సంకలనాలు
Telugu

అమ్మచేతి వంటని మరిపించే కరీ ఇన్ ఏ హరీ

ఆఫీసుల గడపకే థాలీ చేరవేసే స్టార్టప్మిగిలిపోయిన వాటినిదేశవ్యాప్త విస్తరణ కోసం ప్రణాళికలువరుస విజయాలతో దూసుకెళ్తున్న మీరా, మేఘనా

18th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఉరుకుల పరుగుల నగర జీవనంలో టైం సరికి తినడమే గగనం. మెకానికల్ గా మారిన లైఫ్ స్టైల్ లో తీరికనేది డిక్షనరీలో వెతికే వర్డ్ గా మారిపోయింది. క్వాలిటీ లెస్ ఫుడ్ తో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నారు సిటీ జనాలు. ఇకపై ఇలాంటి అడ్జస్ట్ మెంట్ అక్కర్లేదనే భరోసా ఇస్తోంది గుర్గావ్ కేంద్రంగా ప్రారంభమైన కరీ ఇన్ హరీ స్టార్టప్. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు శుభ్రంగా సరైన ఆహారం తీసుకోవడం పెద్ద పనే. ఆఫీసుల్లో ఉంటూ బిజీ బిజీగా పని ఒత్తిడితో మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవడం కష్టమైన పనే. చాలారోజుల పాటు సబ్ వేలో కొన్ని శాండ్ విచ్ లు తిని కాలం వెళ్లదీసేవారే తారసపడతారు. ప్రతి మనిషికి ఆహారం ఇంధనం లాంటిదంటారు కరీ ఇన్ ఏ హరీ కో ఫౌండర్ మీరా జాలా.

కర్రీ హర్రీలో లభించే సౌతిండియన్ థాలీ

కర్రీ హర్రీలో లభించే సౌతిండియన్ థాలీ


కరీ ఇన్ ఏ హరీ ఏమిటి ?

కరీ ఇన్ హరీ ఇండియన్ థాలీను తయారు చేసి అందిస్తుంది. ఇంటికి దూరంగా ఉన్న వారికి ఇంటిని మరిపించే విధంగా పదార్ధాలను తయారు చేసి హోమ్ డెలివరీ చేసే సంస్థ. మీరా, మేఘనా జైశ్వాల్ ఇద్దరు గ్రాడ్యుయేషన్ నుంచి మంచి స్నేహితులు. ఔరంగాబాద్ లో ఇన్షిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ లో ట్రైనింగ్ పూర్తి చేశారు. అంతే కాదు 20 సంవత్సరాల అనుభవం కలిగిన వీరిద్దరి మదిలో నుంచి పుట్టినదే కరీ ఇన్ హరీ కాన్సెప్ట్. వాళ్లిద్దరి ఫస్ట్ వెంచర్ అర్బన్ కిచెన్. కార్పొరేట్ ఆఫీసుల్లో ఫ్రెష్ ఫుడ్ తయారు చేసి అందించడం. అలా మంచి పేరు సాధించారు. ఆ సక్సెస్ తో సెకండ్ వెంచర్ కు రూపకల్పన చేశారు.

ఫౌండర్లు మేఘనా జశ్వా, మీరా జాలా

ఫౌండర్లు మేఘనా జశ్వా, మీరా జాలా


కర్రీ ఇన్ ఏ హర్రీ ఎందుకు.. ?

కార్పొరేట్ సర్కిల్స్ లో క్వాలిటీ ఫుడ్స్ అందిస్తున్న మీరా టీమ్ చిన్నచిన్న ఆఫీసుల పై దృష్టి సారించింది. ఓ వైపు ఆయా సంస్థల నుంచి వస్తున్న డిమాండ్ తో ఆర్డర్లు వచ్చేవి. రెండేళ్ల నుంచి అందిస్తున్న ఆదరణలతో కరీ ఇన్ హరీ ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ఫౌండర్స్. "మేము ప్రతి విషయంలో ఎంతో శ్రద్ద తీసుకుంటాము. ఆహార నాణ్యతతో పాటు ఆరోగ్యానికి అవసరమైన న్యూట్రిషన్లు వుండేలా జాగర్త పడతారు. కస్టమర్లకు సంతృప్తి కలిగే విధంగా కుకింగ్ టెక్నిక్స్ వాడతారు. ప్యాకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే పదార్ధాలు తిరిగి వేడి చేసుకొనే విధంగా, స్పిల్-ప్రూఫ్ ప్యాకేజింగ్ లో డెలివరి చేస్తున్నారు. అలాగే మెనూ కూడా స్థానికంగా లభించే పదార్థాలతో ఉంటుందని మీరా చెప్తున్నారు.

కర్రీ ఇన్ ఎ హర్రీ  ప్రాడక్ట్ చోళే

కర్రీ ఇన్ ఎ హర్రీ ప్రాడక్ట్ చోళే


దక్షిణ భారతదేశంలో ఫస్ట్ టైమ్

ప్రస్తుతం మీరా, మేఘనాలకు రోజుకు 250 పైగా ఆర్డర్లు లభిస్తున్నాయి. మొదట గుర్గావ్ లో ప్రారంభమైంది వీరి ప్రయాణం. ఇతర ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. కరీ ఆలోచన వెనుక పెద్ద ఉద్దేశమే ఉందంటారు. భోజనం తో పాటు పలు పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం అవసరమంటారు. బ్యాలెన్స్ డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మీరా సూచిస్తున్నారు.

"మేము సరైన ఆహారం అందిస్తూ పోషక విలువలు కొనసాగించడంతో మా వినియోగదారులను నిలుపుకోగలుగుతున్నాము. క్వాలిటీ విషయంలో ఎప్పుడు రాజీ పడడం లేదో... అప్పుడు వినియోగదారులను మమ్మల్ని వదిలిపెట్టరు. అంతే కాదు హోమ్ డెలివరీ సౌకర్యం ఉండడంతో పాటు.. మా చుట్టు పక్కల ఉన్న రెస్టారెంట్ల కంటే తొందరగా డెలివరి చేయడం కూడా మాకు ప్లస్ పాయింట్ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలు అందిస్తూ...ఫ్రెష్ ఫుడ్డ్, మా కస్టమర్లను మేము నిలుపుకొనేలా చేస్తోంది.'' అంటూ సక్సెస్ సీక్రెట్స్ వివరించారు మీరా.

సమాజసేవలో సైతం...

కర్రీ ఇన్ ఏ హర్రీ కేవలం వ్యాపార దృక్పథమే కాదు సమాజ సేవలోనూ ముందు ఉంది. ప్రతి రోజు మిగిలిపోయిన పదార్ధాలను స్థానిక గివింగ్ టు ది కమ్యూనిటీ ప్రోగ్రామ్ కింద దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో అందిస్తున్నారు. గుర్గావ్ లో పైలెట్ ప్రోగ్రామ్ గా తీసుకొని సక్సెస్ చేయడంతో కస్టమర్లను ఆకట్టుకోగలిగారు. అంతే కాదు మా ప్రచారం అంతా కూడా మౌత్ పబ్లిసిటీయే అంటారు. ఒకసారి కరీ ఇన్ హరీలో ఫుడ్ తీసుకుంటే ఆ కస్టమర్ వందశాతం తిరిగి మళ్లీ మా దగ్గరకే వస్తారంటూ గర్వంగా చెప్తారు మీరా.

ఒక్కొ మెట్టు ఎక్కి...

కర్రీ ఇన్ హర్రీ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను అధిగమించింది. క్వాలిటీకి పెద్ద పీట వేసే సంస్థలో నైపుణ్యం, అర్హత గల వర్కర్లు లేకపోవడం చాలా ఇబ్బందిగా వుండేది. దాంతోపాటు పనివాళ్ల సమస్య. మెల్లిగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ద్వారా వాటని సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టారు. త్వరలో ఆన్ లైన్ , మొబైల్ అప్లికేషన్ ద్వారా బిజినెస్ పెంచడానికి ప్లానింగ్ చేస్తున్నామంటారు మీరా... కొత్త నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఇద్దరం కలిసి స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెబుతారు. ఇంకా ఇప్పటికే లీడింగ్ ప్రైవేట్ ఈక్విటీ, క్యాపిటల్ వెంచర్ సంస్థలను కలిశామని కొన్ని సంస్థలు మాతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని మీరా తెలిపారు.


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags