ఉత్తమ విద్యాసంస్థల ర్యాంకింగ్స్ ఇలా వున్నాయి..

ఉత్తమ విద్యాసంస్థల ర్యాంకింగ్స్ ఇలా వున్నాయి..

Tuesday April 04, 2017,

1 min Read

ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్ బెంగళూరు టాప్ వన్ పొజిషన్ లో నిలిచింది. తరచుగా వార్తల్లోకెక్కిన జేఎన్ యూ- యూనివర్శిటీ కేటగిరీలో టాప్ 2 స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాసు రెండో స్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ టాప్ వన్ పొజిషన్ లో ఉంటే.. టాప్ కాలేజీ లిస్టులో ఢిల్లీ మిరిండా హౌస్ నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు పదోస్థానం దక్కగా.. యూనివర్శిటీ విభాగంలో హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీకి 7వస్థానంలో నిలిచింది. ఉస్మానియాకు 23వ స్థానం దక్కగా, ఎస్వీయూ 68వ స్థానంలో నిలిచింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం 69వ స్థానంతో సరిపెట్టుకుంది.

image


ఓవరాల్ ర్యాంకింగ్స్

1. ఐఐఎస్సీ బెంగళూరు

2. ఐఐటీ మద్రాసు

3. ఐఐటీ ముంబై

4. ఐఐటీ ఖరగ్ పూర్

5. ఐఐటీ ఢిల్లీ

6. జేఎన్ యూ ఢిల్లీ

7. ఐఐటీ ఖరగ్ పూర్

8. ఐఐటీ గువాహటి

9. ఐఐటీ రూర్కీ

10. ఐఐటీ బెనారస్ హిందూ యూనివర్శిటీ, వారణాసి

మేనేజ్మెంట్ కేటగిరీలో

1. ఐఐఎం అహ్మదాబాద్

2. ఐఐఎం బెంగళూరు

3. ఐఐఎం కోల్ కతా

4. ఐఐఎం లక్నో

5. ఐఐఎం కోజికోడ్

6. ఐఐటీ ఢిల్లీ

7. ఖరగ్ పూర్

8. ఐఐటీ రూర్కీ

9. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, జంషెడ్పూర్

10 ఐఐఎం ఇండోర్

టాప్ యూనివర్శిటీలు:

1. ఐఐఎస్సీ బెంగళూరు

2. జేఎన్ యూ న్యూ ఢిల్లీ

3. బీహెచ్ యూ వారణాసి

టాప్ కాలేజీలు:

1. మిరిండా హౌస్, ఢిల్లీ

2. లయోలా కాలేజీ, చెన్నయ్

3. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ

టాప్ ఫార్మా కాలేజీలు:

1. జామియా హందర్ద్ , న్యూ ఢిల్లీ

2. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మొహాలీ

3. యూనివర్శిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్

2015, సెప్టెంబర్ నుంచి హెచ్ఆర్డీ మినిస్ట్రీ విడుదల చేస్తున్న ఈ ర్యాంకుల జాబితాలో అనేక అంశాలను పరిణగలోకి తీసుకుంటున్నారు. మొత్తం 3,300 విద్యాసంస్థల పనితీరుని లెక్కలోకి తీసుకుని ర్యాంకులు విడుదల చేశారు. రీసెర్చ్ పేపర్లు, రిక్రూట్మెంట్, బోధన, అవగాహన, ఇంకా తదితర క్రైటేరియాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.