సంకలనాలు
Telugu

హిందూపూర్ నుంచి ఆస్కార్ లైబ్రరీ దాకా

సినిమా నిర్మాణంలో తెలుగబ్బాయి అద్భుతాలుచిన్ననాటి కలను నెరవేర్చుకున్న రాజేంద్ర వినోద్అనేక భాషల్లో పదిసినిమాల నిర్మాణంలఘు చిత్రాల్లో తనదైన మార్క్

ashok patnaik
26th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సినిమా తీయాలంటే ఇండస్ట్రీలో పెద్దలు తెలియాలా ? లేక సెలబ్రిటీల పిల్లలై ఉండాలా ? అలాంటిదేమీ అక్కర్లేదని నిరూపించాడు అనంతపురం జిల్లాలోని హిందూపురం కుర్రాడు వినోద్. లఘుచిత్రాలతో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల పల్లె చినగొట్టిగళ్లు వినోద్ జన్మస్థలం. ఈ పల్లె గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోడానికి కారణం ఇక్కడొక ఫిల్మ్ మేకర్ పుట్టడమే. 24ఏ ళ్ల రాజేంద్ర వినోద్ పుట్టింది ఇక్కడే అయినా పెరిగింది హిందూపూర్‌లో. వినోద్ నాన్న రాజేంద్ర నాయుడు రైల్వే ఉద్యోగి. అమ్మ వాణి హోం మేకర్. వినోద్ అక్కకి 13 ఏళ్లకే పెళ్లైపోయింది. ఇది వినోద్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.

రాజేంద్ర వినోద్

రాజేంద్ర వినోద్


రాజేంద్రవినోద్ ఫీచర్

చిన్నతనం నుంచి సిగ్గరి అయిన వినోద్ ఎప్పుడూ అక్కతో పాటే ఉండేవాడు. తనకు పదకొండేళ్లున్నప్పుడు అక్కకు పెళ్లైంది. అప్పటి నుంచి తన జీవితంలో చాలా మార్పలొచ్చాయట. తర్వాత మాస్ కమ్యునికేషన్, మీడియాపై ఇష్టంతో జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. చిన్ననాటి కలలు, ఆలోచనలు తాను ఫిల్మ్ మేకర్ కావడానికి ఉపయోగపడ్డాయని అంటారు వినోద్. గతంలో తానొక పుస్తకంలో చదివిన విషయాన్ని వినోద్ గుర్తు చేసుకున్నారు. చిన్న పట్టణంలో పుట్టడం వల్ల ఫిల్మ్ మేకర్ కాకూడదనే రూల్ ఎక్కడా లేదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడం వల్ల సినిమా తీయలేమనే అభిప్రాయం పోవాలి. సినిమాల్లో కొన్నాళ్లు అసిస్టెంట్‌గా ఎక్కడా పనిచేయ లేదు కనుక సినిమా తీయడం కష్టమనే భావన పోవాలి. ఇలా కొన్ని లైన్లు వినోద్ ని బాగా మోటివేట్ చేశాయట. దీంతో వినోద్ బెంగళూరుకు మకాం మార్చారు. ఫిల్మ్ మేకర్ అయిపోయారు. 

2012లో వినోద్ బెంగళూరులో అడుగుపెట్టారు. ఎం ఎస్ మల్టీమీడియాలో కోర్సు పూర్తి చేశారు. కోర్సులో భాగంగా షార్ట్ ఫిల్మ్స్ తీసే అవకాశం వచ్చింది. తాను హిందూపూర్ లో బిటెక్ చదివే రోజుల్లో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్న కల ఈ రకంగా తీరిందంటారు వినోద్. చిన్ననాటి నుంచి ఎన్నో ఎమోషన్స్‌ను చూడటం వల్ల తన సినిమాలో మంచి ఫిక్షన్ ను చూపించగలిగారట.


ఫిల్మ్ మేకింగ్ కెరీర్

లఘుచిత్రాలు, యాడ్‌లు, డాక్యుమెంటరీ మొత్తం పది దాకా సినిమాలను వినోద్ తీసారు. అన్ని AARVI ఫిల్మ్స్ బ్యానర్ కింద తీసినవే. తెలుగు, ఫ్రెంచ్, తమిళం, మరాఠాతోపాటు ఇంగ్లీష్‌లో వినోద్ సినిమాలు తీసారు. తాను తీసిని లేపాక్షి అనే సినిమా 11 భాషల్లో డబ్ అయింది. తన ఇంగ్లీష్ చిత్రం చేంజ్ మంచి స్క్రీన్ ప్లే చిత్రంగా ఆస్కార్ లైబ్రరీలోకి ప్రవేశించింది. తన లఘు చిత్రాలకు గానూ అవార్డులు కూడా పొందారు. నవంబర్ 2014 లో ఢిల్లీలో జరిగిన షార్ట్ ఫిల్మ్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్వీ ఫిల్మ్స్ బెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌గా గుర్తింపు పొందింది. లక్ష లోపు బడ్జెట్‌తో సినిమాలు తీసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోపేరు సంపాదించింది.

“ నా సినిమాలన్నింటిలో ఎన్నో కాన్సెప్ట్‌లు ఉన్నాయి. పయనం అనేది సిబ్లింగ్ రిలేషన్ మీద తీసిన సినిమా. ఫియర్ అనేది హర్రర్ షార్ట్ ఫిల్మ్. ఓవర్ యాక్షన్, ఎగ్జామ్స్ అనేవి కామెడీ చిత్రాలు. యువతరం ఆలోచనపై తీసిన సినిమా చేంజ్. అరణి అనేది విమన్ ఎంపవర్మెంట్ , లేపాక్షి అనేది హెరిటేజ్ పై తీసిన సినిమా. 2 నుంచి 10 నిముషాల నిడివి గల సినిమాలు తీయడానికి తన ధనాన్ని, ట్యాలెంట్‌ని ఉపయోగిస్తున్నారు. ఎన్నో రకాలైన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివళ్లకు పంపుతుంటారు. తర్వాత వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తారు. ఫీచర్ ఫిల్మ్ కంటే కొన్ని రూల్స్ పాటించాలి. కానీ లఘు చిత్రాలైతే తాను చెప్పాలనుకున్న విషయం డైరెక్ట్‌గా చెప్పే అవకాశం ఉందంటారాయన. సిన్స్, మతవిశ్వాసాలపై వినోద్ సినిమాలు తీయాలనుకుంటున్నారట. అమిర్ ఖాన్ పికే సినిమాలాంటి సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇప్పటికి పల్లెటూళ్లలో చేతబడులు లాంటి మూఢవిశ్వాసాలున్నాయని , అలాంటి వాటిపై కూడా సినిమా తీస్తానని ప్రకటించారయన.

తన సినిమాకు వచ్చిన అవార్డును అందుకుంటూ

తన సినిమాకు వచ్చిన అవార్డును అందుకుంటూ


తన మద్దతుదార్లు

“మాఅమ్మనాన్నలే నాకు మంచి మద్దతు దారులు. నా కలని నెరవేర్చుకోడానికి తల్లిదండ్రుల సహకారం ఎంతగానో ఉంది. నా స్నేహితులు కూడా నకెంతో మద్దతిచ్చారు. నేనీ స్థితిలో ఉండటానికి వారి చేసింది ఎంతగానో ఉపయోగపడింది. అని వినోద్ ముగించారు.


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags