సంకలనాలు
Telugu

పచ్చదనం కొనండి... ఆరోగ్యాన్ని ఉచితంగా పొందండి... గ్రీన్ ఓకె ప్లీజ్ స్టోరీ

దేశీయ మార్కెట్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్న మహిళలు సేంద్రీయ ఉత్పత్తులకు ఆన్ లైన్ హంగులుఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెట్ తక్కువేం కాదురూ.1000 కోట్ల మార్కెట్ సైజ్ ఉన్న రంగమిది

4th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అందరితో పాటు కాకుండా... డిఫరెంట్ గా ఉండాలనే లక్ష్యంతో అనుకున్నది సాధించే పనిలో పడ్డారు రాశి, శ్వేతలు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయ మార్గాన్ని అన్వేషించి నలుగురికి మార్గదర్శిగా నిలుస్తున్నారు. వాళ్లిద్దరూ సాధారణ స్నేహితులే కాదు, ఒకే అభిప్రాయాలు కల్గిన సక్సెస్‌ఫుల్ ప్రొఫెషనల్స్‌గా పూణెలో నిలదొక్కుకున్నారు శ్వేతా ఫాల్గర్, రాశి గోయల్. లక్ష్యాలు సాధించడంలో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కేవలం డబ్బులు సంపాదనే కాదు, ఆరోగ్యకరమైన జీవితం కోసం ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఇలా వారి మదిలో నుంచి పుట్టిందే గ్రీన్ ఓకే ప్లీస్ డాట్ కామ్.

Greenokplease.com ద్వారా ఎకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రాణం పోశారు. స్థానిక చిన్న, సన్నకారు ఉత్పత్తిదారుల నుంచి సేంద్రీయ పదార్ధాలు సేకరించి వాటి అమ్మకాలు ప్రారంభించారు.

శ్వేతా ఫాల్గర్, రాశి గోయల్ (కుడి, ఎడమ)

శ్వేతా ఫాల్గర్, రాశి గోయల్ (కుడి, ఎడమ)


బ్లాగ్‌తో బిజినెస్‌కు బీజం !

అలా ఇద్దరి మనస్సులో వచ్చిన ఆలోచన 2010 లో ఒక విత్తనంగా ప్రారంభమై, ఇప్పుడు మహావృక్షంగా మారింది. మొదట్లో శ్వేత పూణెలో అవగాహన కల్గించేందుకు ప్రారంభించిన బ్లాగ్ జస్ట్ రెండేళ్ల కాలంలోనే, సేంద్రీయ ఉత్పత్తిదారులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చే స్థాయికి చేరుకుంది. దీంతో ఇంటి నుంచే కంపోస్ట్ట్, వర్షపునీటి సేకరణలపై పరిష్కారాల కోసం ప్రజలు ఆమెను సంప్రదించడం ప్రారంభించారు.

శ్వేత చేస్తున్న కృషికి ఆమె స్నేహితులూ సహకరించారు. దీంతో ఫ్రెండ్ రాశి గోయల్‌తో కలిసి గ్రీన్ ఓకే కు శ్రీకారం చుట్టారు. ఇద్దరూ కలిసి పర్యావరణాన్ని కాపాడుతూ, సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకానికి నడుం బిగించారు. పర్యావరణానికి హాని కల్గించని దేశీయ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరికీ ఇష్టమైన పని కావడంతో, అనుకున్నది సాధించడానికి ఎక్కువ సమయం పట్టలేదంటారు శ్వేత. అంతే కాదు 'మీరు చేసే ఉద్యోగంపై ప్రేమ పెంచుకోండి. అదే మీ జీవితంలో ఎంతో మార్పు తెస్తుందని' చెబుతారు.

ప్రస్తుతం గ్రీన్‌ఓకే‌ప్లీజ్ పేరుతో ఈ-కామర్స్ చేస్తూనే ఎడ్యుకేషనల్ బ్లాగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇ-కామర్స్ వెబ్ సైట్ 2013 డిసెంబర్ 15 న ప్రారంభించారు. పండుగ సీజన్, దీపావళి వంటివి వచ్చినప్పుడు మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు గిఫ్టింగ్ గ్రీన్ ఇచ్చి, వారికి అవగాహన కల్పిస్తామంటున్నారు శ్వేత. దానితో పాటు గో గ్రీన్ కోరుకుంటున్న వారి దగ్గర నుంచి నిధులు సేకరించి ప్రజల్లో మార్పు తీసుకువస్తామని చెబుతున్నారు. సంస్థ నిధుల కోసం కార్పొరేట్ గిఫ్టింగ్ చేస్తూనే, వివిధ రకాలుగా తమ ఉత్పత్తుల అమ్మకం ద్వారానే నిధులను సేకరిస్తున్నామని వివరించారు.

గ్రీన్ ఓకె సంస్థ ఉత్పత్తులు

గ్రీన్ ఓకె సంస్థ ఉత్పత్తులు


green_ok వెంచర్ ద్వారా భారతదేశం లో చిన్న, సన్నకారు ఉత్పత్తిదారులకు లాభం జరుగుతుందని వీరి ధీమా. అంతే కాకుండా పర్యావరణం ద్వారా గ్రహించిన సింథటిక్ రసాయనాలు సంఖ్య తగ్గించేందుకు సాయం చేస్తుంది గ్రీన్ OK. రైతుల ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో వారి జీవన విధానం మారడానికి కారణమైంది. దీంతో సేంద్రీయ ఉత్పత్తులు పెంచడానికి పెద్ద సంఖ్యలో రైతులు ముందుకు వస్తున్నారు. అటు పర్యావరణంతో పాటు ఆరోగ్య పరంగా మంచి ఫలితాలు వస్తూ ఉండడంతో, ప్రజలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగా వినియోగదారులకు అవగాహన కల్పించడం, తర్వాత వారి అవసరాలు తీర్చే విధంగా మా ఆన్ లైన్ ,ఆఫ్ లైన్ స్టోర్ల కు రప్పించడమే తమ లక్ష్యమనేది ఈ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల బిజినెస్ ప్లాన్.

''ఆశ్చర్యం కల్గించే విషయం ఏమంటే... పరిచయంలేని ఓ బెంగళూరు ఇన్ఫోసిస్ ఉద్యోగి మాకు మొదటి ఆన్ లైన్ కష్టమర్ గా చేరారు. ఆయన ద్వారా వచ్చిన మౌత్ పబ్లిసిటీ మాకు ఎంతో ఉపకరించింది. అలా ప్రారంభమైన విక్రయాలతో చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు దగ్గరయ్యాం. ఇదంతా గొప్ప అనుభూతి కలిగించింది'' - శ్వేత

ఎటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగించకుండానే Green Ok వెబ్ సైట్ పర్మినెంట్ కస్టమర్లను సంపాదించు పెట్టుకుంది. దీంతో వినియోగదారులకు అందించాల్సిన వ్యవస్థపై దృష్టి పెట్టారు. వస్తువల సేకరణ, ఆన్ లైన్ అనుభవం, వినియోగదారులకు అందించే దానిపై దృష్టి సారించామన్నారు.

అంతు సులువేం కాదు

సంస్థ విజయవంతంగా నడుస్తున్నా, green_ok అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంది. టీమ్‌లో సభ్యులు తక్కువగా ఉండడంతో పాటు, చిన్న చిన్న ఇబ్బందులు తప్పనిసరి అయ్యాయి. వ్యాపారంలో ముఖ్యమైనది విశ్వసనీయత, అది దెబ్బతినకుండా ఉండేందుకు చాలానే కష్టపడ్డారు. విద్యుత్ వైఫల్యాలు, పంటల నష్టం, రవాణా సవాళ్లు, గ్రామాల నుంచి ఉత్పత్తులు తీసుకురాడంలో ఆలస్యం కారణంగా వినియోగదారులకు సరైన సమయానికి డెలివరీ చేయలేకపోవడం వంటివి వీళ్లను మొదట్లో ఇబ్బందిపెట్టాయి. ఇక ఫాలో అప్స్, కస్టమర్‌తో డెలివరీ కమ్యూనికేషన్‌లో సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపించేది. ''గ్రాస్ రూట్స్ నుంచి సప్లై ప్రారంభించినా, పాత కాలం నాటి పద్దతులతో వినియోగదారుల కోరికలు తీర్చలేకపోతున్నామని ఆవేదన'' టీంలో ఉండేది.

image


సేంద్రీయ మార్కెట్ చిన్నదేం కాదు !

2012 లో యస్ బ్యాంక్ నివేదిక ప్రకారం, భారతదేశంలో సేంద్రీయ మార్కెట్ విలువ దాదాపు రూ.1000 కోట్లు (170 మిలియన్ డాలర్లు) ఉంటే అందులో దాదాపు రూ.700 కోట్లు ఎగుమతుల ద్వారా వచ్చేదే. ఏటా వృద్ధి కూడా 30 నుంచి 40 శాతం ఉంది. దేశం 4.43 మిలియన్ హెక్టార్లలో 1,71,000 టన్నుల సేంద్రీయ ఆహారం ఉత్పత్తవుతోంది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌లో అమెరికాలో మార్కెట్ 26 బిలియన్ డాలర్లు, యూరోపియన్ మార్కెట్ లో 10 బిలియన్ డాలర్లూ ఉంది. ప్రస్తుతం, భారతదేశం సేంద్రీయ సాగుభూమి పరంగా టాప్ 10 స్థానాల్లో ఉంది. కొన్ని నివేదికల ఆధారంగా రాబోయే రోజుల్లో సేంద్రీయ సౌందర్యం, బట్టలు, ఆహారాలకు మంచి డిమాండ్ ఉండనుంది.

ఈ రంగంపై దృష్టిసారిస్తే ఎన్నో పుష్కలమైన అవకాశాలు ఉన్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఈకామర్స్ సంస్థలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో వాళ్లు మెరుగైన మార్కెట్ వాటా చేజిక్కించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags