ఆఫీస్‌లో ఆడిస్తూ పని నేర్పించే జుజూబీ

బెంగళూరు ఐఐఎమ్ కుర్రాళ్ల వెల్ నెస్ స్టార్టప్12వేల రిజిస్టర్డ్ యూజర్లతో ఆరంభం అదుర్స్

27th Jul 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

హ్యాపీగా సాగిపోతున్న జీవితం. బాగా రన్నవుతున్న ఆర్గనైజేషన్. అలాంటిది ఒక్కసారిగా యజమాని చనిపోతే? ఆ ఆఫీసులో పని చేసే ఉద్యోగుల పరిస్థితేంటి? ఆ ప్రభావం ఎలా వుంటుంది? అదే జరిగింది శాప్ ఎండి రంజన్ దాస్ మరణంతో. 2009 అక్టోబర్ 21న గుండెపోటుతో ఆయన చనిపోవడంతో..ఆ సంస్థ ఉద్యోగులంతా షాక్ తిన్నారు. తమ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడ్డారు. ఒకరకమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగా సంస్థ నష్టాల్లోకి కూరుకుపోయింది. సీన్ ఇక్కడ కట్ చేస్తే...


ఆర్గనైజేషన్ ఏదైనా కానీ! అది ఐటీ, బిజినెస్, బ్రోకింగ్ ఇలా. ఏ సంస్థలో అయినా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడేవారుంటే అది వారి పనితీరు, తద్వారా సంస్థ ఆదాయంపై ప్రభావం చూపిస్తుంది. ఫిజికల్ గా ఫిట్ గా లేని ఉద్యోగుల్లో పని చేసే ఉత్సాహం ఉండకపోగా, వారి పనితీరును కుంగదీస్తుందని ఎన్నో సర్వేలు చెప్పాయి. ఐతే చాలామంది ఉద్యోగుల్లో వారి హెల్త్ పట్ల శ్రధ్ద తీసుకునే అలవాటు ఉన్నా కూడా, వాటిని పని చేసే చోట ఎలా అమలు చేయాలో తెలీదు. ఆ తర్వాత కూడా వర్క్ ప్రెజర్ ను తట్టుకునేందుకు, సరైన హెల్త్ ప్రోగ్రామ్స్ ను ఫాలో అవరు. దీనికి కారణం వారిలో సరైన విల్ పవర్ లేకపోవడమే.

ఈ సమస్యలను అధిగమించడం ఎలా? ఈ కాన్సెప్టు మీదనే వర్కవుట్ చశారు చెన్నైకి చెందిన అవినాష్ సౌరభ్, ఆనంద్ రాజ్ , మూవెన్ డాన్ అనే ముగ్గురు స్నేహితులు. ఓ హెల్త్ స్టార్ట్ అప్ తో ముందుకు వచ్చారు. మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అప్ మీట్ లో కలిసిన అవినాష్ ,ఆనంద్‌ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇద్దరి ఒపీనియన్స్ నచ్చాయ్. వాళ్ళిద్దరికీ మూవెన్డాన్ కూడా తోడయ్యాడు. అలా జూజూ డాట్ బీ ప్రారంభమైంది. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా వెల్ నెస్ ప్లాట్ ఫామ్ తో పని చేసే ప్రోగ్రామ్. ఉద్యోగులకు ఆరోగ్యకరమైన అలవాట్లను ఆటలరూపంలో అందించే ప్రాజెక్ట్‌. ఉదాహరణకు రోజుకు పది గ్లాసుల నీళ్లు తాగడం.. మెట్లు ఎక్కి రావడం..వంటి చిన్న చిన్న పనుల్లో మార్పు చేస్తూ హెల్త్ హేబిట్స్ అలవాటు చేస్తారు. వీటిలోనే మిగిలిన ఉద్యోగుల మధ్య పోటీ పెడుతూ, ఓ గేమ్ ఆడుతున్న ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఇదంతా జూజూ డాట్ బీ లో సైనప్ అయిన క్లయింట్లకు ఆఫర్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఫాలో అయిన తర్వాత స్వయంగా ఉద్యోగులే లే కొన్ని ఛాలెంజ్ లు కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు కూడా.


జూజూబీ. టీమ్

జూజూబీ. టీమ్


పేరు వెనుక కథ

జూజూబీ. ఈ పేరే తమషాగా అన్పిస్తుంది. చాలాసార్లు విన్నాం కూడా. సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ మూవీలో వాడే మేనరిజమ్ పదం. ఇట్స్ ఈజీ ..చాలా ఈజీ ' అని రజనీ కాంత్ ఓ సినిమాలో డైలాగులు చెప్తాడు. ఆ డైలాగునే సైట్ కి పెట్టడం వెనుక కారణం ఏంటని అవినాష్‌ని అడిగితే ఇలా చెప్పాడు. 

" వర్క్ ప్లేసెస్ లో హెల్దీగా..జాయ్ ఫుల్ గా ఉండటం చాలా ఈజీ అనే అర్ధం లో మేం కూడా ఆ పదాన్నే మా సైట్ కి ప్రోగ్రామ్ కి పెట్టాం".

ఒకరిని చూసి మరొకరు ఇన్ స్పైర్ అవుతారనే కామన్ సైకాలజీను బేస్ చేసుకుని జూజూబీ ప్రోగ్రామ్ తయారు చేశారు. ఆన్ లైన్ లో దొరికే చాలా ప్రోగ్రామ్స్ కంటే కూడా ఎవరికి వారు ఏక్టివిటీలో పాల్గొంటూ, ఇతరులతో పోటీ పడటం అంటే ఇష్టం చూపిస్తారని అవినాష్ చెప్తారు.. అలానే గెలిచినప్పుడు సంబరపడటం..సరదాగా సవాళ్లు విసురుకోవడం అన్నీ పీర్ గ్రూప్ లో మంచి కాంపిటీటివ్ తత్వాన్ని.. ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తాయంటారాయన

జూజూబీ ప్లాట్ ఫామ్ బిజినెస్ టూ బిజినెస్ టూ కస్టమర్ బేస్ పై నడుస్తోంది. కంపెనీలతో టై అప్ పెట్టుకుని ఆ తర్వాత పర్ కస్టమర్ ఛార్జ్ చేయడమే ఈ బిజినెస్ మెయిన్ థీమ్. ప్రఖ్యాతి గాంచిన మైండ్ ట్రీ సొల్యూషన్స్ సంస్థ జూజూబీకి మొదటి క్లయింట్. ఆన్ లైన్లో 12వేల మంది రిజిస్టర్డ్ యూజర్లున్నారు. రిపీటెడ్ గా సైట్ విజిట్ చేసే యూజర్లు మొదటి సారి వచ్చిన దానికంటే 25 శాతం ఎక్కువ సమయం గడుపుతున్నారని లెక్కలు చెప్తున్నాయి.


జూజూబీ గేమ్ మోడల్

జూజూబీ గేమ్ మోడల్


ప్రస్తుతానికి ఐఐఎమ్ ఎన్ఎస్సార్ సీఎల్ఎల్ బెంగళూరు ఇంకుబేషన్ సెంటర్ సాయం పొందుతున్నది. అదెలా దొరికిందన్న విషయం చాలా ఇంట్రస్టింగ్. ఒకసారి ఐఐఎమ్ బెంగళూరు ఇంకుబేషన్ స్క్రీనింగ్ కు వెళ్లిన సమయంలో తమ ముందు స్టార్ట్ అప్ ప్రాజెక్టు వాళ్లు తీసుకోవాల్సిన సమయం కంటే ఎక్కువ తీసుకున్నారు. దాంతో తమకి కేటాయించిన సమయంలో ఏడు నిమిషాలే మిగిలాయి. ప్రెజెంటేషన్ ఇస్తున్న సమయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు సంజయ్ ఆనందమ్ లేచి" మీరు చెప్పేదంతా మాకు అర్ధమవుతోంది..మీకు సాయం చేయడానికి మేం రెడీ..కానీ మీరు రన్ చేయబోయేది ఓ వెల్ నెస్ కంపెనీ కాబట్టి..ఓ 20 పుషప్స్ తీయండి" అన్నారు.. వెంటనే అవినాష్‌ లేచి తప్పకుండా అని -పాతిక పుషప్స్ తీసాడు. అందరూ నవ్వడం తో పాటు అతని ఉత్సాహాన్ని అభినందించారు. ఆ తర్వాత వారానికే సెలక్ట్ చేశామని ఇంకుబేషన్ సెంటర్ నుంచి సమాచారం వచ్చింది. ఆ బ్యాచ్ కో ఇంకుబేషన్ ఫైనాన్స్ పొందింది జుజూబీ ఒక్కటే అని తర్వాత తెలిసింది.

ఏదైనా చేసేద్దాం అనే యాటిట్యూడే అదే మాకు బాగా దోహదపడిందంటారు అవినాష్.. ఓ వేళ ఉద్యోగం వదిలేసినా..ఉపాధి కోల్పోకూడదనేది అవినాష్ నమ్మే సూత్రం. ఉద్యోగం చేస్తూ ఉండటమా, లేక వదిలేసి కొత్తగా ఏదైనా ప్రారంభించాలా అనేది వెంటనే నిర్ణయించుకోవాలి. కావాలంటే ఒక ఉద్యోగంలో చేరవచ్చు. కానీ ఇప్పుడు ఏదో ఒకటి సాధించి, ఓ సంవత్సరం తర్వాత మళ్లీ ఏదో ఒకటి చాలని బయటకు రాకపోతే మాత్రం ,ఇంకెప్పటికీ సాధించే అవకాశం రాకపోవచ్చు. ఇదీ నేటి స్టార్ట్ అప్ యాస్పిరెంట్స్ కి అవినాష్ చెప్పే మాట..

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India