సంకలనాలు
Telugu

ఐపీఎల్ 2017 హైలైట్స్ ఇవే..

team ys telugu
22nd May 2017
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

సుమారు 7 వారాలపాటు సాగిన ఐపీఎల్ 10వ సీజన్ మండు వేసవిలో కావల్సినంత వినోదాన్ని పంచింది. ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కంటిన్యూ చేసింది. పుణె జెయింట్స్ పోరాట పటిమ కనబరిచింది. సన్ రైజర్స్ సమష్టి కృషి శెభాష్ అనిపించింది. నైట్ రైడర్స్ దూకుడు ఉత్తేజాన్ని నింపింది. ఈ సీజన్ లో ఆ నాలుగు టీంలు అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. తారాజువ్వల్లాంటి సిక్సర్లు, బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే బౌండరీలు, మెరుపులాంటి క్యాచులు, కళ్లు చెదిరి ఫీల్డింగ్, నిప్పులు చెరిగే బౌలింగ్, బ్యాట్స్ మెన్ ఊచకోత.. వెరసి ఐపీఎల్-2017 మరిచిపోలేని అనుభూతుల్ని మూటగట్టింది.

ఇమేజ్ కర్టసీ: ఐపీఎల్ అఫీషియల్ వెబ్ సైట్

ఇమేజ్ కర్టసీ: ఐపీఎల్ అఫీషియల్ వెబ్ సైట్


ఐపీఎల్ 2017 హైలైట్స్ ఇవే..

# ఆరెంజ్ క్యాప్ : డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్) 641 పరుగులు, ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలు.

# టోర్నీలో అత్యధిక సిక్సర్లు: గ్లెన్ మ్యాక్స్ వెల్ (పంజాబ్ కింగ్స్) 26 సిక్సర్లు

# ఒక మ్యాచులో అత్యధిక సిక్సర్లు: రిషభ్ పంత్ (ఢిల్లీ డేర్ డెవిల్స్) 9 సిక్సులు, 43 బంతుల్లో 97 పరుగులు

# అత్యధిక వ్యక్తిగత స్కోర్: డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్) 59 బంతుల్లో 126 పరుగులు

# టోర్నీలో అత్యధిక హాఫ్ సెంచరీలు: రాబిన్ ఊతప్ప (కోల్ కతా నైట్ రైడర్స్) 5 అర్ధ సెంచరీలు

# టోర్నీలో అత్యధిక సెంచరీలు: హషిమ్ ఆమ్లా (పంజాబ్ కింగ్స్) రెండు సెంచరీలు

# ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: సునీల్ నరైన్ (కోల్ కతా నైట్ రైడర్స్) 15 బంతుల్లో 54 పరుగులు

# ఫాస్టెస్ట్ సెంచరీ: డేవిడ్ వార్నర్ ( హైదరాబాద్ సన్ రైజర్స్) 43 బంతుల్లో 126

# పర్పుల్ క్యాప్: భువనేశ్వర్ (హైదరాబాద్ సన్ రైజర్స్) 14 మ్యాచుల్లో 26 వికెట్లు

# హ్యాట్రిక్: ఆండ్ర్యూ టై (గుజరాత్), జయ్ దేవ్ ఉనాడ్కట్ (పుణె) సామ్యూల్ బద్రీ(బెంగళూరు)

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags