సంకలనాలు
Telugu

ప‌ర్యాట‌క ప్ర‌దేశాల స‌మ‌స్త స‌మాచారం "36 hrs"లో లభ్యం

వివిధ దేశాల‌ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల స‌మాచారం ఇస్తున్న 36 hrs.inనిపుణులు, ట్రావెల‌ర్స్‌ల అభిప్రాయాల‌ను పొందుప‌రుస్తున్న సంస్థ‌త‌క్కువ బ‌డ్జెట్ ప్ర‌యాణా ప్ర‌ణాళిక‌నూ అందిస్తున్న సంస్థ‌36 hrs.in వెబ్‌సైట్‌లో వంద‌కుపైగా ట్రావెల్ బోర్డు వివ‌రాలుఎవ‌రైనా 36 hrs.inలో ప‌ర్యాట‌క రంగంపై త‌మ అభిప్రాయాల‌ను అందించొచ్చు

GOPAL
20th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అర్జెంటీనాలో క‌ల్చ‌ర్ ఎలా ఉంటుంది..? ఆఫ్రికా దేశాల్లో స్థానికుల‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాలి..? చైనాలో వెజిటేరియ‌న్స్ ఏం తినాలి.. ? చ‌లి కాలంలో ఎక్క‌డికి టూర్ వెళ్తే బాగుటుంది.. ప‌ర్యాట‌కుల మ‌దిలో ఎప్పుడూ ఏవో ఆలోచ‌న‌లు.. వెకేష‌న్స్‌ను ఎలా గ‌డ‌పాలి అని వారు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్క‌డి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అన్న స‌మాచార‌మే ఉండ‌దు. అయితే ఇలాంటి వారికి 36hrs.in ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్న‌ది.

వివిధ ప్రాంతాలు సంద‌ర్శించాల‌ని చాలామంది కోరుకుంటారు. ఐతే మంచి ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఎక్క‌డున్నాయో తెలియ‌దు. అందుకోసం ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. విచిత్ర‌మైన ప్ర‌దేశాల్లో, సందుగొందుల్లో ఉండే ప్ర‌కృతి అందాల‌ను చూడాల‌నుకుంటారు. ఐతే ఇవి కేవ‌లం స్థానికుల‌కు, అనుభ‌వ‌జ్ఞుల‌కు మాత్ర‌మే తెలుస్తాయి. ఇలాంటి అంద‌మైన‌, ఆక‌ర్ష‌ణీయ‌మైన, సుంద‌ర‌ ప్ర‌దేశాల‌ను ప‌ర్యాట‌కుల‌కు అంద‌జేసేందుకు ఢిల్లీ ఐఐటీలో కంప్యూట‌ర్ సైన్స్ పూర్తిచేసిన ర‌విజ్యోత్ చా, హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్ జెన్ బ్లుమ్‌బ‌ర్గ్ 36hrs.in స్టార్ట‌ప్‌ను ప్రారంభించారు. పెథ‌నాన్ గ్రూప్‌లో బోస్ట‌న్‌, ముంబైల‌లో ప‌నిచేస్తూనే ఈ సంస్థ‌ను నెల‌కొల్పారు.

ప్ర‌పంచంలోని న‌లుమూల‌ల్లో ఉన్న అంద‌మైన ప్రాంతాలు, ప్ర‌దేశాల వివ‌రాలు తెలుసుకుని, వాటిని వివిధ ర‌కాలుగా కేట‌గిరైజ్ చేసి 36hrs.inలో పొందుప‌రుస్తున్నారు. అర్జెంటీనాలోని అంద‌మైన ప్ర‌దేశాల‌ను త‌క్కువ బ‌డ్జెట్‌లోనే చూడాల‌నుకుంటే.. అందుకు సంబంధించి ప్ర‌ఖ్యాత ట్రావెల్ నిపుణురాలు అమండా అందించే ప్ర‌యాణా ప్ర‌ణాళిక కూడా 36hrs.inలో ల‌భిస్తుంది. అర్జెంటీనా స్వాతంత్ర స‌మ‌ర విశేషాల నుంచి ఇప్ప‌టి రాజ‌కీయాల వ‌ర‌కూ అన్నింటిని వివ‌రిస్తూ ప‌ర్యాట‌కుల‌కు స‌మ‌స్త స‌మాచారం అందిస్తారు. అలాగే అర్జెంటీనాలో ఎంతో ఫేమ‌స్ అయిన ఐస్‌క్రీమ్ హెలాడోస్ రుచి కూడా చూపిస్తారు. టాంగో నైట్స్‌, వైన్‌యార్డ్ టూర్స్ ఇలా అన్నీ అమందా ట్రావెల్ బోర్డులో ఉంటాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే అమండా చిన్న‌పాటి సిటీగైడ్ అనుకోవ‌చ్చు. మొత్తం ట్రావెల్ ప్లాన్ అంతా సిద్ధం ఉంటుంది. ఇలాంటి వంద‌కుపైగా విశేషాలు 36hrs.in ల‌భిస్తాయి.

ప‌ర్యాట‌క ప్ర‌దేశాల వివ‌రాలు అందిస్తున్న 36 hrs.in వెబ్‌సైట్‌

ప‌ర్యాట‌క ప్ర‌దేశాల వివ‌రాలు అందిస్తున్న 36 hrs.in వెబ్‌సైట్‌


"కంటెంట్ ప‌బ్లిష‌ర్స్‌, యూజ‌ర్స్ త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకోవ‌డాన్ని మేం స్వాగ‌తిస్తాం. ఎవ‌రైనా మా వెబ్‌సైట్‌లో త‌మ సొంత సిటీగైడ్స్‌ను రూపొందించుకోవ‌చ్చు" అని జెన్ వివ‌రించారు.

వెబ్‌సైట్ ప‌నిచేస్తోందిలా..

యూజ‌ర్లు ఎవ‌రైనా 36hrs.in సైన్ అప్ అయి త‌మ సొంత ట్రావెల్ బోర్డుల‌ను సృష్టించుకోవ‌చ్చు. త‌మకు ఇష్ట‌మైన ప్ర‌దేశాల వివ‌రాల‌ను పొందుపర్చొచ్చు. వివిధ ర‌కాల థీమ్‌ల రూపంలో సొంత మినీ సిటీ గైడ్‌ల‌ను సృష్టించుకోవ‌చ్చు. అలాగే వేర్వేరు స‌భ్యులు పొందుప‌ర్చిన ట్రావెల్ ప్ర‌దేశాల‌ను, అంద‌మైన ప్రాంతాల‌ను సెర్చ్ కూడా చేసుకోవ‌చ్చు.

"యూజ‌ర్లు త‌మ ఫ్రెండ్స్‌ను ఫాలో అవుతూ వారి ప్ర‌తిపాద‌న‌ల‌పై ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంచొచ్చు. అలాగే నిపుణులు, ట్రావెల్ రైట‌ర్స్‌, ఫుడ్ బ్లాగ‌ర్స్ ను ఫాలో అవుతూ కొత్త కొత్త స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు. పూర్తిగా తెలిసిన నిపుణులు న‌గ‌రం గురించి ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న‌ల‌ను వివ‌రిస్తారు" అని ఆమె చెప్పారు.

2013లో ర‌వి త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌లిసి ముంబై నుంచి సింగ‌పూర్ వెళ్లాల‌నుకున్నారు. అంద‌మైన ప్ర‌దేశాల గురించి వెత‌క‌డం ఆయ‌న హాబీ. సింగ‌పూర్‌లో ఉన్న త‌న ఫ్రెండ్స్‌ను న‌గ‌రం గురించి వివ‌రాలు అడిగారు. కొంత‌మంది స్నేహితుల నుంచి ఈ-మెయిల్స్ వ‌చ్చాయి. అలాగే ఫుడ్ బ్లాగ్‌, లోన్లీ ప్లానెట్ వంటి బ్లాగ్ ల నుంచి కూడా మంచి వివ‌రాలు ల‌భించాయి. టెక్ట్స్ రూపంలో ఉన్న‌వాట‌న్నింటిని ఒక‌చోట చేర్చేందుకు ర‌వికి త‌ల‌ప్రాణం తోక‌కొచ్చింది. ఆ త‌ర్వాత గూగుల్ డాక్యుమెంట్‌ను క్రియేట్ చేసి ఈ షెడ్యూల్‌ను స్ప్రెడ్‌షీట్ రూపంలో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు పంపారు. ఈ స‌మ‌యంలోనే ప్ర‌తిపాద‌న‌ల‌న్నింటిని ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చే ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తే ఎలా ఉంటుంద‌న్న ఐడియా వ‌చ్చింది. ఈ-మెయిళ్ల‌ను, లాంగ్ ఆర్టికల్స్‌ను ఎలాంటి అడ్డంకులు లేకుండా కొన్ని క్లిక్కుల్లోనే చ‌దివేలా అన్ని అడ్డంకుల‌ను తొల‌గించే ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాల‌ని నిర్ణ‌యించారు.

బోస్ట‌న్‌లో శ్రీకారం..

36hrs.in ఆవిర్భావం బోస్ట‌న్‌లో జ‌రిగింది. జెన్‌, ర‌వి ప‌నిచేస్తున్న పెథ‌నాన్ గ్రూప్ ఆఫీస్‌లో ఈ ప్రారంభ‌మైంది. వినే అవ‌కాశముంద‌ని భావించిన ప్ర‌తి ఒక్క‌రికీ ర‌వి ఈ స్టార‌ప్ కంపెనీ గురించి వివ‌రించ‌డం ప్రారంభించారు. జెన్ త‌న ఉద్యోగానికి గుడ్ బై చెప్పి ఈ స్టార్ట‌ప్‌పైనే దృష్టి సారించారు. వీరిద్ద‌రికి ప్ర‌యాణాలంటే ఎంతో ప్రాణం. ఇప్ప‌టికే 40 దేశాల‌కు పైగా ప‌ర్య‌టించారు. ప‌ర్యాట‌క రంగానికి టెక్నాల‌జీ, సోష‌ల్‌మీడియా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వీరిద్ద‌రి గ‌ట్టి విశ్వాసం. అలాగే చీలీలో జ‌రిగిన స్టార్ట‌ప్ చీలీలో వీరిద్ద‌రూ పాల్గొన్నారు.

స్టార్ట‌ప్ చీలిలో పాల్గొన్న ర‌వి, జెన్‌

స్టార్ట‌ప్ చీలిలో పాల్గొన్న ర‌వి, జెన్‌


వీరిద్ద‌రూ రూపొందించిన ప్రొగ్రామ్‌ను నిర్వాహ‌కులు ఆమోదించారు. దీంతో చాలామంది పెట్ట‌బ‌డులు పెట్టేందుకు ముందుకువ‌చ్చారు. "చాలా స్టార్ట‌ప్‌ల‌ను ప్రోగ్రామ్‌లుగా యాక్సెప్ట్ చేశారు. కాని మాది మాత్రం కాన్సెప్ట్ ఆధారంగా ఎంపిక‌చేశారు. ప్రోగ్రామ్‌గా ఎంపిక కావ‌డం మా ఆత్మ‌విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. అటు పెట్టుబ‌డి విష‌యంలోనూ, ఇటు వ‌న‌రుల విష‌యంలోనూ మంచి మ‌ద్ద‌తు ల‌భించింది. అందువ‌ల్లే ప్ర‌స్తుతం మేమీ స్థానంలో ఉన్నాం" అని జెన్ వివ‌రించారు.

రెండు వారాల్లో వెయ్యి సైన‌ప్స్‌..

స్టార్ట‌ప్ చీలీ యాక్స‌లేట‌ర్ ప్రోగ్రాం ద్వారా జెన్‌, ర‌వి 30 వేల డాల‌ర్ల‌ను సంపాదించారు. ఈ డ‌బ్బుతోపాటు కొంత పొదుపు చేసుకున్న మొత్తంతో క‌లిసి స్టార్ట‌ప్‌ను ప్రారంభించారు. మ‌రికొన్ని నెల‌ల్లోనే మూడు ల‌క్ష‌ల డాల‌ర్ల మూల‌ధ‌నాన్ని స‌మీక‌రించి వెబ్ ప్రాడ‌క్ట్‌ను, మొబైల్ యాప్‌ను డెవ‌ల‌ప్‌చేయాల‌నుకుంటున్నారు. సంస్థ‌ను ప్రారంభించిన కొద్ది స‌మ‌యంలోనే వీరికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రెండు వారాల్లోనే వెయ్యిమందికి పైగా ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించారు. అలాగే వంద‌మందికి పైగా ట్రావెల్ బోర్డును క్రియేట్ చేయ‌గా, వెయ్యిమందికి పైగా స్పాట్స్‌ను యాడ్ చేశారంటే రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 

"ముఖ్యంగా భార‌త్‌, సౌత్ ఈస్ట్ నుంచి ఎక్కువ‌మంది సైన్ అప్ అవుతున్నారు. ఇదే మాత్రం మ‌మ్మ‌ల్ని ఆశ్చ‌ర్యప‌ర్చ‌లేదు. ఎందుకంటే మార్కెట్ రోజు రోజుకు పెరిగిపోతున్న‌ది. అత్యున్న‌త నాణ్య‌మైన ట్రావెల్ స‌మాచారం కోసం చాలామంది వెతుకుతున్నారు" అని జెన్ వివ‌రిస్తారు.

ఆన్‌లైన్‌లో ల‌భించే స‌మాచారంతోనే 63 శాతం మంది ట్రావెల‌ర్స్ స్ఫూర్తి పొందుతార‌ని రెడ్ రాకెట్ మీడియా నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింది. అంతేకాదు తాము తెలుసుకున్న స‌మాచారాన్ని మిత్రుల‌కు తెలియ‌జేసేందుకు మూడోవంతు ట్రావెల‌ర్లు కొత్త‌గా ట్రావెల్ బోర్డుల‌ను క్రియేట్ చేస్తారు. "మా ప్లాట్‌ఫామ్ గొప్ప‌త‌న‌మేమిటంటే ఎలాంటి సుదీర్ఘ వ్యాసాలు రాసే అవ‌స‌రం లేకుండా, వేగంగా, సుల‌భంగా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా రిక‌మండేష‌న్ల‌ను ప్ర‌తిపాదించొచ్చు. ఇది యూజ‌ర్ల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది. ఆ ప్ర‌యాణ ప్ర‌ణాళిక ఆధారంగా త‌మ షెడ్యూల్‌ను కూడా ఫిక్స్ చేసుకోవ‌చ్చు"‌ అని జెన్ వివ‌రించారు.

నిరంత‌ర అన్వేష‌ణ‌..

36hrs.in వినియోగ‌దారులను ఆక‌ట్టుకోగ‌లిగిందంటే ర‌వి, జెన్‌ల నిరంత‌న అన్వేష‌ణే కార‌ణం. వీరిద్ద‌రికి మంచి ఎడ్యుకేష‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ బ్యాక్‌గ్రౌండ్ క‌లిసొచ్చింది. వీరిద్ద‌రికీ టెక్నాల‌జీ అంటే పిచ్చి. "సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌, వెబ్ యాప్స్‌, మొబైల్ యాప్స్‌తో ఏదైనా చేయాలంటే మాకు ఎంతో ఇష్టం" అంటాడు ర‌వి. కంప్యూట‌ర్ సైన్స్‌లో ర‌వికి డిగ్రీ ఉంది. ఇక జెన్ ఈ రంగంలో ఎన్నో కోర్సులు నేర్చుకున్నారు. దీంతో వీరిద్ద‌రి క‌లిసి ప‌నిచేస్తూ ఒక‌ర‌క‌మైన న‌మూనాల‌ను రూపొందిస్తున్నారు. ఈ 36hrs.inకు బ్యాంక్ ఎండ్ మ‌న్‌ప్రీత్ ఖురానా, ఫ్రంట్ ఎండ్ అమిత్ మొండ‌ల్ అందిస్తున్నారు. మేనేజ్‌మెంట్ క‌న్స‌ల్టెంట్స్‌గా ప‌నిచేయ‌డం కూడా ర‌వి, జెన్‌ల‌కు ఈ స్టార్ట‌ప్ కంపెనీనీ ప్ర‌మోట్ చేసేందుకు ప‌నికొచ్చింది. వివిధ ర‌కాలైన ప్రాజెక్టుల‌లోప‌నిచేయ గ‌ల‌గ‌డం కార‌ణంగా, వివిధ ర‌కాల పనుల‌ను చేయాల‌న్న ఆస‌క్తి క‌లిగింది. అలాగే వివిధ దేశాల్లో ప‌నిచేయ‌డం కూడా వివిధ ర‌కాల ప‌రిస్థితుల‌ను త్వ‌ర‌గా అవ‌గాహ‌న చేసుకోగ‌లిగారు. వ‌చ్చిన‌ అవ‌కాశాలను అందిపుచ్చుకున్నారు. ఎలాంటి వ్యూహ‌ర‌చ‌న‌లు చేయాల‌న్న దానిపై ఎప్ప‌టిక‌ప్పుడు ఓ నిర్ణ‌యం తీసుకుంటూ వ‌చ్చాయంటారు జెన్‌. దీనికి తోడు వివిధ ప్ర‌దేశాల‌కు త‌ర‌చుగా ప్ర‌యాణించ‌డం మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరిందంటారామె. ఏడాదిలో వంద‌రోజుల‌పాటు రోడ్ల‌పైనే తిర‌గ‌డంతో ట్రావెల్ ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతోందో వారికి కొట్టిన‌పిండి అయ్యింది. ఎలాంటి స‌మాచారం కావాలి.. ఎలా దాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయాల‌న్న అంశాలు వారికి చాలా తేలిక‌య్యాయి. " ట్రావెల్ రంగ‌లో మాకు ఎదుర‌యిన అతి పెద్ద స‌మ‌స్య ఏమిటంటే.. ఎప్పుడో లీజ‌ర్ ట్రావెల్ గురించి వివ‌రించ‌డం కాకుండా, అంత‌కుమించి, ప‌లుమార్లు సంద‌ర్శించే ప‌ర్యాట‌క ప్రాంత విశేషాల‌ను చెప్పాల్సి ఉంటుంది. దీన్నే మేం న‌మ్ముతాం. అందుకే వివ‌రాల కోసం స్థానికంగా వెళ్లాల్సి ఉంటంది. మ‌రోమాట‌లో చెప్పాలంటే న‌గ‌రానికి చెందిన స్థానికులు అందించే వివ‌రాలు ఎంతో ఉప‌యుక్తం, ఉత్సాహ‌భ‌రితంగా ఉంటాయి" అని ఆమె వివ‌రించారు.

మొద‌ట వీరు "36 అవ‌ర్స్ ఇటెన‌రీ" పేరిట ఎనిమిది న‌గ‌రాల్లో ప్ర‌జ‌ల ఆస‌క్తుల‌ను తెలుసుకునేందుకు కొంత‌మంది ట్రావెల్ రైట‌ర్స్ రాసిన ప్ర‌యాణ ప్ర‌ణాళిక‌ల‌తో కూడిన ఓ న‌మూనా ఫామ్‌ను ఆవిష్క‌రించారు. త‌మ స‌రైన ప్ర‌యాణ ప్ర‌ణాళిక‌ను పంచుకునేందుకు వీరు ఓ ఫామ్‌ను క్రియేట్ చేశారు. త‌ద్వారా రెండు విష‌యాల‌ను తెలుసుకున్నారు.

1. కేవ‌లం కంటెంట్ మాత్ర‌మే ఉండి మ‌రింత ప్ర‌భావ‌వంత‌మైన స‌మాచారం ల‌భ్యం కాక‌పోవ‌డం ..

2. ఒక న‌గ‌రంలో తాము చూసిన సుంద‌ర ప్ర‌దేశాల‌ను సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌ల ద్వారా త‌మ స్నేహితులు/కుటుంబ స‌భ్యుల‌తో పంచుకునేందుకు స‌రైన మార్గం లేక‌పోవ‌డం.. వంటి విష‌యాల‌ను వారు స‌ర్వే ద్వారా తెలుసుకున్నారు. దీంతో యూజ‌ర్ల వ్యాఖ్య‌లు, అభిప్రాయాల‌ను తెలుసుకుని, వారి అభిరుచికి అనుగుణంగా, వారు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా వెబ్‌సైట్‌ను సృష్టించిన‌ట్టు జెన్ చెప్పారు.

100 బిలియ‌న్ మార్కెట్‌పై దృష్టి

ఈ స్టార్ట‌ప్ కోసం జెన్‌, ర‌వి మంచి ఉద్యోగాల‌ను వ‌దిలేశారు. "ఎలా న‌డుస్తుందో తెలియ‌ని ఓ స్టార్ట‌ప్ కోసం మంచి ఉద్యోగాన్ని వ‌దిలివేయ‌డం మా ఇద్ద‌రికీ లోలోప‌ల ఆందోళ‌న‌గానే ఉంది. చాలాకాలం పాటు మాకు ఎలాంటి ఆదాయం రాలేదు. కానీ వీలైనంత తొంద‌ర‌గా మేం కొత్త కొత్త నైపుణ్యాల‌ను నేర్చుకున్నాం. సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ప్లాట్‌ఫామ్‌ను న‌డిపించేందుకు అవ‌స‌ర‌మైన రైటింగ్ కోడ్ మా ఇద్ద‌రికీ రాదు. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌ను న‌డిపించాలంటే ఎంతో స‌త్తా ఉండాలి" అని జెన్ తెలిపారు. ఊహజ‌నిత‌మైన‌ది కాకుండా, క‌స్ట‌మ‌ర్ నిజంగా ఏం కోరుకుంటున్నాడ‌న్న‌దానిపైనే ప్రాడ‌క్ట్‌ను రూపొందించాల‌న్న‌ది త‌న ఉద్దేశ‌మ‌ని ర‌వి చెప్తారు. "వాస్త‌వ ప‌రీక్ష‌లు/క‌స్ట‌మ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంట‌ర్వ్యూల‌పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డాలి. చాలాసార్లు నేను గ్ర‌హించిందేమిటంటే, నేను ఊహించిన ఫీచ‌ర్ల‌ను కాకుండా వేర‌ర‌క‌మైన‌వాటిని క‌స్ట‌మ‌ర్ కోరుకుంటారు. అందుకోసం క‌స్ట‌మ‌ర్‌ను నేరుగా అడిగితేనే కావాల్సిందేమిటో తెలుస్తుంది" అని ఆయ‌న వివ‌రించారు. జెన్‌, ర‌వి ముందున్న అవ‌కాశాలు చాలా పెద్ద‌వి. ట్రావెల్ యాక్టివిటీ బుకింగ్ మార్కెట్ దాదాపు 100 బిలియ‌న్ల‌కంటే పెద్ద‌ది. ప్ర‌తియేటా గ్రోత్ రేట్ 9%గా ఉంటున్న‌ది.

ఏదైనా అనుకుంటే, అది సాధించే వ‌ర‌కూ వెన‌క్కి వెళ్లొద్ద‌న్న‌ది జెన్ ఫిలాసీ. "చాలామంది తాము చేయాల‌నుకున్న‌దాన్ని మ‌ధ్య‌లోనే వ‌దిలి వేస్తారు. అందుకు కార‌ణం.. దాన్ని పూర్తి చేసే స‌త్తా త‌మ‌లో లేద‌ని, తాము అందుకు స‌రితూగ‌లేమ‌న్న ఆలోచ‌న‌లే. కాని ఆ ఆలోచ‌నే త‌ప్పు. ఏదైనా సాధించాల‌నుకుంటే చివ‌రి వ‌ర‌కూ ప్రయాణించాల్సిందే" అని ఆమె వివ‌రిస్తారు. ప్ర‌జ‌ల ప్ర‌యాణ మార్గాన్ని మార్చుకునేందుకు తాము రూపొందించే ప్రాడెక్ట్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని జెన్ న‌మ్ముతారు. అందుకే దాన్ని అత్యుత్త‌మంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆమెకు తెలుసు.. స్టార్ట‌ప్ సంస్థ స‌క్సెస్ కావాలంటూ "అత్యుత్త‌మ‌మైన‌ది"ఇవ్వాల‌ని. అలాగే వారిద్ద‌రూ ప‌నిచేస్తున్నారు కూడా..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags