సంకలనాలు
Telugu

ఈ యాప్ తో మీ పిల్ల‌ల భ‌విష్య‌త్ బంగారమే..!!

RAKESH
9th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

తారే జ‌మీన్ ప‌ర్ సినిమా గుర్తుందా? అందులో ఎనిమిదేళ్ల పిల్లాడు ఒక ర‌క‌మైన మెంట‌ల్ డిజార్డ‌ర్ తో బాధ‌ప‌డుతుంటాడు. బోర్డు మీద లెక్క‌ల‌న్నీ చిత్ర‌ విచిత్రంగా క‌నిపిస్తుంటాయి. అన్ని స‌బ్జెక్టుల్లో ఫెయిల్ అవుతుంటాడు. పిల్లాడి స‌మ‌స్యేంటో పేరెంట్స్ కి అర్థం కాదు. ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌దు. సినిమాలోనే కాదు బ‌య‌ట కూడా చాలామంది పిల్ల‌లు అలాంటి మాన‌సిక సంఘర్షణతో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఒక ఏజ్ వ‌చ్చాక గానీ స‌మ‌స్యను గుర్తించ‌ని ప‌రిస్థితి. ఇక ఇప్పుడా ప్రాబ్ల‌మ్ లేదు. ఎందుకో ఈ స్టోరీ చ‌దివితే మీకే అర్థ‌మ‌వుతుంది!

image


హ‌ర్ష్ సోంగ్రా. వ‌య‌సు 19 ఏళ్లు. ఇందాక చెప్పుకున్న‌ట్టే, హ‌ర్ష్ కూడా మెంట‌ల్ డిసార్డ‌ర్ బాధితుడే. ఆ స‌మ‌స్య‌ను గుర్తించ‌డానికి అతడి త‌ల్లిదండ్రుల‌కు తొమ్మిదేళ్లు ప‌ట్టింది. త‌న‌లా మ‌రే పిల్లాడూ బాధపడకూడదని హ‌ర్ష్ భావించాడు. ఎర్లీ స్టేజ్ లోనే స‌మ‌స్య‌ను గుర్తించాలంటే ఏం చేయాల‌ని బాగా ఆలోచించాడు. అప్పుడే మై చైల్డ్ యాప్ ఆలోచ‌న త‌ట్టింది!

హ‌ర్ష్, ఆఫ్రిన్ అన్సారీ అనే అమ్మాయి కలిసి మై చైల్డ్ యాప్ డిజైన్ చేశారు. ఇద్ద‌రూ కాలేజీ డ్రాపౌట్లే! వీరికి శ్రేయా శ్రీవాస్త‌వ అనే మరో ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసింది. పిల్ల‌ల్లో మాన‌సిక ప‌రిప‌క్వ‌త‌కు సంబంధించిన స‌మ‌స‌ల్య‌పై యాప్ లో స‌మాచారం అప్ లోడ్ చేశారు. దాని ఆధారంగా త‌ల్లిదండ్రులు ఎర్లీ స్టేజ్ లోనే పిల్లల్లో శారీర‌క, మాన‌సిక‌ స‌మ‌స్య‌ల‌ను గుర్తించే వీలు క‌ల్పించారు.

యూజ‌ర్ ఫ్రెండ్లీ యాప్

కొంత మంది పిల్ల‌లు మోటార్ కోఆర్డినేష‌న్ డిసార్డ‌ర్ తో బాధ‌ప‌డుతుంటారు. అంటే- స‌రిగ్గా న‌డ‌వ‌లేరు, గెంత‌లేరు, వ‌స్తువుల‌ను ప‌ట్టుకోలేరు, ఆట‌లు ఆడ‌లేరు. మ‌రికొంత మంది చిన్నారుల హ్యాండ్ రైటింగ్ స‌రిగ్గా వుండదు. ఇంకొంత మందేమో న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన పడుతుంటారు. ఇలాంటి రుగ్మతలను 11 నుంచి 24 నెల‌ల వ‌య‌సులో గుర్తించ‌డమే మై చైల్డ్ యాప్ ప్రత్యేకత! యాప్ లోకి ఎంట‌ర‌వ‌గానే ముందుగా పిల్లాడి ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. పిల్లాడి ఎత్తు, బ‌రువుకు సంబంధించిన స‌మాచారం ఎంట‌ర్ చేయాలి. అవును, కాదు లాంటి కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వాలి. వాట‌న్నింటినీ యాప్ క్రోడీక‌రిస్తుంది. పిల్లాడిలో ఏదైనా స‌మ‌స్య ఉంటే తెరమీద చూపిస్తుంది. వ్యాధికి ఎలాంటి చికిత్స అవ‌స‌ర‌మో కూడా వివరిస్తుంది. 

ఇది పూర్తిగా యూజ‌ర్ ఫ్రెండ్లీ యాప్. రెండేళ్ల వ‌య‌సు లోపు పిల్ల‌ల గ్రోత్ రేటు తెలుసుకోవ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. పిల్ల‌ల్లో ఎదుగుద‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లుంటే ఎలాంటి కేర్ తీసుకోవాలో వివరిస్తుంది. చిన్నారుల ఎత్తు, బ‌రువు సరిగ్గానే ఉందా అన్నవివ‌రాలు కూడా దీని ద్వారా తెలుస్తాయి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే మై చైల్డ్ యాప్ డిజైన్ చేశారు. యువర్ స్టోరీ మొబైల్ స్పార్క్స్- 2015 లో మై చైల్డ్ యాప్ అవార్డు అందుకుంది.

5 కోట్ల మందికి చేర్చ‌డ‌మే ల‌క్ష్యం..

మై చైల్డ్ యాప్ ను ప్ర‌పంచం న‌లుమూల‌ల‌కు చేర‌వేయ‌డానికి హ‌ర్ష్ సోంగ్రా కృషి చేస్తున్నాడు. ఇప్ప‌టికే యాప్ లక్ష డాలర్లు సేకరించింది. 500 స్టార్టప్ అనే కంపెనీ ఇన్వెస్ట‌ర్లు సమీర్ బంగారా, అనిషా మిట్టల్, అమిత్ గుప్తా, పల్లవ్ నందిని, లలిత్ మంగల్, అరిహంత్ పట్నీ, డాక్టర్ రితేశ్ మాలిక్, దేబ్ రత్ సింగ్, సౌరభ్ పరుథితో పాటు సింగపూర్ ఏంజెల్ నెట్ వర్క్ నుంచి నిధులు సేకరించింది. వీటిని ప్రాడక్ట్ డెవలప్ మెంట్ కోసం ఉపయోగించనుంది. యాప్ ద్వారా పేరెంట్స్ నేరుగా ఇతర తల్లిదండ్రులు, డాక్టర్ల‌తో క‌మ్యూనికేట్ అయ్యేలా ఒక క‌మ్యూనిటీని డెవ‌ల‌ప్ చేయాల‌న్నది ప్లాన్. వ‌చ్చే ప‌దేళ్ల‌లో యాప్ ను 5 కోట్ల మందికి చేరువ చేయాల‌న్న‌దే హర్ష్ ల‌క్ష్యం.

యాప్ డెవ‌ల‌ప్ మెంట్ కి సంబంధించి మా దగ్గర ఇప్పటికే రోడ్ మ్యాప్ రెడీగా ఉంది. సేకరించిన నిధులతో ప్రాడక్ట్ ను మరింతగా అభివృద్ధి చేయాల‌నుకుంటున్నాం. మా యాప్ పేరెంట్స్ కి ఒక గైడ్ లా ప‌నిచేసేలా తీర్చిదిద్దుతాం- హ‌ర్ష్ సోంగ్రా

హ‌ర్ష్ మామూలోడు కాదు..

మై చైల్డ్ యాప్ చాలా ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని, ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్న ఆరోగ్య స‌మ‌స్య‌ను ఒక స్మార్ట్ ఫోన్ తో ప‌రిష్కరించ‌డం నిజంగా వండ‌ర్ అంటున్నారు యాప్ పార్ట్ న‌ర్ అమిత్ గుప్తా. ఇంత చిన్న వ‌య‌సులో హ‌ర్ష్ అద్భుతాన్ని సృష్టించాడని కితాబిచ్చారు. అత‌డి ఆవిష్క‌ర‌ణ ఎంతో మంది ఎంట్ర‌ప్రెన్యూర్ల‌లో స్ఫూర్తి ర‌గిలిస్తుంద‌ని చెప్పారు. మ‌రో పార్ట్ న‌ర్ పంక్ జైన్ కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. ఒక సింపుల్ మొబైల్ యాప్ ద్వారా పిల్లల్లో డిసార్డ‌ర్స్ క‌నిపెట్ట‌డం గొప్ప విష‌య‌మ‌ని ప్ర‌శంసించారు. దేశంలో మాన‌సిక వైద్య నిపుణుల కొర‌త ఉన్న ఈ ప‌రిస్థితుల్లో మై చైల్డ్ యాప్ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంద‌ని వివ‌రించారు. హ‌ర్ష్ తో క‌లిసి దీన్నింకా డెవ‌ల‌ప్ చేయ‌డ‌నికి కృషి చేస్తామ‌ని తెలిపారు.

ఏడాది కింద‌ట హ‌ర్ష్ ఈ కంపెనీని స్టార్ట్ చేసిన‌ప్పుడు స్వ‌యంగా చూశాను. అప్పుడే అత‌డికి సాయం చేయాల‌నుకున్నా. ఎంట్రప్రెన్యూర్ల‌లో హ‌ర్ష్ అరుదైన వ్య‌క్తి. త‌న ఆరోగ్య సమ‌స్య‌ని బిజినెస్ గా మార్చిన మేధావి. అంతేకాదు, దాని వ‌ల్ల ల‌క్ష‌లాది మందికి మేలు చేస్తున్నాడు. ప్ర‌పంచం మీద త‌న‌దైన ముద్ర వేయాల‌న్న అత‌డి ఆరాటం స్ఫూర్తిదాయ‌కం- స‌మీర్

యువ‌ర్ స్టోరీ టేక్..

ఇండియాలో 13-14 శాతం మంది స్కూల్ పిల్ల‌లు బుద్ధిమాంద్యం వంటి రుగ్మ‌త‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారే. 1950, 60ల్లోనే దీనిపై ప‌రిశోధ‌న‌లు మొద‌ల‌య్యాయి. సైకాల‌జిస్టులు, సైకియాట్రిస్టులు సాధార‌ణ మేథో నైపుణ్యం ఉన్న పిల్ల‌ల‌ను ప‌రీక్షించి చూశారు. అందులోనూ వివిధ ర‌కాల డిసార్డ‌ర్లు ఉన్న‌ట్టు గుర్తించారు. 20 శాతం మంది చిన్నారులు, కౌమార ద‌శ‌లో ఉన్న పిల్ల‌లు బుద్ధిమాంద్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు ప్రపంచ సాంక్ర‌మిక వ్యాధుల అధ్య‌య‌న నివేదిక తాజాగా ప్ర‌క‌టించింది. అటు గ్లోబ‌ల్, ఇటు ఇండియా గ‌ణాంకాలు రెండూ ఆందోళ‌న‌క‌ర‌మే! దీనిపై ప్ర‌జ‌ల్లో మ‌రింత అవగాహ‌న పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకు మై చైల్డ్ లాంటి యాప్స్ మ‌రిన్ని రావాలని కోరుకుందాం.

మై చైల్డ్ యాప్ వీడియో ఇక్కడ చూడండి!


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags