ఈ సీరిస్‌లో.. శ్రమణ మిత్రా... తాను రాసిన విజన్ ఇండియా 2020 నుంచి కొన్ని చాఫ్టర్ల గురించి మనతో పంచుకుంటున్నారు. విజయవంతంగా కోట్ల డాలర్లు కుమ్మరించగల 45 ఆసక్తికరమైన స్టార్టప్ కంపెనీల ఆలోచనలను ఆమె రాసుకొచ్చారు. ఈ ఆర్టికల్స్ అన్నీ ఆమె వ్యాపార రంగంలో ఊహజనితంగా రాసినవే అయినా... మనం 2020లో ఉండి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పటికి దశాబ్ద కాలం కిందట ఇవన్నీ అద్భుతంగా రాణించినవే అయి ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ భవిష్యత్తులో కొత్త ఆలోచనలతో సొంతంగా కొత్త స్టార్టప్ లు విజయవంతం అయ్యేందుకు సహకరిస్తాయని భావిస్తున్నారు.
'' 2004లో నేను, నా భర్త డొమెనిక్ టెంపోట్ కలసి,.. K 12 విద్యావిధానాన్ని పరిశీలించే పనిలోఉన్నాం. ముఖ్యంగా లెక్కలు, సైన్స్ విభాగాల్లో దాన్ని పరిశీలిస్తున్నాం. ఈ రంగంలో మాకున్న ఆసక్తితో పాటు, అప్పటికి కొన్నాళ్లు అమెరికా విద్యా రంగంలో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో తగ్గుతూ వస్తున్న విద్యార్థుల స్థాయి కూడా మమ్మల్ని ఈ పరిశోధన వైపు పురిగొల్పింది.
స్టీవ్ జాబ్స్ నెక్ట్స్ కంప్యూటర్ తయారు చేసి, దాన్ని ఆపిల్‌కి అమ్ముకుని తన మాతృసంస్థలోకి చేరినంత వరకూ ఆయనకు డొమినిక్ కుడిభుజంలా ఉండేవాడు. అంతే కాదు ఆయన స్మార్ట్ కార్డ్‌లలో ప్రపంచ రారాజుగా ఉన్న జెమ్ ప్లస్ అనే సంస్థకు, ఆటోమేషన్ కస్టమర్ సర్వీస్‌లు అందించే కినిసా అనే నాలెడ్జ్ మేనేజ్ మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవోగా వ్యవహరించారు. ఇక విద్యారంగంలో అతనికున్న అనుభవం అన్నది... పెనిన్సులాలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డ్ లో ఐదేళ్ల పాటు భాగస్వామిగా ఉండటంతో వచ్చింది.
ఈ ప్రయత్నంలో భాగంగా, మేం స్థూలంగా మార్కెట్ రీసెర్చ్ చేశాం, దీనిలో నాణ్యమైన, నేరుగా దొరికే అత్యున్నత అభిప్రాయాల కోసం బే ఏరియాలో ఉన్న చాలా పాఠశాలలకు చెందిన వేలాది మంది ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఇంటర్వ్యూలు చేశాం. ఇందులో మేం ఎన్నో ప్రశ్నలు అడిగాం. అంటే క్లాస్‌లో విద్యార్థుల సంఖ్య, స్కిల్ గ్యాప్ అనాలసిస్, టీచింగ్ మెథడాలజీస్, మరియు సప్లిమెంటల్ ట్యుటోరింగ్ వంటి అంశాలను పరిశీలించాం. శాన్ఫ్రాన్సిస్కో గలేలియో హై స్కూల్లో పనిచేసే ఓ తెలివైన యువ మ్యాథ్స్ టీచర్ క్రిస్ కయోగీ అతని విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నారు.
నా విద్యార్థుల మధ్య ఉన్న నైపుణ్య బేధాల గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. కానీ నా తరగతిలో 180 మంది విద్యార్థులుంటారు. దీంతో నాకు వాళ్లు వీక్‌గా ఉన్న అంశాలు తెలిసినా.. దాని గురించి నేనేమీ చేసే పరిస్థితిలో ఉండను " అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూతో మాకు రెండు మౌలికమైన అంశాలు తెలిసి వచ్చాయి. అవి (1) అప్పటికి విద్యా విధానంలో ప్రమాణీకరించిన బోధనా పద్దతులు లేవని తేలింది. (2) ఇక వ్యక్తిగతంగా వారి నైపుణ్యాల మధ్య ఉన్న బేధాలను అంచనా వేసే విధానాలు కూడా లేవని తేలింది.
అలాంటి ప్రత్యేకమైన విధానం లేకపోవడం వల్ల.. విద్యార్థులు ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్లే కొద్దీ కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంటే ఏడో తరగతి ఆల్జీబ్రాలో ఒక విద్యార్థికి సీ గ్రేడ్ ఉంటే.. అతను ఎనిమిదో తరగతికి వెళ్లేసరికి అది కాస్తా డీ గ్రేడ్ కి పడిపోతుంది. తొమ్మిదో తరగతికి వెళ్లే సరికి అది ఎఫ్ గా మారుతుంది. అసలు మీకు భాగించడం అనేదే రాకపోతే... మీరు వర్గ సమీకరణాలను ఎలా పరిష్కరిస్తారు.?
లూసిడ్లో ఇలాంటి ప్రాథమిక ఆటంకాలెన్నో గుర్తించారు. అవన్నీ ఎంతో కాలం కిందట స్థానిక స్కూళ్లలో, వాటిలో విద్యార్థుల్లోనూ గుర్తించారు. వీటితో పాటు మరో కలవర పరిచే అంశం కూడా వాళ్ల ముందుకొచ్చింది. నిపుణులైన వారికి ఏటా సగటున 43 వేల డాలర్ల రూపాయల జీతం వచ్చే టీచింగ్ ఉద్యోగం, అంతకన్నా ఎన్నో రెట్లుఎక్కువగా వచ్చే మిగిలిన ఉద్యోగాల కన్నా పెద్దగా ఆకర్షించే అంశం కాదని 2002 నేషనల్ ఎడ్యుకేషన్ అసోషియేషన్ రీసెర్చ్ స్డడీ నివేదిక తేల్చి చెప్పింది. సైన్స్, మ్యాథ్స్ చెప్పే టీచర్లలో మూడో వంతు కన్నా తక్కువ మంది మాత్రమే దానికి సంబంధించిన విద్యానేపథ్యం కలిగి ఉంటున్నారు. ఇక అమెరికన్ స్కూళ్లన్నీ ఈ టీచర్లతోనే ఈ సబ్జెక్టుల్ని బోధించేలా చేయాలని చూస్తున్నాయి. అంతే కాదు..కేవలం ఆల్జీబ్రా లేదా అర్థిమెటిక్స్ తెలిసిన ప్రతి టీచర్ కూడా ఓ కొత్త అంశాన్ని కనిపెట్టేయాలన్న అత్యాశతో ఉంటారు.
భారతదేశంలో... పెద్ద సంఖ్యలో విద్యార్థులు సైన్స్ మరియు మ్యాథ్స్‌లలో అడ్వాన్స్డ్ డిగ్రీలు పొందుతున్నారు. అంటే ఇక్కడున్న విస్తారమైన ఈ నైపుణ్యం గల వారి బోధనా విజ్ఞాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీచర్లు, విద్యార్థులు వినియోగించుకునేలా చెయ్యాలనుకున్నాం.
ముందు అనుకున్నది ముందుగానే
కృత్రిమ మేధస్సు. ఇలా కృత్రిమ మేధస్సు నియమాల ఆధారంగా పనిచేసే రెండు సంస్థల్ని గుర్తించాను. కనిసాను డొమినిక్ నడిపిస్తున్నాడు. అది నాలెడ్జ్ ఆధారంగా పనిచేసే ఓ ప్రాథమికమైన ఆలోచన. అంటే నాలెడ్జ్ మేనేజ్మెంట్ కోసం వినియోగించే ఓ ప్రత్యేకమైన డేటా బేస్ అది. అది కంప్యూటర్ ఆధారిత సమాచారాన్ని సేకరించడం, వ్యవస్థీకృతం చేయడం, పునశ్చరణ చేయడం వంటివి చేస్తుంది. ఇలా కృత్రిమ మేధస్సు రంగంలో ఇంత లోతైన పరిజ్ఞానం ఉండటంతో మేం కూడా ఇలాంటి నాలెడ్జ్ బేస్ ఉన్న సమాచారాన్ని, బోధనా రంగం పద్ధతులతో సమ్మిళతం చేయాలని అనుకున్నాం. ఈ విధానం వ్యక్తిగత నైపుణ్య బేధాల విశ్లేషణలు చేస్తుంది. అంటే సాధారణ స్థాయి ఆల్జీబ్రా చదువుతున్న విద్యార్థిని లేదా విద్యార్థి తను కచ్చితంగా ఎక్కడ వెనుకబడి ఉన్నానన్న విషయాన్ని సులువుగా అవగతం చేసుకోవచ్చును. అంటే అది భిన్నాల(ఫ్రాక్షన్స్) దగ్గరే కావచ్చు. లేదా ఘాతాంకాల(ఎక్స్‌పోనెంట్స్) దగ్గర కూడా కావచ్చు. ఈ విషయ ఆధారిత సాఫ్ట్ వేర్ సమస్య మూలం ఎక్కడ ఉందనన్న విషయాన్ని కచ్చితంగా గుర్తిస్తుంది.
ఆ తర్వాత... మేం కనుగొన్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే... ఒక్కో విద్యార్థికి ఒక్కో విభిన్నమైన విధానాల్లో నేర్చుకుంటాడు. హార్వర్డ్‌కి చెందిన డెవలప్మెంట్ సైకాలజిస్ట్ హౌవార్డ్ గార్డెనర్ ప్రకారం.. మేం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సిద్ధాంతాన్ని చదివాం. ఇందులో కినెస్తటిక్, ఇంటర్ పర్సనల్, వెర్బల్ లింగ్విస్టిక్, లాజికల్ మ్యాధమాజికల్, నేచురలిస్టిక్, ఇంటర్ పర్సనల్, విజువల్ స్పాచియల్, మరియు మ్యూజికల్. మా అసైన్ మెంట్ సిస్టమ్ పిల్లలను వారు నేర్చుకునే విధానాన్ని వారి విద్యాస్థాయిని బట్టి కచ్చితంగా వర్గీకరిస్తుంది. ఒకసారి ఇలా విద్యార్థుల నైపుణ్యాల్లో లోపం ఎక్కడుందో గుర్తించిన తర్వాత... వారికి ఎలాంటి విధానంలో బోధించాలో కూడా గుర్తించి, ఆ విద్యా విధానాన్ని సూచిస్తారు.
ఉదాహరణకు ఒక విద్యార్థి చూడటం ద్వారా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటే... అతనికి భిన్నాలను దృశ్య మాధ్యమాల ద్వారా బోధిస్తారు. అదే మరో విద్యార్థికి సంగీతం ద్వారా నేర్చుకోవాలనుకుంటే అతనికి కూడా మ్యూజికల్ అనలాగ్స్ ద్వారా పాఠాలు బోధిస్తారు.
కానీ సంప్రదాయ పెట్టుబడిదారులు ఇలాంటి ఎడ్యుకేషనల్ మార్కెట్ మీద పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే దిగ్గజ సంస్థ అయిన జాన్ డీరీ ఈరంగంలో ప్రవేశించడానికి ప్రయత్నించి చాలా తక్కువగా సఫలమైంది. ఇలాగే ధైర్యం చేసి ఈ రంగంలోకి అడుగు పెట్టిన మరికొందరిని కూడా మార్కెట్.. నష్టాల పాలు చేసింది. అంతే కాదు... ఇందులో ఎదురయ్యే పెద్ద సమస్యలను ఎదుర్కొనేందుకు నిధులు లేక మరికొందరు వెనుకడుగేశారు. దీంతో విద్యా రంగంలో పెద్దగా ఆదాయం రాదన్న అభిప్రాయం స్థిరపడిపోయింది.
కానీ 2008లో ద వెబ్ 2.0 తరం వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితే మారిపోయింది. మేం హాట్ చాక్ అనే ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు ఎడ్వర్డ్ ఫీల్డ్ ను కలిశాం. ఇది కిండర్ గార్టెన్ నుంచి 12వ గ్రేడ్ వరకూ ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులను ఉచితంగా కనెక్ట్ చేసే ఓ ఆన్ లైన్ అప్లికేషన్. మిగిలిన ప్రయత్నాలు పెద్దగా రాణించకపోయినా.. హాట్ చాక్ మాత్రం అందుకు భిన్నంగా రాణించింది. ఈ విజయ రహస్యం ఏంటో తెలుసా... వీళ్లు కనీసం ఒక స్కూల్ అడ్మిషన్ కూడా అమ్మే ప్రయత్నం చెయ్యలేదు. వాళ్లు కేవలం దీని వినియోగదారులైన టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం మాత్రమే అందచేసేవారు. హాట్ చాక్ 2004 సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. 2008 కల్లా దానిలో సభ్యత్వం 3,75,00కి చేరింది. 188 దేశాల నుంచి ఏడులక్షల మందికి పైగా ఈ సైట్ ను సందర్శించేవారు. ఇది 72 వేల స్కూళ్లకు చేరువైంది. అంటే అమెరికాలో 93 శాతం స్కూళ్లన్నమాట.
ఈ ఘనచరిత్ర ఉన్న మేం... 2009లో ఎనిమిది మిలియన్ డాలర్ల ఎమర్జెన్సీ క్యాపిటల్ తో లూసిడ్ అనే వెంచర్ క్యాపిటల్ ను ఏర్పాటు చేశాం. ఇది పవర్ పాయింట్ ఫైన్సాన్సింగ్, అంటే ఎలాంటి ఆస్తులు కూడా కొనుగోలు చెయ్యలేదు. మూడేళ్ల కఠోర పరిశ్రమ, సుదీర్ఘ, సునిశిత పరిశోధనలతో మేం మ్యాథ్స్ బోధనలో అర్థమాటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగొనోమెట్రీ, కాలిక్యులస్ వంటి అన్ని అంశాల్లో 6.12 గ్రేడ్ సాధించాం. ఆ తర్వాత మేం ఇండియాలో ఉన్న డెవలప్మెంట్ సెంటర్ నుంచి ఈ గణిత బోధనా రంగానికి సంబంధించి లెక్కలేనంత సమాచారాన్ని అధీకృతంగా చేర్చాం. ఇందులో పూర్తి నిపుణత్వం కలిగిన ఉపాధ్యాయుల్ని, లోతైన అవగాహన ఉన్నవారిని చేర్చాం. ఇంతే సుదీర్ఘ, సునిశిత ప్రయత్నాలు సైన్స్ బోధనలోనూ కొనసాగించాం.
మార్కెట్లోకి వెళ్లడం పెద్ద ఛాలెంజ్
మా టార్గెట్ మార్కెట్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులే. 2008 నాటికి యునైటెడ్ స్టేట్స్ వ్యాప్తంగా లక్షా 40వేల పబ్లిక్, ప్రైవేట్ స్కూళ్లలో 32 లక్షల మంది టీచర్లు, ఐదున్నర కోట్ల మంది విద్యార్థులున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అయితే 2.9కోట్ల మంది టీచర్లు, 46.4 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇంగ్లీష్ మాట్లాడే ఇంటర్నేషనల్ మార్కెట్ మాత్రమే... దాదాపు అదనంగా 13 లక్షలుంది. దీనికి తోడు ఇంగ్లీషేతర మార్కెట్ అయిన చైనా, లాటిన్ అమెరికా, అరబ్ దేశాలు, యూరోప్ లలో కూడా భారీ అవకాశాలున్నాయి. అన్నింట్లోనూ కామన్ గా ఉండే విషయం ఏంటంటే... ఎక్కడా కూడా సరైన విద్యా వనరులు మాత్రం తగినంత లేవు.
మేం దీన్ని ప్రపంచ వ్యాప్త సర్వీసుగా విస్తరించాలని అనుకున్నప్పుడు... ప్రతి దేశంలో ఉన్న ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి లెక్కల టీచరూ.. ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా అక్కున చేర్చుకుని బోధనలో బాధ్యత వహించాలి. మేం ఈ మార్కెట్ ను విభాగాలుగా చేసి, అనుగుణంగా ఉండే బిజినెస్ మోడల్ ద్వారా సాధ్యమైనంత వేగంగా మార్కెట్లోకి దూసుకుపోవాలని అనుకున్నాం.
ఇందుకోసం హాట్ చాక్ భాగస్వామిగా మేం నార్త్ అమెరికాను ఎంచుకున్నాం. ఆ తర్వాత మిడిల్ స్కూల్, హై స్కూల్ స్థాయిల్లో ఉండే మ్యాధ్స్ టీచర్లు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యేలా, తమ ఆలోచనల్ని మార్చుకునేలా ఒక వేదిక క్రియేట్ చేశాం. అంతే కాదు.. ఆపై మిడిల్ స్కూల్, హైస్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం సంయుక్త కమ్యూనిటీ ఏర్పాటు చేశాం. దీనిలో ప్రతి స్కూళ్లో టీచర్లు చెప్పే విధానాలుంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మా బోధనా విధానాల్ని అనుసరించి విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించే ప్రతి టీచరుకు ప్రతిఫలంగా తల్లిదండ్రుల నుంచి కొంత మొత్తం లభిస్తుంది. మేం స్కూల్ వ్యవస్థను ఇలా మార్చేయాలనుకున్నప్పుడు మా బిజినెస్ లో ఇది అత్యంత ముఖ్యమైన వ్యాపార విధానం. ఎలాగైతే ఏం... నార్త్ అమెరికాలో మేం టార్గెట్ చేసిన కస్టమర్ బేస్ అప్పటి నుంచి స్థిరంగా ఉంటూ వచ్చింది. మా సేవల్ని ఉపయోగించుకుంటున్న టీచర్లు, తల్లిదండ్రులు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇంకా ఇండియా, యూకే, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, వంటి దేశాల్లో ముఖ ప్రచారం ద్వారా ఎక్కువ మంది వచ్చి చేరారు. కానీ మరో వైపు కొద్దిగా మాత్రమే టార్గెట్ కస్టమర్లు అయిన సంపన్న వర్గాలకు కూడా చేరువయ్యేందుకు మేం పెద్దగా ప్రయత్నించలేదు.
మేం ఈ విభాగ విధానం ఐదేళ్ల పాటు ఉంచాలనుకున్నాం. దీనివల్ల మా బోధనా విధానాల్ని , కంపెనీ వాల్యూయేషన్ ను, మరింత ఆర్థిక పెట్టుబడుల కోసం మెరుగైన డీల్స్ ఏర్పాటు చేయడం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ప్రపంచ చరిత్ర, ప్రపంచ భూగోళం, ఇంగ్లిష్, రెండో భాషగా ఇంగ్లిష్ వంటి ఇతర సబ్జెక్టులకు కూడా విస్తరించడం, వంటి విధానాల్లో మెరుగు పర్చుకోవాలనుకున్నాం.
ఇవేమీ లేనప్పటికీ మేం మా ఆదాయాన్ని ఏడాదికి 113 శాతం చొప్పున పెంచుకుంటూ వచ్చాం. ఈ లెక్కలను బట్టి 2017 కల్లా మేం లాభాల్లోకి వచ్చేస్తాం. కానీ మాకో సమస్య తలెత్తితే దాన్ని సరైన విధానంలో పరిష్కరించుకున్నాం. ఇందుకోసం మా బోధనా విధానంలో అత్యున్నత స్థాయి నిపుణులతో కలసి, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా బోధించదగ్గ సరైన విషయ పరిజ్ఞానాన్ని అందులో చేర్చాం. ఇందులో వ్యక్తిగతం అన్నది వారి నేర్చుకునే విధానాలు, వారి నైపుణ్య బేధాలు, ఉదాహరణలతో కూడిన అంశాలతో మిళితమై ఉంది. అంటే సాకర్ అంటే ఇష్టమున్న విద్యార్థికి.. ఫిజిక్స్ లో వేగం, త్వరణం వంటి అంశాలను బోధించడానికి లూసిడ్.. గ్రౌండ్ లో ఉన్న అంశాలతో బోధన చేస్తాడు. అంతే కాదు... అత్యున్నత ప్రభావం కలుగచేసే విషయ పరిజ్ఞానం కోసం మేం డిస్కవరీ ఛానెల్, ఏ అండ్ ఈ, సీఎన్ ఎన్ , నెట్ ఫ్లిక్స్ వంటి వాటి భాగస్వామ్యం కోసం పెట్టుబడులు పెట్టాం. దీంతో వారి కంటెంట్ ఎప్పటికప్పుడు మాకు అందుతుంది. దీంతో హిస్టరీ, ఆర్ట్ హిస్టరీ, జియోగ్రఫీ వంటి ఇంతర కోర్సులు బోధించడానికి వీలుండేది. అంతే కాదు.. 2018 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేద దేశాలు, పేద పాఠశాలల్లో మా ఈ బోధనా విధానాల్ని పూర్తి స్థాయిలో అందించాలని గేట్స్ ఫౌండేషన్ మా సంస్థకు ఫండింగ్ చేయడానికి ముందుకొచ్చింది. దీంతో మేం వదిలేశాం అనుకున్న సేవా విభాగాన్ని కూడా పూర్తి చేసినట్లు అయ్యింది.
ఇంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. మేం ప్రపంచ విద్యా బోధాన విధానంలో లీడర్లుగా ఉన్నాం. ఇప్పుడు మాకు వచ్చే దానిలో దాదాపుగా 29 శాతం కేవలం ఆదాయంగా మిగులుతోంది.
రచయిత గురించి
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో శ్రమన మిత్ర రాశారు. విజన్ ఇండియా 2020లో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. గ్లోబల్ వర్చువల్ ఇంక్యుబేటర్ అయిన ఒన్ మిలియన్ బై ఒన్ మిలియన్ వ్యవస్థాపకురాలు. ఆమె సిలికాన్ వ్యాలీ ఆంట్రప్రెన్యూర్,స్ట్రాటజిస్ట్.