సంకలనాలు
Telugu

చూపులేని ఏనుగులకు సంగీత సేవ

వణ్యప్రాణుల కోసం అంగలార్చిన బ్రిటీష్ సంగీత విద్వాంసుడుథాయ్‌లాండ్ వచ్చి ఆసియాపై మక్కువ పెంచుకున్నారుడొనేషన్లతో అభయారణ్య నిర్మాణంకళ్లులేని ఏనుగుల్లో ఆనందం నింపుతున్న వైనంజీవితాంతం పియానో వాయించడానికి సిద్ధపడిన వ్యక్తి

ashok patnaik
14th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ప్రపంచంలో అత్యంత శ్రేష్ఠమైన కలప ఏదని అడిగితే టేకు అని ఠక్కున్నజవాబిస్తాం. కానీ ఒక చేదు నిజమేంటంటే ప్రపంచంలో అడవుల వాటా 61 శాతం నుంచి 34 కు పడిపోవటానికి కారణం కూడా ఈ టేకు చెట్ల నరికివేతే. 1975-1986 మధ్య కాలంలో థాయ్‌లాండ్ తన మిగిలిన అడవిలో 28 శాతం కోల్పోయింది. కళ్ళు తిరిగే ఈ సమాచారం చూశాక అక్కడి ప్రభుత్వం వాణిజ్యపరంగా టేకు చెట్ల నరికివేత మీద 1989లో నిషేధం విధించింది. ఈ అడవుల నరికివేత పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిందో చెప్పలేం కానీ.. అక్కడే ఆవాసం ఉన్న ఏనుగులు మాత్రం బాధితుల జాబితాలో చేరాయి. అవి స్వేచ్ఛ కోల్పోయి టేకు దుంగలు మోయాల్సి వచ్చింది. ఒకవైపు అడవుల నరికివేత, మరోవైపు వీటిపై హింస కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలో కొమ్మలు తగిలి వాటి కళ్ళు చీరుకుపోవటం, ఒళ్ళంతా రక్తం కారటం తప్పేది కాదు. అడవుల నరికివేత మీద నిషేధం విధించినప్పుడు ఈ ఏనుగులకు నిరుద్యోగ సమస్య ఎదురైంది. అప్పటికే చాలా ఏనుగులు వాటి పనిలో భాగంగా నడుస్తూ కొమ్మలు చీరుకొని గుడ్డివయ్యాయి. స్వయంగా ఎలా బతకాలో వాటికి ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు.

image


ఇలాంటి ఏనుగులకు ఒక ప్రశాంతమైన ఆవాసం కల్పించటానికి క్వాయ్ నది ఒడ్డున ఒక స్వర్గధామం లాంటి అభయారణ్యం రూపొందింది. అది పూర్తిగా విరాళాల మీద నడుస్తుంది. పౌల్ బార్టన్‌గా పేరొందిన బ్రిటిష్ పియానో వాద్యకారుడు సాహసాలు చేద్దామని 1996లో థాయ్‌లాండ్ వచ్చాడు. కానీ దానికి బదులుగా జీవకోటి మీద ప్రేమ పెంచుకున్నాడు. ఆ దంపతులిద్దరూ గడిచిన ఇరవై ఏళ్ళుగా ఏనుగులకు పునరావాసం కల్పిస్తున్నారు. ఈ మధ్యనే ఆయన యాభయ్యవ పుట్టిన రోజు సందర్భంగా తన చిరకాల కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. చూపు లేని ఏనుగుల కోసం పియానో వాయించటమే ఆయన కోరిక. కష్టపడి కొండ పైదాకా దాన్ని మోసుకొచ్చాడు కూడా. ఎందుకంటే ఏనుగులన్నీ అక్కడే గుమికూడతాయి. దాని అసలు లక్ష్యం విరాళాల సేకరణే అయినప్పటికీ అలా చేయటం స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం.

ఏనుగుల ముందు పియానో వాయిస్తున్న పౌల్ బార్టన్

ఏనుగుల ముందు పియానో వాయిస్తున్న పౌల్ బార్టన్


పియానో వాయించటం పౌల్ బార్టన్ వృత్తి. పన్నెండేళ్ళ వయసులోనే సొంతగా నేర్చుకున్నాడు. ఉత్తర ఇంగ్లండ్‌లో సముద్రం ఒడ్డున ఉండే ఒక చిన్న పట్టణంలో తండ్రితో కలిసి పియానో వాయించేవాడు. అలా జీవితాంతం వాయిస్తూనే ఉన్నాడు. డ్రాయింగ్ అన్నాతనకి బాగా ఇష్టం. వాళ్ళ నాన్న కూడా పెయింటింగ్ వేయటం నేర్పారు. పదహారేళ్ళ వయసులోనే లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరాడు.

అలాంటివాడు థాయిలాండ్ లోని థాయ్ పియానో స్కూల్లో పియానో నేర్పటానికి అక్కడికి చేరాడు. ఆసియా అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుందని అనుకున్న పౌల్ మూడు నెలల పాటు గడపటం చాలా బాగుంటుందని ఈ అవకాశం వాడుకున్నాడు. కానీ అతనికి కాబోయే భార్య అక్కడే ఎదురైంది. ఆమెను పెళ్ళి చేసుకొని ఇప్పటికి పద్దెనిమిదేళ్ళు. వన్యప్రాణుల పరిరక్షణ అంటే ఆమెకెంతో ఇష్టం. ఆ ప్రభావం పౌల్ మీద పడింది.

image


అదృష్టవశాత్తూ కొంతకాలం కిందట థాయ్‌లాండ్‌లో అడవుల నరికివేతను చట్ట వ్యతిరేకంగా ప్రకటించారు. కానీ, దాంతో అక్కడి ఏనుగులకూ, వాటి మావటీలకూ పనిలేకుండా పోయింది. ఇదో పెద్ద సమస్యైంది. కంచనబురిలోని ఎలిఫెంట్స్ వరల్డ్ లాంటి కొన్ని ఏనుగుల అభయారణ్యాలు తయారయ్యాయి. అందులో ముసలి ఏనుగులు, గాయపడి వైకల్యం పాలైన వీధి ఏనుగులు ఉండేవి. అవి మళ్ళీ పనిచేయాల్సిన అవసరం లేకుండా క్వాయ్ నది ఒడ్డునే ఈ అభయారణ్యం ఏర్పాటు చేశారు. ప్లారా అనే ఏనుగు అడవిలో దుంగలు మోస్తూ వెళుతున్నప్పుడు కొమ్మలు చీరుకుపోయి దాని చూపు పోగొట్టుకుంది. జనం దాని నివాసమైన అడవిని నరికేసి, వాడుకున్నంత కాలం వాడుకొని ఇప్పుడు పక్కన బెట్టారు. గతంలో రెండేళ్ళపాటు చూపులేని పిల్లలతో కలిసి పనిచేసిన పౌల్, వాళ్ళ జీవితాల మీద సంగీతం ప్రభావాన్ని చూశాడు. అందుకే అదే సిద్ధాంతాన్ని ఈ చూపులేని ఏనుగుల మీదా ప్రయోగించాలనుకున్నాడు. ముఖ్యంగా ఏనుగు చాలా తెలివైనది. అందుకే సంగీతాన్ని ఆస్వాదిస్తుందనుకున్నాడు. ఎలాంటి సంగీతమైతే బాగుంటుందో బాగా ఆలోచించి బీతోవెన్ దగ్గర ఆగిపోయాడు. అది విన్నప్పుడు దాని స్పందన అద్భుతంగా ఉంది. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.

image


ఏనుగులు చాలా ఎక్కువ తిండి తింటాయి. అన్ని ఏనుగులకు అంత భారీగా తిండి సేకరించి పెట్టటం కుదిరే పనికాదు. ఏనుగు తినటం మొదలెడితే ఆత్రంగా తింటుంది. మళ్ళీ దొరుకుతుందో లేదోనన్న భయం. మెత్తటి ఆకులు దొరికితే చాలు... వాటిని పక్కకు లాగటం ఎవరివల్లా కాదు. ఆ ఉదయం అభయారణ్యానికి పెందలాడే పియానో తీసుకెళ్ళాడు పౌల్. ప్లారాను మెత్తటి ఆకులున్న వెదురు తోటదగ్గరికి తీసుకెళితే అది మరో ధ్యాస లేకుండా తినటం మొదలుపెట్టింది. బీతోవెన్ వాయించటం మొదలుపెట్టగానే తినటం ఆపేసింది. దాని తొండంలో ఉన్న సగం తిన్న వెదురే దానికి సాక్ష్యం. అది చూసిన తీరు అంతకుముందెప్పుడూ చూడలేదంటాడు పౌల్. అంటే, సంగీతం కారణంగా ఒక ఏనుగు తినటం ఆపేసింది.

image


ఏళ్ల తరబడి వాటికోసం పియానో వాయిస్తున్న పౌల్... మనుషులకూ, ఏనుగులకూ మధ్య తేడా గుర్తించాడు. కుక్కలూ, పిల్లులతో సహా అన్ని జంతువులకూ సంగీతం ఇష్టం. కానీ మనుషుల మెదడులోని న్యూరాన్ల కు దగ్గరగా ఉండటం ఏనుగుల ప్రత్యేకత. వాటి జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువ. చిన్నప్పుడు దాన్ని హింసిస్తే అది జీవితకాలం గుర్తుంచుకుంటుంది. అవి చూసిన, అనుభవించిన భయంకరమైన విషయాలను అది ఎప్పటికీ మరిచిపోదు.

ఒక ఏనుగుకు సున్నితమైన, అందమైన శాస్త్రీయ సంగీతం వినిపిస్తే దాని స్పందన అమూల్యం. వందలాది ఏళ్ళుగా మనుషులు విని ఆనందిస్తూ వచ్చిన సంగీతాన్ని చూపులేని ఏనుగుకు వినిపిస్తే అద్భుతంగా స్పందిస్తాయి. అప్పుడు ఏనుగుకూ, ఆ మనిషికీ మధ్య ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. అంటే, ఒక భిన్నమైన భాషలో మనం దానితో కమ్యూనికేట్ చేస్తున్నట్టు లెక్క. అది మన భాషా కాదు, దాని భాషా కాదు. బీతోవిన్ వాయిస్తూ ఉంటే మరో ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అనుభూతి కలుగుతుందంటాడు పౌల్. వీపు నొప్పితో బాధపడుతున్నా సరే, యాభయ్యేళ్ళ వయసులోనూ పియానో తీసుకొని కొండెక్కటానికి పౌల్ వెనుకాడడు. మనిషి కోసం చాలాకాలం పాటు శ్రమించిన ఏనుగును గుర్తు చేసుకుంటాడు. యుద్ధాల్లోనూ, దాని సొంత ఆవాసమైన అడవిని నరకటంలోనూ అది సాయపడింది. మనుషులు చేసిన ద్రోహానికి మనుషుల తరఫున క్షమాపణ చెప్పటం కనీస ధర్మమంటాడు పౌల్. అది అల్పాహారం తింటున్నప్పుడు కాస్త ఆహ్లాదం కలిగించేలా సంగీతం వినిపించటానికి ఈ మాత్రం కష్టపడటం చాలా తక్కువేనంటాడాయన.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags