సంకలనాలు
Telugu

నెలకు 60రూ. సంపాదన నుంచి బిజినెస్ సామ్రాట్ ఎదిగిన గుప్తా

చేసిన మంచి పనులే స్పూర్తిమొదటి నుంచి కష్టపడే తత్వమేసమాజాన్ని చదువుతూ అడుగులుముక్తి ఎయిర్ వేస్ ను గాడిలో పెడతామంటున్న టైకూన్

21st Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఏదైనా సాధించాలంటే ముందుగా నువ్వు సాధించగలవనే నమ్మకం కలగాలి. నువ్వు చేయగలవనే ఆత్మవిశ్వాసం నిన్ను ఏ శక్తీ ఆపలేదంటారు గుప్త. పేదవాడిగా పుట్టడం తప్పుకాదు.. పేదవాడిగా చనిపోవడం ముమ్మాటికీ తప్పంటారు. డబ్బులు సంపాదించడానికి ఉన్న మార్గాలన్నింటినీ వంటపట్టించుకున్న ఆయన .. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రోల్ మోడల్ గా మారారు. ఇది అతని కథ.నాకు వాటిలో ఏమి లేవు.. అవి ఏమి నాకు తెలియదు... కానీ ఈ రోజు ఓ మంచి వ్యాపారవేత్త గా మారి ఇతరులను ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నాను. 200 చదరపు అడుగుల ఇంట్లో అద్దెకు ఉంటూ...నెలకు అరవై రూపాయిల జీతం నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్ టైకూన్ గా మారిపోయారు. ఈ స్థాయికి ఎదగడానికి రాజ్ కుమార్ గుప్తా జీవితంలో ఎంతో కష్టపడాల్సి వచ్చిందని వివరిస్తారు. కష్టాలు, బాధల నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుందని చెప్తారు. కానీ ఆయన కలల సాకారం కోసం చేసిన కృషిని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటారు. డబ్బు సంపాదించడమే సక్సెస్ మంత్రమంటారు. నెలకు అరవై రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, గుప్తా సమాజం గురించి ఆలోచించేవారు. ఆర్ధికంగా ఎదుగుతున్న ఆ కుటుంబం చిన్న ఫ్లాట్ లో ఉన్నప్పుడు కూడా, ఇతరుల శ్రేయస్సు ఆలోచించడమే ప్లస్ పాయింట్ గా చెబుతారు. కర్మ సిద్ధాంతంపై నమ్మకం లేకపోతే..తన స్టోరీ మాత్రం.. నమ్మకాన్ని కల్గిస్తుందని వివరిస్తారు గుప్తా..

రాజ్ కుమార్ గుప్త

రాజ్ కుమార్ గుప్త


రాజ్ కుమార్ గుప్తా ముక్తి గ్రూప్, ఛైర్మన్. బెంగాల్ లో ముక్తి గ్రూప్ నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముక్తి గ్రూప్ హుగ్లీ బెల్ట్ లో బహుళ అంతస్థుల నివాసాలకు శ్రీకారం చుట్టింది.1984 సంవత్సరంలో మొదటి సారిగా హుగ్లీ జిల్లాలో ఫస్ట్ రెసిడెన్షియల్ ప్లాట్స్ నిర్మించడం ద్వారా కోలకతాలో ఆధునిక నిర్మాణానికి తెర తీసింది. ఇంకా మల్టీప్లెక్స్, ఇంటర్నేషనల్ హోటల్, లాంజ్ లు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ల నిర్మాణాలు చేశారు. ఇలా ఒక్కో అడుగు తో.. నిర్మాణ రంగంలో మెఘల్ గా ఎదిగిన రాజ్ కుమార్ గుప్తా పేరు నెట్ వాసులకు పరిచయమే.

గుప్తా కేవలం వ్యాపారమే కాదు... చారిటీ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించారు. వినయంతో, అందరిని ఒప్పించే విధంగా ఉండడం వల్లే తాను ఆయా రంగాల్లో దృష్టి కేంద్రీకరించి విలువలు కాపాడడమే సక్సెస్ ఫార్ములా అని ఇంటర్వ్యూలో అంగీకరించారు. ఆయన విజయం వెనుక ఎన్నో ఇబ్బందులు తట్టుకోని ఈ స్థాయికి ఎదిగానని చెప్పుకొస్తారు.తన విజయం ఎంతో మందికి స్పూర్తిని ఇస్తుందని.. దాన్ని సాధించడానికి ఎంతో కష్టపడ్డానని గుర్తుచేసుకుంటారు..

టెలీగ్రాఫ్ పత్రికలో పడిన ఆర్టికల్

టెలీగ్రాఫ్ పత్రికలో పడిన ఆర్టికల్


పంజాబ్ నుంచి అడుగులు..

రాజ్ కుమార్ గుప్తా... పంజాబ్ లో చాలా పేద కుటుంబంలో జన్మించారు. అక్కడచాలా కష్టపడి స్కూలింగ్ పూర్తి చేశారు. తర్వాత కొలకత్తాకు వచ్చిన ఆయన అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి...1978లో ఓ చిన్న ప్రైవేట్ సంస్థలో నెలకు అరవై రూపాయిల జీతానికి చేరారు. తర్వాత కొన్నాళ్లకు నెలకు నూట ఇరవై అయిదు రూపాయలు జీతానికి హిందూస్థాన్ మోటార్స్ కు వెళ్లారు. ఐదారు సంవత్సరాలు అక్కడ పని చేసిన తర్వాత గ్రౌండ్ లెవల్ లో అనుభవం సంపాదించి వ్యాపారంలో కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నారు. అప్పుడే ఆయన సొంతంగా ట్రేడింగ్, సప్లై లకు సంబంధించిన వ్యాపారం ప్రారంభించారు.

నా దాతృత్వం విజయ మార్గం

నేను కొలకత్తాలోని 200 చదరపు అడుగుల ఇల్లు అద్దెకు తీసుకొని కుటుంబం తో నివసించేవాడ్ని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నా...నానుడి నాకు బాగా పని చేసింది. అదే నేను ఓ సొంత వ్యాపారం ప్రారంభించడానికి కారణమైంది. నేను ఎల్లప్పుడూ జీవితంలో ఏదో సాధించాలనే తపన కలిగి ఉండే వాడ్ని. ఎందుకంటే చాలా మంది కంటే నేను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉంటాను.. ఇదే విషయాన్ని స్నేహితులతో చాలా సార్లు చెబుతూ ఉంటాను. వారు నాతో సొంతంగా మనుగడ సాగించడం కష్టమైన పనంటారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పేవాడ్ని అంటూ వివరిస్తారు రాజ్ కుమార్ గుప్తా. ఇంకా చాలా మంది కంటే మనం ఎంతో నయమని... స్టేషన్లలో నిద్రపోయి..వ్యర్థ పదార్ధాలు తినే వారి కంటే ఎంతో అదృష్టవంతులం. ఇంకా నిజంగా ఎవరికైనా సాయం కావాల్సిన వారికి అందించే స్థితిలో ఉన్నామని చెప్పుకొస్తారు..

గుప్త కుటుంబం

గుప్త కుటుంబం


సాయంతో నే గుర్తింపు

ఉన్నదాంట్లో కొంత మొత్తాన్ని ఛారిటీ కోసం ఉపయోగించాలని నిర్ణయానికి వచ్చాము. మంచి ఆలోచనలు, ఉద్దేశ్యాలు ఉంటే సమయం అదే దొరుకుతుంది. అలా ఆలోచనలతో ఉన్న మేము కొల్ కత్తా స్టేషన్లలో నిరాశ్రయులకు శుభ్రమైన తాగునీరు అందించడం, ఇంకా చిన్న పిల్లలకు మంచినీరు అందించేందుకు ' మట్కా ' తో పాటు ఓ మనిషి ని ఏర్పాటు చేశాం. దాని కోసం నెలకు యాభై , అరవై రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు. దీని కోసం మా స్నేహితులందరం ఫండ్ తయారు చేసి, సేవ చేస్తూ సొంత జీవితాల్లో వెలుగులు నింపుకున్నాము..ఇలా సోషల్ వర్క్ ప్రారంభించామని గతాన్ని గుర్తు చేసుకున్నారు గుప్తా.

జీవితంలో ఇంకా ఏదైనా సేవ చేయాలనుకున్న నేను పేద ప్రజలకు ఉచిత హోమియోపతి ఆసుపత్రి ప్రారంభించాలనే ప్రతిపాదనను స్నేహితులకు వివరించాను. దానికి ఖర్చు ఎక్కువ అవుతుందంటూ నిరాశ పరిచారు. అయితే ఏదైనా పట్టుదలతో పనిచేస్తే వైఫల్యం దరికి రాదని నా నమ్మకం. కష్టపడకుండానే సాధించలేమనుకుంటే ఎప్పటికి అక్కడే ఉండిపోతామంటారు. అప్పుడు ఎనిమిది నుంచి పది అడుగుల గారేజ్ ను నలబై రూపాయిలకు అద్దెకు తీసుకున్నాము. కొంత మంది దగ్గర నుంచి నిధులు, మరి కొంత మంది బెంచ్ లు, కర్టెన్లు, మెడిసిన్ కిట్.. ఇలా ఒక్కొక్కరు ఒక్కటి ఇచ్చారు. అనుకున్న పదిహేను రోజుల్లో పూర్తయిన హోమియో డిస్పెన్సరీలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ను నియమించాం. ఇక ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేయాలనుకున్నాం.అయితే నా ఓల్డ్ కంపెనీ హిందుస్థాన్ మోటర్స్ లిమిటెడ్ అధ్యక్షుడు ఎన్ కె బిర్లా మా ఆహ్వానాన్ని అంగీకరించారు. ఆయనకు హోమియో మందులు ఇవ్వడం హాబీ కావడం మాకు ప్లస్ పాయింట్.. ప్రారంభోత్సవానికి భారీగా బ్యానర్లు ఏర్పాటు చేయడం.. పెద్ద ఎత్తున ఫైర్ వర్క్స్ కాల్చడం నా జీవితంలో మంచి అనుభూతి మిగిల్చిందంటారు.వరుసగా చేస్తున్న సేవలతో రాజ్ కుమార్ గుప్తాకు సంఘంలో గౌరవం పెరిగింది. వెంటనే రోటరీ క్లబ్ లో గౌరవ సభ్యత్వం అభించింది. వెంటనే పెద్ద పెద్ద పెట్టుబడిదారులతో పరిచయం ఏర్పడింది. ఇంత గౌరవం రావడానికి చేసిన సామాజిక సేవే కారణమని నమ్ముతారు. ఎవ్వరిని మోసం చేయకుండా, కుంభకోణాలకు పాల్పడకుండా ఎంతో మంది గుప్తాపై నమ్మకంతో పెట్టబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇలా హాస్పటల్స్, అపార్ట్ మెంట్స్ , కాంప్లెక్స్ లు నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు.

ముక్తి లోగో

ముక్తి గ్రూప్ లోగో ఏర్పాటు అంత సులభం కాలేదు. నాతో కలిసి పనిచేసిన వారికి, కొన్ని సమయాల్లో ఆర్ధికంగా ఆదుకోలేకపోయానని ఆవేదనతో చెప్తారు. అయితే ఇటుక, ఇటుక పేర్చుకుంటూ.. ఉన్నత స్థాయికి ఎదిగి అనుకున్నది సాధించానంటారు. నేను విజయాలు సాధించడం కోసం విశ్రాంతి తీసుకోలేదు.

ముక్తి గ్రూప్ లోగో

ముక్తి గ్రూప్ లోగో


ముక్తి ఎయిర్ వేస్...కుప్పకూలిన

రియల్ ఎస్టేట్ విభాగంలో సూపర్ సక్సెస్ కావడంతో..ఒక్కసారిగా ఎయిర్ వేస్ రంగంలో అడుగు పెట్టాలని ముక్తి గ్రూప్ నిర్ణయించింది. 1990 వ సంవత్సరం ఆసియాలో విమాన రంగం అభివృద్ధి చెందుతోంది. వెంటనే సొంత ఎయిర్ లైన్స్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కానీ ఆ రంగంలో ఓనమాలు తెలియదు. అయినప్పటికి "నేను ఒక వైమానిక సంస్థ ప్రారంభించాలని అనుకుంటున్నాని ప్రకటించాను'' ఆఫీసులో అందరూ ఒక్కసారి ప్రకటన విని కంగారుపడిపోయారు. 1994 లో బెంగాల్ నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేశాం అంటూ చెప్పుకొచ్చారు.అయితే అధికారుల్లో పేరుకుపోయిన రెడ్ టేపిజం, సాంకేతిక సమస్యలు అధిగమించడానికి చాలా ఇబ్బంది పడ్డాం. మరో వైపు కొంత మంది అధికారుల సాయంతో ఇంజనీర్లు, టెక్నికల్ టీమ్ ను తయారుచేశాం.జనవరి ౧ ,1995న మేము, టాటా సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాము. ఆనందకరమైన విషయం ఏమంటే... ముక్తి గ్రూప్ ఎయిర్ లైన్స్ కు ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నుంచి క్లియెరన్స్ వచ్చింది.

తర్వాత లైసెన్స్ కోసం ఢిల్లీలోని పౌర విమానయాన శాఖలో గ్రౌండ్ లెవెల్ గుమాస్తాను నుంచి సివిల్ ఏవియేషన్ మంత్రి గులాం ఆలీ వరకు అందరిని కలిశాను.ఈ క్రమంలో భాగంగానే జాయింట్ సెక్రటరీ మిస్టర్ మిశ్రాను కలిసినప్పుడు, ఈప్రతిపాదన అసాధ్యమని చెప్పారు. సాంకేతిక శిక్షణ, నేపథ్యం లేకపోవడం, వంద విమానాలు లేని కారణంగా లైసెన్స్ ఇవ్వమని తేల్చి చెప్పారు. వ్యాపార వేత్త కావడంతో... ఇతర ప్రాంతాల్లో ఉండే నిపుణుల సాయంతో ముందుకు వెళతానని వివరించాను.. చివరకు మా నిజాయితీ గుర్తించి లైసెన్స్ మంజూరు చేశారని వివరించారు.

image


అంతర్జాతీయ విమానాల తయారీ కంపెనీలతో నిర్వహించిన చర్చల కారణంగా హెవీ డ్యూటీ ఒప్పందాలతో ముక్తి గ్రూప్ భారత్ లో మొదటి కంపెనీ ప్రారంభించింది. అయితే భారత్ కు యూరోపియన్ల నుంచి అనుకున్న స్థాయిలో ప్రోత్సాహం రాలేదు. వారికి ఇండియన్స్ పై పక్షపాత వైఖరి ఉండేది. అయితే వ్యాపారం ఒకసారి ప్రారంభమైతే అన్నీ సాఫీగా సాగుతుందన్న నమ్మకం ఉంది.దురదృష్టవశాత్తు మేము ఎయిర్ లైన్ ప్రారంభించే సమయంలో , హర్షద్ మెహతా కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. అప్పుడే ఊపందుకుంటున్న ఆర్ధిక లావాదేవీలపై ప్రభావం పడింది మదుపుదారులు ప్రమాదకర వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి నిరాకరించడంతో ముక్తి ఎయిర్ వేస్ కుప్పకూలింది.

వైఫల్యాలతో కుంగిపోయా..

వైమానిక రంగంలో అడుగు పెట్టాలన్న నా ఆలోచన విఫలమైంది. ఆ సంఘటన నా హృదయాన్ని ముక్కలు చేసింది. నేను విమాన రంగంలో చేయి కాల్చుకున్న తర్వాత ఎంతో మార్పు వచ్చిందంటారు. నేను కొన్నిసార్లు కొత్త రంగానికి బదులుగా సుపరిచితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే ఆ వనరులను ఉంచి.. ఎక్కువ సమయం, కేటాయిస్తే... దేశంలోనే నెంబర్ వన్ కు ఎదిగే వాడినని గతాన్ని గుర్తుచేసుకుంటారు. ఏదో ఒక రోజు నేను ముక్తి ఎయిర్ వేస్ ను రియాలిటీ చేస్తానంటూ ధీమాతో ఉన్నారు. నేను సాధించిన దానితో తృప్తి పడుతూ జీవితంలోనూ,వ్యాపారంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాని చెప్తారు.

జీవితంలో సాధించాలనుకునే వారికి ఒక్కమాట..

సాధారణంగా ఎవరైనా కానీ చేసిన ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటారు. అయితే ఇది ప్రశంసనీయం, కానీ మీరు, మీ గురించి ఆలోచిస్తూ ఉంటే జీవితంలో సాధించలేరు. ఏ పనైనా మనస్సు పెట్టి చేస్తే.. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags