సంకలనాలు
Telugu

60వేల సెల్ఫీలతో మీకు ఛాలెంజ్ విసురుతున్న ఓ సోషల్ నెట్‌వర్క్

సెల్ఫీ ఛాలెంజ్. ఇదో ఫోటోగ్రఫీ యాప్. ఈ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకున్న వారికి కొన్ని ఛాలెంజస్ ఇస్తారు. వాటికి అనుగుణంగా సెల్పీ తీసుకుని అప్ లోడ్ చేయాలి.

bharathi paluri
18th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సెల్ఫీ ఛాలెంజి.. ఇదో ఫోటోగ్రఫీ యాప్. అయితే, ఇక్కడో తమాషా వుంది. మనం గ్యాలరీలోకెళ్ళి ఏదో ఒక ఫోటో తీసి అప్ లోడ్ చేసేద్దామనుకుంటే కుదరదు. అప్పటికప్పుడు ఫోటో తీసి అప్ లోడ్ చేయాల్సిందే.

Image credit - shutterstock

Image credit - shutterstock


2013 డిసెంబర్ లో ఈ యాప్ ఆల్ఫా వెర్షన్ లాంచ్ చేసిన తర్వాత బ్రహ్మాండమైన స్పందన రావడంతో మరో రెండు నెలలకే బీటా వెర్షన్ కూడా మార్కెట్ లోకి తెచ్చారు. గై కవసాకి, మాటియస్ ఆహ్న్ బర్గ్ లాంటి ఉద్దండుల నుంచి సైతం ప్రశంసలు రావడంతో సెల్ఫీ ఛాలెంజ్ ఫౌండర్స్ ఉత్సాహం మరింత రెట్టించింది. ఇప్పుడు ఈ యాప్ డౌన్ లోడ్స్ 50 వేలు దాటాయి. 60 వేలకు పైగా సెల్ఫీలు జనాలకు సవాలు విసురుతున్నాయి.

విశేషాలు

ఇందులో యూజర్లకు సెల్ఫీలు తీసుకోవడానికి రకరకాలు ఛాలెంజ్‌లు వుంటాయి. బాత్ రూమ్ అద్దం లాంటి సాదా సీదా ఛాలెంజ్‌ల దగ్గర నుంచి తలకిందులుగా తీసుకోవడం లాంటి.. కష్టమైనవి కూడా ఇందులో వున్నాయి. అందులో మనకిష్టమైన ఛాలెంజ్‌ను ఎంచుకుని ఆ విధంగా సెల్ఫీ తీసుకుని షేర్ చేసుకోవచ్చు.

ఛాలెంజ్ చూసిన వెంటనే సెల్ఫీ తీసి అప్ లోడ్ చేయొచ్చు. లేదా.. దాన్ని సేవ్ చేసుకుని తర్వాత ఎపుడైనా కూడా అప్ లోడ్ చేయొచ్చు.

షేరింగ్ లో కూడా రెండు రకాలు వున్నాయి. ఒకటి ఫ్రెండ్స్‌కి మాత్రమే షేర్ చేయొచ్చు. లేదా కమ్యూనిటీ మొత్తం చూసేలా షేర్ చేయొచ్చు.

ఒకరు తీసిన సెల్ఫీ కంటే తాము ఇంకా బాగా చేయగలమనుకుంటే, ఔట్సెల్ఫీ ఆప్షన్ కూడా వుంది. అలాగే తమ సెల్ఫీలను ఫేస్ బుక్, ట్విటర్ ల ద్వారా కూడా షేర్ చేయొచ్చు.

టీమ్ స్పిరిట్

యష్ కోటక్, నైహా శ్రీలకు ఈ సెల్ఫీ ఛాలెంజ్ సరదాగా మొదలైంది. దీనికి ఆదరణ పెరిగే కొద్దీ వాళ్ళు మరింత సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ సంస్థ కో ఫౌండర్ , సిఈవో .. యాష్‌కు పదహారేళ్ళనుంచే ఐటిలో ప్రావీణ్యం వుంది. 1996లో DALnet, Undernet, EFnet లకు ఐఆర్‌సి సర్వర్‌ను సెటప్ చేసిన ఏకైక భారతీయుడిగా యాష్ ను చెప్పుకోవాలి. పాతికేళ్ళకే ఆయన భారతదేశంలో మొదటి పివిఆర్ (పర్సనల్ వీడియో రికార్డర్ )కు రూపకల్పన చేసారు. అదే సమయంలో బ్లూటూత్ ఎనేబల్డ్ అడ్వర్టయిజ్‌మెంట్, మార్కెటింగ్ (బీమ్) టూల్‌ను కూడా రూపొందించారు. హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, బిహేవియరల్ ప్యాటర్న్స్ లో యష్ నిష్ణాతుడు.

ఇక నిహా శ్రీ ఒక హ్యాకర్. కాలేజిలో వున్నప్పుడే ఆమె తన తొలి వెంచర్‌ను మొదలు పెట్టారు. గ్రాడ్యుయేషన్ తర్వాత మేనేజ్‌మెంట్, బిజినెస్ డెవలప్‌మెంట్, మానవవనరులు, తదితర రంగాల్లో ప్రాజెక్టులను చేపట్టారు. యాష్‌తో కలిసి కొన్ని వెంచర్స్ చేపట్టిన తర్వాత ….. ఆ అనుభవంతో ఇప్పుడు సెల్ఫీ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు.

యశ్ కొటక్, నైహాశ్రీ, అంకుర్ కుమార్

యశ్ కొటక్, నైహాశ్రీ, అంకుర్ కుమార్


ఈ స్టార్టప్ లో రకరకాల హోదాల్లో 11 మంది పనిచేస్తున్నారు. కొంత సక్సెస్ చవి చూసిన తర్వాత సి టీ వో ను నియమించుకోవాలనుకున్నారు. అప్పుడే అంకుర్ కుమార్ ఈ సంస్థలో చేరారు. అంతకు ముందు అంకుర్ ఐనాక్స్ యాప్స్‌లో పనిచేసారు. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్, గ్రోత్ హ్యాకింగ్, తదితర రంగాల్లో అంకుర్‌కు మంచి అనుభవం వుంది. ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో మూడేళ్ళ అనుభవం వున్న దీపక్ బాలిగ.. ఈ సంస్థలో ఆండ్రాయిడ్ డెవలపర్ గా పనిచేస్తున్నారు.

ఈ మధ్యే ఈ సంస్థకు భారీగా ఫండింగ్ కూడా అందింది. అయితే, ఎంత వచ్చిందీ. ఎవరు పెట్టుబడులు పెట్టిందీ మాత్రం బయట పెట్టడం లేదు. నిపుణులైన స్టాఫ్‌ను నియమించడానికి, వ్యూహాత్మక టై అప్స్ కోసం, ప్రాథమిక మార్కెటింగ్ కోసం ఈ నిధులను వినియోగిస్తున్నట్టు సంస్థ చెప్తోంది. ప్రస్తుతానికి ఇది ఫ్రీ యాప్ కనుక దీనిని నుంచి ఆదాయం రావడం లేదు. అయితే, అసలు ఆదాయం మీద దృష్టి పెట్టడం కూడా లేదు. భవిష్యత్తులో జరిగే బి టు బి టై అప్స్ ద్వారా ఆదాయం పొందాలని ఫౌండర్స్ ఆలోచన. ప్రస్తుతం వాళ్ళు znapin అనే మరో ప్రోడక్ట్ పై పని చేస్తున్నారు. ఇది త్వరలో మార్కెట్లోకి వస్తుంది.

ఇన్స్టాగ్రామ్, ట్విటర్లు మా పోటీదార్లు. వాళ్ళతో పోటీపడాలే నిర్ణయించుకున్నాం. నిజానికి మా యాప్‌ను అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారనుకున్నాం. 90శాతం అమ్మాయిలు, 10 శాతం అబ్బాయిలు డౌన్ లోడ్ చేసుకుంటారనుకున్నాం. కానీ ఇది 50..50 నిష్ఫత్తిలో వుండడం ఆశ్చర్యంగా వుంది. ’’ అంటున్నారు.. యాష్,

ఆకర్షణీయమైన యాప్

ఈ యాప్ లో చాలా ఆకర్షణలున్నాయి. ఫేస్ బుక్, ట్విటర్ ల ద్వారా సైన్ అప్ అయ్యే అవకాశం వుండడంతో పాటు, చక్కటి యూజర్ ఇంటర్‌ఫేస్ మరో ఆకర్షణ. యాప్ ఓపెన్ చేసిన కొద్ది సెకన్లకే అదెలా పనిచేస్తుందో మనకి అర్థమైపోతుంది. దీంతో పాటు, గ్యాలరీ లో ఫోటోలు అప్ లోడ్ చేసే అవకాశం లేకపోవడం కూడా ఈ యాప్‌కు విశ్వసనీయత పెంచింది.

చిత్రవిచిత్రమైన సెల్ఫీలు నిండిన ఈ యాప్‌ను ఎంతసేపైనా చూస్తూ వుండొచ్చు. ఔట్ సెల్ఫీ ఫీచర్ ఇంకో ప్రధాన ఆకర్షణ.

మెరుగుపరిచే మార్గాలు..

ప్రస్తుతం ఈ సెల్పీలు ఫ్రెండ్స్ తోపాటు అందరికీ అందుబాటులో వున్నాయి. దీని వల్ల ప్రైవసీ విషయంలో పట్టింపుగా వుండేవాళ్ళు యాప్ కు దూరంగా వుండే ప్రమాదం వుంది. కనుక ఫ్రెండ్స్ కు మాత్రమే యాక్సెస్ వుండేలా ఒక ఫీచర్ వుంటే బావుంటుంది.

అలాగే యూజర్స్ తాము చూడాలనుకునే టాగ్స్ ను షార్ట్ లిస్ట్ చేసుకునే అవకాశం వుంటే కూడా బావుంటుంది. దీని వల్ల తమకిష్టం లేని ఛాలెంజస్ తో కాలయాపన జరగకుండా వుంటుంది. అలాగే ముందు ముందు వీడియో సెల్ఫీ ఛాలెంజ్ ను కూడా అందిస్తామని ఫౌండర్స్ చెప్తున్నారు.

యువర్ స్టోరీ అభిప్రాయం..

సెల్ఫీలు తీసుకోవడంలో సరదాను మరింత పెంచే ఓ మంచి యాప్ గా సెల్ఫీ ఛాలెంజ్ ను చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వున్న ఆదరణను మరింత పెంచుకునేలా ఈ యాప్ ను ఎలా తీర్చిదిద్దుతారో మునుముందు చూడాలి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags