సంకలనాలు
Telugu

అది తొడుక్కుంటే జారిపడ్డా తుంటి విరగదు.. వృద్ధుల కోసం వినూత్న ప్రాడక్ట్స్..

వయసు మళ్లిన వాళ్లకు రక్షణగా నిలిచే అండర్ గార్మెంట్

27th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


వయసు మళ్లిపోయినవారికి ప్రధాన గండం.. జారిపడటం దగ్గరే వస్తుంది. ఎముకల్లో పటుత్వం తగ్గిపోవడం, నడవడంలో తడబడటం, బాత్ రూముల్లో జారిపడటం వృద్ధులకు చాలా సహజం. అయితే ఇలాంటి సందర్భాల్లో వీరికి తగిలే గాయాలు తీవ్రంగా బాధపెడతాయి. వృద్ధాప్యంలో ఇవి తగ్గడం కూడా అంత తేలికైన విషయం కాదు. వారిని ఈ బాధల నుంచి విముక్తుల్ని చేయడానికి ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఓ వినూత్న ఉత్పత్తిని ఆవిష్కరించారు. ముఖ్యంగా కిందపడినప్పుడు నడుము, తుంటి ఎముకలు విరిగిపోకుండా ఈ డివైజ్ రక్షణ ఇస్తుంది.

అండర్ గార్మెంటే ఆయుధం

ఐఐటీ ఢిల్లీలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు దీనికి రూపకల్పనచేశారు. అండర్ గార్మెంట్ ను పోలి ఉండే ఈ డివైజ్ చుట్టు ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ఉంటుంది. తొడ ఎముక, నడుము దగ్గర పటిష్టంగా ఉంటుంది. దీన్ని ధరించిన వృద్ధులు కిందపడినా ఎములకు ఎటువంటి సమస్యా రాదు. నడుము భాగానికి రక్షణ ఇచ్చే ఈ అండర్ గార్మెంట్ డివైజ్ చిన్న సైజులో తేలికగా ఉంటుంది.

' ఈ డివైజ్ వంద శాతం కాటన్ తో తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ ఫోన్ తో.. మైక్రో సెల్యూలార్ ఇంజెక్షన్ తో దీన్ని రూపొందించడం వల్ల మంచి రక్షణ ఇస్తుంది. కింద పడిన సమయంలో తుంటి ఎముకపై ఎలాంటి భారం పడకుండా చేస్తుంది. దీని వల్ల ఎముకలు విరగడం, గాయాలు కావడం లాంటి సమస్యలేమీ ఉండవు." నరేష్ భట్నాగర్, ప్రాజెక్ట్ హెడ్

విస్త్రతమైన పరిశీలన

దీన్ని రూపొందంచిన తర్వాత... ప్రాజెక్ట్ బృందం విస్త్రతంగా పరిశీలన చేసింది. తొడుక్కున్న వారిద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. చాలా సందర్భాల్లో దీన్ని ధరించిన వృద్ధులు కిందపడ్డారు కానీ ఎవరికీ గాయాలు కావడం కానీ. ఎముకలు విరగడం కానీ జరగలేదు. అంతా బాగాను ఉన్నా సమస్య మాత్రం వారిచేత తొడిగించడమే. ఇదే అతి పెద్ద సవాల్ అని ప్రాజెక్ట్ టీమ్ భావిస్తోంది. పరిశోధన సమయంలో చాలామంది పెద్దలు దీన్ని ధరించడానికి అంగీకరించిన్పటికీ.. 92 శాతం మంది దాన్ని వాడటానికి ఇష్టపడలేదు. 

ఎయిమ్స్ లోని వృద్ధుల వార్డులో, ఘజియాబాద్ లోని సీనియర్ సిటీజన్స్ సొసైటీలతో పాటు ఇతర ఇనిస్టిట్యూట్లలో కూడా ఈ డివైజ్ ను పరీక్షించారు. అన్ని చోట్లా సంతృప్తికర ఫలితాలు వచ్చాయి. దీన్ని ధరించిన వారు కింద పడినప్పుడు ఎవరికీ ఎముకలు విరగడం, గాయాలు కావడంలాంటివి జరగలేదు. ఈ డివైజ్ రూపకల్పనకు ఐఐటీలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పాన్సర్ చేసింది. ఇటీవలే ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ లో ఈ ఉత్పత్తిని ప్రదర్శనకు ఉంచారు.

image


ఆన్ లైన్ లో లభ్యం

పరిశోధనల్లో మంచి ఫలితాలు రావడంతో దీన్ని త్వరలో ప్రజలకు అందుబాటులో తేవాలని ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఫ్లిప్ కార్ట్ తో చర్చలు కూడా జరిపారు. ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

" ఇలాంటి ఉత్పత్తి ధర అమెరికా వంద డాలర్లు.. అంటే ఆరువేలకు పైగానే ఉంది. కానీ ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల కృషితో ఇదివెయ్యి రూపాయల లోపే అందుబాటులోకి రానుంది. అయితే ఇలాంటి ఉత్పత్తి భారత్ లో ఇదే మొదటిది" నరేష్ భట్నాగర్, ప్రాజెక్ట్ హెడ్


వృద్ధులకు పెద్ద గండాన్ని తప్పించే అండర్ గార్మెంట్ డివైజ్ కు అప్పుడే మార్గెట్ వర్గాల్లో మంచి హైప్ వచ్చింది. వృద్ధుల్లో మరింత అవేర్ నెస్ పెంచితే... దీని వల్ల చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags