సంకలనాలు
Telugu

ఐఐఎంలో చదివి తేనెటీగల పెంపకానికి శ్రీకాంత్ పయనం

పర్యావరణ సమతుల్యమే లక్ష్యం..తెనె టీగల పెంపకమే మార్గంమహారాష్ట్రలో ప్రారంభమైన శ్రీకాంతుడి ఉద్యమంబీ దీ చేంజ్ తో మార్పు తెచ్చే ప్రయత్నంతేనెటీగల పెంపకంపై రైతులకు ఉచిత శిక్షణ

25th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

భూమిపై మానవజాతి లాగానే ఎన్నో జాతులు నివశిస్తున్నాయి. ప్రతిరోజూ మనిషి స్వార్థానికి ఎన్నో రకాల జాతులు నశిస్తునే ఉన్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. చెట్లను నరకడంతో ఎన్నో జీవులకు ఆశ్రయం లేకుండా చేస్తున్నాం. దీనికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకపై మేల్కొనకపోతే.. భవిష్యత్ తరాలు జంతువులను ఫోటోల్లో, వీడియోల్లో మాత్రమే చూడగల్గుతాయి.ఇదే విషయం మహారాష్ట్రకు చెందిన శ్రీకాంత్ గజ్బియాను ఆలోచింపజేసింది. దీంతో ‘బీ ది చేంజ్’ అనే సంస్థను మొదలు పెట్టారు. రాష్ట్రంలో ఉండే రైతులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తుంది ఈ సంస్థ.

వ్యవసాయానికి రైతులు పడేకష్టంతో సమానంగా తేనెను తయారు చేయడంలో తేనెటీగలు శ్రమపడతాయనేది శ్రీకాంత్ వాదన. యూరప్‌లో నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఏడాదికి దాదాపు 200 మిలియన్ యూరోల తెనెను తెనెటీగలు తయారు చేస్తాయట. దీంతోపాటు పరోక్షంగా తెనెటీగలు ఒక బిలియన్ యూరోల బిజినెస్ చేస్తున్నాయి. ఆహారపు అలవాట్ల పరంగా చూస్తే ప్రపంచంలోని అన్ని దేశాల్లో తేనె వినియోగం ఒకేలా ఉండటం విశేషం. తేనె తయారు చేసే పద్ధతి కూడా అన్ని చోట్లా దాదాపు ఒకేలా ఉంది. అమెరికాలో కొన్ని రకాలైన తేనె కనిపించకుండా పోయిందని యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్‌లో తేనెను ఉత్పత్తి చేసే తేనెటీగల జనాభ తగ్గుతూ వస్తోందనే విషయాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మొబైల్ ఫోన్ టవర్స్ దీనికి ప్రధాన కారణంగా తేలింది. దీని ప్రభావం భవిష్యత్తులో మరింత ఉండబోతోంది. గతంకంటే తేనెటీగల సంఖ్య తగ్గడాన్ని ‘బీ ఎఫెక్ట్’ గా నామకరణం చేశారు.

బీ ది చేంజ్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ గజ్బియా

బీ ది చేంజ్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ గజ్బియా


శ్రీకాంత్ ప్రారంభించిన సంస్థ తేనెను తయారు చేయడంతోనే తీరిపోయే బాధ్యత మాత్రమే కాదు. అంతరించిపోతున్న తేనెటీగలను కాపాడే ఓ గొప్ప ఉద్దేశం ఉందన్న మాట. ఐఐఎం కోజికోడ్ నుంచి డిగ్రీ పట్టా పొందిన తర్వాత... శ్రీకాంత్ పూణే ప్రభుత్వ ఇనిస్టిట్యూట్‌లో బీకీపింగ్(తేనెటీగల పెంపకం) ఫైవ్ డే హాబీ కోర్స్ చేశారు. తేనెటీగలపై ఇష్టం పెంచుకున్నారు. 

“తేనెటీగల కోసం ఎన్నో అద్భుత విషయాలు తెలుసుకున్నా. పర్యావరణ సమతుల్యంలో వాటి పాత్ర. ముఖ్యంగా వాటిలో కనిపించే క్రాస్ పొలినేషన్ (ఫలదీకరణ). నేచర్‌లో తేనెటీగలు ఆవశ్యకత నాకు కనువిప్పు కలిగించింది. జీవ వైవిధ్య పిరమిడ్ ప్రారంభం తేనెటీగలతోనే ఆరంభం అవుతోంది” అంటారు శ్రీకాంత్

గడిచిన కొన్ని నెలలుగా 'బీ ది చేంజ్' 500లకు పైగా రైతులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చింది. అడవుల్లో నివసించిన వారికి సైతం వీరు కొన్ని టిప్స్ నేర్పిస్తారు. శిక్షణా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. “మా ఆపరేషన్‌లో భాగంగా మేం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులను కలుస్తున్నాం. బీ బాక్సులతో పాటు ఉచితంగా శిక్షణ ఇస్తాం. వాళ్లు తేనెటీగలను పెంచి.. తేనెని ఉత్పత్తి ప్రారంభిస్తే.. వారి దగ్గర తేనెని మేమే కొనుగోలు చేస్తాం. ఇక్కడ లాభం ఎంతొచ్చిందనేది విషయం కాదు. మా బ్రాండ్‌తో తేనెను మార్కెట్‌లో అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతాం. తేనెను తయారు చేసిన రైతుల వద్దనుంచి కొనుగోలు చేస్తాం కనుక వారికి అందాల్సిన డబ్బు అందుతోంది” అని శ్రీకాంత్ విరించారు. అంతరించిపోతున్న తేనెటీగలను కాపాడటం ఇక్కడ ముఖ్యం. తెనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా చాలా మందికి ఉపాధిని అందిస్తున్నాం. ఆరోగ్యకరమైన తేనెని ఉత్పత్తి చేస్తున్నామని గర్వంగా చెబ్తారు.

తెట్టె నుంచి తేనె తీస్తున్న రైతులు

తెట్టె నుంచి తేనె తీస్తున్న రైతులు


“ తేనె ఉత్పత్తిలో భాగంగా తేనెటీగల పెంపకం చేయాలి. ఈక్రమంలో ఎరువుల వాడకం ఆహ్వానించదగినది కాదు. రసాయన మందులతో తేనెటీగలు చనిపోతాయి,” అని శ్రీకాంత్ వివరిస్తారు.

సేంద్రీయ (ఆర్గానిక్) పద్ధతిలో తేనె ఉత్పత్తి ప్రక్రియపై కొంతమందికి శిక్షణ ఇస్తున్నాం . అయితే దీనికి చాలామంది సహకారం తప్పనిసరి. కొంతమంది సమూహాలుగా ఏర్పడి ప్రయాస పడాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగానే తేనె ఉత్పత్తికి పెట్టుబడి అవసరం పడింది. అందువల్లనే రైతులు తేనె ఉత్పత్తికి దూరంగా ఉంటున్నారు. “ఒక తేనె టీగ పెట్టె(బీ బాక్స్) ప్రారంభ ధర 5వేలు. ప్రక్రియ ప్రారంభమైన కొన్ని నెలల తర్వాతనే తేనె ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. పదిమందిలో ఒకరు మాత్రమే ఏడాదిపాటు తెనెటీగలను పెంచడానికి సుముఖంగా ఉన్నారు. ఈ రకమైన వ్యవసాయ ఉత్పత్తి లాభదాయంగా మారితే కచ్చితంగా పరిస్థితిలో మార్పు రావొచ్చు. ”

బీ కాలనీలను పరిశీలిస్తున్న శ్రీకాంత్

బీ కాలనీలను పరిశీలిస్తున్న శ్రీకాంత్


భవిష్యత్‌లో ప్రతీ టేనెటీగల కాలనీ మరో రెండు కాలనీలను తయారు చేస్తుంది. అటవీ ప్రాంతంలో నివశించే వారితో శ్రీకాంత్ టీం పనిచేస్తోంది. అయితే ఇది అనుకున్నంత సులువైన పనైతే కాదు. సహజసిద్ధంగా తేనెను తయారు చేసే ప్రక్రియలో వారికి కొన్ని సులభమైన పద్దతులు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. తేనె టీగలను పట్టుకోకుండా వాటంతట అవే బాక్స్‌లోకి వచ్చి ప్రక్రియ మొదలయ్యేలా వీరి ప్రయత్నం సాగుతోంది. తమలాంటి ప్రక్రియలో మరికొన్ని సంస్థలు చేతులు కలుపుతున్నాయి. అందులో దాదాపు అంతా రైతులతోనే పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు . తాము మాత్రమే అటవీ జనాభాతో కలసి ముందుకు పోతున్నాం. ఈ ఆర్గనైజేషన్లన్నీ తమ తేనెని ప్రిమియమ్ ప్రాడక్ట్‌గా మార్కెట్ లో అమ్ముతున్నాయి. తాము మాత్రం సాధారణ ధరకే విక్రయిస్తున్నామని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. తేనెటీగల పెంపకంపై మహారాష్ట్ర లో సరైన శిక్షణా సౌకర్యాల కొరత, బీకాలనీలు అందుబాటులో లేని కారణంగా తేనెను సేంద్రీయ పద్దతిలో తయారు చేసే శిక్షణ చేపట్టడం తమకి కొద్దిగ కష్టంగానే ఉందనేది సంస్థ ఆలోచన. భాషా అడ్డంకులు, పెట్టుబడి వంటివి ప్రస్తుతం బీ ది చేంజ్‌కు సవాళ్లుగా మారాయి.

“ ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే మాకు మేముగా శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. కాలనీలను పెంచడానికి నిపుణులతో కలసి పనిచేసి వారి సలహాలను తీసుకుంటున్నాం. శిక్షణానంతరం తెనెను తయారు చేసి విజయం సాధించిన వారిని ఆదర్శంగా తీసుకుంటున్నా ఇదే సామాజికంగా చైతన్యం తీసుకురావడానిక సహకరించగలదని భావిస్తున్నా.” అని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తేనెటీగల పెంపకంలో పాల్గొంటున్న మహిళలు

తేనెటీగల పెంపకంలో పాల్గొంటున్న మహిళలు


బీకాలనీని తయారు చేసే కంటే.. శిక్షణ ఇవ్వడం ద్వారా కాలనీల నిర్మాణం చేపట్టడం చాలా తక్కువ ఖర్చుతో తేలిపోతోంది. సహజ సిద్ధంగా కాలనీలు ఏర్పడటం పర్యావరణానికి సైతం మేలు చేకూర్చే ప్రక్రియ. భవిష్యత్‌లో మహిళలకు కూడా శిక్షణ ఇచ్చి తేనెటీగల పెంపకాన్ని మరింతగా ముందుకు తీసుకుపోదామని చూస్తున్నాం. స్టీవ్ జాబ్స్ చెప్పినట్లు ఫలితాలని సాధించాలి. వనరులనేది సమస్యకాకుండా.. ఉన్న దానికంటే పదిరెట్లు పనిచేసి..ఫలితాలను సాధిస్తూ..దీన్నొక ఉద్యమంగా తాము పనిచేస్తామని.. శ్రీకాంత్ ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags