సంకలనాలు
Telugu

తండ్రిలేని విషాదం నుంచి కోలుకుని విజయతీరాలకు

Sri
24th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఫ్యాషన్ ఇండస్ట్రీలో సత్తాచాటిన వాణీ భాటియా.

కుటుంబ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించిన మహిళ.

ఫ్యాషన్ మార్కెట్లో కొత్త బ్రాండ్స్‌కు శ్రీకారం.

పదిహేడేళ్ల వయస్సులో ఎవరి జీవితమైనా ఎలా ఉంటుంది ? ఉడుకు రక్తం... ఉరకలెత్తించే యవ్వనం... కొత్త ఆశలు... కొత్త ఆశయాలు... కొత్త స్నేహితులు... కొత్త జల్సాలు.... కాలేజ్ క్యాంపస్‌లో కవ్వింతలు, తుళ్లింతలు. రోజులన్నీ హ్యాపీగా కాలేజీలో గడిచిపోతుంటాయి. కానీ వాణీ భాటియా జీవితంలో ఇవేవీ లేవు. 17 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయింది. ఒక్కసారిగా కుప్పకూలినట్టైపోయింది. ఆ తర్వాత వాణి ఏం చేసిందో చదివితే ఎంతో మంది మహిళలకు


జీవితం విసిరిన సవాల్

వాణీ భాటియా... Gritstones.com వ్యవస్థాపకురాలు. ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ పోర్టల్ ఇది. ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో పోరాటం ఉంది. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాణి భాటియా... ఢిల్లీలోనే తన చదువులన్నీ పూర్తి చేసుకున్నారు. అక్కడే స్థిరపడ్డారు. పదిహేడేళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోవడంతో జీవితమంతా తారుమారైంది. చిన్నవయస్సులోనే తండ్రిని కోల్పోవడంపై ఎంతో బాధపడుతుంటారు వాణీ. కానీ వాణీ ఆ క్షణాలను సవాలుగా తీసుకుంది. గుండెనిబ్బరం చేసుకుని కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తన తమ్ముడితో కలిసి కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించారు. వ్యాపారంలో ఏమాత్రం అనుభవం లేని తల్లికి వెన్నుదన్నుగా నిలిచారు. మొదట్లో భయపడ్డా... కొద్ది రోజుల్లోనే తన తల్లి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించారు వాణి.

వాణి భాటియా, గ్రిట్ స్టోన్స్ వ్యవస్థాపకురాలు

వాణి భాటియా, గ్రిట్ స్టోన్స్ వ్యవస్థాపకురాలు


"ఆ రోజులన్నీ వారికి ఎన్నో పాఠాలను నేర్పించాయి. ప్రపంచంలో ఎవరేంటో తెలిసొచ్చింది. ఏ ఆధారం లేనివారిని సమాజం ఎలా చూస్తుందో అర్థమైంది. ఎవరు ఎలాంటి వాళ్లో అంచనా వేయగలిగాం. మనం సంక్షోభ సమయంలో నేర్చుకున్నంతగా, బాగా బతికిన రోజుల్లో నేర్చుకోలేం. నిజంగా అది మాకు పరీక్షా కాలం. అప్పుడే నేను చాలా నేర్చుకున్నాను" అంటారు వాణీ.

బుడిబుడి అడుగులతో ప్రయాణం

ఫ్యాషన్ లో పీజీ సంపాదించిన అనుభవం, మోస్ట్ క్రియేటివ్ డిజైనర్‌గా ఉన్న పేరుతో సొంతగా వెంచర్ ప్రారంభించాలనుకుంది వాణీ. పొదుపు చేసిన డబ్బులతో వెంచర్ ప్రారంభించేందుకు నిర్ణయించింది. "మా అమ్మ నా ఎంబీఏ కోసం డబ్బులు దాచిపెట్టింది. కానీ నేను నా కాళ్ల మీద నిలబడేందుకు ఆ డబ్బులతో సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా. మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత సరే అన్నది" అంటారు వాణి. మొదట్లో దేశీయ బ్రాండ్లకు పనిచేసిన వాణీకి... ఆ తర్వాత వీడియోకాన్ లాంటి కార్పొరేట్ ఆర్డర్లు వచ్చాయి. పెద్దపెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు రావడంతో వాణీ దశతిరిగింది. ఆ తర్వాత బిబా, గుడ్ ఎర్త్, యునైటెడ్ కలర్స్ లాంటి బ్రాండ్లకు పనిచేయడం మొదలుపెట్టారు. అలా 2011లో Gritstones ప్రారంభమైంది. ఈ-కామర్స్ బూమ్ తో ఆన్ లైన్ మార్కెట్ లో అడుగుపెట్టి ఈ బ్రాండ్ ను ఆన్ లైన్ లో లాంఛ్ చేశారు. బుడిబుడి అడుగులతో ప్రయాణం మొదలైంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆఫ్ లైన్ స్టోర్ ఒకటి ప్రారంభించారు.

ప్రస్తుతం వాణీ రెండు ఫ్యాషన్ బ్రాండ్స్ Gritstones, Vvoguish కి యజమాని. Gritstones ఎక్కువగా పురుషుల కోసం రూపొందించిన బ్రాండ్. Myntra, Jabong, Flipkart, Amazon లాంటి ఆన్ లైన్ సైట్లలో ఈ బ్రాండ్ దుస్తులు లభిస్తాయి. Vvoguish మాత్రం కేవలం స్త్రీల దుస్తులు అమ్మే వన్ స్టాప్ షాప్. Homeshop 18 లాంటి టీవీ ఛానెళ్లలో ప్రముఖమైన బ్రాండ్ ఇది. పురుషాధిక్యత గల వ్యాపార రంగంలో మహిళగా రాణించేందుకు ఎన్నో కష్టాలను దాటుకుంటూ వచ్చారు వాణీ. ఒత్తిళ్లను తట్టుకుంటూ నిలబడటమే కాదు... నిలకడగా ఉంటూ ఎప్పటికప్పుడు నిరూపించికోవడమూ ఈ రంగంలో అవసరమే. అందుకే సొంత వ్యాపారం మొదలుపెట్టడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం, వ్యాపారాన్ని నిర్వహించడం వాణీకి సవాల్ గా మారింది. ఆ సవాల్ ని ఎంతో ధైర్యంగా స్వీకరించి విజయం సాధించారు వాణీ.

image


తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు వాణీ. డెనిమ్స్, బ్లేజర్స్, సమ్మర్ కోట్స్ లాంటి వాటిని తన బ్రాండ్‌తో తయారుచేయాలనుకుంటున్నారు. ఫ్రాంచైజీలను విస్తరించడం, ఆఫ్‌లైన్ మోడల్ ప్రారంభించడం ఆమె ముందున్న లక్ష్యం. తన తల్లి గర్వపడేలా వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు వాణీ. తన తండ్రి ఆశయసాధన దిశగా సోదరుడు ధీరజ్ భాటియాను కంపెనీ డైరెక్టర్ గా నియమించారు. ఖాళీ సమయాల్లో తనకు ఇష్టమైన సినిమాలు చూడటం వాణికి చాలా ఇష్టం. తనకు మరో హాబీ కూడా ఉంది. ఇతరుల సమస్యలు పరిష్కరించడమంటే చాలా ఇష్టం. పరిస్థితిని విశ్లేషించడం, సమస్యకు మూలకారణాలు వెతకడం, పరిష్కారాన్ని కనుగొనడం ఎంతో ఇష్టం. ఎంతో క్రియేటివిటీ ఉన్న వాణీ... డిజైనింగ్ ఫీల్డ్ లో అడుగుపెట్టకపోయి ఉంటే సినిమాలు, సీరియల్స్ కి దర్శకత్వం వహిస్తూ ఉండేవారట.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags