ్రూవరీ, ఫివర్ లాంటి సంస్థలతో సంబంధాలు పెట్టుకుని విస్తరిస్తామని ఆదిత్య అంటున్నాడు. కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని… తప్పులు దిద్దుకుని ముందుకెళ్లడమే తమ విజయ రహస్యమని చెబుతున్నాడు. మన సేవలతో కస్టమర్ సంతృప్తి చెందితే … మన గురించి పదిమందికి చెప్తారని… అదే అడ్వర్టైజ్ మెంట్ అవుతుందని అంటున్నాడు ఆదిత్య. అప్పుడు ప్రత్యేకంగా యాడ్స్ పై ఖర్చు చేయాల్సిన అవసరం లేదనేది అతని ఉద్దేశం.

కాలేజీ ముఖం చూడకపోతేనేం… ఆదిత్య ఎదుగుదలకు తిరుగులేదు. పట్టుదల, తపనే అతనిని వ్యాపారవేత్తగా నిలబెట్టాయి. 20 ఏళ్లుకూడా నిండకుండానే విదేశాలకు తన స్టార్టప్ ను విస్తరించాలనుకుంటున్నాడు. దటీజ్ ఆదిత్య అంటున్నాడు.