సంకలనాలు
Telugu

మేం మహిళా ఆంట్రప్రెన్యూర్లం..!! అయితేనేం.. మాకు మనసులేదా..?

12th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


మ‌హిళా ఆంట్ర‌ప్రెన్యూర్ల‌పై కొన్ని అభూత క‌ల్ప‌న‌లు ప్రచారంలో ఉన్నాయి. వారికి ఫ్యామిలీ అంటే ప‌ట్ట‌ద‌ని, ఎప్పుడూ బిజినెస్ లో త‌ల‌మున‌క‌లై ఉంటార‌ని, వ్యాపారం త‌ర్వాతే కుటుంబ‌మ‌ని- ఇలా ర‌క‌ర‌కాల దురభిప్రాయ‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విమెన్ ఆంట్ర‌ప్రెన్యూర్స్ లైఫ్ పార్ట్ న‌ర్ గా ప‌నికిరార‌న్న ఒపీనియ‌న్- కొంచెం బాధ పెట్టే విష‌య‌మే. అయితే ఇవ‌న్నీ అవాస్త‌వాల‌ని ఒక మ‌హిళా ఆంట్ర‌ప్రెన్యూర్ గా చెప్ప‌గ‌ల‌ను! సూప‌ర్ విమెన్ అనే పుస్త‌కం రాస్తున్న‌ప్పుడు చాలా విష‌యాలు తెలుసుకున్నాను. మంచి అర్థాంగి కావ‌డానికి మ‌హిళా ఆంట్ర‌ప్రెన్యూర్ల‌లో ఉన్న ప‌ది మంచి క్వాలిటీస్ మీతో షేర్ చేసుకుంటున్నా..

image


1. ఇండిపెండెంట్

విమెన్ ఆంట్ర‌ప్రెన్యూర్స్ స‌హ‌జంగానే ఆశావాదులు! ఫ్యామిలీ, ఫ్యూచ‌ర్ వంటి విషయాల్లో ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు. టైంకి అప్పులు కట్టేస్తారు. జీవిత భాగ‌స్వామి జయాప‌జయాలను బాగా అర్థం చేసుకుంటారు. ఇంట్లో అయినా, బిజినెస్ లో అయినా గిల్లికజ్జాలను ఒడుపుగా పరిష్కరించుకునే నేర్ప‌రిత‌నం ఉంది. లైఫ్ పార్ట్ న‌ర్ కావడానికి ఇలాంటి ఐడియల్ క్యారెక్టర్ సరిపోదా..?

2. గో- గెట్టర్స్

మహిళా ఆంట్రప్రెన్యూర్లు మాంచి స్వాప్నిక జీవులు ! కలలు కంటారు. తప్పకుండా వాటిని సాకారం చేసుకుంటారు. అందుకోసం శక్తివంచన లేకుండా కష్టపడతారు. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్న‌ లైఫ్ పార్ట్ నర్ ఏ మగాడికైనా దొరుకుతుందా..?

3. కంటెంట్ విమెన్

వర్క్ విష‌యంలో ల‌వ్ అండ్ ప్యాష‌నేట్ గా వ్య‌వ‌హ‌రిస్తారు. బిజినెస్ లో ఎన్ని స‌మ‌స్య‌లున్నా.. పెదాల మీద చెరగని చిరున‌వ్వుతో ఈవినింగ్ ఇంటికి తిరిగొస్తారు. హ్యాపీగా, హెల్దీగా ఉండే వ్య‌క్తులంతా గ్రేట్ లైఫ్ పార్ట్ న‌ర్స్ అవుతార‌ని ఒక అధ్య‌య‌నంలో తేలింది!

4. ట్ర‌బుల్ షూట‌ర్స్

రోజువారి ప‌నిలో స‌వాళ్లు, వ్యాపారంలో ఎదురు దెబ్బ‌లు కామ‌నే. వాటిని చూసి కుంగిపోకుండా సొల్యూష‌న్ కోసం ఆలోచించ‌డం మ‌హిళా ఆంట్ర‌ప్రెన్యూర్ల ప్రత్యేక‌త‌. చూసిందే న‌మ్ముతారు. చెప్పుడు మాట‌లు అస్సలు విన‌రు. సంసారంలో కావాల్సిందే ఇదే కదా!

5. స్టోరీ టెల్ల‌ర్స్

విమెన్ ఆంట్రప్రెన్యూర్ల‌కు ప్ర‌తి రోజూ ప్ర‌త్యేక‌మే. రోజువారి ప‌నిలో భాగంగా ఎన్నో చ‌ర్చ‌లు, ప‌రిశోధ‌న‌ల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. వాటి ద్వారా మ‌రింత స్మార్ట్ గా త‌యార‌వుతారు. ఇక ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత భ‌ర్త‌తో షేర్ చేసుకోవ‌డానికి బోలెడ‌న్నీ క‌బుర్లు మోసుకొస్తారు! ఇలాంటి నేచ‌ర్ వ‌ల్ల భార్యాభ‌ర్త‌ల బాండింగ్ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ట‌!

6. ఇన్ స్పిరేష‌న్

మహిళా ఆంట్ర‌ప్రెన్యూర్లు ఇత‌రుల‌కు స్ఫూర్తిగా ప‌నిచేస్తుంటారు. ఒక‌వేళ లైఫ్ పార్ట్ న‌ర్ కూడా కార్పొరేట్ రంగానికి చెందిన వ్య‌క్తి అయితే, వారి లైఫ్ మ‌రింత బాగుంటుంది. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఆంట్ర‌ప్రెన్యూర్లే కాబ‌ట్టి.. ఎలాంటి రిస్క్ ఉన్నా ఈజీగా దాటేస్తారు.

7. ఓపెన్ మైండెడ్

విమెన్ ఆంట్ర‌ప్రెన్యూర్లు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. ప‌రిస్థితుల‌కు త‌మ‌ను తాము అనుకూలంగా మలుచుకుంటారు. ర‌క‌ర‌కాల గోల్స్, ఎజెండాలు ఉన్న బోలెడంత మంది వ్య‌క్తుల‌తో మాట్లాడుతుంటారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు వాటిని సాకారం చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఈ క్వాలిటీస్ అన్నీ భవసాగ‌రాన్ని ఈద‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌వా..?

8. గ్రేట్ క‌మ్యూనికేట‌ర్స్

మహిళా ఆంట్ర‌ప్రెన్యూర్లకు రోజులో సింహభాగం క‌మ్యూనికేష‌న్ కే స‌రిపోతుంది. అది ఈ మెయిల్స్ కానివ్వండి! ఫోన్ కాల్స్ కానివ్వండి! అవ‌త‌లి వాళ్ల‌కు పంపే ప్ర‌తీ సందేశం సూటిగా సుత్తి లేకుండా ఉంటుంది. చెప్పే విషయంలో క్లారిటీ ఉండే ఇలాంటి వ్య‌క్తుల‌నే చాలా మంది జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

9. టైమ్ మేనేజ్ మెంట్ స్కిల్స్

బిజినెస్ అంటేనే మ‌ల్టీ టాస్క్. వ్యాపారాన్ని విజ‌య‌వంతంగా న‌డిపించ‌డ‌మే కాకుండా, సామాజిక సేవ‌లోనూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు మ‌హిళా ఆంట్ర‌ప్రెన్యూర్లు. అంత మంచి ఉదార స్వ‌భావం ఉన్న వాళ్లు.. భ‌ర్త‌ను ఇంకెంత బాగా చూసుకుంటారు చెప్పండి?

10. లైఫ్ పార్ట్ న‌ర్ కు సపోర్ట్

అన్నింటికీ మించి స‌క్సెస్ ఫుల్ విమెన్ ఆంట్ర‌ప్రెన్యూర్స్ వారి జీవిత భాగ‌స్వాముల కెరీర్ కూ సాయం చేస్తుంటారు. ప్రొఫెష‌న‌ల్ గా స‌ల‌హ‌లు సూచ‌న‌లు ఇస్తుంటారు.

ఇప్పుడు చెప్పండి! ఎవ‌రి జీవితాన్నైనా అందంగా, అర్థ‌వంతంగా మార్చ‌గ‌లిగే శ‌క్తి మ‌హిళా ఆంట్ర్రప్రెన్యూర్ల‌కు ఉందంటారా? లేదంటారా? అటు బిజినెస్ ను , ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను ప‌ర్ ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకునే అర్థాంగి దొర‌క‌డం క‌న్నా అదృష్టం ఉంటుందా!?

రచయిత; ప్రాచీ గార్గ్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags