సంకలనాలు
Telugu

ఈ-ఫైలింగ్ సమస్యలకు చక్కటి పరిష్కారం 'మై ట్యాక్స్‌ కేఫ్'

పన్ను చెల్లింపుదారులకు సేవలందిస్తున్న మై ట్యాక్స్‌ కేఫ్పన్ను చెల్లింపును సులభతరం చేసిన సంస్థ2013లో ప్రారంభమైన మైట్యాక్స్‌కేఫ్అసెసీకి పూర్తిస్థాయి పన్ను మినహాయింపులను అందిస్తున్న సంస్థసంస్థ ఖాతాలో 40 వేల మంది రిజిస్టర్డ్ యూజర్లు ప్రీమియం మోడల్‌లో కస్టమర్లకు సేవలుత్వరలోనే మొబైల్ యాప్‌ను రూపొందించనున్న మైట్యాక్స్‌కేఫ్

GOPAL
14th Aug 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

దేశ జనాభా వందకోట్లు దాటినప్పటికీ, ఇందులో పన్ను చెల్లించేవారు మాత్రం మూడుశాతం కంటే మించి ఉండరు. అందుకు కారణం ఆదాయం లేకపోవడం మాత్రం కాదు. పన్ను చెల్లింపుపై సరైన అవగాహన లేకపోవడమే. అలాగే పన్ను చెల్లింపు సంక్లిష్టంగా ఉండటమే. ఉన్నత విద్య చదివిన వారుసైతం పన్ను చెల్లింపును ఇబ్బందిగా భావిస్తుంటారు. ఇలాంటిసమస్యలకు చెక్ పెట్టేందుకు ముందుకొచ్చింది కాన్పూర్‌కు చెందిన మైట్యాక్స్‌కేఫ్.

అర్జిత్ గుప్తా కాన్పూర్‌లో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్. ట్యాక్సేషన్‌లో పదేళ్లకుపైగా అనుభవముంది. అయితే ట్యాక్స్‌కు సంబంధించి ఓ జోక్‌ను ఆయన ఎప్పుడూ ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఇందిరాగాంధీ ఓ సారి దేవుడిని ఓ కోరిక కోరుతారు..

ఇందిరాగాంధీ: దేవుడా సంజయ్ గాంధీ ఎప్పుడు ప్రధాని అవుతారు?

దేవుడు: అతని జీవితంలో ఒక్కసారి కూడా కాడు.

ఇందిరాగాంధీ: రాజీవ్ ప్రధాని ఎప్పుడవుతారు ?

దేవుడు: నీవు బతికుండగా ప్రధాని కాడు ? దేవుడి నుంచి పాజిటివ్ రిప్లై రావడంతో, ధైర్యంగా మరో ప్రశ్న అడుగుతారు ఇందిర.

ఇందిరాగాంధీ: దేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు సులభమవుతాయి?

దేవుడు: నా జీవితకాలంలో కూడా ఐటి రిటర్న్స్‌ సులభం కావు.. అని మాస్టర్ స్ట్రోక్ ఇస్తారు గాడ్. ఈ జోక్‌ను అర్జిత్ గుప్తా తరచుగా చెప్తుంటారు.

మైట్యాక్స్‌కేఫ్ టీమ్

మైట్యాక్స్‌కేఫ్ టీమ్


అర్జిత్ చెప్పింది జోకే అయినప్పటికీ అది నిజం. భారత్‌లో ట్యాక్స్ ఫైలింగ్ చాలా సంక్లిష్టమైనది. ఉన్నత విద్య అభ్యసించి, పెద్ద పెద్ద జాబ్స్ చేస్తుండేవారు కూడా పన్ను చెల్లింపుల కోసం సీఏలనో, ఇతర ట్యాక్స్ కన్సల్టెంట్లనో సంప్రదిస్తుంటారు. ఈ సంక్లిష్టత కారణంగా మై ట్యాక్స్‌కేఫ్ స్టార్టప్ కంపెనీ ఏర్పాటైంది. అర్జిత్‌తోపాటు సతీశ్ భాటియా, అభిషేక్ పొర్వాల్ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సతీశ్ అమెరికాలోని సీఐఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో 15 ఏళ్లకుపైగా అనుభవముంది. అభిషేక్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. కార్పొరేట్, పర్సనల్ ఫైనాన్స్‌లో మంచి అనుభవముంది. ఈ ముగ్గురు కలిసి 2013 జూన్‌లో ఈ సంస్థను ఆరంభించారు.

ఉత్తరప్రదేశ్‌కు గుండెకాయగా చెప్పుకొనే కాన్పూర్‌ను బేస్‌గా చేసుకుని వీరు బిజినెస్ చేస్తున్నారు. ఈ సంస్థలో మొత్తం 15 మంది ఉద్యోగులున్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా పన్ను చెల్లించడంతోపాటు వీలైనంత ఎక్కువగా పన్ను రాయితీలను పన్నుచెల్లింపుదారులకు కల్పించడమే ఈ సంస్థ లక్ష్యం.

‘‘అన్నిరకాల పన్ను ఆధారిత ఈ-ఫైలింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలన్నదే మా సంస్థ లక్ష్యం. ట్యాక్స్ రీఫండ్స్, ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ కన్సల్టెన్సీ వంటి సేవల్లో సాయం చేస్తాం’’ అని అర్జిత్ చెప్తున్నారు.

100% ఖచ్చితత్వం

వందశాత్యం ఖచ్చితత్వంతో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు అసెసీలకు మైట్యాక్స్‌కేఫ్ సాయం చేస్తుంది. దీంతోపాటు వీలైనంత ఎక్కువ పన్ను మినహాయింపును పొందేందుకు ట్యాక్స్ పేయర్లకు అవకాశం లభిస్తుంది. ఈ సంస్థకు ఇప్పుడు 40 వేలమంది రిజిస్టర్డ్ యూజర్లున్నారు. ప్రస్తుతానికైతే ఈ సంస్థ బీ టూ సీ స్టార్టప్ మాత్రమే. కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల వంటివాటితో టై అప్ చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అనుకోకుండా ఆవిర్భావం..

మై ట్యాక్స్‌కేఫ్ పూర్తి సొంత మూలధనంతో ఏర్పాటైన సంస్థ. ఆర్జిత్ తమ సంస్థ ఏర్పాటు గురించి ఇలా చెప్తారు.

‘‘ఓ వైపేమో ట్యాక్స్ ఫైలింగ్స్ మరిన్నింటిని రాబట్టేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపేమో సులభ ట్యాక్స్ ఫైలింగ్ సొల్యూషన్స్‌ను అందించడంలో విఫలమవుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే మై ట్యాక్స్‌కేఫ్ ఏర్పాటు చేశాం’ అని ఆయన వివరించారు.

భారత దేశ జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నారు. సరైన అవగాహన కల్పించకపోవడం, పన్ను చెల్లించేందుకు సులభమైన విధానం లేకపోవడం వల్లే పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని ఈ సంస్థ ఉద్దేశం.

ప్రీమియం మోడల్

మై ట్యాక్స్‌కేఫ్ ప్రీమియం మోడల్‌లో కస్టమర్లకు సేవలందిస్తోంది. బేసిక్ ఐటీఆర్ ఫైలింగ్స్‌ను ఉచితంగానే చేసి పెడుతున్నప్పటికీ, సీఏ సేవలకు మాత్రం చార్జ్ చేస్తుంది. ట్యాక్స్ ఫైలింగ్స్ కోసం ఇప్పటికే ఎన్నో సంస్థలు తమ సేవలు అందిస్తున్నాయి. క్లియర్ ట్యాక్స్ సంస్థ ఈ రంగంలో ప్రారంభమైన తొలి స్టార్టప్ సంస్థ. క్వికో, ట్యాక్స్‌మంత్ర వంటి సంస్థలు ఈ తరహా వ్యాపారంలో ఉన్నాయి. ప్రభుత్వ వెబ్‌సైట్ కూడా ఆదాయపుపన్ను చెల్లింపుదారులకు ఉపయోగకరంగానే ఉన్నప్పటికీ, పలుమార్లు లాగ్ అవుతుండటంతో వినియోగదారులు విసుగు చెందుతున్నారు.

మరింత విస్తరణ

తమ సంస్థను మరింత విస్తరించాలని మైట్యాక్స్‌కేఫ్ భావిస్తున్నది. ఇండివిడ్యువల్స్, ఫ్రీలాన్సర్స్, కమిషన్ ఏజెంట్స్, ప్రొఫెషనల్స్, కాంట్రాక్ట్ వర్కర్స్ వంటి వారికి కూడా సేవలందించనుంది. అలాగే త్వరలోనే ఓ యాప్‌ను కూడా రూపొందించాలని భావిస్తున్నారు. మొత్తమ్మీద సాధారణ పన్ను చెల్లింపుదారుకు తలనొప్పిగా మారిన ట్యాక్స్‌ ఫైలింగ్‌ను సులభతరం చేసిన మైట్యాక్స్‌కేఫ్‌కు అభినందనలు తెలపాల్సిందే.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags