సంకలనాలు
Telugu

సోషల్ సైట్లందు ఈ స్మార్ట్ సైట్ వేరయా !

సోషల్ సైట్లలో వినూత్న పంథాటాపిక్ బేస్డ్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఓ వేదికప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫోనంతా ఒక చోట తెలుసుకోవచ్చుకాలేజ్ డ్రాపౌట్స్ మొదలుపెట్టిన స్మార్టికన్‌కు ఇప్పుడు మంచి ఆదరణఇది అన్నిలాంటి సోషల్ సైట్ కానేకాదని ప్రచారం చేయడమే లక్ష్యం

seshu madiraju
27th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ప్రపంచం ఒక సోషల్ హబ్‌గా మారుతున్న తరుణంలో ట్వీట్స్, పోస్ట్స్, అప్‌డేట్స్ మరియు సేల్ఫీస్ శిఖరాగ్రానికి చేరతాయి అని మా అంచనా. సోషల్ మీడియాలో పాల్గొనటం, ఉపయోగించటం, తదితరమైన వాటికి నూతన ప్రక్రియల వాడకం ఈ రోజుల్లో కనపడుతున్న నూతన పంధా. టాపిక్ ఆధారంగా నెట్వర్కింగ్‌తో సోషల్ మీడియా యొక్క ట్రాఫిక్‌ను మరలించే ముఖ్య ఉద్దేశంతో Smartican అనే సోషల్ మీడియా సైట్‌ని మోషన్ పంచ్ స్టూడియోకి చెందిన ఆస్తా అల్మాస్ట్, చరక్ అల్మాస్ట్, అభిషేక్ పూరి మరియు మణి దేవ్‌గ్యవాలి రూపొందించారు.

స్మార్ట్ ఫోన్ గేమ్స్‌ని రూపొందించాలి అనే ఆలోచనతో మోషన్ పంచ్ స్టూడియోస్ అనే ఒక యాజమాన్య సంస్థను 2012 లో వీళ్ళంతా స్థాపించాము. ఆ తరువాత ఒక సంవత్సరంలోపు మా కంపెనీని ప్రైవేటు లిమిటెడ్ గా మార్చాలి అని ఒక ఆలోచనకు వచ్చాం అని చెప్పారు ఆ సంస్థ కో ఫౌండర్ మరియు సి.ఎం.ఓ ఆస్తా అల్మాస్ట్.
అభిషేక్ పూరి, చరక్ ఆల్మాస్ట్,ఆస్తా ఆల్మాస్ట్,మణిదేవ్ గ్యవాలి

అభిషేక్ పూరి, చరక్ ఆల్మాస్ట్,ఆస్తా ఆల్మాస్ట్,మణిదేవ్ గ్యవాలి


చరక్ అల్మాస్ట్ మరియు మణిదేవ్ యు.ఎస్‌లోని యూనివర్సిటీ అఫ్ లూసియానాలో గేమ్ డెవలప్మెంట్ మీద డిగ్రీ చేస్తున్న రోజుల్లో మోషన్ పంచ్ స్టూడియో స్థాపించారు. సెకండ్ ఇయర్‌లో కాలేజీ ప్రాజెక్ట్ కోసం వారు రూపొందించిన గేమ్‌ని ఆ కాలేజీ డీన్ చూసి బాగా ఆకర్షితుడై యాప్ స్టోర్స్‌లో దాన్ని పెట్టవలసిందిగా సలహా ఇచ్చారు

నేను IIM Calcutta నుండి డిగ్రీ పట్టా పొందాను. ఒక కొత్త సంస్థ కోసం పనిచేయాలి అనే ఉత్సాహం తో ఉన్నాను. వారు సహాయం అడిగినప్పుడు నేను ఉద్వేగం పొందాను. అలా మేము మా మొదటి గేమ్ యాంగ్రీ బేబీ రూపొందించాం. ఆ తరువాత వెంటనే రెండో గేమ్‌ని కూడా రూపొందించాం. మూడవది Smartican. అది కూడా కాలేజీ కోర్స్‌లో ఒక భాగం. అనుకోకుండా మేము రూపొందించిన సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ పేరుకూడా Smartican అయ్యింది అని చెప్పారు ఆస్తా.

ఇండియా లో ఇప్పుడున్న సోషల్ నెట్వర్కింగ్ వ్యవస్థల్లో చాలా సమస్యలు ఉన్నట్టు మేము గుర్తించాం. సాధారణంగా ఆ సైట్స్ వివిధ అంశాలని ఎక్కువ సభ్యులకు కనపడనీయటం లేదు. అవి వారి మిత్రులకు, మిత్రుల మిత్రులకు మాత్రమే కనపడేటట్టు నిరోధించారు. దీని వలన ఒక వృత్తిపరమైన విషయమై శోధించాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి. సైట్స్ ఉన్నా వాటి సమాచారం పంచుకోవడం పరిమితమైంది. ఇప్పుడున్న నెట్వర్క్ మిమ్మలని నిజమైన ప్రపంచానికి అనుసంధానిస్తుంది. ఏ ప్రత్యేకమైన కంటెంట్ కోసం అయితే వెతుకుతున్నారో ఆ కంటెంట్ వారికి చేరడం లేదు. ఈ పై అంశం మే మేము Smartican అనే సోషల్ మీడియా పోర్టల్‌ని స్థాపించటానికి దారి చూపించింది అని వివరించారు ఆస్తా.

కావాల్సిన వారికి కంటెంట్‌ను సులభంగా అందుబాటులో ఉండేలా చేయటమే smartican యొక్క ముఖ్య ఉద్దేశం. కంటెంట్ ఒక క్రమ పద్దతిలో వుంటే వినియోగదారుడు దానికోసం వెతకాల్సిన పని వుండదు. అది సరైన వినియోగాదారుడిని చేరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వుండేటటువంటి అపారమైన విషయాలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. అని సభ్యులు వివరిస్తారు.


ఆస్తా ఆల్మాస్ట్, స్మార్టికన్ సహ వ్యవస్థాపకులు

ఆస్తా ఆల్మాస్ట్, స్మార్టికన్ సహ వ్యవస్థాపకులు


ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ సంస్థ స్థాపకుల్లో నలుగురిలో ముగ్గురు కళాశాల విద్యనూ మధ్యలో ఆపివేసిన వాళ్ళు. చరక్ మరియు మణిదేవ్ తోటి విద్యార్థులకన్నా ఎంతో ముందుగా గేమింగ్ టెక్నాలజీ లో మంచి భవిష్యత్ ఉంది అని గ్రహించారు. ఇందుకోసం వారి యూనివర్సిటీ విద్యనూ మధ్యలోనే విడిచిపెట్టారు. అభిషేక్ తన లా కోర్స్‌ని మధ్యలో ఆపేసి మాతో కలిసాడు. ఇక నా విషయానికి వస్తే నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్‌ని. మేము అందరం Smartican లో సభ్యులం కావటానికి కారణం మాకు దాని పై వున్న అపారమైన మక్కువ మరియు ఇది ఒక పెద్ద సంస్థగా రూపాంతరం చెందుతుంది అని మాకు వున్న గాఢ విశ్వాసమనేది వీళ్ల నమ్మకం.

జనవరి 2013 లో Smartican ఏర్పాటైనా లాంచింగ్ మాత్రం నవంబర్ 2013 లో జరిగింది. ప్రోడక్ట్‌ని అభివృద్ధి చేయటానికి మరియు పూర్తి చేయటానికి టీం కొంత సమయాన్ని తీసుకుంది. మొట్ట మొదట జరిగిన చర్చలో అత్యధిక సంఖ్య లో పాల్గొన్న ప్రేక్షక సమూహంలో విద్యార్ధి వర్గం వారు ఎదుర్కుంటున్న ఇబ్బంది గురించి చర్చ జరిపారు. ఈ చర్చల తరువాత Smartican వివిధ రకాల అంశాలతో సమకూరిన ఒక సంపూర్ణ పోర్టల్ గా అవతరించింది. అందులో ఎవరైనా సభ్యులు కావొచ్చు. ఒకే రకమైన ఆలోచనా విధానం కలిగినవున్నవారిని కలవచ్చు మరియు చర్చలు జరపవచ్చు.

అజ్ఞాతంగా ఉంటూ నిస్సంకోచంగా వారి మనసులోని భావాలని వ్యక్తపరిచే సౌకర్యం కలిగిన సైట్ ఉండాలి అని మా అభిప్రాయం” అని చెప్పారు ఆస్తా. వారు ఎదురుకున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఆస్తా ఇలా అన్నారు. 

ఈ వినుత్నమైన ప్రక్రియ రూపొందిస్తున్న ఆరంభ దశలో మాకు భాగస్వాములను పొందటం కొంత కష్టమైంది. ఇప్పుడు మేమ ఎదురుకుంటున్న సవాల్ వేరు. మేము రూపొందించిన సోషల్ నెట్వర్కింగ్ మార్గం లోకి ప్రజలను మరలించటం మరియు వారి చేత తేడా గమనింప చేయటం మేము ఎదుర్కుంటున్న ప్రస్తుత సవాల్.

చరక్ స్పేస్ అభివృద్ధి మరియు విస్తరణలు గురించి మాట్లాడుతూ . ప్రతి రోజు ప్రతి పోర్టల్ తనదైన ప్రత్యేకతలు జోడిస్తూ తన పరిధిని విస్తరిస్తుంది. స్పేస్ ప్రతి నిమిషం అభివృద్ధి చెందుతోంది . కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా ఇమేజేస్, వీడియోస్, కాల్స్, చాటింగ్ మొదలైన ఎన్నో విషయాలకు విస్తరించింది. మేము కంటెంట్ మరియు ఇన్ఫర్మేషన్‌ని రెండిటిని సంపూర్ణంగా అందరికి సులభంగా అందుబాటులో తీసుకొని రావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు చరక్ చెబ్తున్నారు. చరక్ ఇక్కడ స్పేస్ డెవలప్‌మెంట్, ఎక్స్‌పాన్షన్ వ్యవహారాలు చూసుకుంటాడు. ఒక వర్చ్యువల్ వరల్డ్ ని రూపొందించే ప్రయత్నం లో వున్నాం. ఇది కేవలం వ్యక్తిగత వివరాలు మరియు వ్యక్తిగత ఇమేజెస్‌ని మాత్రం పంచుకునేది కాదని తెలియజేయడమే ఇప్పుడు మా కర్తవ్యం.

చాల సంస్థలకు సరైన వ్యక్తులను వెతకటం కష్టంగా వున్న తరుణంలో smartican కి అసలు ఇబ్బందే కలుగ లేదు. వృత్తి పై శ్రద్ధగా, ఉత్సాహంగా మరియు ఇన్నోవేటివ్‌గా వుంటూ ఎంతో ప్యాషనేట్‌గా వుంటే జాబ్స్ చేయటానికి సరైన వ్యక్తులు దొరుకుతారు అని నేర్చుకున్నాం.

ఇక కంపెనీ వృద్ధి గురుంచి మాట్లాడితే ''మేము January 2014 లో Mtv Roadies తో ఒప్పందం చేసుకున్నాం . ఆ ఒప్పందం ప్రజలను వారికి ఇష్టమైన roadie participants తో ఒక ఫాంటసీ గేమ్ ఆడుకునేట్టు చేసింది. ఎంతో ఉత్సాహంగా ఆ గేమ్ ఆడుతూ roadies ఫాన్స్ వరల్డ్ స్కోర్ బోర్డు లో ఒకరిని ఒకరు challenge చేసుకుంటున్నారు. Smartican కేవలం కంటెంట్ ఉత్పత్తి చేయటానికి మాత్రమే కాదు. సోషల్ గేమ్స్, వీడియో షేరింగ్ , చాటింగ్ వంటి వాటికి కూడా, వీడియో చాటింగ్ ను కూడా ప్రారంభించాలి అని అనుకుంటోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags