సంకలనాలు
Telugu

విదేశీ రుచికి.. దేశీయ హంగులు 'స్టూఆర్ట్' స్పెషాలిటీ

ABDUL SAMAD
9th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

స్టూ.... ఇదో వంటకం. ఇందులో ఏముంటుందో తెలుసా ? ఒకోసారి మొత్తం కూరగాయలు, కొన్నిసార్లు మాంసం.. లేదా అన్నీ కలిపి... అతి చిన్న మంటపై... కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి ఎక్కువసేపు వండే వంటకమే స్టూ. రకాన్ని బట్టి బ్రెడ్‌, అప్పాలు, అన్నంతో కలిపి వడ్డిస్తారు.

image


నిజానికి స్టూ అంటే... పాత్రపై మూత పెట్టి సుదీర్ఘంగా ఉడికించే వంటకం. దాదాపు 8 వేల ఏళ్ల చరిత్ర ఉంది దీనికి. అమెజాన్ అడవులు, యూరోప్, మధ్య ఆసియాల్లో... తాబేలు డొప్పల్లో వంటచేసుకునే అలవాటు ఉంది. భారతీయులకూ దీనితో అనుబంధం ఉందనే చెప్పాలి.

“పప్పు, సాంబార్ అంటూ కొన్ని రకాలు మనం వండుకుంటాం. అయితే వీటిని స్టూ కేటగిరి కింద పరిగణించవచ్చో లేదో నాకు తెలీదు. అయితే స్టూ అంటే సూప్‌కు, కూరకు మధ్యస్తంగా ఉంటుంది. సూప్ అంత పల్చగానూ కాకుండా... కూర మాదిరిగా నూనె, కారంతో కాకుండానే ఉంటుంది ” అంటారు పూనేకి చెందిన ‘స్టూ ఆర్ట్’ వ్యవస్థాపకులు హేమంత్ థైట్. ఈ ‘స్టూ ఆర్ట్’ రెస్టారెంట్లలో వివిధ రకాలైన కొత్త రుచులతో స్టూ వంటకాలను రుచి చూపిస్తున్నారు.

ఎవరీ హేమంత్ ?

హేమంత్‌కు ఇద్దరు పిల్లలు. తన చిన్నారులిద్దరికీ ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినేందుకు అందించాలని భావిస్తారు. మొదట హేమంత్ ఓ పాపులర్ బ్రాండ్ ఐస్ క్రీమ్, మిల్క్ షేక్‌లను విక్రయించేవారు. అయితే... దీన్ని మూడేళ్లు నిర్వహించాక తాను ఏదైనా సొంతగా నడపాలనే ఆలోచన వచ్చింది. ఐస్‌క్రీమ్ షాప్ తర్వాత పిజా ఔట్‌లెట్ నడపాలనుకున్నారు. “ ఓ వినూత్న, రుచికరమైన, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వంటకాలు అందించాలనే ఆలోచనే ‘స్టూఆర్ట్‌’కు మూలం” అంటారు హేమంత్.

తనకస్టమర్లతో హేమంత్ (ఎడమ వైపు చివరి వ్యక్తి )

తనకస్టమర్లతో హేమంత్ (ఎడమ వైపు చివరి వ్యక్తి )


ఏమిటి ఈ స్టూ ?

2014లో వేలంటైన్స్ డే రోజున ‘స్టూ ఆర్ట్’ కార్యకలాపాలు మొదలయ్యాయి. దీనికి హేమంత్ ఇచ్చిన ట్యాగ్‌లైన్ ‘ఆరోగ్యంతో ప్రేమలో పడ్డ రుచి’. లైన్ బాగుంది కదూ... టేస్ట్ కూడా అదిరిపోతుందంటారు నిర్వాహకులు.

“ఈ వంటకాలను మన దేశంతోపాటు... మధ్య అమెరికా, సింగపూర్, ఇటలీ, మలేషియాల ఇన్‌స్పిరేషన్‌తో తయారు చేస్తున్నాం. కొంతకాలం పరిశోధన చేశాక... మన దేశంలోనే కాదు 'స్టూ'లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అని అర్ధమైంది. అంతేకాదు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఆరోగ్య కారకాలను అందిస్తాయని తెలుసుకున్నా”నంటారు హేమంత్. తన రెస్టారెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తూనే పూనేలో ఓ ప్రఖ్యాత కాలేజ్‌కు క్రియేటివిటీ & ఇన్నోవేషన్ విభాగానికి విజిటింగ్ ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

image


బ్రాండ్ బిల్డప్

మనలో చాలామంది భోజనం చేసేప్పుడు పప్పు, సాంబార్‌లను దాటి చాలాసార్లు ఆలోచించం. స్టూ అనే కాన్సెప్ట్ నగరాల్లో చాలా కొత్తదనే విషయం హేమంత్‌కు అర్ధమైంది. “ దేశంలో 'స్టూ'లను వడ్డించే మొదటి రెస్టారెంట్ స్టూ ఆర్ట్. ఈ స్థాయికి ఎదగాలని మాకేం పెద్ద పెద్ద లక్ష్యాలు లేవు. అలాగే మాకు రోల్ మోడల్స్ కూడా లేరు. రెస్టారెంట్ ప్రారంభించిన మొదట్లో... మా స్టాఫ్‌లో ఒక వ్యక్తిపై రోడ్డుపై నిలబడి, ఇటువైపు చూసినవాళ్లకు పాంప్లెట్లు అందించేవాడు. తల్చుకుంటే ఇప్పుడది నవ్వొచ్చే సంఘటనే. అయితే, ఈ ప్రాసెస్ విజయవంతమైందనే చెప్పాలి. అసలు ఈ 'స్టూ'లను ఎందుకు తినాలి అని కస్టమర్లను ఒప్పించడానికి కష్టమయ్యేది. ఓసారి ట్రై చేసి టేస్ట్ చూస్తే పోలా.... అనుకునే వాళ్లే ఇటువైపు వచ్చేవారు” అని గుర్తు చేసుకున్నారు హేమంత్.

స్టూ ఆర్ట్‌లో మెనూ ఏంటి ?

ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌ మెనూలో 9 ఐటెమ్స్ ఉన్నాయి. ఇందులో నాలుగు ఇండియన్ స్టూస్ (మలబరి కాష్యూ స్టూ, ఘుగ్‌నీ, స్పైసీ బ్రౌన్ స్టూ, మంగళూర్ కోకోనట్ స్టూ)లతో పాటు ఐదు అంతర్జాతీయ వంటకాలు (హంగేరియన్ గౌలాష్, మొరాకన్ స్టూ, మెక్సికన్ బీన్ స్టూ, అమెరికన్ గుంబో, కార్న్ చౌడర్) ఉంటాయి. “ ఒక్కో సర్వ్‌కి 4 మి.లీ. కంటే తక్కువ నూనె లేదా వెన్న ఉపయోగిస్తారు.

image


స్టూ ఆర్ట్ ప్రచారానికి ప్రత్యేకమైన ఆర్ట్

స్టూ ఆర్ట్ వ్యాపార రహస్యమంతా కస్టమర్‌ను ఎడ్యుకేట్ చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. రెస్టారెంట్లోని గోడలపై.. ఒక్కో 'స్టూ'కు సంబంధించిన చరిత్ర, వంట చేసే విధానం, సర్వింగ్, తినే విధానం వంటివి పోస్టర్లుగా దర్శనిమిస్తాయి. అలాగే స్టాఫ్ మొత్తానికి కూడా వాటి చరిత్ర చెప్పగలిగేలా ట్రైనింగ్ ఇచ్చారు. “ మాకు ప్రత్యేకమైన కస్టమర్ బేస్ లేదు. కాలేజ్ విద్యార్ధులు, కుటుంబాలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు అందరూ మా కస్టమర్లే. మా వంటలన్నీ ఆరోగ్యంపైనే కాదు... ఖరీదు తక్కువ కావడంతో కస్టమర్ల జేబులనూ ఆరోగ్యంగానే ఉంచుతాయం”టారు హేమంత్. ప్రింట్(పాంప్లెట్స్, ప్రింట్ యాడ్స్), సోషల్ మీడియా(ఫేస్‌బుక్, ఫుడ్/డీల్ వెబ్‌సైట్లు)ల సహాయంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. కొన్ని కాలేజ్‌లలో 'స్టూ ఆర్ట్ స్టోరీ' పేరుతో కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఫోటో- అమెరికన్ గుంబో

ఫోటో- అమెరికన్ గుంబో



Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags