సంకలనాలు
Telugu

మురికి బట్టలను మల్లెపువ్వుల్లా మార్చి ఇంటికి తెచ్చి ఇచ్చే ''మైవాష్''

ఆన్ డిమాండ్ సేవల రంగంలోకి మరో స్టార్టప్బెంగళూరు కేంద్రంగా బిట్స్ పిలానీ మాజీ విద్యార్థుల కంపెనీ సిటీలో లాండ్రీ సర్వీసుకు మైవాష్‌తో పరిష్కారంఏడాది చివరికల్లా ప్రధాన మెట్రో నగరాలకు వ్యాప్తి

ashok patnaik
18th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

దేశ వ్యాప్తంగా నగర జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. వారి తీర్చడానికి ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా తక్కువే అవుతోంది. దీంతో ఎప్పటికప్పుడు కొత్తకొత్త సౌకర్యాలు ఇంటి తలుపులు తడుతునే ఉంటున్నాయి. జీవితం మరింత సౌకర్యవంతంగా మారిపోతోంది. క్షణం కూడా తీరిక లేని జీవనవిధానంలో దేన్నైనా ఫోన్ నుంచే చేయాల్సిన పరిస్థితి. మొబైల్ యాప్‌తోనే ఏదైనా చేయడానికే ఇష్టపడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ జనరేషన్‌ని సౌకర్యవంతమైన జనరేషన్‌గా పోల్చవచ్చు. ఆన్ డిమాండ్ సేవలను డబ్బులు ఇవ్వడానికి ఈతరం అసలు వెనకాడటం లేదు. టైం సేవ్ చేయడమే ఇక్కడ ముఖ్యం. దీంతో ఆన్ డిమాండ్ సర్వీసులు దేశం మొత్తం మీద పుట్టుకొస్తున్నాయి. గూడ్స్ డెలివరి, సర్వీస్ ఆన్ డిమాండ్ అనేది భవిష్యత్తులో గొప్ప వ్యాపారవకాశాలున్న రంగాలుగా చెప్పొచ్చు. నెట్ ఫిక్స్‌లో వీడియో ఆన్ డిమాండ్ మనకి తెలిసిన విషయమే. క్యాబ్స్ ఆన్ డిమాండ్ (ఉబర్,ఓలా), ఇంటికి కావల్సిన సరుకులు ఆన్ డిమాండ్ (బిగ్ బాస్కెట్). మరి మన బట్టలకు ఆన్ డిమాండ్ లాండ్రీ సంగతేంటి? అంటే సమాధానం మై వాష్.

image


బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఆన్ డిమాండ్ లాండ్రీ కోరమంగళ లో సర్వీసు అందిస్తోంది. ఈ స్టార్టప్ డెలివరీ కోసం బాయ్స్‌ని పంపించి బట్టలను తీసుకుంటారు. రెండురోజుల్లో వాటిని ఉతికి పంపిస్తారు. కస్టమర్లకు ఇది చాలా సౌకర్యమంతమైన లాండ్రీ సర్వీసు. ప్రారంభించిన నెలరోజుల్లోనే మూడు వందలకు పైగా ఆర్డర్లను పూర్తి చేసింది మై వాష్ డాట్ ఇన్.

డెలివరీకి సిద్ధమైన బ్యాగ్స్

డెలివరీకి సిద్ధమైన బ్యాగ్స్


లాండ్రీ సర్వీసనేది ఎంతో మార్కెట్లో చక్కని అనుకూలత ఉన్న వ్యాపారం. మీరు మీ వీధి చివరున్న దోభీకి బట్టలు ఇవ్వడం లేదు. ఎందుకంటే తాను సరిగ్గా చేయడనే అభిప్రాయం మీలోఉంటుంది. మైవాష్ కస్టమర్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటి వరకైతే ఉతికి, ఇస్త్రీ చేసే కుర్రాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో కచ్చితంగా ఉంటుంది. అది తప్పకుండా చేస్తామంటున్నారు ఫౌండర్లు. ప్రస్తుతానికి స్టార్టప్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. శిలస్ రెడ్డి మార్కెటింగ్ వ్యవహారాలు, రఘు ప్రాడక్ట్, టెక్‌కు సంబంధించి, బాలాజీ అశోక్ కుమార్ డిజైన్ గురించి చూసుకుంటున్నారు. శిలస్, రఘులు బిట్స్ పిలానీలో చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహితులు. యంగ్ ఇండియా ఫెలోషిప్ కోసం బాలాజీ ఢిల్లీ వెళ్లారు. ముగ్గురు కలసి వ్యాపారం చేయాలని అనుకున్నది అక్కడే. అలా మొదలైన స్టార్టప్ సత్ఫలితాలను ఇస్తోంది. ప్రస్తుతానికి బెంగళూరుకే పరిమితమైన తమ సేవలను రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు వ్యాపించాలని చూస్తున్నట్లు శిలస్,బాలాజీ,రఘు చెబుతున్నారు.

రఘు భరత్, బాలాజీ అశోక్, సిలస్ రెడ్డి - మైవాష్ ఫౌండర్స్

రఘు భరత్, బాలాజీ అశోక్, సిలస్ రెడ్డి - మైవాష్ ఫౌండర్స్


యూజర్ బేస్‌ని పెంచుకోవడమే ముందున్న సవాలంటున్నా... క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదనేది వారి అభిప్రాయం. తాను బిట్స్ పిలానీలో చదువుకునే రోజుల్లో దోభీ వారానికి ఒక రోజు వచ్చేవాడని శిలస్ గుర్తు చేసుకున్నారు. ''కాలేజి తర్వాత లాండ్రీ కోసం పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావట. మురికి బట్టలు పట్టుకొని ట్రాఫిక్ జామ్‌లో కూడా లాండ్రీ షాప్‌లకు వెళ్లిన రోజులున్నాయట. కానీ ఈ రోజు మీకు ఇల్లు కావాలంటే చాలా సులభంగా దొరుకుతుంది. కిరణా కావాలంటే ఆర్డర్ ఇస్తే ఇంటికే వస్తుంది. దీంతో లాండ్రీ సర్వీసు లేకపోవడం ఏంటని ప్రశ్నించుకుంటే నాకు కనిపించిన జవాబే మైవాష్. నేను,నా స్నేహితులతో కలసి దీనిపై పనిచేయడం ప్రారంభించాం. లాండ్రీ ఇండస్ట్రీ గురించి రీసెర్చ్ చేశాను. బట్టలను సరిగ్గా ఉతుకుతున్నది, లేనిదీ, చెప్పిన సమయానికే ఇస్తున్నారా లేదా అనే అంశాలను కంపల్సరి అనే విషయాన్ని గుర్తించా . క్వాలిటీ స్టాండర్డ్స్ ఫెయిల్ కావడాన్నిఓర్చలేం. నిర్వాహణ విషయంలో మంచి స్టాండర్డ్స్ పాటిస్తున్నాం. తప్పని సరి పరిస్థితుల్లో మైవాష్ డ్రైక్లీనింగ్ సర్వీసు కూడా చేయాల్సి వస్తుంది. వాష్ స్కెడ్యూల్ ఇచ్చిన తర్వాత మురికిబట్టలు తీసుకెళ్లడానికి మీ ఇంటి ముందు పికప్ చేసుకునే వ్యక్తి ఉంటాడు. ఒకటి రెండు రోజుల్లో తిరిగి బట్టలను రిటర్న్ చేస్తాడు. ధర కూడా చాలా ప్రధానమైనదే. ఒక బట్టకి 19రూపాయిలను మైవాష్ టీం వసూలు చేస్తోంది. ఒకే ఆర్డర్ లో 200కంటే ఎక్కువ సర్వీసు ఇచ్చినట్లైతే.. 100రూపాయిల తగ్గింపును ఇస్తోంది. యాజర్లను పెంచుకోడానికి ఇది మార్కెట్ వ్యూహంగా ఎంతగానో పనికొస్తోంది''.

image


భవిష్యత్ లో ధరల గురించి వివరించిన శిలస్.. తాము పేపర్ యూజ్ మోడల్ పై పనిచేస్తున్నాం కనుక ఒక క్లాత్‌కు 19 రూపాయిలు చాలా తక్కువే. కానీ తాము ప్రారంభించిన తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలను సాధించామని గర్వంగా చెప్పుకొచ్చారు. జనం లాండ్రీ అవసరాలను ఔట్ సోర్సింగ్ ఇస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కెపిఎంజి నివేదిక ప్రకారం భారత్ లో వ్యవస్థీకరించబడిని లాండ్రీ మార్కెట్ 5వేల కోట్లు. కానీ అస్తవ్యస్తంగా ఉన్న మార్కెట్ 2లక్షల కోట్లు. బెంగళూరులో వర్కింగ్ పాపులేషన్ 65 లక్షల మంది. ప్రతిఒక్కరూ కనీసం నెలకు 500రూపాయిలు లాండ్రీ కోసం ఖర్చు చేస్తున్నారు. ఈరకంగా చూసినా బెంగళూరు సిటీ మార్కెటే హాఫ్ ఏ బిలియన్ డాలర్ గా తేలింది. కాలం మారిపోయింది. గతంలో ఆటోల్లో వెళ్లేవాళ్లం.. వాటి స్థానంలో ఇప్పుడు క్యాబ్‌లలో తిరుగుతున్నాం. పరిశ్రమలంటే పాతరోజుల్లో ఉన్నట్లు కర్మాగారాల్లా లేవు. లాండ్రీ సిస్టమ్ కూడా మార్పు రావాలి. ఇప్పటి వరకూ అయితే మైవాష్ బెంగళూరు మొత్తాన్ని కవర్ చేసింది. వారం వారం యాభైశాతం పెరుగుదలతో ముందుకు పోతోంది. ఇకపై లాండ్రీ పై మొబైల్‌లో స్టేటస్ తెలుసుకోనే సౌలభ్యం రానుంది. పేమెంట్ లు కూడా ఆన్ లైన్లోనే చేయడానికి జనం ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ సరికి దేశంలోని ఇతర మెట్రోలకు వ్యాపించడమే లక్ష్యంగా మైవాష్ పనిచేస్తోంది. వచ్చే రెండేళ్లలో దేశం మొత్తం వ్యాపించాలనే ఆశిస్తోంది.

ప్రస్తుతానికైతే టీం పెట్టుబడుల కోసం చూస్తోంది. బెంగళూరు మొత్తం వ్యాపించిన తర్వాత ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్ విషయంలో కొద్దిగా మెరుగుపర్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. మరి లాండ్రీ సర్వీస్ వర్కవుట్ కాదంటారా ? మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి !

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags