సంకలనాలు
Telugu

'ఇండియన్ రోబోటిక్ లీగ్' ఈ కవలల కల !

ABDUL SAMAD
27th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అదితి ప్రసాద్, దీప్తి రావ్ సుచీంద్రన్‌లు కవలలు. వారి పోలికల్లాగా వారి ఆలోచనలు కూడా సారూప్యంగా ఉంటాయి. రోబోటిక్స్ లెర్నింగ్ సొల్యూషన్స్ సంస్ధకు ఒకరు COO మరొకరు CIO . రోబోల తయారీలో కొత్త అన్వేషణలు అవసరం అంటుంటారు అదితి, దీప్తి, అందుకోసం వారు ఓ కొత్తరకం టూల్‌ని తయారుచేశారు. దానికి STEM అని పేరు పెట్టారు. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్. ఈ రంగాల్లో నైపుణ్యం సంపాదించుకుంటే భవిష్యత్తు బంగారు బాట అంటున్నారు.

భవిష్యత్తుపై కోటి ఆశలు పెట్టుకున్న అదితి, దీప్తిలు చిన్నతనం నుంచి రోబో టెక్నాలజీ విషయంలో కొత్త కొత్త అన్వేషణలు సాగిస్తూనే ఉన్నారు. శాస్త్ర సంబంధమైన విషయాల్లో వాళ్ళ తండ్రే మార్గదర్శి. చిన్నతనంలో వచ్చే చిన్న చిన్న సందేహాలను ఆయనే తీరుస్తూ ఉండేవారట. ఉదాహరణకు కింద పడేసిన బంతి ఏ శక్తివల్ల తిరిగి పైకి ఎగరగలదు. ఇంటి ఆవరణలోని సీతాకోకచిలుక వారిలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించేది. అంతేకాదు మిగతా పక్షులకు లేని ప్రత్యేకత సీతాకోక చిలుకకు ఎలా వచ్చిందనేది వారి సందేహం.

చిన్న విత్తనం పెరిగి మహా వృక్షంగా ఎలా మారుతుంది ? ఆ వృక్షం నుంచి ఉద్భవించిన పండ్లు, ఫలాలు జీవకోటికి ఎలా ఆహారంగా మారుతున్నాయనేది అదితి, దీప్తిలను అన్వేషణ వైపు అడుగులు వేసేలా చేశాయి. సృష్టిలో బాల్యానికి మించిన మధురమయిన స్మృతులు లేవు. చిన్నప్పటి ఆలోచనలు భవిష్యత్తుపై ఎంతో ప్రభావం ఉంటుందంటారు ఈ కవలలు.

అదితి ప్రసాద్, దీప్తి రావ్ సుచీంద్రన్‌

అదితి ప్రసాద్, దీప్తి రావ్ సుచీంద్రన్‌


అమ్మాయిలు సాధారణంగా తండ్రి ఆలోచనలకు, ఆయన అడుగుజాడలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. వీళ్లిద్దరూ కూడా అలాంటిదానికి మినహాయింపు లేదు. తండ్రి దగ్గరనుంచి దీనికి సంబంధించి విషయాలను తెలుసుకునేవారు. రోబోటిక్స్‌పై మక్కువ ఉన్న అమ్మాయిలకు STEM ఎడ్యుకేషన్‌ని దగ్గరకి చేర్చాలని ఆయన భావించారు.

బాల్యం నుంచే బీజాలు

‘‘పాఠశాల స్థాయినుంచీ మాలో టెక్నాలజీ కి సంబంధించిన ఆలోచనలు ముసురుకునేవి. అదే టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నా మాకెంతో ఇష్టం. ఇంటర్ స్కూల్ కల్చరల్ కాంపిటీషన్స్‌లో వాలీబాల్ టీంకి నేను కెప్టన్‌గా ఉండేదాన్ని. మా నాన్నగారు దగ్గరుండి మరీ ముందుకు నడిపించేవారు. థియరీకి ప్రాక్టికల్స్‌కీ మధ్య తేడా ఏంటో నాన్న చెప్పేవారు. ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వివరించేవారు. ప్రతి ఆదివారం ఖాళీగా ఉన్న సమయంలో టైం మేగజైన్ చదివేదాన్ని. అందులో వచ్చే సైంటిఫిక్ ఆర్టికల్స్ మీద చర్చ జరిగేది. మా ఆలోచనలను, అభిప్రాయాలను పుస్తకంలో రాసి పెట్టుకునేదాన్ని. భారత రాజ్యాంగం, చరిత్ర అంటే నాకెంతో ఇష్టం. పూణెలోని ILS Law College లో న్యాయశాస్త్రం, సింగపూర్‌లోని Lee Kuan Yew School of Public Policy చదువుకున్నాను’’ అని చెప్పారు అదితి.

‘‘ నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక Lee Kuan Yew School of Public Policyలో కొన్నాళ్ళపాటు పనిచేశాను. ఆ తర్వాత సింగపూర్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చేశా. ఐఐటీ మద్రాసులోని చైనా స్టడీస్ సెంటర్‌లో పరిశోధన ప్రారంభించాను. అప్పుడే Robotix Learning Solutions స్టార్టప్ చేయాలని అనుకున్నాను. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నా ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాను. Indian Robotix Leagueలో మా ఆలోచనలకు సంబంధించిన రోబోలను ప్రదర్శించాం’’ అంటారు అదితి.

ఇక దీప్తి విషయానికి వస్తే.. '' నేను ఐదేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచే టెక్నాలజీ విషయాలు నాన్నదగ్గర నేర్చుకునేదాన్ని. ఐస్ స్కేటింగ్‌కి సంబంధించిన చిన్నప్పుడే ఓ మోడల్ చూపించాను. విత్తనాలు నాటడం, అవి మొలకెత్తడం వంటివాటిని రోజూ గమనించడం నాకు భలే ఆసక్తి'' అంటారు.

12 ఏళ్ళ వయసులో షార్క్ చేపల విన్యాసాలను Jaws మూవీలో చూసిన దీప్తి వాటి పనితీరును పరిశీలించింది. వాటిపై పరిశోధన కూడా చేసింది.

కాలేజీ స్టేజ్‌కి వచ్చాక జీనోమ్ సైన్స్, బయో టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుంది దీప్తి. తన అభిరుచి మేరకు అన్నా యూనివర్శిటీ చెన్నై నుంచి ఇండస్ట్రియల్ బయో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ నుంచి న్యూరో సైన్స్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అందుకుంది. అలాగే యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా చాపెల్ హిల్ నుంచి పిహెచ్‌డీ పూర్తిచేసింది. 

"న్యూరో సైన్స్ టెక్నాలజీ స్టార్టప్ ప్రారంభించాలని నిర్ణయించాం. దానిలోనుంచి వచ్చిందే Robotix Learning Solutions. దీనికి Chief Innovation Officerని నేనే'' అని గర్వంగా చెబ్తారు దీప్తి

‘‘STEM ఫీల్డ్‌లో మహిళలు వివక్షకు గురవుతున్నారు. అనాది కాలం నుంచి పరిశోధనా రంగంలో పురుషాధిక్యం బాగా పెరిగిపోయింది. ఈ రంగంలో ఔత్సాహికులైన అమ్మాయిలను ప్రోత్పహించాలనే మేం దీన్ని ప్రారంభించాం’’అంటున్నారు అదితి.

వివాహితులైన మహిళలకు పిల్లల పెంపకంతోనే సరిపోతోంది. వారికి సరైన ఛైల్డ్ కేర్ సెంటర్లు ఉంటే STEM రంగంలో వారి సేవలు దేశానికి ఉపయోగపడతాయి.

రోబోటిక్స్ టెక్నాలజీ గురించి ఈతరం యువతులకు తెలియచేయాలని భావిస్తున్నాం. ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో తెలుసుకోవాలి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా India Robotix Leagueని విస్తృతం చేయాలి.

ప్రధాన నగరాల్లో రోబోటిక్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలంటారు అదితి దీప్తి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్‌పై ఈనాటి యువత బాగా పట్టు సాధించగలగాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం.

దక్షిణ భారతదేశంలో K-12 స్కూల్స్‌లో రోబోటిక్ ఎడ్యుకేషన్‌పై ఇప్పడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ప్రతి ఏటా రోబోటిక్స్ కాంపిటీషన్, Indian Robotix League నిర్వహించాలనుకుంటున్నాం.

స్కూల్ విద్యార్థులకు స్టెమ్ గురించి వివరిస్తున్న అదితి, దీప్తి

స్కూల్ విద్యార్థులకు స్టెమ్ గురించి వివరిస్తున్న అదితి, దీప్తి


వివిధ శారీరక అవలక్షణాలతో పుట్టిన పిల్లలకు కూడా టెక్నాలజీని పరిచయం చేయాలి. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా వారిలోని లోపాలను సరిదిద్దగలగాలి. త్రిచీలోని అన్నై ఆశ్రమంలో అనాథ పిల్లలను ఆదరించి వారికి విద్యను అందిస్తున్నారు ఈ కవల సోదరులు.

ఇక్కడ మరో విషయం ఆలోచించాలి. STEM ఎడ్యుకేషన్‌పై ముందుగా తల్లిదండ్రులను చైతన్యపరచాలి. ఇలాంటి స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అమ్మాయిలకు అవసరం లేదనేది తల్లిదండ్రుల భావన. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఇలాంటి ఎడ్యుకేషన్‌లో ముందుంటున్నారు. అందుకే వివిధ కాలేజీలు, స్కూళ్ళలో ఈ తరహా అవగాహన కల్పిస్తున్నాం. ఆడపిల్లలను STEM, robotics and codingలో నిపుణులుగా తయారుచేయగలగాలంటారు అదితి, దీప్తి.

‘‘ఈ తరం చిన్నారులు చాలా సున్నితంగా. వేగంగా ఆలోచించగలుగుతున్నారు. ఇతరుల పిల్లలతో మన పిల్లల్ని పోల్చి చూసుకోకుండా..వారి ఆలోచనలకు అనుగుణంగా విద్యను అందించే ఏర్పాటుచేయాలంటారు. నేటి పిల్లలే రేపటి సైంటిస్టులు. రోబోటిక్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వారిని ముందుకు నడిపించే వ్యవస్థ మనకు ఇప్పుడు అవసరం’’ అని చెబుతున్నారు అదితి, దీప్తి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags