సంకలనాలు
Telugu

విండో షాపింగ్ @ ఆన్ లైన్

షాపింగ్ ట్రెండ్ ని మార్చేసిన గ్లిట్ స్ట్రీట్సరికొత్త ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్

Sri
23rd Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఒక్కసారి గూగుల్ లో చూస్తే కుప్పలు తెప్పలుగా ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్లు కనిపిస్తాయి. ఇక ఫ్యాషన్ వెబ్ సైట్ల లెక్కే లేదు. దాదాపు అన్నీ ఒకేలా ఉంటాయి. ఢిల్లీకి చెందిన ఓ వెబ్ సైట్ ఉంది. అదీ ఫ్యాషన్ వెబ్ సైటే. కానీ మిగతా వాటిల్లా కాదు. చాలా డిఫరెంట్. అందుకే కొద్ది కాలంలోనే కస్టమర్ల మనసు దోచేసింది. ఇంతకీ ఏంటా వెబ్ సైట్..? ఎలా మొదలైంది? ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఫౌండర్ ప్రణవ్ గుప్తా మాటల్లోనే తెలుసుకుందాం...

 ఇలా మొదలైంది

మా వెబ్ సైట్ పేరు glitstreet.com. సాధారణంగా అన్ని స్టార్టప్ ల కథలు ఒకేలా మొదలవుతాయి. భారీ జీతాలిచ్చే ఉద్యోగాలను వదిలి రావడం... కంపెనీని ప్రారంభించడం... సక్సెస్ అవడం... దాదాపుగా అందరి ఫ్లాష్ బ్యాక్ లు ఇలాగే ఉంటాయి. కానీ మా కథ చాలా భిన్నం. నేను(ప్రణవ్ గుప్తా) బిట్స్ పిలానీ గ్రాడ్యుయేట్. మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ గా పనిచేశాను. స్టార్టప్ కోసం ఒపెరాలో ఉద్యోగం మానేశాను. మరో ఇద్దరు కో-ఫౌండర్లు నితీష్ భూషణ్, కార్తీక్ ధార్ నాతో ఉన్నారు. బెయిన్ అండ్ కంపెనీలో పనిచేస్తున్న వీళ్లు నాలా ఉద్యోగానికి గుడ్ బై చెప్పలేదు. కంపెనీ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారంతే. వారి యజమాని వారికి ఎంతో మద్దతుగా నిలిచారు. ఇక స్టార్టప్ ప్రారంభించడానికి మాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే బెయిన్ అండ్ కంపెనీలో జాబ్ సెక్యూరిటీ ఎలాగూ ఉంది. ఆ ధైర్యంతో ముందుకెళ్లాం. ముగ్గురం కలిసి 2014లో ప్రాజెక్ట్ పై కొన్ని నెలల పాటు వర్కవుట్ చేశాం. మా దూకుడు చూసిన మా యజమానులు ఇక మేం ఉద్యోగులుగా తిరిగి రామని డిసైడైపోయారు. అలా గ్లిట్ స్ట్రీట్ ని ప్రారంభించాం.

నితీష్, కార్తీక్, తృప్తి, సునీ, ప్రణవ్

నితీష్, కార్తీక్, తృప్తి, సునీ, ప్రణవ్


కొత్త రూట్ లో షాపింగ్ సైట్

గ్లిట్ స్ట్రీట్ ఓ ఫ్యాషన్ వెబ్ సైట్. అలాగని మిగతా వెబ్ సైట్లలా అస్సలు కాదు. చాలా తేడాలుంటాయి. ఢిల్లీకి చెందిన దుస్తుల షాపులన్నింటినీ ఆన్ లైన్ లోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా షాపూర్ జాట్, హౌజ్ ఖాస్ విలేజ్, లజ్ పత్ నగర్ లాంటి మార్కెట్లలో దొరికే దుస్తులు మా వెబ్ సైట్లో కనిపిస్తాయి. ఢిల్లీలోని ప్రముఖ బొటిక్స్, షోరూమ్ లల్లో అమ్మే బట్టలను మా వెబ్ సైట్ లో చూడొచ్చు. అంతే కాదు... వాళ్లు ఏం అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, క్లాత్ క్వాలిటీ ఏంటీ లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఢిల్లీలోని ఫ్యాషన్ డిజైనర్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మా వెబ్ సైట్ సరైన వేదిక. వెబ్ సైట్ లో దుస్తులను, డిజైన్లను చూడటమే కాదు... అవసరమైతే మా డిజైనర్లను కస్టమర్లు నేరుగా సంప్రదించే అవకాశం కల్పించాం. షాపుల్లో ఉండే దుస్తులు మా వెబ్ సైట్ లో కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి నేరుగా ఆ షాప్ కి వెళ్తే సరిపోతుంది. ఇలా ఢిల్లీలోని డిజైనర్లు, బొటిక్స్, బట్టల దుకాణాల్లో లభించే ఫ్యాషన్ వేర్ మా వెబ్ సైట్ లో ఉంటాయి. కొత్త స్టాక్ వచ్చినప్పుడు వ్యాపారులే కొన్ని క్లిక్కులతో అప్ డేట్ చేసుకోవచ్చు.

ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్లు చాలానే ఉన్నాయి. కానీ మాలాగా 'ఇన్ స్టోర్' షాపింగ్ ను మరింత సులభతరం చేసే సైట్లు లేవు. అదే మా బలం. ఢిల్లీలో వందల స్టోర్స్ మా వెబ్ సైట్ లో ఉన్నాయి. త్వరలో ఇంకొన్ని స్టోర్స్ యాడ్ అవుతాయి. అన్ని షాపులకు మా వెబ్ సైట్ లో చోటు కల్పించడమే మా లక్ష్యం. ఫ్యాషన్ వెబ్ సైట్ లకు దీటుగా నడిపిస్తున్నాం. డిజైనర్లకు, బొటిక్స్ కి మంచి డీల్స్ అందిస్తున్నాం. ఢిల్లీలో మొదలు పెట్టిన మా ప్రయత్నాన్ని మరిన్ని నగరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాప్ ద్వారా మొబైల్ యూజర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాం. త్వరలో గ్లిట్ స్ట్రీట్ మ్యాగజైన్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags