సంకలనాలు
Telugu

చెర్రీ టొమాటో సాగులో విప్లవం సృష్టించిన స్పర్శ్ బయో

దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద హైడ్రోఫోనిక్ ఫామ్

team ys telugu
21st Mar 2017
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

దేశంలో వ్యవసాయం చేసే తీరు మారలేదు. ఇంకా అవే పాత పంటల ఎంపిక. అవే పాత సాగు విధనాలు. పూర్తిగా వర్షాధారం, దిగుబడి నామమాత్రం. పంట చేతికి రాక, చేసిన అప్పులు తీరక, అన్నదాతలు ఉసురు తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. దేశంలో అనాదిగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం ఇదే.

వ్యవసాయం అంటే దండగ కాదు దాన్నొక పండుగల చేయాలన్న సంకల్పంతో విప్లవాత్మక మార్పులతో చెర్రీ టొమాటలో సాగులో సంచలనం సృష్టిస్తోంది స్పర్ష్ బయో. మట్టిని వాడకుండా మాణిక్యాలను పండిస్తున్నదా ఫామ్. ఆ మాటకొస్తే ఇండియాలోనే కాదు.. దక్షిణాసియాలోనే అతిపెద్ద హైడ్రోఫోనిక్ ఫామ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి కూతవేటు దూరంలో, 25 ఎకరాల్లో కొలువుదీరిన ఫామ్ విశేషాలను విని, నీతి అయోగ్ సభ్యులు ఇటీవలే తోటని సందర్శించారు. అంతా కలియతిరుగుతూ అక్కడి సాగువిధానం చూసి అబ్బుర పడ్డారు.

image


దేశంలోనే ఎక్కువ ధర వచ్చే పంట ఏదైనా వుందీ అంటే.. అది చెర్రీ టొమాటోనే. దాని ఎంపికలోనే స్పర్శ్ విజయవంతమైంది. 30వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాలిహౌజ్ దీని సొంతం. అంతా హైడ్రో ఫోనిక్ పద్ధతిలోనే సాగుచేస్తారు. అంటే మట్టి వాడకం అన్నమాటే ఉండదు.

ప్రతీ మొక్కకీ సంపూర్ణ సమతుల పోషకాహారం అందిస్తారు. ఏడాదిలో అన్ని సీజన్లలో కాపు కాసేలా సేంద్రీయ ప్రమాణాలు పాటిస్తారు. రివర్స్ ఓస్మాసిస్ ద్వారా స్వచ్ఛమైన జలాలు మెక్కలకు అందిస్తారు. నీళ్లలో ఎలాంటి కాలుష్యం, కెమికల్ అన్న మాటే ఉండదు. దాంతో బ్యాక్టీరియా మొక్కల దరిచేరదు. విత్తనాలు స్విట్జర్లాండ్ నుంచి తెస్తారు. హైడ్రోఫోనిక్ ఫామింగ్ మెషినరీ అంతా ఫ్రాన్స్, స్పెయిన్ నుంచి తెచ్చారు. ఈ టొమాటోల తియ్యదనం బ్రిక్స్ స్కేల్ మీద రీడింగ్ 8 చూపిస్తుంది. పల్పీ ఎక్కువగా ఉంటుంది. ప్రతీ కాయ 10-15 గ్రాముల బరువు తూగుతుంది. పోషకాల అమలు విధానంలో ఏమాత్రం తేడా రాదు కాబట్టి, మొక్కలన్నీ ఒకే సైజులో పెరుగుతాయి. సంవత్సరం పొడవునా పంట పండుతుంది. పళ్లు విరగ్గాస్తాయి.

image


పూర్తిగా క్లయిమేట్ కంట్రోల్డ్ గ్రీన్ హౌస్ ఇది. టర్బో వెంటిలేటర్స్ ద్వారా మొత్తం ఆటోమేటెడ్ చేశారు. వాటిని గతంలో ఇండస్ట్రియల్ షెడ్లలో వాడేవారు. ఆ టెక్నాలజీని గ్రీన్ హౌస్ కు అడాప్ట్ చేసుకున్నారు. టెంపరేచర్ని, హ్యుమిడిటీని మెయింటెన్ చేసి ఒక్కో చెట్టు నుంచి 2-3 కిలోల టొమాటోల్ని ఉత్పత్తి చేస్తున్నారు.

కేవలం పంట పండించడమే కాదు.. ప్యాకింగ్ సదుపాయం కూడా ఉందిక్కడ. 6వేల చదరపు అడుగుల ప్యాకింగ్ హౌస్, విశాలమైన కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీ వుంది. రోజుకి 1000 కిలోల టొమాటోలు ప్యాక్ చేస్తారు.

ప్రస్తుతానికి ఈ ఫామ్ నుంచి స్విస్ మిస్ బ్రాండ్ పేరుతో ఇండియాలో మాత్రమే సేల్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, పుణె, ముంబైలో అమ్ముతున్నారు. హైదరాబాదులో 225 గ్రాములు రూ.99కి అమ్ముతున్నారు. చెన్నై, బెంగళూరులో పావుకిలో 120 రూపాయలు. ముంబైలో రూ.129, ఢిల్లీలో రూ. 149. అన్ని ప్రధాన సూపర్ మార్కెట్లలో ఈ చెర్రీ టొమాటో ప్యాక్స్ దొరుకుతాయి. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎక్స్ పోర్ట్ చేసే దిశగా చర్చలు నడుస్తున్నాయి.

ప్యాకింగ్ హౌస్ లో రోజుకి 50 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇందులో స్థానిక వ్యవసాయ కూలీలు పనిచేయడం మూలంగా, వారు ఆధునిక వ్యవసాయ పద్దతుల్ని, అందులో మెళకువల్ని నేర్చుకుంటున్నారు. రైతుల్ని చైతన్యవంతులుగా తీర్చదిద్దడంలో స్పర్ష్ బయో తనవంతు పాత్ర పోషిస్తోందంటున్నారు స్పర్ష్ బయో ఎండీ పాయల్ రైనా ఘోష్. 

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags