సంకలనాలు
Telugu

స్టార్టప్ ప్రపంచంలో ఇదీ మహిళల సత్తా..!!

GOPAL
7th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆకాశంలో సగం.. అవకాశంలో సగం.. మహిళల గురించి చెప్పే మాట ఇది. అయితే సగం కాదు మొత్తం మేమే వున్నామని నిరూపిస్తున్నారు మహిళలు. స్టార్టప్ ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో మగువలే సత్తా చాటుతున్నారు.

స్టారప్స్, మేక్ ఇన్ ఇండియా, ఆంట్ర‌ప్రెన్యూర్‌షిప్‌, ఈ ఏడాది బాగా వినిపించిన పదాలు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆంట్ర‌ప్రెన్యూర్లను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. మహిళల ఆర్థిక స్వాలంభన కోసం మోదీ ప్రభుత్వం 200 కోట్ల రూపాయాల బడ్జెట్ ను కేటాయించడం స్వాగతించదగిన పరిణామం.

image


ఇలాంటి ప్రోత్సాహాల కారణంగా రానున్న రోజుల్లో మరింత మంది మహిళలు ఆంట్ర‌ప్రెన్యూర్లుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది మహిళలు టెక్నాలజిస్టులుగా, లీడర్లుగా సత్తా చాటుతూ రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు. ఇతర మహిళలు కూడా వారిని ఆదర్శంగా తీసుకొంటున్నారు.

ఆదితి అవాస్థి. 

ఎంబిబే సంస్థకు సీఈఓ కం వ్యవస్థాపకురాలు. ముంబైకి చెందిన ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ స్టార్టప్‌లో కలారి క్యాపిటల్, లైట్ బాక్స్ వెంచర్స్ పెట్టుబడులు పెట్టాయి. టెక్నాలజీ, డాటా సైన్స్ కంబైన్డ్‌గా విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఈ సంస్థ హెల్ఫ్‌ చేస్తున్నది. ఐఐటీ జేఈఈ విద్యార్థులకు 2012 ఏప్రిల్ నుంచి శిక్షణ ఇస్తున్న మార్ఫెస్ గ్యాంగ్ కంపెనీ 100 మార్క్స్‌ను ఎంబిబే ఇటీవలే కొనుగోలు చేసింది.

అదితి చౌరాసియా.

డిజైనింగ్ నుంచి మెయింటెనెన్స్ వరకు ఎండ్ టు ఎండ్ ఐటీ సర్వీసులు అందించే ఇంజినీర్ బాబు సంస్థకు కో ఫౌండర్. ఇండోర్‌కు చెందిన ఈ సంస్థ యాండ్రాయిడ్, ఐఓఎస్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైనింగ్, డెవలప్‌మెంట్ సర్వీసులు కూడా అందిస్తున్నది. ఈ సంస్థను అదితి 2014లోనే ప్రారంభించినప్పటికీ వివాహం, ఇతర ఒత్తిళ్ల కారణంగా ఉద్యోగం నుంచి కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.

అదితి గుప్తా. 

మెన్స్‌ట్రూపీడియా వ్యవస్థాపకులు. మహిళల రుతుస్రావానికి సంబంధించిన సమాజంలో ఉన్న కట్టుబాట్లపై పోరాటం చేసేందుకు ఏకంగా ఓ సంస్థనే నెలకొల్పారు. రుతుస్రావ సమయంలో బాలికలు, మహిళలు తీసుకోవాల్సిన చర్యల గురించి కావాల్సిన సమాచారాన్ని ఈ సంస్థ అందిస్తుంది. ఈ సంస్థను 2012లో ప్రారంభించారు.

అజైతా షా.

ఫ్రాంటియర్ మార్కెట్స్ పేరుతో ప్రారంభమైన సంస్థకు ఆమె సీఈవో. రాజస్థాన్‌కు చెందిన ఈ సంస్థ బేస్ ఆఫ్ పిరమిడ్స్ (బీఓపీ) పేరుతో పేదలకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లను అత్యంత నాణ్యతతో, అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు. ఈ రంగంలో ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అజైత షా వినూత్న విధానాలను అవలంభించారు. టుఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాల్లో బీఏ పూర్తి చేసిన అజైతా షా సౌర విద్యుత్‌ను పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.

అమ్నా అబ్బాసి. 

కొత్తవి, ఉపయోగించని దుస్తులను విక్రయించే ఎటాషీ ఆన్‌లైన్ పోర్టల్ వ్యవస్థాపకురాలు కమ్ సీఈవో. ఈ సంస్థను అమ్నా 2014 నవంబర్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సంస్థలో ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఐదు కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. నోయిడా, ఢిల్లీ కేంద్రాలుగా పనిచేసే ఈ సంస్థలో 18 మంది ఉద్యోగులున్నారు.

అనిషా సింగ్.

గ్రూప్ సెట్టింగ్‌లో కస్టమర్లకు డీల్స్‌ను కుదిర్చే మైడాలాకు కో ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. 2009లో ప్రారంభమైన ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. అనిషాకు ఇది రెండో స్టార్టప్ కంపెనీ. అమెరికా సంస్థలకు డిజిటల్ కంటెంట్స్‌ను అందించే ఓ సంస్థను అమెరికాలో ఆమె గతంలోనే ప్రారంభించారు.

అంకితా టాండన్. 

డిస్కౌంట్ ప్రపంచంలో దుమ్మురేపుతున్న కూపన్ ధునియాకు కో ఫౌండర్. ఈ సంస్థ కన్జూమర్స్‌ను రిటెయిలర్లను కలుపుతున్నది. ఈ సంస్థ 2012లో ప్రారంభమైంది.

అను ఆచార్య

మ్యాప్ మై జీనోమ్ సంస్థ ఫౌండర్ కమ్ సీఈఓ. 2000 సంవత్సరంలో ఆంట్ర‌ప్రెన్యూరియల్ ప్రయాణాన్ని ప్రారంభించిన అనూ టెక్నాలజీ ద్వారా మరింత మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో మ్యూప్ మై జీనోమ్ సంస్థను 2011లో ప్రారంభించారు. జనెటిక్ రిపోర్ట్, హెల్త్ హిస్టరీల మేళవింపుతో జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలన్నదే ఆమె లక్ష్యం. 2015 ఆరంభంలో ఈ సంస్థలో ఓ యాంజెల్ ఇన్వెస్టర్ 1.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.

అనూ శ్రీధరన్.

గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన నీటిని అందించేందుకు కృషిచేస్తున్న నెక్స్ట్‌డ్రాప్ సోషల్ ఎంటర్‌ప్రైజ్‌కు సీఈవో. 2011లో ప్రారంభమైన ఈ సంస్థ మొదటగా కర్ణాటకలోని హుబ్లీ-ధార్వాడ్ ప్రాంతంలోని జంట నగరాల్లో స్వచ్ఛమైన నీటిని అందించేందుకు కృషి చేస్తున్నది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని, బెర్కెలే యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని ఆమె పొందారు.

అనుపమ పాంచల్

గ్రిడ్లే డాట్ ఐఓ సంస్థ వ్యవస్థాపకురాలు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ 2011 లో ప్రారంభమైంది. క్లౌడ్ బేస్డ్ ప్రాడక్టివిటీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుందీ కంపెనీ. మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్ వినియోగంలో ఉన్న సంక్లిష్టతను తొలిగించి టాస్క్ మేనేజ్‌మెంట్‌ను సులభతరం చేస్తుంది ఈ సంస్థ.

అర్పితా గణేశ్.

ఇండియన్ బ్రా క్వీన్‌గా గుర్తింపు పొందిన అర్పిత గణేష్ 2008లో బట్టర్ కప్స్ సంస్థను ప్రారంభించారు. కస్టమర్లకు నప్పే, అనువైన సైజ్‌లలో లింగరీలను అందించే ఆన్‌లైన్ సంస్థ బట్టర్ కప్స్‌లో కన్వల్జిత్ సింగ్, యాంజీ మహంతేతోపాటు మరికొందరు పెట్టుబడులు పెట్టారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ క్రౌడ్ ఫండెడ్‌గా ఉండేది. ఈ సంస్థకు పెద్ద సంఖ్యలో కస్టమర్లున్నారు.

అరుణా ష్వార్జ్. 

స్టీలే టెక్నాలజీస్ సంస్థ ఫౌండర్ కమ్ సీఈవో. బహుళ కేటగిరీల్లో ఈ సంస్థ ఆటోమేటెడ్ కన్వర్జేషన్ సొల్యూషన్స్‌ను అందించే సాఫ్ట్‌వేర్ వెండర్ ఇది. చెన్నైకి చెందిన ఈ సంస్థ 2002లో ప్రారంభమైంది.

అశ్వినీ అశోకన్. 

ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్, కంప్యూటర్ విజన్‌ను ప్లంగ్ అండ్ ప్లే విధానంలో అందిస్తున్న మ్యాడ్ స్ట్రీట్ డెన్ సంస్థ కో ఫౌండర్ . అమెరికాలోని శాన్ జోస్, చెన్నైలలో కార్యాలయాలున్న ఈ సంస్థలో రిజర్వాయర్ ఇన్వెస్ట్‌మెంట్, ఎక్స్‌ఫినిటీ ఫండ్, గ్రో ఎక్స్ సంస్థలు ఒకటిన్నర మిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టాయి.

చిత్ర గుర్నాని డాగా.

2009లో తన భర్త అభిషేక్ దాగాతో కలిసి థ్రిలోఫిలియా సంస్థను ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ అడ్వెంచర్ ట్రావల్‌ కంపెనీ. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో ఎంబీఏ పూర్తి చేసిన చిత్ర థ్రిలోఫిలియా కో-ఫౌండర్ కమ్ సీఈవో. ఈ సంస్థను ప్రారంభించకముందు ఎస్ఏపీలో వర్క్ చేశారామె. 2013లో ఈ సంస్థలో హైదరాబాద్‌కు చెందిన ఐ ల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్, నోవ్లాక్ వెంచర్స్, సీఐఐ (ఐఐఎంఏ) పెట్టుబడులు పెట్టాయి.

image


దేవ్ దత్త ఉపాధ్యాయ. 

టైమ్స్ అయ్యర్జ్ సంస్థ కో ఫౌండర్ కమ్ సీఈవో. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ స్థానికంగా ఉండే సర్వీస్ ప్రొవైడర్ల వివరాలను ఒక్క బటన్‌తో అందిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల సర్వీసులకు కేంద్రమిది. గత ఏడాది ఆగస్టులో యూనిలజెర్ వెంచర్స్‌కు చెందిన రొన్ని స్క్రీవ్యాల రెండున్నర మిలియన్ల సిరీస్ ఏ ఫండింగ్ పెట్టారు.

ఫల్గుణి నాయర్.

ఆన్‌లైన్ బ్యూటీ రిటైలర్ నాయకా సంస్థ వ్యవస్థాపకురాలు. బ్యూటీ అండ్ వెల్‌నెస్ ప్రాడక్ట్స్ ఈ సంస్థ ఆన్‌లైన్‌లో అందిస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఫల్గుని ఈ సంస్థను 2012లో ప్రారంభించారు. ఈ సంస్థలో దాదాపుగా తొమ్మిదిన్నర మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు ఇండియన్ ఇన్వెస్టర్లు.

గరిమా సతిజా.

పోష్ వైన్ వ్యవస్థాపకురాలు. కలినరీ తరగతులు, ట్రావెల్, ట్రెక్స్ వర్క్‌షాప్స్ వంటి వినూత్న అనుభవాలను కస్టమర్లకు అందిస్తున్నదీ సంస్థ. పోష్ వైన్‌ను ప్రారంభించకముందు గరిమా నౌకరీ.కామ్, ఓజోన్ మీడియాలలో పనిచేశారు.

గౌరీ జయరామ్. 

అంతర్జాతీయ అడ్వెంచర్ టూర్ సంస్థ యాక్టీవ్ హాలీడే కంపెనీ వ్యవస్థాపకురాలు. హాలీడేస్‌లో సాహస యాత్రలు చేసే పర్యాటకులకు గైడ్‌గా వ్యవహరిస్తున్నదీ సంస్థ. గౌరీ జయరామ్‌కు ఇది రెండో స్టార్టప్. యాక్టీవ్ హాలీడేను 2013లో ప్రారంభించారామె.

హేమలతా అన్నామలై.

గత 15 ఏళ్లుగా వివిధ రకాల సంస్థలను ఆమె ప్రారంభిస్తున్నారు. 5 కోట్ల రూపాయల సీడ్ మనీతో 2007లో ఆమె ఓ సంస్థను ప్రారంభించారువివిధ రకాల, తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని కేటగిరీ ప్రజలకు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆమె తన సేవలను అందిస్తున్నారు.

కనికా జైన్.

క్రౌడ్ సోర్సింగ్ ప్లాట్౨ఫామ్ స్క్వాడ్ రన్ సంస్థ కో ఫౌండర్. ఈ సంస్థ స్మార్ట్ ఫోన్స్‌కు ఎనేబుల్డ్ వర్క్ ఫోర్స్‌ను అందిస్తున్నది. యువర్‌స్టోరీ మొబైల్ స్పార్స్క్‌లలో ఒకటైన ఈ సంస్థకు అమిత్ రంజన్ (స్లైడ్ షేర్స్,) దీపిందర్ గోయల్ (జమాటో), జైషన్ హయత్ (టాపర్), గిరీష్ ఖేరా (సైంటిఫిక్ యానిమేషన్స్) వంటి పెట్టుబడిదారుల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయి.

కనికా టేక్రివాల్.

జెట్ సెట్ గో ఫౌండర్. ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్, ఎయిర్ అంబులెన్స్‌లకు ఈ సంస్థ మార్కెట్ ప్లేస్. కనిక క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించారు. ఈ సంస్థలో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ యువీ కెన్ వెంచర్స్ సంస్థ పెట్టుబడులు పెట్టింది.

కవితా జైన్

వాగ్ మాబ్ సంస్థ కో ఫౌండర్ . ఇండోర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ 2010లో ప్రారంభమైంది, విద్యా రంగంలో వినియోగదారులకు అవసరమైన యాప్‌లను రూపొందించింది. యువర్‌స్టోరీ టెక్ స్పార్క్ అయిన వ్యాగ్ మాబ్ ఇప్పటివరకు 400కు పైగా యాప్‌లను రూపొందించింది.

లీసా ఎస్ రావు.

ఐ బ్రాండ్స్ బేవరేజెస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ ఆల్కాహాల్ తయారీ సంస్థ 2010లో ప్రారంభమైంది. అంతర్జాతీయస్థాయి నాణ్యత, బ్లెండ్, డిజైన్, లుక్, ఫీల్ కలిగేలా ఆల్కాహాల్‌ను అందించాలన్నదే ఈ సంస్థ లక్ష్యం.

లివా వర్గీస్, హర్ష థాకరే.

మసాలా బాక్స్ వ్యవస్థాపకులు. ఇంటి భోజనాన్ని కస్టమర్లకు అందించాలన్న ఉద్దేశంతో మసాలా బాక్స్‌ను ప్రారంభించారు. 2014లో బెంగళూరులో ప్రారంభమైన ఈ సంస్థ సేవలు ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో కూడా లభిస్తున్నాయి. మంచి స్నేహితులైన లివా, హర్ష అభిరుచులు కూడా ఒకటే కావడంతో మసాల బాక్స్‌ను ప్రారంభించారు.

image


మాలిని అగర్వాల్.

మిస్ మాలిని పేరిట 2008లో ప్రారంభమైన బ్లాగ్ సూపర్ హిట్టయింది. బాలీవుడ్, ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ న్యూస్ అండ్ ఎనాలసిస్‌ను బ్లాగ్‌లో అందించారు. యువ, నూతన, గ్లోబల్ ఇండియన్స్ వాయిస్‌గా బ్లాగ్‌లలోనే కొత్త ఒరవడి సృష్టించారు.

మనిషా రైసింగాని.

లాగినెక్స్ట్ సొల్యూషన్స్ సంస్థ ఓనర్. మరొకరితో కలిసి 2014లో ప్రారంభమైన ఈ సంస్థలో అలిబాబాకు చెందిన పేటీఎం 10 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ పెట్టుబడులు పెట్టింది.

మీనా గణేశ్.

ఆరోగ్య రంగంలో పొర్టీయా హోం ఫోకస్స్‌డ్ సార్టప్‌ను భర్తతో కలిసి 2013లో ప్రారంభించారు. ప్రముఖ ఇన్వెస్టర్ యాక్సెల్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్ సీ), వరల్డ్ బ్యాంగ్ గ్రూప్ మెంబర్ క్వాల్ కామ్ వెంచర్స్ అండ్ వెంచర్ ఈస్ట్ సంస్థలు గత ఏడాదిలో 37.5 మిలియన్ డాలర్ల సిరీస్ బీ ఫండ్స్‌ను ఇన్వెస్ట్ చేశాయి.

నియ్యా సాగి.

పిల్లలకు సంబంధించిన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించే బేబీ చక్ర సంస్థ కోఫౌండర్ నియ్యా సాగి. మాతృత్వాన్ని ఆడుకున్నంత సులువు చేసేందుకు ఈ సంస్థ తల్లిదండ్రులకు ఎంతో సాయపడుతున్నది. 2014లో ప్రారంభమైన ముంబైకి చెందిన ఈ సంస్థలో ముంబై యాంజిల్స్, పత్ని ఫ్యామిలీ ఆఫీస్, సింగపూర్ ఏంజెల్ నెట్ వర్క్ సంస్థలు 6 లక్షల డాలర్ల ఫండ్స్‌ను ఇన్వెస్ట్ చేశాయి.

నీరూ శర్మ

అహ్మదాబాద్‌కు చెందిన ఈ-కామర్స్ సంస్థ ఇన్ఫీబీమ్ కో ఫౌండర్ నీరూ శర్మ. 450 కోట్ల రూపాయల నిధులు సమీకరించేందుకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లకు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రొస్పెక్టస్ (డీఆర్ హెచ్ పీ) ఇష్యూ చేసింది. ఏదైనా సంస్థ పబ్లిక్ ఇష్యూకు వెళ్లేముందు డీఆర్‌హెచ్‌పీ ఇష్యూ చెయ్యాల్సి ఉంటుంది.

నీతూ భాటియా.

క్యాజోంగా కోఫౌండర్ కమ్ సీఈఓ. 2007లో ప్రారంభమైన ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ టికెటింగ్ వ్యవహారాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. గతంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేసిన నీతూ ప్రస్తుతం ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. అమెరికాలోని మస్సాచూట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్‌లలో నీతూ ఎంఎస్ పూర్తి చేశారు.

నేహా మెహానీ.

లోకల్ స్టోర్స్‌లలో ఇన్ స్టోర్ రేడియో సర్వీసులను అందించే మోజిక్ సంస్థ కో ఫౌండర్ నేహా మెహానీ. ప్లేలిస్టులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే సదుపాయాన్ని ఈ సంస్థ కల్పిస్తున్నది. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ 50 వేల డాలర్ల నిధులను సమకూర్చుకుంది. 2013లోనే 25 లక్షల రూపాయలను సంపాదించగలిగింది. రవి గురురాజ్, రాజన్ ఆనందన్, పంకజ్ జైన్, రమేశ్ షా వంటి పెట్టుబడిదారులు ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు.

నేహా మోత్వానీ

ఫిట్నెస్ డిస్కవరీ, హెల్త్ ఈ సొల్యూషన్స్ ప్లాట్‌ఫామ్ సంస్థ ఫిట్టర్నిటీ సంస్థ ఫౌండర్ నేహా మోత్వానీ. గత ఏడాది జులైలో ఈ సంస్థ మిలియన్ డాలర్ల సిరీస్ – ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ను దక్కించుకుంది. బెంగళూరుకు చెందిన ఎక్స్‌ఫినిటీ వెంచర్ పార్ట్‌నర్స్, టీవీ మోహన్ దాస్ పాయ్, బాలకృష్ణన్ వీ, గిరీశ్ పరాంజపే, దీపక్ ఘాయసిస్‌వంటి ఇన్వెస్టర్లను ఆకర్షించగిలిగిందీ సంస్థ.

నిధి అగర్వాల్.

మహిళలు ధరించే దుస్తులను ప్రత్యేకంగా ఆన్‌లైన్ విక్రయిస్తున్న సంస్థ కార్యాన్ సీఈఓ కమ్ ఫౌండర్. 2014లో ప్రారంభమైన ఈ సంస్థలో టీవీ మోహన్ దాస్ పాయ్, సాహా ఫండ్ పెట్టుబడులు పెట్టాయి. రతన్ టాటా కూడా ఈ సంస్థలో పర్సనల్ ఇన్వెస్ట్ చేశారు.

నిమ్మి చెరియన్.

2014లో ప్రారంభమైన డెయిలీ రౌండ్స్ సంస్థ కో ఫౌండర్. మొబైల్ యాప్ ద్వారా డాక్టర్లకు అకాడమిక్ నెట్ వర్క్‌ను అందిస్తున్నది. గత ఏడాది ఆరంభంలో కే క్యాపిటల్, టెరూహైడ్, సాటో, జీఎస్ఎఫ్ వంటి సంస్థల నుంచి ఐదు లక్షల డాలర్లను సమీకరించగలిగింది.

పంఖూరి శ్రీవాస్తవ.

గ్రాబ్‌హౌజ్ కోఫౌండర్ కమ్ సీఎంఓ. ఆన్‌లైన్‌లో రియల్ ఎస్టేట్ వ్యవహారాలను కస్టమర్లకు అందించే ఈ సంస్థ 2013లో ప్రారంభమైంది. కలారి క్యాపిటల్, సీక్వియా క్యాపిటల్ నుంచి 2.5 మిలియన్ డాలర్ల ఫండ్స్‌ను ఈ సంస్థ సమీకరించింది. అంతకుముందు ఇండియా కోషియంట్ 5 లక్షల డాలర్లను ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసింది.

ప్రాంశు భండారి.

క్లచర్ అలే సంస్థ కో ఫౌండర్ ప్రాంశు భండారి. వెబ్ ఆధారిత లాంగ్వేజ్ లర్న్ ప్లాట్‌ఫామ్ ఈ సంస్థ 2012లో ప్రారంభమైంది. ముంబైకి చెందిన ఎన్‌ఎంఐఎంఎస్ నుంచి ప్రాంశు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

image


ప్రీతా సుఖ్తాంకర్.

లేబల్ కార్ప్ ఫౌండర్. గతంలో లేబల్ లైఫ్‌గా ఉన్న సంస్థ ప్రస్తుతం లేబల్ కార్ప్‌గా మారింది. సెలబ్రిటీలు ఎక్కువగా కొనుగోలు చేసే ప్రాడక్టలను ఆన్‌లైన్ లో రీటైల్‌గా అందిస్తున్నది ఈ సంస్థ. 2013లో కలారి క్యాపిటల్ ఈ సంస్థలో ఒక మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది.

ప్రుకల్ప శంకర్.

సోషల్ కాప్స్ సంస్థ కో ఫౌండర్. టెక్నాలజీ డాటా కంపెనీ అయిన ఈ సంస్థలో రాజన్ ఆనందన్ (గూగుల్ ఇండియా ఎండీ), మనోజ్ మీనన్ (ఫ్రోస్ట్ అండ్ సులివాన్ ఏపీఏసీ ఎండీ) 320000 డాలర్లను ఇన్వెస్ట్ చేశారు.

పూజా వారియర్.

అన్ లిమిటెడ్ ఇండియా కో ఫౌండర్ పూజా వారియర్. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు లాంచ్ ప్యాడ్ అయిన ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఈ సంస్థను 2007లో ప్రారంభించారు.

ప్రియాంకా గిల్, నమ్రత బోస్ట్రూమ్.

పాప్ క్సో ఫౌండర్లు. యువతుల అభిప్రాయాలు పంచుకునేందుకు కమ్యునిటీ, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతున్న ఈ సంస్థలో ఐడీజీ వెంచర్స్ ఇండియా, కలారీ క్యాపిటల్ రెండు మిలియన్ డాలర్లను సిరీస్ ఏ పెట్టుబడులు పెట్టాయి. అలాగే 2014 నవంబర్ లో సంస్థ ఫౌండర్లిద్దరూ రాజన్ ఆనందన్, కారట్ లేన్స్ మిథున్ సాన్ చెట్టి (చెన్నై ఏంజెల్స్)‌తోపాటు మరికొందరి నుంచి 3 కోట్ల రూపాయలను పెట్టబడిగా సమీకరించారు.

ప్రియా మహేశ్వరి.

ప్రాపర్జీ సంస్థ కో ఫౌండర్ ప్రియా మహేశ్వరి. రియల్ ఎస్టేట్ రీసెర్చ్ ఎనాలటిక్స్ స్టార్టప్ ప్రాపర్జీ బెంగళూరు కేంద్రంగా 2013లో ప్రారంభమైంది.

ప్రీతి షా.

పేనియర్ సొల్యూషన్స్ కో ఫౌండర్ కమ్ సీఈఓ. మర్చంట్ సెంట్రిక్ సొల్యూషన్స్ నుంచి ఎయిడ్ స్టోర్ మేనేజ్‌మెంట్ అవసరాల వరకు అన్ని సేవలు అందించే ఈ సంస్థ పేమెంట్ యాక్సప్టెన్స్ సేవలనూ అందిస్తున్నది. ఇటీవలే ఈ సంస్థ 2.5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ను సమీకరించింది. పది మిలియన్ల నిధులు సమీకరించాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. 2013లో ప్రారంభమైన ఈ సంస్థలో సీరియల్ ఇన్వెస్టర్ నిధులను ఇన్వెస్ట్ చేశారు.

ప్రీతీ సావంత్.

జొలెస్టో వాట్స్ ఫౌండర్ ప్రీతి సావంత్. టాలెంట్ కొలాబరేషన్ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు పొందిన ఈ సంస్థను 2015లో ప్రారంభించారు. మహిళలచే, మహిళల కోసం నడుపబడుతున్న సాహా ఫండ్స్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశాయి.

ప్రియాంకా అగర్వాల్, అన్షులికా దూబే.

విష్ బెర్రి క్రౌడ్ ఫండింగ్ వెబ్ సైట్ వ్యవస్థాపకులు. భారత్ కేంద్రంగా 2012లో ఈ సంస్థ ప్రారంభమైంది. రాజన్ ఆనందన్, శరద్ శర్మ, శంకర్ మహదేవన్ వంటి ఇన్వెస్టర్ల నుంచి 650000 డాలర్లను సమీకరించింది.

పల్లవి గుప్తా.

మస్త్ కలందర్ రెస్టారెంట్ కో ఫౌండర్ పల్లవి గుప్తా. పల్లవి, ఆమె భర్త గౌరవ్ జైన్ రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు తమ ఐటీ ఉద్యోగాలకు 2006లో రాజీనామా చేశారు. కొన్నేళ్లలోనే రెస్టారెంట్ పాపులారిటీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం పలు నగరాల్లో వీరి వ్యాపారం విస్తరించింది. బెంగళూరులో ఎక్కువ సంఖ్యలో ఔట్ లెట్స్ ఉన్న రెస్టారెంట్ మస్త్ కలందర్.

ప్రమద్ జంధ్యాల.

డాటా ఎనాలటిక్స్, డాటా మేనేజ్‌మెంట్ ఫర్మ్ లాటెన్ వ్యూ సంస్థ కో ఫౌండర్. 2006లో ప్రారంభమైన ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది.

రాధికా ఘయ్ అగర్వాల్.

షాప్‌క్లూస్ కో ఫౌండర్ కమ్ సీఎంఓ. ఆన్‌లైన్‌లో అమ్మకందారులను, కొనుగోలుదారులను ఒకతాటిపైకి తెస్తున్న మార్కెట్ ప్లేస్ షాప్‌క్లూస్. 2011లో ప్రారంభమైన ఈ సంస్థలో వంద మిలియన్ డాలర్ల సిరీస్ డీ పెట్టుబడులను సమీకరించింది. అమెరికాకు చెందిన క్లూస్ నెట్‌వర్క్ ఇంక్ సంస్థ ఇండియన్ సబ్సీడరీ సంస్థ ఇది. గుర్గావ్ కేంద్రంగా నడుస్తున్నది.

రష్మీ డాగా

ఫ్రెష్ మెనూ సీఈఓ కమ్ ఫౌండర్ రష్మీ దగా.. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 2014లో ప్రారంభమైంది. కృష్ణణ్ గణేశ్, మీనా గణేశ్ వంటి సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పెట్టుబడులు పెట్టారు.

రిచా కర్.

ఆన్‌లైన్ లింగరీ రిటైలర్ జివామే సంస్థ కో ఫౌండర్ కమ్ సీఈవో. ఈ సంస్థ 2011లో ప్రారంభమైంది. జొడియస్ టెక్నాలజీ ఫండ్, ఖాజనా నాసినల్ బెర్హాడ్ 250 కోట్ల రూపాయలను ఈ సంస్థలో పెట్టుబడి పెట్టాయి. యునిలజెర్ సంస్థ 6 మిలియన్ డాలర్లను సిరీస్ బీ పెట్టుబడులుగా పెట్టింది.

రేణు బిస్త్, ప్రగ్యా ఉపాధ్యాయ్. 

ఢిల్లీకి చెందిన బ్యూటీ కంపెనీ వానిటీ క్యూబ్ ఫౌండర్లు. ఇంటికే వద్దకు వెళ్లి తమ సేవలను అందిస్తున్న ఈ సంస్థ 2014లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఎంత పెట్టుబడులను వీరు సమీకరించారో వివరించడం లేదు.

రష్మీ మెండా

మహిళల కొనుగోళ్లు, అమ్మకాలు, సొంత ఫ్యాషన్ కోసం ఏర్పాటైన ఆన్‌లైన్ పోర్టల్ జాప్‌యేల్. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ 2015లో ప్రారంభమైంది. ఈ సంస్థ ఫౌండర్ కమ్ సీఈఓ రష్మీ మెండా.

రిచా సింగ్

ప్రజల ఎలాంటి భావోద్వేగాలపైనైనా సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పడిన సంస్థ యువర్ దోస్త్. ఈ సంస్థను ప్రారంభించింది రిచా సింగ్. వెబ్ ఆధారితంగా ఎలాంటి సమస్యలకైనా నిపుణులతో పరిష్కారాన్ని చూపిస్తున్నది ఈ సంస్థ. మార్కెటింగ్ ఖర్చులు, విస్తరణ కోసం 2015లో రెండున్నర కోట్ల నిధులను సమీకరించింది.

రితికా ధ్యావాలా, నిర్మలా కున్వర్.

ఐఓటీ కంపెనీ బాసిల్ సిస్టమ్స్ కో ఫౌండర్లు. వైఫై కెనక్టెడ్ స్మార్ట్ స్విచ్ బోర్డ్ క్లోవర్ బోర్డ్ యూజర్లకు అనుకూలంగా ఉండటంతోపాటు విద్యుత్‌ను ఆదా చేస్తుంది. అలాగే మంచి భద్రత అందిస్తుంది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 2014లో ప్రారంభమైంది.

సుచీ ముఖర్జీ.

ఆన్‌లైన్ సోషల్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ లైమ్ రోడ్ ఫౌండర్ కమ్ సీఈఓ. 30 మిలియన్ల సీ ఫండ్ నిధులను సమీకరించినట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది. టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, లైట్ స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్, మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి.

సైరీ చాహల్.

షీరోజ్ సంస్థ ఫౌండర్. మహిళలకు ఉద్యోగాలు, కెరీర్ ను అందిస్తున్న కమ్యునిటీ ఇది. 2014లో ప్రారంభమైన ఈ సంస్థ 2015 ఆగస్టులో ఐదు కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. రాఘవ బెహల్, రితూ కపూర్‌కు చెందిన క్విటిలియన్ మీడియా, 500 స్టార్టప్స్, విజయ్ శేఖర్ శర్మ, రాజన్ ఆనందన్, బిన్నీ బన్సాల్, మేకిన్ మహేశ్వరీ, గిరీశ్ మాత్రూభూతమ్, ఇండస్ ఖైతాన్, కృష్ణన్ మెహ్వా వంటి మరికొందరు కూడా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు.

image


స్వాతి భార్గవ.

గుర్గావ్‌కు కేంద్రంగా నడుస్తున్న క్యాష్ బ్యాక్, కూపన్ ఆధారిత ప్లాట్‌ఫామ్ క్యాష్ ఖరో సంస్థ కో ఫౌండర్. కలారీ క్యాపిటల్ సంస్థ 25 కోట్ల రూపాయల సిరీస్ ఏ ఫండింగ్ పెట్టింది.

శుచి పాండ్యా.

పిపా + బెల్లా సంస్థ ఫౌండర్. ఈ సంస్థ ఇటీవలే ఆరున్నర లక్షల డాలర్ల నిధులను సమీకరించింది. సింగపూర్‌కు చెందిన లయన్ రాక్ క్యాపిటల్, రాజేశ్ సావానీ, టెరూ హైడ్ సాటో, రూపానాథ్ తదితరులు ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. జీఎస్ ఎఫ్ ఫౌండర్ రాజేశ్ సావానీ, ఫ్రీ కల్టర్. కామ్ మాజీ సీఈఓ సుజాల్ షా ఈ సంస్థ సలహాదారులు. మహిళలకు మెచ్చే ఫ్యాషన్ జ్యుయలరీ కలక్షన్స్‌ను సరసమైన ధరలకే ఈ పోర్టల్ అందిస్తున్నది.

శ్రీ కులకర్ణి.

రిటైల్ కామర్స్ సేవలు అందిస్తున్న మొట్టమొదటి మొబైల్ ప్లాట్‌ఫామ్ బిజామ్ కో ఫౌండర్. క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్, బిజామ్ 2012లో ప్రారంభమైంది. మొబిసీ టెక్నాలజీ ప్రయివేట్ లిమిటెడ్ ఫ్లాగ్‌షిప్ కింద ఏర్పాటైన ఈ సంస్థలో ఓజాస్ వెంచర్ పార్ట్‌నర్స్ 2013లో రెండున్నర లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టారు.

సబీనా చోప్రా.

ఆన్‌లైన్ ట్రావెల్ సెర్చ్ ఇంజిన్ యాత్రా సంస్థ కో ఫౌండర్. విమాన టికెట్లు, హోటల్స్, హాలీడే ప్యాకేజ్‌లను అందిస్తున్న ఈ సంస్థ 2006లో ప్రారంభమైంది.

సాక్షి తుల్సియన్.

క్లౌడ్ బేస్డ్ రెస్టారెంట్ పొసిస్ట్ కో ఫౌండర్. రెస్టారెంట్స్‌లో టేబుల్ రిజర్వ్స్, టేబుల్ ఆర్డర్స్, డెలివరీస్, ఎక్స్‌పెన్సెస్, రెసిప్స్‌ వంటి వాటికి సొల్యూషన్స్ అందిస్తున్నది.

శుభ్ర చద్దా.

క్లోతింగ్ యాక్ససరీస్, హోమ్ డెకార్స్‌ను అందిస్తున్న చుమ్ బక్ సంస్థ కో ఫౌండర్ శుభ్ర. ఈ సంస్థను 2009లో ప్రారంభించారు.

శాలిని నౌటియల్.

యప్పీదో సంస్థ కో ఫౌండర్. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నగరంలో జరుగుతున్న కార్యక్రమాలు, క్లబ్ బిజినెస్ వంటి వివరాలను అందిస్తున్నదీ సంస్థ. యపీదో సంస్థను గత ఏడాది అక్టోబర్‌లో గిఫ్ట్ జోజో సొంతం చేసుకుంది.

శాంతీ మోహన్.

ఆన్ లైన్ డీల్ వ్యవహారాలు పర్యవేక్షించే లెట్స్ వెంచర్ సంస్థ ఫౌండర్. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 2013లో ఏర్పాటైంది.

సుభి దేవ్రా.

మేరా కెరీర్ గైడ్ ఫౌండర్. కెరీర్‌కు సంబంధించి విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఇన్‌స్టంట్‌గా నిపుణులతో ఆన్సర్లు అందిస్తున్న సంస్థ మేరా కెరీర్ గైడ్. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ 2008లో ప్రారంభమైంది.

సురుచి వా.

టాలెంట్ అసెస్‌మెంట్, అనలటిక్స్ ఫర్మ్ జామ్ బే ఫౌండర్ కమ్ సీపీఓ. ఈ సంస్థ 2011లో ప్రారంభమైంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags