సంకలనాలు
Telugu

కస్టమర్లను.. కళాకారులను కలిపే 'త్రెడ్‌ క్రాఫ్ట్'

చికన్‌కారీ కళను నమ్ముకున్న వాళ్లకు ఆశాదీపంకళతో పాటు వ్యాపారస్తులను బతికిస్తున్న మోహిత్ఐఐఎం,టిస్‌లో చదివినా ఈ వ్యాపారంపైనే మనస్సు

bharathi paluri
22nd Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మోహిత్ వర్మకు చాలా ఇష్టాలుండేవి.. హైస్కూల్లో సైన్స్, గ్రాడ్యుయేషన్ లో కామర్స్, జూడోలో గోల్డ్ మెడల్.. సైన్యంలో చేరేందుకు ఎన్‌డిఏ.. ఇలా చాలా ఆసక్తులున్నాయి. వీటన్నిటికీ మించి బాగా డబ్బు సంపాదించాలన్న ఆసక్తి కూడా వుంది. అది కూడా నీతి తప్పకుండా.. ! తాను నీతి తప్పకుండా, సమాజానికి కూడా ఎంతో కొంత మేలు చేసేలా సంపాదించడానికి మోహిత్ కనుగొన్న మార్గం.. త్రెడ్ క్రాఫ్ట్.. చికన్‌కారీ కళాకారుల ఆశాదీపం ఈ త్రెడ్ క్రాఫ్ట్..

మోహిత్ వర్మ

మోహిత్ వర్మ


మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య నూర్ జహాన్ కనిపెట్టిన ఒక విశిష్టమైన అల్లిక చికన్‌కారీ..అని చరిత్ర చెబుతోంది. మన దేశంలోనే కాక మొత్తం ప్రపంచంలోనే ఈ కళకు ఆదరణ వుంది. అయితే, కళ కి ఎంత పేరున్నా కళాకారులు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నారు. లాభాలన్నీ మధ్య దళారీలు తినేయడంతో అసలు చికన్‌కారీ కళాకారులకు మాత్రం దారిద్ర్యమే మిగులుతోంది.

మోహిత్ వర్మ నెలకొల్పిన త్రెడ్ క్రాఫ్ట్.. ఈ దళారీ వ్యవస్థకు ఫుల్‌స్టాప్ పెట్టి నేరుగా చికన్‌కారీ కళాకారులతోనే వ్యాపారం నిర్వహిస్తుంది. దీని వల్ల కళాకారులకు న్యాయంగా రావలసిన ధర వస్తుంది.. ఈ కళ నాలుగు కాలాల పాటు కొనసాగుతుంది.

మోహిత్ లక్నోలోని ఓ మధ్యతరగతి వ్యాపార కుటుంబంలో పుట్టాడు. దీని వల్ల చిన్నప్పటి నుంచే అతనికి వ్యాపార లక్షణం బాగానే అబ్బింది. ఆయన తాత స్వర్ణకారుడు. అందులో ఆయనకు డిప్లమా కూడా వుంది. అయినా .. ఆయనకు తన పని మీద గౌరవం వుండేది కాదు. ఆయనకే కాదు.. మోహిత్ ఇంట్లో, ఇంటి చుట్టు పక్కల చాలా మంది స్త్రీలు చికన్‌కారీ కళాకారులే. కానీ వారెవ్వరికీ అదొక గౌరవనీయమైన పనిలా అనిపించేది కాదు. కూడుకు, గుడ్డకు పనికిరాని కళ ఎంత గొప్పదైతే ఏంటి.. అనుకుంటారు వాళ్ళు. ఇది చూసినప్పుడల్లా మోహిత్ మనసు చివుక్కు మనేది. ఈ కళకు మళ్లీ పూర్వ వైభవం తేవాలి.. ఈ కళాకారులకు వారు చేసే పనిపట్ల గౌరవం పెరగాలి.. దీనికి తానేమైనా చేయాలని అనుకునే వాడు.

చాలా డబ్బు సంపాదించాలి.. అదీ న్యాయంగా సంపాదించాలి..

కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోహిత్ IBMలో ఉద్యోగం చేసారు. ఈ జాబ్‌లో జీతం ఎక్కువే అయినా... అతనికెప్పుడూ సొంతంగా బిజినెస్ చేయాలనే కోరికే వుండేది. మోహిత్ మాటల్లోనే చెప్పాలంటే...‘‘నైతిక దారుల్లోనే బాగా సంపాదించాలనే పురుగు నా మెదడును తొలుస్తూ వుండేది..’’ దీంతో మూడేళ్ల పాటు చేసిన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి ఘజియాబాద్ ఐ.ఎమ్.టీ లో ఎమ్.బి.ఎ. చేయడానికి వెళ్లిపోయాడు .


సోషల్ అంట్రప్రన్యూర్‌షిప్..

ఐ.ఎమ్.టి. ఘజియాబాద్ లో MBA చేస్తుండగానే.. టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) నిర్వహించే సోషల్ అంట్రప్రన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నారు మోహిత్. తనకి కూడా సమాజానికి ఏమైనా చేయాలనే ఆసక్తి వుండడంతో టిస్‌లో కోర్స్ చేరాలని నిర్ణయించుకున్నారు.

ఇక నేర్చుకున్న విద్యను ఆచరణకు పెట్టే ముహూర్తం.. టిస్స్ స్వర్ణోత్సవాల్లో వచ్చింది. ఈ ఉత్సవాల్లో ఇన్స్‌టిట్యూట్ నుంచి అనుమతి తీసుకుని చికన్‌కారీ ఉత్పత్తులను అమ్మే స్టాల్‌ను పెట్టాడు. ఈ స్టాల్ ద్వారా అతనికి చెప్పుకోదగ్గ లాభాలే వచ్చాయి. నిజానికి ఇక్కడమ్మిన వస్త్రాలు తాను తయారు చేసినవి కావు. అయినా అమ్మకాలు బావుండడం, లాభాలు మిగలడంతో తానే ఒక తయారీ కేంద్రాన్ని పెడితే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా.. త్రెడ్ క్రాఫ్ట్ ఇండియా రూపుదిద్దుకుంది.

తమ సంస్థ ఉత్పత్తులతో మోహిత్

తమ సంస్థ ఉత్పత్తులతో మోహిత్


ఈ కంపెనీ లక్నో కేంద్రంలో 25 మంది మహిళా కళాకారులు పని చేస్తారు. వారికో టీమ్ లీడర్ వుంటారు. ఈ కళాకారులు, కంపెనీలో వుండైనా పనిచేయొచ్చు.. ఇంటి నుంచైనా పనిచేయొచ్చు. కొనుగోలుదారులకు, కళాకారులకు మధ్య వారధి.. ఈ త్రెడ్ క్రాఫ్ట్.. వచ్చిన ఆర్డర్స్‌కు అనుగుణంగా ఫ్యాబ్రిక్ కొనుగోలు చేస్తారు. దానికి రంగులు వేసి, డిజైన్లు గీసి కళాకారులకు ఇస్తారు. వారు ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత దాన్ని వాష్ చేసి.. ప్యాక్ చేసి.. కొనుగోలు దారులకు పంపిస్తారు. ఈ కళాకారులకు నెల నెలా వేతనాలందుతాయి. ఈరకంగా కంపెనీ పెట్టిన అయిదు నెలల్లోనే ఆదాయం రెట్టింపయింది.

తమ మహిళా బృందంతో...

తమ మహిళా బృందంతో...


చికన్‌కారీ అల్లిక చాలా శ్రమతో కూడుకున్నది. అతి సన్నటి దారాలతో, అత్యంత నేర్పుగా అల్లుకుంటూ రావాలి. దీని వల్ల కళ్ళు దెబ్బ తినే అవకాశముంది. అందుకే ఈ కంపెనీలో ఎప్పటికప్పుడు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వుంటారు. అవసరమైన వారికి కళ్ళద్దాలు ఇస్తారు. త్రెడ్ క్రాఫ్ట్ కు మొదటి నుంచి డిబిఎస్ బ్యాంక్ అండగా నిలుస్తోంది.

చికన్‌కారీ ఉత్పత్తులు

చికన్‌కారీ ఉత్పత్తులు


డిబి ఎస్ బ్యాంక్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సి బిలిటీలో భాగంగా త్రెడ్ క్రాఫ్ట్ తరహా 30 కంపెనీలకు ఆర్ధిక సాయం అందిస్తోంది. ఇండియాలో టి ఐ ఎస్ ఎస్ తో కలిసి డి బి ఎస్ నిర్వహిస్తున్న డి బిఎస్-టి ఐ ఎస్ ఎస్ సోషల్ అంట్రప్రన్యూర్ షిప్ ప్రోగ్రామ్ లో త్రెడ్ క్రాఫ్ట్ తరహా కంపెనీలకు ఆర్ధిక సాయం అందించడమే కాకుండా.. టిస్ నుంచి బయటికొచ్చి కొత్త తరహా ఆలోచనలతో వ్యాపారలను మొదలుపెట్టే సంస్థలకు మార్గదర్శిగా కూడా వ్యవహరిస్తుంది. నిజానికి కొత్త కంపెనీ పెట్టేటప్పుడు నిధులు పెద్ద సమస్యగా వుంటుంది. కానీ డిబి ఎస్ చలువ వల్ల తమకా కష్టం రాలేదని మోహిత్ చెప్తారు.


ప్రస్తుతానికి త్రెడ్ క్రాఫ్ట్ ఇటు బొటిక్స్ కు అటు ఎగుమతి దారులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ముంబైలోని కొన్ని బొటిక్ లతో, ఒక ఎగుమతి సంస్థతో త్రెడ్ క్రాఫ్ట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. బొటిక్ ల నుంచి వచ్చే ఆర్డర్స్ నేరుగా ఎంబ్రాయిడర్ల దగ్గరకే చేరుతాయి. వారు కంపెనీలో ఈ పని పూర్తి చేసి పంపుతారు. ఎక్సపోర్టర్ ల నుంచి వచ్చే ఆర్డర్లు మాత్రం కొంత మంది నమ్మకస్తులైన ఏజెంట్లకు ఇస్తారు. వారు ఈ కళాకారులతో పనిచేయించుకుని వాటిని ఆయా ఎగుమతి సంస్థలకు పంపుతారు. ఈ ఏజెంట్లు మళ్ళీ కళాకారులను దోచుకోకుండా త్రెడ్ క్రాఫ్ట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో తగిన ఆర్ధిక సహాయం అందించడమే కాకుండా.. ఎక్కడ లోటు పాట్లు జరగకుండా... డి బి ఎస్ తగిన మార్గదర్శకత్వం కూడా అందిస్తుంది.

సవాళ్ళు.. భవిష్యత్ ప్రణాళిక

ఒక ప్రత్యేక కళ ఆధారంగా జరిగే వ్యాపారం కనుక త్రెడ్ క్రాఫ్ట్ అనేక సవాళ్ళు ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇందులో ఆదాయం ప్రధానమైనది. ఒక పక్క ఖర్చులెక్కువ. రాబడి మాత్రం కొన్ని బొటిక్స్, ఒక ఎగుమతి సంస్థ నుంచే రావాలి. ఇక రెండో సవాలు.. మంచి కళాకారులను ఎన్నుకోవడం. ఈ ప్రాంతంలో అలాంటి వారు చాలా తక్కువగా దొరుకుతారు. ‘‘ఈరంగంలో రాత్రికి రాత్రి అద్భుతాలేం జరగవు. కాకపోతే, నెమ్మదిగా.. పరిస్థితుల్లో మార్పు రావచ్చు’’ అంటారు.. మోహిత్.

అయితే, జీవితంలో సవాళ్ళు ఒక భాగమని మోహిత్ నమ్ముతాడు. నెమ్మదిగా త్రెడ్ క్రాఫ్ట్ ను ఓ స్వయం సహాయక గ్రూప్ గా మార్చాలని ఆయన ఆలోచన. అలాగే ఈ ఉత్పత్తులను తానే ఎగుమతి చేసి. మరింత లాభాలను ఆర్జించి కళాకారులకు వీలైనంత ఎక్కువ సాయపడాలని మోహిత్ ఆలోచిస్తున్నారు.

(ఈ కథనం డి బి ఎస్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తున్న పోర్ట్రయిట్స్ ఆఫ్ పర్పస్ సిరీస్ లో భాగం..)

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags