ఇంగ్లిష్ లిటరేచర్ చదివి ఇన్‌స్ట్రక్చరల్ డిజైనర్

ఆమె ఎప్పుడూ బ్యాంక్ బెంచ్ స్టూడెంట్ ఇంటర్‌లో అత్తెరసు మార్కులతో తల్లిదండ్రులు బెంబేలుఇంట్లో వద్దన్నా ఇంగ్లిష్ లిటరేచర్ డిగ్రీ, ఆపై కంప్యూటర్ కోర్స్అనుకోకుండా అదే రంగంలో ఉన్నత స్థాయికిఅప్పుడు వెక్కిరించిన వారికే ఇప్పుడు క్లాసులు తీసుకుంటున్న వైనందీపా పొట్టంగడి ఇన్‌స్పైరింగ్ స్టోరీ

7th Jul 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మీరు జాతకాలను నమ్ముతారా ? అయితే మీ సమాధానాన్ని ఆఖరి వరకూ అలానే ఉంచండి. ఈ స్టోరీ చదివిన తర్వాత మీ నిర్ణయం తప్పో కాదో తెలిసిపోతుంది.

ఒక క్లాసులో అందరి పిల్లల్లానే తాను ఓ బుడత. అన్ని క్లాసులకూ తప్పకుండా హాజరీ ఉండేది. అందరి కంటే ఎక్కువ ప్రశ్నలూ వేసేది. కానీ చివరకు అందరూ మొద్దులా చూసి గేలి చేస్తూ నవ్వుకునేవారు. ఆ చిన్న పిల్లే దీపా పొట్టంగడి. అయితే ఇప్పుడు క్లాసులకు బదులు కాన్ఫరెన్స్ హాల్స్ వచ్చాయి. ఆమెను ఫూల్ అనడం కాదు.. తనే ఫూల్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం బెంగళూరులోని యూకలిప్టస్ సిస్టమ్స్‌లో ఇన్‌స్ట్రక్షనల్ డిజైనర్‌గా పనిచేస్తోంది.

కంప్యూటర్లు, టెక్నాలజీ దీపకు అత్యంత ప్రియమైన స్నేహితుల్లా మారిపోయాయి. అయితే అది కూడా ఇంగ్లిష్ లిటరేచర్ డిగ్రీ తర్వాత. ఇవే కాదు దీప గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

దీపా పొట్టంగడి

దీపా పొట్టంగడి


జాతకంలో ఏముంది ?

సెకెండరీ పరీక్షలు(+2) పరీక్షల్లో దీప సరైన మార్కులు సంపాదించలేకపోయింది. దీంతో బెంగపడిన తల్లిదండ్రులు ఓ ఆస్ట్రాలజర్‌ దగ్గరకు వెళ్లారు. జాతకమంతా ఆసాంతం పరిశీలించిన తర్వాత తను కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే వృద్ధిలోకి వస్తుందని, ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటుందని సూచించారు. కానీ ఎవరి మాటా వినకుండా తాను మాత్రం బోల్‌పూర్ శాంతినికేతన్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేటర్ డిగ్రీ పూర్తి చేసింది. ఈ సందర్భంగా తన యూనివర్సిటీ తరపున ఎన్నో ప్రాంతాలకు వెళ్లి ఛాంపియన్‌గా నిలిచింది. అదే తనలో బలమైన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. తనలో గూడుకట్టుకుని ఉన్న బిడియం మొత్తం పటాపంచలైంది. కానీ చివరకు ఆ డిగ్రీ ఉద్యోగాన్ని మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. అయితే డబ్బులు సంపాదించేందుకు ఏదైనా మంచి కోర్సులో జాయిన్ కావాలని అప్పుడు దీప నిర్ణయించుకున్నారు. అప్పుడే ఎన్ఐఐటికి చాలా మంది విద్యార్థులు వెళ్లడాన్ని ఆమె గమనించారు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆమె ఎన్ఐఐటిలో ఓ కోర్సులో జాయిన్ అయ్యారు.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్

ఎన్ఐఐటి చేరడం యాదృచ్ఛికంగా జరిగిందే కానీ ప్లాన్డ్ నిర్ణయం మాత్రం కాదని. ఆమె 2000వ సంవత్సరంలో మూడేళ్ల GNIIT కోర్సులో చేరారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి ఆమెకు అప్పుడే మెల్లిగా అవగాహన మొదలైంది. కంప్యూటర్లంటే ఆమెకు ఎందుకో చెప్పలేని ప్రేమ మొదలైంది. రోజంతా గంటల తరబడి ల్యాబుల్లోనే గడిపేది. ఒక్కోసారి ల్యాబ్ నుంచి ఇన్‌స్ట్రక్టర్లు బయటకు పంపించేసిన ఘటనలూ ఉన్నాయి. టెక్నాలజీపై ఆమె పెంచుకున్న ప్రేమే కాలికట్‌లోని ఎన్ఐఐటిలో ఫ్యాకల్టీ జాబ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బెంగళూరుకు మారింది.

ఒరాకిల్‌లో ఇన్‌స్ట్రక్షనల్ డిజైన్ ఫ్యాకల్టీగా జాయిన్ కావడం దీప కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఎంటర్‌ప్రైజ్, అప్లికేషన్ లెవెల్ సొల్యూషన్స్‌పై ఉన్న అభిమానం విఎంవేర్, క్లౌడ్‌దట్ టెక్నాలజీస్.. ఆ తర్వాత యూకలిప్టస్‌వైపు నడిపించింది. ఇప్పుడామె కన్సల్టెంట్‌-కోర్స్‌వేర్ డెవలపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యూకలిప్టస్ ప్రొడక్ట్స్‌కు అవసరమైన కోర్స్‌వేర్ శిక్షణను డెవలప్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సపోర్ట్, డాక్యుమెంటేషన్ టీంలతో ఆమె సన్నిహితంగా పనిచేయాల్సి ఉంటుంది.

''నేను కోర్సులను డిజైన్ చేసేటప్పుడు అనేక మెథడ్స్ ఉపయోగిస్తాను. వాటిల్లో బ్లూమ్స్ థియరీ, ఆండ్రగాగీ లెర్నింగ్, టీచింగ్ మెథడాలజీలు ఉంటాయి. నాకు యూకలిప్టస్ ప్రొడక్ట్స్‌పై సాంకేతికపరమైన అనుభవం కూడా ఉంది. టెక్నికల్ ప్రొడక్ట్స్‌కు సర్టిఫికేషన్ ఎగ్జామ్స్‌ కూడా అభివృద్ధి చేస్తూ ఉంటాను. వీటితో పాటు ఈ సంస్థలో LMSను మెయింటెన్, మేనేజ్ చేసే బాధ్యత కూడా నాదే''

దీప ఈ పదేళ్ల కాలంలో అనేక విషయాలపై అవగాహన పెంచుకుంటూ వచ్చారు. ఏదో ఒక్క టెక్నాలజీకి అతుక్కుపోయి ప్రేమను పెంచుకుంటూ పోలేదు. 'నాకు ఒక్కటే తెలుసు.. భవిష్యత్తులో అయినా సరే నేను కంప్యూటర్లతోనే ఆడుకుంటాను అది కూడా కొత్త కొత్త టెక్నాలజీతో' అంటారు.

image


తనేంటో తనకే తెలుసు

దీప పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితుల నేపధ్యంలో తనకు భయమంటే ఏంటో తెలియదు. జెంషెడ్‌పూర్‌లో పుట్టిపెరిగి స్కూలుకు వెళ్లినప్పుడు తను ఓ సౌత్ ఇండియన్‌లా ఫీలై అందరికంటే భిన్నమని అనుకునేది. కేరళకు వెళ్లినప్పుడు తోటివాళ్లు తననో నార్త్ ఇండియన్‌లా చూసేవారు. తన జీవితంపై తండ్రి ప్రభావం చాలా ఎక్కువ ఉందని దీప చెప్తారు. తన తండ్రిని ఓ సక్సెస్‌ఫుల్‌ ఫాదర్‌గా ఆమె అభివర్ణిస్తారు. టాటా స్టీల్స్‌లో ఓ సాధారణ ఉద్యోగే అయినప్పటికీ తనను, తన తమ్ముడిని ఏ లోటూ లేకుండా పెంచారంటూ దీప గుర్తుచేసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా తమ తండ్రి నుంచి విలువలు నేర్చుకున్నట్టు చెప్తారు.

  • నిజాయితీ - ఇది నాకు ఉపకరించడంతో పాటు కొంత మందిని దూరం కూడా చేసింది. కానీ కొంత మందికి అర్థమయ్యింది ఏంటంటే నా దగ్గరికి వస్తే సరైన సలహా దొరుకుతుందనే నమ్మకం మాత్రం వాళ్లలో ఉంది.
  • ముక్కుసూటితనం - కాలంతో పాటు నేనూ చాలా నేర్చుకున్నాను. అలా ఉండడం వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కఠినంగా ఉండడం కంటే నిజాయితీ ఉండడం మేలని అర్థం చేసుకున్నా.
  • శ్రమ - కష్టపడడం అంటే ఏంటో మా నాన్నను చూసి తెలుసుకున్నా. ఆయనే నాకు స్ఫూర్తి.
  • రిలేషన్స్ కొనసాగించడం - నేను చాలా ఆలోచించి రిలేషన్ కలుపుకుంటాను. సన్నిహితులంతా నాకు స్నేహితులు కారు. అయితే నాలో లోపాలు ఏవైనా ఉంటే నా స్నేహితులు మాత్రమే గుర్తించి చెప్తారు.

ఎవరిలానో కావాలని తాను అనుకోవడంలేదు. కానీ జెఆర్‌డి టాటా, తన తండ్రి, జెఫ్ బెజోస్, షెరిల్ శాండ్‌బర్గ్ అంటే దీపకు ఎంతో స్ఫూర్తి. 'దాతృత్వం గురించి చాలామంది చాలా మాట్లాడతారు. కానీ దాని వాస్తవరూపాన్ని నేను జెంషెడ్‌పూర్‌లో తెలుసుకున్నాను. జెఆర్‌డి టాటా ఓ సంస్కృతిని అక్కడ తీర్చిదిద్దారు. ఎవరు ఏ పనిచేస్తున్నా ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకునే పద్ధతి అక్కడుంది. జార్ఖండ్‌లో ఓ అకాడమీనే ఏర్పాటు చేసి ఒలంపిక్స్‌కు ఆర్చరీ టీమ్‌ను పంపారు. AWS క్లౌడ్ రూపొందించి ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్ ధరను నేలకు దించిన జెఫ్ బెజోస్ అంటే కూడా నాకు చాలా గౌరవం.

టెక్నాలజీలో ఓ మహిళ

మహిళగా దీప తానెప్పుడూ చిన్నతనంగా ఫీల్ కాలేదు. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఆమెపై ఎంతో విశ్వాసాన్ని పెట్టుకున్నారు. కష్టపడితే పనిచేస్తేనే ఫలితం ఉంటుందని చిన్నప్పటి నుంచి నేర్పించారు. అయితే టెక్నాలజీ రంగంలో ఇప్పటికీ మహిళలు ఆశించిన స్థాయి లేరని ఆమె మాట. అంతేకాదు ఇతరులతో పోలిస్తే దీప ఎందుకు అంత ప్రత్యేకమో కూడా మీరే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన అనేక శిక్షణా తరగతులకు హాజరై నిత్యం తనను తాను అప్‌డేట్ చేసుకుంటుంది. ప్రతీ అవకాశాన్ని ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు ఉపయోగించుకుంటుంది. కుటుంబం, సమాజం సాకు చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడదు. ఇబ్బంది అయినా సరే కాన్ఫరెన్సులు, మీటింగ్స్‌కు వెళ్తుంది.

ఒకప్పుడు ఆమె ప్రతీ పనిలో పర్ఫెక్షన్ ఉండాలని తెగతాపత్రయపడేది. కానీ పెళ్లి తర్వాత ఆ ఆలోచన మారింది.

''ఇప్పుడు అత్యద్భుతంగా వంట కుదరకపోతే నేనేమీ అంత బాధపడను. ఒకప్పుడు అన్నింటిలోనూ బెస్ట్ అనిపించుకోవాలనుకునే దాన్ని. కానీ దేనిమీద ఫోకస్ చేయాలో, మనకు ఇష్టమైన వాటిపై ఎంద దృష్టిపెట్టాలో తెలుసుకున్నా''

లిటరేచర్ ఏమైంది ?

ఫిక్షన్ పుస్తకాలు ఎప్పుడైనా చదవినప్పుడు తనలోని లిటరేచర్ మళ్లీ బయటకు వస్తూ ఉంటుంది. కానీ తన ఖాళీ సమయాన్ని వంట చేయడానికి, ఫిట్‌గా ఉండేందుకు, పెయింటింగ్‌కు ఉపయోగించుకుంటారు. షెరిల్ శాండ్‌బగ్ రాసిన 'లీన్ ఇన్' పుస్తకం చదవడం తనకు ఎంతో ఇష్టం. ప్రతీ మహిళా ఆ పుస్తకాన్ని చదవాలని సిఫార్సు చేస్తారు. మహిళలను వెనక్కిలాగే అంశాలేంటో అందులో చక్కగా క్రోడీకరించారు. ఒకే సంస్థలో ఏళ్లకు ఏళ్లు ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటూ తమకు తాము మెరుగైన శిక్షణ ఇచ్చుకోవడం వల్లే వృద్ధిలోకి వస్తారనేది ఆ పుస్తక సారాంశమంటారు దీప.

మహిళలకు ఏదైనా చేయాలనేది దీప ఆరాటం. వంటలు, పెయింటింగ్, చేతిపనులు వచ్చిన చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. 40ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లకు ఎంతో తెలిసినా వాటికి వ్యాపార గుర్తింపు లేకపోవడం వల్లే ఇబ్బంది అనేది దీప భావన. సరైన కస్టమర్లకు వీళ్లను పరిచయం చేయడం వల్ల ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తారు. తన స్నేహితురాలి తల్లికి ఈ మధ్య ఓ ప్రోటోటైప్ వెబ్‌సైట్‌ను ఆమె తయారు చేయించి ఇచ్చారు. 'నేను ఎవరి దగ్గర నుంచీ డబ్బులు తీసుకుని ఇలాంటి పనులు చేయాలనుకోవడం లేదు. ఇలాంటి ఆలోచలవైపు మహిళలను మళ్లించడమే నా ధ్యేయ''మంటూ ముగిస్తారు దీప.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India