సంకలనాలు
Telugu

స్టేజ్ మీద నుంచి విసిరిపారేయాలనే కోపం ప్రేక్షకుల్లో ఉన్నా.. స్టేజ్ వదలకపోవడం వల్లే ఈ స్థాయికి వచ్చా !

మీలో నవ్వించే కళ ఉంటే ఓపెన్‌ మైక్‌ అందుకోండిటెన్షన్లతో తలబద్దలయ్యే ఐటీషియన్లకు ప్రత్యేకంగా కామెడీ షోలుబిట్స్‌ పిలానీలో చదువుకుని సోలో షోలు చేస్తున్న ప్రవీణ్‌-ప్రవీణ్ కుమార్ మాటల్లోనే..

team ys telugu
23rd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

''యూట్యూబ్‌ పుణ్యాన మన దేశంలో కామెడీ, మిమిక్రీ వంటివి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. గతంలో మాదిరిగా కేవలం హాస్యగాళ్లన్న ముద్ర పోయింది. కళాకారులుగా గుర్తింపు వచ్చింది. ఈ ఘనత వీర్‌ దాస్‌, పాపా సిజెలకే దక్కాలి. సోలోగా కామెడీ సీన్లను ఎలా చేయాలో వాళ్లే మొదలెట్టారు. దీనిని వాళ్లు 'స్టాండ్‌ అప్‌ కామెడీ'గా జనంలోకి తీసుకెళ్లారు. మాలాంటివాళ్లందరూ వారిద్దరూ నిర్వహించిన 'ఓపెన్‌ మైక్‌ నైట్స్‌'ద్వారా కెరీర్‌ని ఆరంభించినవాళ్లమే !

ప్రవీణ్ కుమార్

ప్రవీణ్ కుమార్


నేను బిట్స్‌ పిలానీలో చదువుకుంటున్న రోజుల్లోనే కామెడీ మూకాభినయం (మైమ్‌) చేసేవాణ్ణి. దాదాపు 2,000 మంది ప్రేక్షకుల ఎదుట నా ప్రదర్శన జరిగేది. అంతమందిని నవ్వించడంవల్ల నాకొక తృప్తి కలిగేది. కాలేజీ నుంచి పట్టా పుచ్చుకుని బయటకు రాగానే అవకాశాలు అంతంతమాత్రం అయ్యాయి. నా తోటి విద్యార్థుల్లో దాదాపుగా అందరూ తలోదారి పట్టారు.

మైమ్‌ ప్రదర్శన ఇవ్వాలంటే, రసికులైన ప్రేక్షకులతోపాటుగా మన ఆలోచనలతో పాలుపంచుకునేవాళ్లుకూడా కావాలి. దాంతో 2008లో పెళ్లయ్యేంత వరకు నా ప్రదర్శనలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పటి పరిస్థితి వేరు. క్రమంగా నాకు పెళ్లిళ్లలో చాలా అవకాశాలు వస్తున్నాయి. 2008 డిసెంబర్‌లో పాపా సిజె గురించి ఒక ఆర్టికల్‌ చదివాను. అది చదివాక, స్టాండ్‌ అప్‌ కామెడీ నిర్వహించడానికి ఇతరుల అవసరం అక్కర్లేదనిపించింది. స్టేజిమీద నువ్వే... నువ్కొక్కడివే ! అదే సమయంలో మా కాలేజీ పూర్వ విద్యార్థుల వేడుక జరిగింది. నిర్వాహకులకు నా గురించి మిత్రుడొకడు పరిచయం చేశాడు. ఆ రోజు రాత్రి 10 ని.ల సేపు అవకాశం దక్కింది. ఎదురుగా ఉన్న ఆడియన్స్‌లో చాలామంది నాకు తెలిసిన ముఖాలే కావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. నా ప్రదర్శన మొదలైన రెండో నిమిషం నుంచే నవ్వుల వరద పొంగింది. అవన్నీ నా ప్రదర్శనవల్ల అనుకున్నానుగానీ, నిజానికి వాళ్లంతా నన్ను చూసి నవ్వడం మొదలెట్టారు. వెక్కిరింతలతో హాలు మారుమోగిపోయింది. నా ఫ్రెండ్‌ అయితే ఆశలు వదులుకున్నాడు. నేనుమాత్రం ఆత్మవిశ్వాసంతో ప్రదర్శన కొనసాగించాను.

నా ఆఫీసులో ఒకటి రెండుసార్లు షో చేశాను. అదృష్టవశాత్తు అవి క్లిక్‌ అయ్యాయి. బహుశా ఆ ఉత్సాహమే నన్ను స్టాండ్‌అప్‌ కామెడీకి చేరువ చేసి ఉండొచ్చు. 2009 జూలైలో నా మొట్టమొదటి ఓపెన్‌ మైక్‌ ప్రదర్శన చేశాను. బాగా చేశాననే అనుకున్నాను. తీరా, ఆ మర్నాడు ఫీడ్‌బ్యాక్‌ కోసం నిర్వాహకుల దగ్గరకు చుక్కెదురైంది. కామెడీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు చాలా సీరియస్‌గా చేయాలి అని తలంటాడు. ఏం చేయను ? నా దక్షిణాది యాస నన్ను ముందుకు సాగనివ్వలేదు. చాలా నిరాశలో కూరుకుపోయాను. అప్పుడే ఒక ఆశ మిణుక్కుమంది. 2009 సెప్టెంబర్‌లో వీర్‌ దాస్‌ బెంగళూరులో ఓపెన్‌ మైక్‌ పోటీలు నిర్వహించారు. అది నా కెరీర్‌లో గొప్ప మలుపు అయ్యింది. ఆ సందర్భంలోనే నేను సందీప్‌ రావును కలుసుకున్నాను. తర్వాత ఆరు మాసాల వ్యవధిలో వీర్‌ దాసు నాలుగుసార్లు బెంగళూరు వచ్చారు. ఒకసారి నేను నెగ్గాను. మరోసారి సందీప్‌ నెగ్గాడు.

ఇదిలా జరుగుతుండగానే, నేను 2009 నవంబర్‌లో తొలి కార్పొరేట్‌ ప్రదర్శన ఇచ్చాను. అదొక భయానక అనుభవం. నేను 20 ని.లపాటు స్టేజిమీద షో చేయాలి. మొదటి అయిదు ని.లు చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం. అంతలోనే చప్పట్లు మార్మోగాయి. నేను గొప్పగా ఫీలయ్యాను. కానీ, నిజం అది కాదు. 'ఇక చాలులే ఆపేయరా బాబూ' అనే సంకేతాన్ని చప్పట్లద్వారా ఇచ్చారు. అయినా నేను మొండిగా కొనసాగించాను. దాంతో ప్రేక్షకుల్లో సహనం చచ్చిపోయింది. బుడగలు పగలకొట్టడం, కేకలు వేయడం మొదలెట్టారు. ఆపేయక తప్పలేదు. స్టేజి దిగి పరుగో పరుగు. నా పేమెంట్‌ గురించికూడా ఆలోచించలేదంటే నమ్మండి. ఆ రోజంతా కుమిలిపోయాను. నాకు ఆ సమయంలో దన్నుగా నా కుటుంబం, స్నేహితులు నిలిచారు. వెనకడుగు వెయ్యొద్దని వెన్ను తట్టారు.

సంజయ్‌ మనక్తల ఇండియాకి రావడం నాకు గొప్ప మేలు చేసింది. నాకొక మంచి బ్రేక్‌ లభించింది. 2010 జూన్‌లో తాను వచ్చాక, నేను, సందీప్‌, సంజయ్‌ కలిసి వేర్వేరు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాం. మాతోపాటు సాల్‌ యూసుఫ్‌ జత కలిశాడు. ఆ ఉత్సాహంతోనే బచ్చూస్‌లో స్నాప్‌ నైట్‌ ఆరంభించాం. ఇది క్రమం తప్పకుండా ప్రతి నెల రెండో, నాలుగో ఆదివారాల్లో జరుగుతోంది. మేము బాగా పేరు తెచ్చుకున్నాం. కెన్నీ సెబాస్టియన్‌, అహ్మద్‌ షరీఫ్‌ల ప్రతిభనుకూడా వినియోగించుకున్నాం.

2001 ద్వితీయార్థంలో, దేశమంతా ఊపందుకుంటున్న తరుణంలో, ముంబైలో కామెడీ స్టోర్‌ తెరిచాం. అక్కడ నాతోసహా అందరూ అక్కడ తమ సత్తా చూపాల్సిందే. అదొక స్వప్న వేదిక. ఆదిలో అయిదేసి నిమిషాల స్పాట్స్‌ వేసేవాళ్లం. నెమ్మదిగా రుసుం వసూలు చేసేవాళ్లం. ఒక రోజున ఏమైందంటే, నా షో అయిపోయాక ఆ స్థలం యజమాని నా దగ్గరకొచ్చాడు. ఆయన బ్రిటిషర్‌. దక్షిణాది యాసలో నేను వాడిన థ్యాంక్స్‌ అనే మాట ఆయనకు అర్థం కాలేదట ! అదేమిటని అడిగాడు. చెప్పాను. 'ఇదే తరహాలో మాట్లాడుతున్నట్టయితే, నేను మిమ్మల్ని ప్రమోట్‌ చేయలేను. దానిని సరిజేసుకోండి' అనేసి కరాకండీగా చెప్పాడు. కథ మళ్లీ మొదటికొచ్చిందే అనుకున్నాను.

అశ్విన్‌ని కలిసినప్పుడు ఆయనొక సలహా ఇచ్చాడు. స్టేజి మీద మీవలెనే ప్రవర్తించండన్నాడు. ఆయన చెప్పినవి నాకింకా గుర్తున్నాయి. 'మీరు తమిళియన్‌. కాబట్టి తమిళియన్‌గానే స్టేజి మీద ఉండండి' అన్నాడు అశ్విన్‌. నా జీవితంలో ఇది మూడో మలుపు, అత్యంత విలువైనది. ఆ తర్వాత ఎక్కడ షో చేసినా నేనొక తమిళియన్‌ని అన్న వాస్తవాన్ని దాచుకోలేదు. నా యాసలోనే మాట్లాడాను. దీనివల్ల స్టేజిమీద చాలా సహజంగా, సౌకర్యంగా ప్రదర్శనలివ్వగలిగాను.

బెంగళూరులో కమెడియన్లకు ఆదరణ తగ్గడాన్ని గుర్తించాం. దాంతో శివార్లలోనికి మా ప్రదర్శనలు విస్తరించాం. ఉల్సూరులో ఓపెన్‌ మైక్‌ నైట్స్‌ ఆరంభించాం. మూడేళ్లుగా ప్రతి బుధవారం మా షో ఉంటుంది. చాలామందికి ఆ వేదికే ఓనమాలు నేర్పిందని చెప్పవచ్చు. కానన్‌ గిల్‌, వంశీధర్‌ భోగరాజు, కృతార్థ్‌, బిశ్వ కల్యాణ్‌ రథ్‌, సిద్‌, సతీష్‌ వంటి ఔత్సాహికులందరికీ అదే మొదటి మెట్టు అయ్యింది. 2012-13లో మళ్లీ కమెడియన్లకు ఆదరణ పెరిగింది. పబ్లిక్‌ షోలతోపాటుగా చాలా కార్పొరేట్‌ షోలు చేయసాగాం. కార్పొరేట్‌ షోలవల్ల సొమ్ములు బాగా వస్తాయి. పబ్లిక్‌ షోలవల్ల మనలోని కమెడియన్‌ బాగా రాటుదేలతాడు. ఇంత చేస్తున్నా నా ఆఫీసును మాత్రం వదలలేదు. దేశవ్యాప్తంగా 16 నగరాలు తిరిగాను, ఎన్నో షోలు చేశాను. అప్పుడప్పుడు కొన్ని ఓపెన్‌ మైక్‌ షోలు వదులుకోవలసి వచ్చింది. కొన్ని కొన్నిసార్లు మా అమ్మాయికి టీకాలు వేయించాలని, మా తాతకు తద్దినమని, అదని ఇదని వంకలు చెప్పి, ప్రదర్శనలకు వెళ్లేవాడిని.

2013 చివరలో ఉండగా రెండు పెద్ద నిర్ణయాలతో 2014ని ఆరంభించాలని తీర్మానించుకున్నాను. అందులో ఒకటి 'ది టికిల్‌ మైండెడ్‌' పేరుతో గంటసేపు జరిగే ప్రదర్శన; రెండోది నా ఉద్యోగానికి నీళ్లదిలేసి పూర్తిస్థాయి కమెడియన్‌గా మారిపోవడం. ముందుగా మా తల్లిదండ్రులను ఒప్పించాల్సి వచ్చింది. అదృష్టం కొద్దీ నా భార్య చాలా దన్నుగా నిలిచింది. నేను చేసేది ఏదైనా తనకు ఇష్టమేనని చెప్పింది.2014 జనవరి 4న టికిల్‌ మైండెడ్‌ తొలి ప్రదర్శనను బెంగళూరులో నాకిష్టమైన జాగృతి థియేటర్‌లో ఇవ్వడానికి రంగం సిద్ధం చేశాను. చూడడానికి మా తల్లిదండ్రులు వచ్చారు. వారి సమక్షంలో నేను చేసిన షో బ్రహ్మాండంగా సక్సెస్‌ అయ్యింది. అదే రోజు రాత్రి నేను ఉద్యోగం వదిలేస్తున్నానని చెప్పగానే, సరేనని ఆశీర్వదించారు.

జనవరి 6న నా రాజీనామా ఇచ్చేసి, తొందరగా విముక్తుణ్ణి చేయమన్నాను. ఇకమీదట స్టాండప్‌ కామెడీతోపాటుగా ఇంకా ఏదో ఒకటి చేయగలనన్న నమ్మకంతో ఉన్నాను. ఏదో ఒక అంశం ఆధారంగా థీమ్‌ షోలు చేయసాగాను. టిట్స్‌ పేరుతో ఐటి షో, ఎస్‌టిఎఫ్‌యు, డాడీస్‌ డే అవుట్‌ వంటివి ప్లాన్‌ చేసుకున్నాను. దాదాపుగా అన్ని ఓపెన్‌ మైక్‌లకు హాజరవుతాను. నా స్క్రిప్ట్‌లు నేను రాసుకుంటాను. గడచిన రెండేళ్ల కంటే పోయిన 10 నెలల్లోనే ఎక్కువ స్క్రిప్ట్‌లు రాసుకున్నాను. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశంకూడా దక్కింది. నా కూతురుని స్కూలుకి తీసుకెళ్లడం, మధ్యాహ్నం తీసుకురావడం వగైరాలతో ఉల్లాసంగా అనిపిస్తోంది. వారం వారం షోలను ఇప్పుడు వెంటవెంటనే ఒప్పుకుంటున్నాను. కొన్ని కొన్నయితే చివరి నిమిషాల్లో వచ్చినా కాదనడం లేదు. ఓపెన్‌ మైక్స్‌కి క్రమం తప్పకుండా వెళ్తుండడమనేది నాలోని కమెడియన్‌ పదునెక్కడానికి బాగా ఉపకరిస్తోంది.

బెంగళూరులోని జాగృతి థియేటర్‌లో ప్రవీణ్‌ ఇచ్చిన తొలి సోలో ఒన్‌-అవర్‌ ప్రదర్శన.

బెంగళూరులోని జాగృతి థియేటర్‌లో ప్రవీణ్‌ ఇచ్చిన తొలి సోలో ఒన్‌-అవర్‌ ప్రదర్శన.


ఓపెన్‌ మైక్‌లకు వెళ్లకపోతే కమెడియన్‌గా రాణించలేరు. బెంగళూరులో మేము వారానికి మూడు ఓపెన్‌ మైక్స్‌ నిర్వహిస్తున్నాం. తొందరలోనే మరొకటి ఆరంభించాలనుకుంటున్నాం. దేశంలో బెంగళూరుకే ఆ అవకాశం ఉంది. నానాటికీ ఇక్కడి కమెడియన్లలో జోరు బాగా పెరుగుతోంది. కొత్త కొత్తవాళ్లు వస్తూ ఓపెన్‌ మైక్‌ షోలకు రాణింపు తెస్తున్నారు. ఇక్కడ సీనియర్‌ జూనియర్‌ తేడా ఏమీ లేదు. అవసరాన్నిబట్టి యువ కమెడియన్లకు సీనియర్లు సలహాలిస్తుంటారు.

భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను. నా మటుకు నేను అన్నింట్లోనూ చెయ్యిదూర్చకుండా మనకేది మంచిదో దానిపైనే దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటాను. ఎ్కడో చదివినట్టు గుర్తు, అదేమిటంటే, గుహలో కూర్చుని గుర్తింపు పొందాలంటే వీలు కాదు. ఎవరైనాగానీ, తమ మనసు చెప్పినట్టే నడుచుకోవాలి. అయితే, స్థిరపడేవరకు ఉద్యోగాన్ని వదులుకోవద్దు అన్నదే నా సలహా. చాలామంది తొందరపాటుతో తమ కుతి తీర్చుకోవడానికి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుని రంగంలో దూకేస్తారు. తర్వాత్తర్వాత పశ్చాత్తాపపడతారు. ముందుగా తమ కలని, వాస్తవాన్ని సమతుల్యం చేసుకోవాలి. క్రమంగా మీ కలను సాకారం చేసుకోండి. అందమైన జీవితాన్ని సాధించండి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags