సంకలనాలు
Telugu

ఐటి రిటర్న్స్ తయారీని అత్యంత సులువు చేసిన 'క్వికో'

ఐటి రిటర్న్స్ దాఖలు చేయడమంటే ఇప్పటికీ చాలా మందికి అదో బ్రహ్మపదార్థం. ఎంత పెద్ద చదువు చదివిన వారైనా ఈ సబ్జెక్ట్‌లో మాత్రం జీరో నాలెడ్జ్ ఉంటుంది. మార్చ్ వస్తోందంటే.. ఎంత పన్ను కట్ అవుతోందని ఆలోచించే వాళ్లే కానీ.. ఎలా తగ్గించుకోవాలి.. ? రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి అనే విషయాలను తెలిసిన వాళ్ల సంఖ్య మాత్రం బాగా తక్కువ. ఇలాంటి కష్టాలను తీర్చేందుకు పుట్టుకొచ్చిన సంస్థ క్వికో డాట్ కాం. విదేశీ స్థాయి టెక్నాలజీని వాడి రిటర్న్స్ ఫైలింగ్‌ను అత్యంత సులువు చేసింది క్వికో.

bharathi paluri
10th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇండియాలో ఆన్‌లైన్‌లో టాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేయడానికి అత్యంత సులువైన వేగ‌వంత‌మైన వెబ్‌సైట్ ఇదేన‌ని విశ్వ‌జిత్ చెప్తున్నారు.

ఇండియ‌న్ టాక్స్ పేయ‌ర్స్‌కి ఉచితంగా ITR 1 ఫైలింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించే Quicko.com, క‌చ్చితత్వానికీ, ప్రైవ‌సీకి,మాగ్జిమమ్ రిఫండ్‌కి, నూరు శాతం గ్యారంటీ ఇస్తోంది. అంతేకాదు, నిపుణుల స‌ల‌హాలు, టాక్స్ చ‌ట్టాల్లో వ‌చ్చే మార్పుల‌కు సంబంధించిన అప్‌డేట్స్ లాంటివి ఎన్నో ఈ వెబ్‌సైట్‌లో వున్నాయి.

అస‌లు టాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డం అనేది విసుగు తెప్పించేప‌ని కాకూడ‌ద‌ని విశ్వ‌జిత్ అంటారు. అందుకే Quicko.com కొన్ని మామూలు ప్ర‌శ్న‌లు మాత్ర‌మే అడుగుతుంది. దీనివ‌ల్ల క‌స్ట‌మ‌ర్లు క‌ష్ట‌మైన లెక్క‌లు వేయ‌క్క‌ర్లేదు. ఎలాంటి గంద‌ర‌గోళం లేకుండా చార్ట్‌ల ద్వారా ఇన్‌కమ్ బ్రేక్ డౌన్, టాక్స్ బ్రేక్స్, భ‌విష్య‌త్తులో టాక్స్ సేవింగ్ అవ‌కాశాలు.. అన్నిటినీ వివ‌రిస్తామ‌ని విశ్వ‌జిత్ వివ‌రించారు.

సాఫ్ట్‌వేర్ స్పెష‌లిస్టుల చేతిలో ఈ Quicko.com చాలా విభిన్నంగా రూపొందింది. దీనికో ఉదాహ‌ర‌ణ చెప్తారు విశ్వ‌జిత్. సాధార‌ణంగా మీకో సొంత ఇల్లు వుండి, దానిపై హోమ్ లోన్ వుంద‌నుకోండి. దానికి టాక్స్ ఎగ్జెంప్ష‌న్ కావాలంటే, స‌వాల‌క్ష సెక్ష‌న్ల కింద సంక్లిష్ట‌మైన ప్ర‌శ్న‌లు అడుగుతారు. కానీ Quicko.com లో ఈ బాద‌ర‌బందీ వుండదు. సింపుల్‌గా మీరు ఇల్లు కొన్నారా ? దాని మీద రుణం వుందా.. వుంటే, వ‌డ్డీ ఎంత‌ ? అస‌లెంత‌ ? ఇవే అడుగుతారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే, ఈ వెబ్ సైట్లో ఇన్‌క‌ం టాక్స్ ఫైల్ చేయ‌డానికి క‌స్ట‌మ‌ర్ల‌కు కాలిక్యులేట‌ర్ అవ‌స‌ర‌మే ఉండదంటారు విశ్వ‌జిత్.

ఈ ఏడాది జులై ఒక‌టి నుంచి Quicko.com లో రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డం మొద‌లైంది. మొద‌టి సంవ‌త్స‌రంలోనే 50వేల రిట‌ర్న్స్ ఫైల్ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టార్గెట్ పూర్తి చేయ‌గ‌లిగితే, ఈ త‌ర‌హా వెబ్ సైట్ల‌లో Quicko.com నాలుగో స్థానంలో వుంటుంది. వ‌చ్చే ఏడాది ఈ సంఖ్య‌ను రెట్టింపు చేసి క‌నీసం ల‌క్ష రిట‌ర్న్స్ ఫైల్ చేయాల‌ని త‌దుప‌రి ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

అనుభ‌వ‌మే పెట్టుబ‌డి

విశ్వ‌జిత్ అంత‌కు ముందు ప‌దేళ్ళ‌పాటు ప‌ర్స‌న‌ల్ ఫైనాన్స్ రంగంలో ప‌నిచేసారు. ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ , డాయిష్ బ్యాంక్‌లో ప‌నిచేస్తున్న‌ప్పుడే అత‌నికి ఇండియాలో ప‌ర్సన‌ల్ ఫైనాన్స్ రంగంలో అద్భుతమైన అవ‌కాశాలున్నాయ‌ని అర్థ‌మైంది. అధునాత‌న ప‌ర్స‌న‌ల్ ఫైనాన్స్ సేవ‌ల‌కి సంబంధించిన అవ‌స‌రం కూడా వుంద‌ని ఆయ‌న గ్ర‌హించారు. మింట్.కామ్, వెల్త్ ఫ్రంట్ . కామ్, బెట‌ర్మెంట్ .కామ్, ఏస్పిరేష‌న్స్ .కామ్ లాంటి ప‌ర్స‌న‌ల్ ఫైనాన్స్ వెబ్ సైట్లు అమెరికాలో ఎంత పెద్ద స‌క్సెస్ ను సాధించాయో విశ్వ‌జిత్ కి బాగాతెలుసు.

ఇండియా విష‌యానికొస్తే, ఈ రంగంలో ప్ర‌భుత్వ‌మే అతి పెద్ద స‌ర్వీస్ ప్రొవైడర్. అయితే, ప్ర‌భుత్వం అందిస్తున్న ఆన్‌లైన్ సేవ‌లు అంతంత మాత్ర‌మే. ఏవో క‌నీస సేవ‌లు మాత్ర‌మే ప్ర‌భుత్వ వెబ్ సైట్ల‌లో అందుబాటులో వున్నాయి. అందుకే ప్రైవేట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు చాలా అవ‌కాశాలున్నాయ‌ని విశ్వ‌జిత్ న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌కానికి త‌గ్గ‌ట్టే Quicko.com రూపుదిద్దుకుంది.

విశ్వజిత్, క్వికో వ్యవస్థాపకులు

విశ్వజిత్, క్వికో వ్యవస్థాపకులు


ఇప్పుడు ఆన్‌లైన్ ప‌ర్స‌న‌ల్ ఫైనాన్స్‌లో మార్కెట్ లీడ‌ర్ అంటూ ఎవ‌రూలేరు. ఏవో అర‌కొర అనుభవాల‌తో కొన్ని వెబ్ సైట్లు న‌డుస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ల‌క్షా యాభైవేల డాల‌ర్ల సొంత డ‌బ్బుతో Quicko.com ను విశ్వ‌జిత్ ప్రారంభించారు. దీంట్లో ఎక్కువ మొత్తాన్ని ఆఫీస్ ఖ‌ర్చుల‌కి, టాలెంట్ వున్న ఉద్యోగుల‌ను నియ‌మించ‌డానికీ, వాళ్ళ‌కి త‌గిన శిక్ష‌ణ ఇవ్వ‌డానికీ ఖ‌ర్చుపెట్టారు.

భ‌విష్య‌త్ ల‌క్ష్యాలు

గ‌డిచిన అయిదేళ్ళ‌లో టాక్స్ రిట‌ర్న్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య 20 ల‌క్ష‌ల నుంచి 3.5 కోట్ల‌కు పెరిగింది. అంటే, అత్యంత 80 శాతం ఎక్కువ‌. ఈ ప‌రిస్థితుల్లో 2016 నాటికి టాక్స్ ఫైలింగ్ మొత్తం ఆన్‌లైన్‌లోనే జ‌ర‌గాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

దేశంలోని టైర్ 1, టైర్ 2 శ్రేణి న‌గ‌రాల్లో టాక్స్ ఫైల్ చేసే వారిని ల‌క్ష్యంగా పెట్టుకుంది Quicko.com. డిజిట‌లైజేష‌న్ పూర్త‌య్యేనాటికి ఆన్ లైన్‌లో టాక్స్ ఫైల్ చేసే వారి సంఖ్య 30 నుంచి న‌ల‌భై శాతం పెరుగుతుంది క‌నుక‌.. ప‌దికోట్ల‌కు పైనే ఆన్‌లైన్ పన్ను చెల్లింపుదారులు వుంటార‌ని విశ్వజిత్ అంచ‌నా వేస్తున్నారు.

కేవ‌లం సాధార‌ణ టాక్స్ రిట‌ర్న్సే కాక‌, రెంట్ ఇన్‌క‌మ్, కేపిట‌ల్ గెయిన్స్... లాంటి సంక్లిష్ట‌మైన వాటికి కూడా Quicko.com లో సొల్యూష‌న్స్ వున్నాయి. అయితే, వాటికి 100 రూపాయ‌ల‌ నుంచి 5వేల‌రూపాయ‌ల వ‌ర‌కు వ‌సూలు చేస్తారు.

ఇప్పుడిప్పుడే Quicko.com కి ఇన్వ‌ెస్టెర్లు కూడా వ‌స్తున్నారు. ఇండియా, అమెరికాలోని వెంచ‌ర్ క్యాపిట‌ల్ సంస్థ‌ల‌తో ప్రాథ‌మిక చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. క్విక‌ర్, హౌసింగ్, వ‌యాకామ్ లాంటి సంస్థ‌ల‌కు క్రియేటివ్ యాడ్ యాజెన్సీగా వున్న స్కేర్ క్రో సంస్థ Quicko.comతో ఇరవైల‌క్ష‌ల డాల‌ర్ల విలువైన భాగ‌స్వామ్య ఒప్పందం చేసుకుంది.

స‌వాళ్ళు. రేప‌టి అవ‌కాశాలు

విశ్వ‌జిత్‌కి వున్న అతి పెద్ద స‌వాలు.. క‌స్ట‌మ‌ర్ డాటాను కాపాడ‌డం. ఈ స‌వాలు ఆయ‌న ఒక్క‌డికే కాదు.. ఈ రంగంలో వున్న వారందికీ క‌స్ట‌మ‌ర్ డాటా దుర్వినియోగం కాకుండా చూడడమే అతి పెద్ద ఛాలెంజ్. అయితే, Quicko.com లో ప‌నిచేస్తున్న వారికి అంత‌ర్జాతీయంగా ప్ర‌ఖ్యాతి చెందిన సంస్థ‌ల్లో ప‌నిచేసిన అనుభ‌వం వుంది. దీంతో వాళ్లు అక్కడ అనుసరిస్తున్న ప‌ద్ధ‌తుల‌నే ఇక్క‌డా అనుసరిస్తున్నారు. 256 బిట్ ఎన్‌క్రిప్ష‌న్, మ‌ల్టీ పాయింట్ వెరిఫికేష‌న్, మాస్క్‌డ్ డేటా లాంటి జాగ్ర‌త్త‌ల‌న్నీతీసుకుంటున్నారు. ప్ర‌పంచంలో అగ్ర‌శ్రేణి ఇంట‌ర్నెట్ బ్రాండ్స్‌ను హోస్ట్ చేస్తున్న అమ‌ెజాన్ క్లౌడ్ స‌ర్వీసెస్ ప్లాట్ ఫామ్ మీదే Quicko.com కూడా హోస్ట్ అవుతోంది.

ఈ రంగంలో వున్న ఇత‌ర సంస్థ‌ల‌న్నీ కేవ‌లం టాక్స్ రిట‌ర్న్స్ మాత్ర‌మే ఫైల్ చేసే సంప్ర‌ద‌ాయ అకౌంటింగ్ సంస్థ‌లే క‌నుక Quicko.comకి భ‌విష్య‌త్ స‌హ‌జంగానే ఆశాజ‌న‌కంగా వుంది. దీనికి తోడు దేశంలో డిజిట‌ల్ విప్ల‌వం ఉధృతంగా సాగుతోంది క‌నుక Quicko.comకి కూడా అభివృద్ధి అవ‌కాశాలు చాలానే వున్నాయి. ఈ వెబ్ సైట్ న‌డ‌ప‌డం అంటే, ప్ర‌జ‌ల‌కి సేవ‌చేయ‌డ‌మేన‌ని న‌మ్ముతారు విశ్వ‌జిత్. 

“మాకు సంబంధించిన‌నంత‌వ‌ర‌కు రిటర్న్స్ ఫైల్ చేయ‌డ‌మ‌నేది మ‌న బాధ్య‌త కాదు..హ‌క్కు. ప్ర‌జ‌లు ఈ హ‌క్కును ఏ మాత్రం ఖ‌ర్చు లేకుండా ఉచితంగా వినియోగించుకునే అవ‌కాశం క‌ల్పించ‌డం అంటే అది ప్ర‌జాసేవే క‌దా.. ” అంటారు విశ్వ‌జిత్
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags