సంకలనాలు
Telugu

ఇకనుంచి ప్రతీ గురువారం కారు ఎక్కమంటున్న హైదారాబాదీలు !!

ashok patnaik
21st Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

రాహ్ గిరీ సక్సెస్ తో కార్ ఫ్రీ థర్స్ డే ప్రారంభమైంది. ప్రతి గురువారం కార్ లేకుండా ఆఫీసుకు వెళ్లే కొత్త సాంప్రదాయానికి ఇది నాంది పలికింది. మొదట్లో పదుల సంఖ్యలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు వందలు దాటి వేల సంఖ్యకు చేరుకుంది. ఇటీవల ఈ కార్యక్రమంలో పోలీసులు సైతం భాగస్వామ్యం కావడం జనంలో రెస్పాన్స్ మరింత పెరిగిందనే చెప్పాలి.

“ప్రతి గురువారం నేను ఆఫీసుకు సైకిల్ పై వెళతా” కమిషనర్, సివి ఆనంద్

గురువారం కారు వాడమంటూ ఐటి ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తాను కూడా గచిబౌలి లో ఉన్న ఆఫీసుకు ప్రతి గురువారం సైకిల్ పై వెళతానని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. పర్యావరణంపై అవగాహన కల్పిండమే కాదు, భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత నగరాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

image


కార్ ఫ్రీ సిటీ

ప్రస్తుతం ఈ కార్యక్రమం హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో సాగుతోంది. దీన్ని నగరమంతా వ్యాపించాలని చూస్తున్నారు. ఐటి ఉద్యోగులు కొన్ని గ్రూపులుగా ఏర్పడి దీనిలో పాల్గొంటున్నారు.

“వారంలో ఒకరోజైనా కారు లేకుండా ఆఫీసుకు రావాలని అంతా అనుకోవాలి.” ప్రశాంత్ బాచు

ప్రశాంత్ బాచు తో పాటు ట్రాన్స్ పోర్ట్ నిపుణులు దీని ఆర్గనైజింగ్ టీంలో ఉన్నారు. వీరందరి ఉద్దేశం ఒక్కటే. కార్ ఫ్రీ సిటీని తయారు చేయడమే. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ను మరింతగా ప్రచారం కల్పించాలని చూస్తున్నారు. కార్ల సంఖ్య తగ్గితే ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుందని అటు పోలీసుల ఆలోచన. సాధ్యమైనన్ని కార్లను తగ్గిస్తే పర్యవరణ హితంగా మారడమే కాదు పూర్తి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారిపోతుంది మన హైదరాబాద్.

image


కార్ పూలింగ్

కార్ పూలింగ్ యాప్ లకు ప్రచారం కల్పించడమే కాదు యాక్ట్ కార్ పూలింగ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులను కార్ పూలింగ్ చేసేలా ప్రొత్సహిస్తున్నాయి.

“నేను ప్రతి రోజూ ఉప్పల్ నుంచి హైటెక్ సిటీకి కారులో వస్తుంటా. ఎవరైనాకార్ పూలింగ్ దొరికితే పిక్ చేసుకుంటా.” మహమ్మద్ షకీ

ఐబిఎం ఉద్యోగి అయిన షకీల్ చెబుతున్న ప్రకారం గతంలో తానొక్కరే ఉప్పల్ నుంచి వచ్చే వారు. ఇప్పుడుకార్ పూలింగ్ ద్వారా కొంతమందిని పిక్ చేసుకుంటన్నారు. కార్ పూలింగ్ పై పూర్తి అవగాహన కల్పిస్తే మరింత మంది దీనికి అలవాటు పడతారు. తద్వారా కార్ల సంఖ్య తగ్గుతుంది. దీనిపై హైసియా అనే సంస్థ పనిచేస్తోంది. పోలీసులు సైతం దీనిపై పూర్తి స్థాయిలో పనిచేయడానికి ముందుకొచ్చారు. కౌన్సిలింగ్ ద్వారా ఐటి ఉద్యోగులు కార్ పూలింగ్ కు మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

image


కార్ ఫ్రీ థర్స్ డే టీం

కార్ ఫ్రీ థర్స్ డే సక్సెస్ కావడానికి చాలా ఎన్జీఓలు, సంస్థల సహకారం ఉంది. ఇందులో ప్రధానంగా ట్రాన్స్ పోర్ట్ నిపుణుడైన ప్రశాంత్ బాచు ఇనిషియేషన్ గురించి చెప్పాలి. రాహ్ గిరీ తోనే కార్ ఫ్రీ థర్స్ డే ప్రారంభించాలని అనుకున్నారు. రాహగిరికి పనిచేసిన చాలా మంది దీనికి కూడా పనిచేశారు. ఈ ఏడాది ఆగస్ట్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. దీంతో పాటు హైసియా ఫౌండర్ రమేష్ లోకనాథన్ కార్ ఫ్రీ థర్స్ డే లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు . ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ దీనిలో భాగస్వామ్యం అయింది. దీంతో పాటు వేల సంఖ్యలో ఐటి ఉద్యోగులు దీనిలో పాల్గొనడం ఇంతటి సక్సెస్ సాధించడానికి కారణమైంది.

image


భవిష్యత్ ప్రణాలికలు

కార్ ఫ్రీ థర్స్ డే ప్రధానంగా కార్ పూలింగ్ ని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చ ఏడాది ఆగస్టు సరికి ఈ కార్యక్రమం ప్రారంభించి ఏడాది కానుంది. అప్పటి లోగా కార్ పూలింగ్ పూర్తి స్థాయిలో నగరంలో విస్తరించాలనేది లక్ష్యంగా ముందుకు పోతున్నారు. సైక్లింగ్ పై సివి ఆనంద్ పాటు పోలీసు డిపార్ట్ మెంట్ తో ఓ భారీ కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి సైక్లింగ్ ను ప్రోత్సహించాలనుకుంటన్నారు. గురువారం కార్ ఫ్రీ హైటెక్ సిటీ ఏరియాకే పరిమితం కాకుండా నగరం మొత్తం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నిర్వాహకులు.

“పర్యావరణం కోసం ఈరోజు కార్ ను విడిచిపెట్టండి. రేపటి తరానికి కాలుష్యరహిత నగరాన్నివండి” ప్రశాంత్ బాచు
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags