సంకలనాలు
Telugu

ఇదో కొత్తరకం రెంటల్ స్టార్టప్..!!

RAKESH
28th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

చేతన్ ఆఫీసు పని మీద ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాడు. ఫ్లయిట్ మిస్సవుతుందన్న కంగారులో తన మ్యాక్ బుక్ ఛార్జర్ ఇంటి దగ్గరే మర్చిపోయాడు. ల్యాప్ టాప్ లేనిదే పని జరగదు. ఛార్జర్ కంపల్సరీ! రెండు రోజుల కోసం కొత్త ఛార్జర్ కొనడం వేస్ట్! మరేం చేయాలి? చేతిలో స్మార్ట్ ఫోన్ తో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది! ఒకే ఒక్క క్లిక్ తో చేతన్ చేతిలోకి ఛార్జర్ వచ్చేసింది!

 లక్నో వాసి మన్విత్ సింగ్ కు ఓ యాక్సిడెంట్ లో కాలు విరిగింది. నెల రోజులు కాలు కదపొద్దన్నారు డాక్టర్లు. వీల్ చెయిర్ దిగవద్దన్నారు. కొత్త వీల్ చెయిర్ కొనే స్థోమత లేక కాదు! తర్వాత దాంతో ఉపయోగం ఏంటని ఆలోచించాడు. ఒక్క ఫోన్ కాల్ తో మన్విత్ సమస్య కూడా తీరిపోయింది. ఓ నెల రోజుల కోసం ఇంటికి వీల్ చెయిర్ వచ్చింది!

image


షేరింగ్ ఎకానమీ! ఇంకా సూటిగా చెప్పాలంటే వస్తువులు రెంటుకు ఇవ్వడం, తీసుకోవడం! అమెరికా లాంటి దేశాల్లో హెయిర్ బ్లోయర్ దగ్గర్నుంచి హై-ఎండ్ కార్ల దాకా అన్నీ అద్దెకు దొరుకుతాయి. యూజ్ అండ్ పే పాలసీ! ఇండియాలో ఆ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కొత్తగా మార్కెట్లోకి రెంటల్ స్టార్టప్స్ దూసుకొస్తున్నాయి. రెంటొమో సరిగ్గా అలాంటి కంపెనీయే!

చిన్న నాటి డ్రీమ్

అన్షుల్ జోరి! వయసు 32. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పుణే యూనివ‌ర్సిటీలో ఎంసీఏ చేశాడు. తర్వాత ఐబిబో, ఆస్క్ లైలా, బుక్ అడ్డా, అమెజాన్ వంటి కంపెనీల్లో కొంత కాలం ఉద్యోగం చేశాడు. మంచి జాబ్. కోరినంత శాలరీ. కానీ త‌న డ్రీమ్ వేరు. ఆలోచన వేరు. కొత్తగా ఏదైనా ట్రై చేయాలన్నది చిన్ననాటి కల. అన్షుల్ ఓసారి యూర‌ప్ ట్రిప్ వెళ్లాడు. టూరిస్టులకు ఆతిథ్యం ఇచ్చే ఎయిర్ బీఎన్బీ అనే వెబ్ సైట్ సేవలు అత‌డిని బాగా ఆక‌ర్షించాయి. తను కూడా అలాంటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేయాలన్న ఆలోచన అప్పుడే మొదలైంది.

ప్రతీ ఇంట్లో స్టోర్ రూమ్ కామన్! అందులో వాడి ప‌డేసిన వస్తువులు చాలానే ఉంటాయి. పారేయ‌డానికి మ‌న‌సు రాక, మ‌ళ్లీ వాడాల‌న్న ఇంట్రస్టు లేక అవి అలా దుమ్ము పట్టి పోతుంటాయి. అలాంటి వస్తువులతో బిజినెస్ ఎందుకు చేయకూడదని అన్షుల్ ఆలోచించాడు! మనకు అక్కర్లేని వ‌స్తువులు ఇంకొక‌రికి పనికి రావొచ్చు. పైగా రెంటుకిస్తే కొంత డ‌బ్బు కూడా వస్తుంది. అందుకు సరైన ప్లాట్ ఫామ్ రెంటొమో!

య‌జ‌మానుల దగ్గర్నుంచి వ‌స్తువుల్ని రెంటుకు తీసుకొని, అవ‌స‌రం తీరాక తిరిగి ఇచ్చేయాలి! వినూత్న ఆలోచన! టెంపరరీ అవసరాలకు కొత్త వస్తువులు కొనాల్సిన ప‌నిలేదు. దానివల్ల డ‌బ్బు మిగులుతుంది. అటు రెంటుకు ఇచ్చిన వారికీ ఎంతో కొంత ఆమ్ దానీ! ఎలా చూసినా ఇద్దరికీ లాభమే! అయితే ఇక్కడే ఒక ప్రాబ్లమ్! అద్దెకిచ్చిన వ‌స్తువు తిరిగి రాక‌పోతే? ఒకవేళ వచ్చినా ఏదైనా డ్యామేజీ జరిగితే? దానికీ ఓ ప‌రిష్కారం ఆలోచించాడు అన్షుల్. చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు, కామన్ ఫ్రెండ్స్, క్లాస్ మేట్స్- ఇలా రెంటొమోలో ఒక క‌మ్యూనిటీని ఏర్పాటు చేశాడు. వారిలో అవసరం ఉన్న వారికి వస్తువులు రెంటుకు ఇవ్వొచ్చు. ఫేస్ బుక్ ఐడీతో ఇందులో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.

బిజినెస్ ప్రారంభించే ముందు అన్షుల్ చిన్నపాటి స‌ర్వే ఒకటి చేశాడు. వాడేసిన వస్తువులకు ఇండియాలో 9 బిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్ ఉంద‌ని గుర్తించాడు. గత ఏడాది 15 బిలియ‌న్ డాల‌ర్ల రెవెన్యూ వచ్చిందని తెలుసుకున్నాడు. 2025 క‌ల్లా షేరింగ్ ఎకానమీ విలువ ఏకంగా 335 బిలియ‌న్ డాలర్లకు చేరుకుంటుందుని తెలిసి షాకయ్యాడు. ఇంకేం ఆలోచించకుండా 2015 ఆగస్టులో రెంటొమో వెబ్ సైట్ ను లాంఛ్ చేశాడు. ముందుగా బెంగళూరు! ట్రావెల్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, మోట‌ర్ బైక్స్, ఎల‌క్ట్రానిక్ గూడ్స్ వంటి వస్తువులను రెంటుకు ఇవ్వడం మొదలు పెట్టాడు. అవసరాన్ని బట్టి రోజు, నెల, వారం లెక్కన ఐటమ్స్ అద్దెకు తీసుకోవచ్చు. పది రూపాయల నుంచి పది వేల దాకా వస్తువులు రెంటుకు దొరుకుతాయి.

ఈ మధ్యే రెంటొమో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ కూడా ప్రారంభించారు. ఎలాంటి ప్రమోషన్ లేకుండానే ఇప్పటికే వంద మందికి పైగా యూజర్లు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. దానికి కొత్తగా పేమెంట్, డెలివ‌రీ, ఇన్సూరెన్స్ లాంటి ఆప్షన్లు కూడా యాడ్ చేస్తున్నారు. అటు ఫేస్ బుక్ లో వెబ్ సైట్ ను ప్రమోట్ చేశారు.

వ్యాపార విస్తరణ

బెంగ‌ళూరులో మొద‌లైన రెంటొమో కార్యకలాపాలు మెల్లగా ఢిల్లీ, గుర్గావ్, పుణే, ల‌క్నో వంటి న‌గ‌రాలకు విస్తరించాయి. ఐదు నెల‌ల్లోనే 2,500 మంది యూజ‌ర్లు యాడ్ అయ్యారు. 300 వ‌ర‌కు లిస్టింగ్స్ ఉన్నాయి. నెల‌కు 350 దాకా ట్రాన్జాక్షన్స్ నమోదవుతున్నాయి. ఒక్క బెంగ‌ళూరు నుంచే 30 మంది వెండ‌ర్లు రెంటొమోను ఉపయోగించుకుంటున్నారు. కంపెనీ నెల‌నెలా 30 శాతం గ్రోత్ న‌మోదు చేస్తోంది. రిపీటెడ్ యూజ‌ర్స్ సంఖ్య కూడా పెరగడం విశేషం. పోయిన డిసెంబ‌ర్ లో కంపెనీ మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. యూకే నుంచి శివ అశోక్, యూఏఈకి చెందిన మ‌రో ఇన్వెస్టర్ కలిసి రెంటొమోలో ల‌క్ష డాల‌ర్లు పెట్టుబడి పెట్టారు.


మిగతా రెంటల్ స్టారప్స్ కు మా కంపెనీకి చాలా తేడా ఉంది. నమ్మకమే మా పెట్టుబడి! వెబ్ సైట్ కు మంచి ఆదరణ లభిస్తోంది. త్వరలో మరిన్ని వస్తువులను అందుబాటులోకి తీసుకొస్తాం- అన్షుల్
image


యువ‌ర్ స్టోరీ సేక‌ర‌ణ‌..

ఇండియాలో రెంట‌ల్ రంగం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వ‌స్తోంది. ప్రస్తుతం మ‌న దేశంలో 50 వేల పైచిలుకు రెంట‌ల్ స్టోర్లు, ఫేస్ బుక్ పేజీలు, గ్రూపులు పనిచేస్తున్నాయి. ఆన్ లైన్ లో కొత్త కొత్త రెంటల్ స్టార్టప్ లు వస్తున్నాయి. మెష్ యాప్, గ్రాబ్ ఆన్ రెంట్ లాంటివి ఆ కోవ‌లోకే వ‌స్తాయి. ప్రత్యేకంగా బట్టల కోసం క్లోజీ, ఫ‌ర్నీచ‌ర్ కు రెంటొమోజో వంటి స్టార్టప్స్ కూడా ఉన్నాయి. అవి విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి.

ఈ కొత్త సెక్టార్ లో తొలిత‌రం ఆంట్రప్రెన్యూర్లకు మార్కెట్లో మంచి అవ‌కాశాలు ఉంటాయి. నాణ్యమైన వ‌స్తువుల‌ను కస్టమర్లకు అందుబాటులోకి తేవ‌డానికి రెంటల్ రంగం మ‌రింత వ్యవస్థీకృతంగా, ప్రొఫెష‌న‌ల్ గా త‌యారు కావాలి. మౌలిక సూత్రాల‌ను, నిబంధ‌న‌ల‌ను రెంట‌ల్ స్టార్టప్స్ మ‌ర‌చిపోకూడ‌దు. ఈ విష‌యంలో రెంటొమోను ఆద‌ర్శంగా తీసుకోవాలి. అటు వెంచ‌ర్ కేపిట‌లిస్టులు కూడా రెంట‌ల్ రంగాన్ని గుర్తిస్తున్నారు. షేరింగ్, రెంటింగ్ పై జ‌నానికీ విశ్వాసం కలుగుతోంది. బోలెడంత డబ్బు పెట్టి కొత్త వ‌స్తువుల‌ను కొనడం క‌న్నా, షేర్ చేసుకోవ‌డ‌మే బెట‌ర్ అన్న ధోరణి పెరుగుతోంది. రెంటొమో లాంటి స్టార్టప్ లకు ముందంతా మంచికాలమే!

వెబ్ సైట్: రెంటొమో

యాప్ లింక్: గూగుల్ ప్లే స్టోర్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags